
ఏడవ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించిన సాంఘిక శాస్త్రం రెండో భాగం పాఠ్యాంశంలో వస్తు మార్పిడి నుంచి ద్రవ్యం వరకు, మార్కెట్లను అర్థం చేసుకుందామనే శీర్షికన ఒక అధ్యాయాన్ని చేర్చారు. గతంలో సాంఘిక శాస్త్రంలో భాగంగా చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సాంఘిక రాజకీయ జీవితం, మన పర్యావరణం అనే పాఠ్యాంశాలు ఉండేవి. సాంఘిక- రాజకీయ జీవితం పాఠ్యాంశంలోనే ఆర్థిక శాస్త్రం ఒక భాగంగా ఉండేది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిన నూతన విద్యా విధానం ఆధారంగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య పుస్తకాలు అన్నిటిని సమూలంగా మార్చటంలో భాగంగా ఈ మూడు పాఠ్యాంశాలను కలిపి ఒకే పాఠ్యాంశంగా మార్చారు. ఫలితంగా గతంలో ఉన్న పార్టీ పుస్తకాలలో ఉన్న సవివరమైన చాలా వివరణలు ప్రస్తావనలుకు తాజా పుస్తకాలలో చోటు దొరకటం లేదు. అదే సమయంలో వర్తమానాన్ని కూడా చరిత్రలో భాగంగా చొప్పించే ప్రయత్నం జరగటంతో తాజా పాఠ్యాంశాలు విద్యార్థులకు కావాల్సిన సంపూర్ణ అవగాహనను ఇవ్వగలిగేవిగా లేవు. అక్కడక్కడా ప్రభుత్వం ఎంపిక చేసిన థీమ్స్‌కు సంబంధించి చెదురుమదురు వివరాలు మాత్రమే పూర్తి చరిత్రగా మారింది.
ప్రస్తుతం రూపొందించిన పాఠ్యాంశ పుస్తకం శీర్షిక ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఈ సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలైంది. దీని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో మొదటి ఆరు నెలల పాటు బోధించనున్నారు.
ఈ పాఠ్యాంశాలను ఐదు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో భారతదేశం– ప్రపంచం, రెండో భాగంలో భూమి– ప్రజలు, మూడో భాగంలో మన సాంస్కృతిక వారసత్వం, నాలుగో భాగంలో జ్ఞాన సాంప్రదాయాలు, మన చుట్టూ ఉన్న ఆర్థిక- జీవితల గురించి బోధించనున్నారు.
ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం మొదటి భాగం..
ఇప్పటివరకు అమల్లో ఉన్న ఏడో తరగతి చరిత్ర పాఠ్యాంశం క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి మొదలవుతుంది. దీనికి భిన్నంగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన ఏడో తరగతి చరిత్ర పాఠ్యాంశం మొదటి భాగంలో క్రీస్తుపూర్వం 19వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు జరిగిన చరిత్రను బోధించనున్నారు. ఇందులో భాగంగా సంస్కృత పదాలు వాటి వివిరణ గురించి కూడా విద్యార్థులకు బోధించనున్నారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న చరిత్ర పాఠ్య పుస్తకంలో మొగల్ చక్రవర్తి బాబర్ 14వ శతాబ్దపు కవి మీనాజ్ ఈ సిరాజ్ గురించిన వివరాలు ఉన్నాయి. ఈ కవి మొదటిసారిగా భారతదేశాన్ని హిందుస్థాన్, హింద్ అన్న పదాలతో ప్రస్తావించారని చరిత్ర పరిశోధకులు నిర్ధారించారు. ఈ వివరాల స్థానంలో తాజాగా విడుదల చేసిన పాఠ్యపుస్తకంలో భారతదేశాన్ని భారత్, ఇండియా అన్న పదాలతో మాత్రమే పరిచయం చేయనున్నారు.
సంవత్సరం ఆరో తరగతి పాఠ్య పుస్తకాన్ని సవరించడం కోసం జరిగిన ప్రయత్నాల్లో వెలువడిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు జరిగాయి. ఆరో తరగతి పాఠ్య పుస్తకంలో ప్రాచీన భారత దేశాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి సవివరమైన కథనాలను పాత పాఠ్యాంశంలో బోధించేవారు. ప్రస్తుతం ఆరో తరగతి చరిత్ర పాఠ్యాంశంలో ఈ అంశాలు తొలగించి ఏడవ తరగతి పాఠ్యాంశంలో భాగంగా మార్చారు.
ఏడవ తరగతి విద్యార్థుల కోసం తాజాగా రూపొందించిన చరిత్ర పాఠ్యాంశంలో భారతదేశం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ భాగం గుప్తుల పరిపాలన వరకు ఉన్న చరిత్రను ప్రస్తావిస్తుంది. ఏడవ తరగతి చరిత్ర బోధనలో ఇప్పటివరకు ఉపయోగిస్తున్న పాఠ్యపుస్తకంలో క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి 12 శతాబ్దం వరకు ఉన్న చరిత్రకు సంబంధించిన వివరాలు ఎంపిక చేసిన రాజవంశాలు గురించి లోతైన చర్చ ఉంది. పాత పాఠ్యాంశంలో మౌర్యుల సామ్రాజ్యం, గుప్తుల సామ్రాజ్యం గురించిన ప్రస్తావన ఇతర ప్రాంతీయ రాజ్యాల గురించిన ప్రస్తావనలు లేవు. వీటిని నూతన పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు.
ఢిల్లీ సుల్తాన్లు, మొగలులకు స్థానం లేని చరిత్ర పాఠ్యాంశం..
ఇప్పటివరకు బోధిస్తున్న ఏడవ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకంలో క్రీస్తు శకం 12 శతాబ్దం నుంచి 15 శతాబ్దం వరకు ఉత్తరభారతాన్ని దక్షిణ భారతంలో కొంత భాగాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తానుల శకం ప్రారంభం గురించిన చర్చ ఉన్నది. రాజపుత్ రాజ్యాలు పతనమై వాటి స్థానంలో ఖిల్జీలు, తుగ్లకులు, సయ్యిద్‌లు, లోడీలు భారత దేశంలో 16 శతాబ్దంలో ప్రవేశించిన మొగలుల గురించిన చారిత్రక అంశాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం రూపొందించిన ఏడో తరగతి చరిత్ర పాఠ్యాంశంలో ఈ ప్రస్తావనలను తొలగించారు.
ప్రాచీన భారత రాజ్యాలు..
భారతదేశపు గతం గురించి ఉన్న భాగంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. నూతన ప్రారంభం- నగరాలు రాజ్యాలు శీర్షికతో ఉన్న మొదటి అధ్యాయం కౌటిల్యుని అర్థశాస్త్రంలోని వాక్యాలతో, మొదటి సామ్రాజ్యం కూలిపోయిన రాజ్‌గిర్ పట్టణం శిథిలాలతో ప్రారంభమవుతుంది. జానపదాలు మహాజనపదాలు అన్న భావన ఆరంభాన్ని ఈ అధ్యాయంలో చర్చిస్తారు. అందులో భాగంగా గాంధార, కురు, మత్స్య, అవంతి, చెడి, కోసల, మగధ వంటి క్రీస్తుపూర్వం రెండవ సహస్రాబ్ది ముగింపు కాలం నాటి జనపదాల గురించి పరిచయం చేస్తారు. వర్ణ, కులవ్యవస్థ వేదాలలోనే ఉన్నట్టు చెప్పబడుతుంది.
ఆవిర్భవించిన సామ్రాజ్యాలనే శీర్షికతో సాగే ఐదవ అధ్యాయంలో పాటలీ పుత్ర, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, గ్రీకుల దాడులు, అశోకుని పాలన వాటి అంశాలు పరిచయం చేస్తున్నారు. కౌటిల్యుడు, పాణిని వంటి ఆ కాలానికి సంబంధించిన ముఖ్యమైన మేధావులు రాజకీయ శాస్త్రవేత్తలు గురించిన పరిచయం ఈ భాగంలో ఉంటుంది. పాణిని తన అష్టాధ్యాయి పుస్తకంలో సంస్కృతానికి సంబంధించిన వ్యాకరణ సూత్రాలను ప్రతిపాదిస్తారు.
ఆరో అధ్యాయంలో భాగంగా శుంగ, శాతవాహన, చేడి వంటి ఉత్తర భారత రాజ్యాలతో పాటు దక్షిణ భారతంలోని చోళ, పాండ్య, చేర రాజ్యాల గురించి ఉంటుంది. పునర్నిర్మాణం అధ్యాయంలో రామాయణ కథనం ఆధారంగా రూపొందించిన రంగురంగుల చిత్రాలు మధ్యప్రదేశ్‌లోని శుంగ వంశ పాలన నాటి బహ్రూత్ స్థూపం, మహారాష్ట్రలోని నానే ఘాట్, కార్ల, పిట్టల్ ఖోర గుహలు, భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరి గుహలు, చెన్నైలోని కన్నె విగ్రహం వంటి వాటిని పరిచయం చేస్తున్నారు.
భూమి పవిత్రమైనదిగా ఎలా మారింది..
ఏడవ అధ్యాయంలో ప్రధానంగా గుప్తుల కాలం నాటి చరిత్రకు కేటాయించారు. మూడో శతాబ్దం నుంచి ఆరో శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని ఈ పాఠ్యాంశంలో బోధిస్తున్నారు. కళలు, శాస్త్రవిజ్ఞానం, సాహిత్యం, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఖనిజ వనరుల వినియోగం, భవన నిర్మాణాలతోపాటు సంస్కృత భాషలో వెలువడిన సాహిత్యం గురించి ఈ అధ్యాయంలో చర్చించారు. గుప్తుల సామ్రాజ్యం, నలంద విశ్వవిద్యాలయం, కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిహురుడు వంటి వారి గురించి విష్ణు పురాణంలోని కథనాలను ఈ అధ్యాయంలో ప్రస్థావించారు.
ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతం పై ఆధిపత్యాన్ని సాధించిన పల్లవ సామ్రాజ్యం గురించి కూడా ఈ అధ్యాయంలో చర్చించారు. సమకాలీన అస్సాంను ఆ రోజుల్లో ప్రాగ్జ్యోతిష్యపురం పేరుతో రామాయణ, మహాభారతంలో ఉన్న ప్రస్థావనలను ఈ అధ్యాయంలో చేర్చారు.
భూమి ఎలా పవిత్రమైందనే శీర్షికతో మొదలయ్యే ఎనిమిదవ అధ్యాయం భాగవత పురాణంలోని వాక్యాలతో మొదలవుతుంది. కుంభమేళతో సహా దేశంలోని ప్రముఖ ధార్మిక తీర్థయాత్ర స్థలాల గురించి ఈ అధ్యాయంలో విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.
ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్‌లో భాగంగా పాతకాలపు పేదరికం, వలసవాదం నుంచి పాఠ్యపుస్తకాలను విముక్తి చేశామని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రస్థానలో తెలిపారు. ఆర్థిక అంశాలపై ఎన్టీఆర్ రూపొందించిన పాఠ్యాంశాల రూపకల్పన విభాగానికి సంజీవ్ సన్యాల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఎన్సీఈఆర్టీ కరిక్యులం ఏరియా గ్రూప్ ఎకనామిక్స్ విభాగం రూపొందించిన ఏడో తరగతి పాఠ్యపుస్తకంలో అన్ని అందమైన వర్ణ చిత్రాలు ఆధారంగా ఆర్థిక శాస్త్రాన్ని విద్యార్థులకు పరిచయం చేయనున్నామని, చరిత్ర పాఠ్యాంశాలను తేదీలు, సంవత్సరాల రూపంలో కథల రూపంలో బోధించనున్నామని తెలిపారు. వీటికి సంబంధించి ఇంకా తాజాపరిచే ప్రయత్నాలు అవసరమైతే రావచ్చు కానీ వలసవాద దృక్పథం, పేదరికం దృక్కోణం నుంచి పాఠ్యాంశాలను విముక్తి చేశామని తెలిపారు.
2012లో రూపొందించిన ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరణలన్నీ ఉద్దేశపూర్వకంగానే పేదరికానికి సంబంధించిన వ్యాఖ్యానాలతో నిండి ఉన్నాయని ఆయన ఆరోపించారు.
తాజాగా ఖరారు చేసిన పాఠ్యాంశంలో వస్తు మార్పిడి నుంచి నగదు వరకు అన్న అధ్యాయంలో వసుమార్పిడి పద్ధతి తీరుతున్నలు, నగదు చలామణి చరిత్ర, చాళుక్యులు, చోళుల కాలంలో నాణాల వ్యవస్థ వంటి అంశాలను వివరించుకుంటూ తాజాగా చలామణిలో ఉన్న డిజిటల్ మనీ, ఆధునిక ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థలు, యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వంటి వ్యవస్థల గురించి విద్యార్థులకు పరిచయం చేయనున్నారు.
మార్కెట్ల గురించి అర్థం చేసుకుందామనే రెండవ అధ్యాయంలో కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర సామ్రాజ్య కాలం నాటి చారిత్రక హంపి బజారు గురించి న వర్ణన ఆధారంగా ఆధునిక మార్కెట్లు ఎలా పనిచేస్తాయో వివరించారు.
ఇప్పటివరకు పాఠ్యాంశంగా ఉన్న ఏడవ తరగతి చరిత్ర పుస్తకాలకు భిన్నంగా తాజా పుస్తకం వర్తమాన వ్యవసాయ మార్కెట్లను, చేనేత కార్మికుల సహకార సంఘాలను, వర్తమాన వేతన వ్యవస్థ గురించి, వస్త్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని చిత్రాలు చూపించి ఆయా పనులకు ఎంతెంత వేతనాలు ఇవ్వవచ్చని విద్యార్థి భావిస్తున్నారో ఆ మేరకు మంత్రులకు లేఖలు రాయడం గురించిన ఉదాహరణలు మాత్రమేఉన్నాయి. పాత పాఠ్యాంశంలో చరిత్ర నుంచి అనేక ఉదాహరణలు బోధనాంశాలుగా పొందుపరిస్తే తాజాగా రూపొందించిన పాఠ్యపుస్తకంలో కుటుంబ సభ్యులు కూరగాయలు అమ్మే వ్యక్తితో బేరసారాలు ఆడటం, వీధిలో ఉన్న అమ్మకం దారుడిని కాదని సూపర్ మార్కెట్‌కు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేయటం వంటి ఉదాహరణలు ఉన్నాయి.
6, 7 తరగతిలో బోధించే ఆర్థిక అంశాల గురించిన పాఠ్యాంశాలను సవరించిన తమ బృందం ప్రస్తుతం ఎనిమిదో తరగతి పాఠ్యాంశాలను సవరించే ప్రయత్నంలో ఉందని సన్యాల్ తెలిపారు.
రైతులు రుణభారానికి చోటు లేని చరిత్ర..
ఇప్పటివరకు అమల్లో ఉన్న ఆరో తరగతి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకం రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. గ్రామీణ జీవనస్థితి కథలు పట్టణ ప్రాంత జీవనస్థితిగతులు అన్నవి ఆ రెండు భాగాలు. గ్రామీణ జీవనస్థితిగతులు అనే అధ్యాయంలో గ్రామీణ తమిళనాడు ప్రాంతంలో పంట పొలాల్లో పని చేసే కూలీలు వారి వేతనాలు గురించి చర్చ ఉండేది. ఈ మొత్తం అధ్యాయం రుణభారం మోస్తున్న రైతాంగం గురించి సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరణలు ఉండేవి. దీనికి భిన్నంగా తాజాగా రూపొందించిన ఆరో తరగతి పాఠ్యాంశంలో కౌటిల్యుని అర్థశాస్త్రంలోని వాక్యాలతో ప్రారంభమవుతుంది. గుజరాత్‌లోని ఆనంద్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం దేశంలో పాల ఉత్పత్తిని ఎలా విప్లవీకరించిందో వివరంగా ప్రస్థావించారు. పాత పాఠ్య పుస్తకంలో రైతాంగం మోస్తున్న రుణ భారం గురించి ఉదాహరణలతో కూడిన వివరణ ఉంటే తాజాపరిచిన పాఠ్యపుస్తకంలో ఈ భాగాన్ని తొలగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.