
జనవరి మూడో తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో వేదాంత మహాసభలను ప్రారంభిస్తూ ఉపరాష్ట్రపతి ధన్కడ్ చేసిన ప్రసంగం.
విషయంలోనూ మాట్లాడే విధానంలోనూ దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అసమానశైలిని అనుసరిస్తారు. అది దూకుడుగా లేకున్నా ధృఢంగా నొక్కిచెప్పేదిగా ఉంటుంది. తరచుగా చెప్పే అంశానికి దానితో సంబంధం ఉండదు. అది అన్ని సందర్భాల్లో తార్కికంగానూ స్థిరంగానూ కూడా ఉండదు. ప్రతిపక్షాలపై వాస్తవమైన లేదా ఊహాత్మకమైన ఆరోపణలు చేసేటప్పుడు ఈ ప్రసంగంలో దృశ్యాత్మకమైన పదబంధాలు ఉంటాయి.
నిజానికి దాన్ని ధన్కడ్ భాషణం అని పిలవడం సరైంది కాదని అనలేం. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘వేదాంత’ అంతర్జాతీయ సభల ప్రారంభోత్సవంలో జనవరి 3వ తేదీన ఆయన చేసిన ప్రసంగం ‘ధనకడ్ భాషణం’కు చక్కటి ప్రదర్శన.
సభలలో చర్చనీయాంశం వేదాంత ప్రపంచక్రమాన్ని పునఃకల్పన చేయటం- వేదాంత తాత్విక భావాలని నేటి ప్రపంచపు ఆదర్శాలతో కలిపపడానికి నేరుగా ధన్కడ్ ప్రయత్నించలేదు. అప్రతిహతంగా సాగుతున్న సాంకేతిక మార్పులు, మానవ మనుగడనే సంక్షోభంలో పడేస్తున్న పర్యాయరణ మార్పులు, భౌగోళిక కలవరం కాలంలో వేదాంత తాత్విక భావజాలాన్ని ఆశ్రయించాలని నొక్కి వక్కాణించారు. ‘అవి వేగుచుక్క మాదిరిగా మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది’ అని బలంగా చెప్పారు.
ప్రపంచక్రమాన్ని నడిపించే లంగరుగా ఒక తాత్విక వ్యవస్థ ఉండి తీరుతుందనే అభిప్రాయం ధన్కడ్ కలిగి ఉండటం పట్ల ఎవరితో తగాదా పడాల్సిన అవసరం లేదు. ఇతర తాత్విక ఆధ్యాత్మిక సాంప్రదాయాలను అనుసరించే వారు వాటి ప్రాసంగికతను కూడా చెపుతారు. కాబట్టి ఆధునిక కాలంలో మనుషులంతా సమానం అనే విశ్వజనీన భావనలనే అంతర్జాతీయ సమాజం నొక్కి చెపుతుంది. ఈ సూత్రం యూరపు జ్ఞానోదయ కాలపు భావాల నుండి పుట్టింది. ఇది విస్తృతమై 20వ శతాబ్దంలోకి కూడా వ్యాపించింది. (యూరపు జ్ఞానోదయం గురించి ప్రస్తావించగానే నన్ను మెకాలే పుత్రుడని పిలుస్తారనే ఆరోపణ వస్తుందని నాకు తెలుసు. మరి భారతదేశ ప్రజాస్వామ్యానికి తల్లి కదా ఆ మాట అంటేనే దానర్థం మానవ సమానత్వ భావనను విశ్వసించినట్లే అవుతుంది) అన్నికాలాల్లో అన్ని వ్యవస్థల్లో అవగాహనకు, అమలుకు మధ్య వెడల్పాటి అంతరం ఉంటుంది.
అయితే, మన కాలపు సంక్షోభాలను ధన్కడ్ గుర్తించారు. సైబరు యుద్ధాలు, అలౌకికమైన అభూతపూర్వమైన వాతావరణ ముప్పు దాని నివారణకు అవసరమైన నైతిక దృక్పథం గల సాంకేతిక పరిష్కారాల గురించి కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు. ‘వేదాంతతత్వ లోతయిన అవగాహనలోంచి పుట్టుకొచ్చి నైతిక వివేకం, వాస్తవ విధానాలపై నొక్కి వక్కాణించారు. సాంకేతిక పురోగతిని నైతికంగా వాడుకోవాలనే తపన మానవజాతి ప్రారంభం నుండి ఉంది. కానీ సాంకేతిక అభివృద్ధికి, సాంకేతిక పరిష్కారాలు అనే అంశాలు వాటి స్వంత తార్కికతను అనుసరిస్తాయి. నైతికత- వాస్తవ విధానాలను విలీనం చేయటం ఎన్నడూ పనిచేయలేదు.
‘కలలన్నీ కలిసి సాగితే ప్రపంచం చాలా మెరుగవుతుంది, కాని మనం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాం. ఆశ, ఉన్నత ధోరణులు ఒక చోటికి రావడం లేదు. ఒక దగ్గర చేరుతున్నవన్ని చెడు లక్ష్యాలు, నీచమైన ధోరణులు- వాటి లక్ష్యం మానవతకు అనుకూలం అయినవి కావు.’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ధన్కడ్ ప్రకారం ఈ ప్రతికూల శక్తులు ఏవి? ఎవరైతే సనాతన ధర్మాన్ని కీర్తించరో వాళ్లంతా. ఆయనే చెప్పినట్టు ‘ఈ దేశంలో సనాతనం గురించిగాని, ‘హిందు’ గురించి గాని ప్రస్తావిస్తే చాలు ఈ పదాలు లోతైన అర్థాన్ని చూపకుండానే అడ్డుపడే ప్రతిస్పందన రావడం బాధాకరం, విచిత్రం, అవగాహన కానిది. తక్షణం జనం లోతుల్లోకి పోకుండా ప్రతిస్పందిస్తారు. ఇంతకంటే తీవ్రమైన అజ్ఞానం ఏమైనా ఉంటుందా? అపారమైన ఈ లోపాన్ని సరిదిద్దడం సాధ్యమా? ఈ ఆత్మలు వాటంతట వాటిగానే దారి తప్పాయి. సమాజానికే కాదు. వాటికి కూడా ప్రమాదకారిగా ఉన్న ఒక ప్రమాదకరమైన పర్యావరణం వలన నడపబడుతున్నారు.’ అని ఆయన ప్రస్తావించారు.
భావప్రకటనా, పరస్పర సంభాషణల ప్రాధాన్యత గురించి ధన్కడ్ నొక్కి చెప్పారు. నిజానికి భావప్రకటనా హక్కు దైవదత్తమైనది, అభివ్యక్తీకరణ సంభాషణ చేయిచేయి కలిపి నడుస్తాయని ఆయన చెప్పారు. ఇక ఆ తర్వాత చెప్పిందంతా పాలనా నియమ మినహాయింపులు ప్రతిపక్షాలకు సంబంధించి వర్తమాన రాజకీయాల గురించి అని విశ్లేషించుకోవాలి. ‘ఈ అంతరాయాలు, కల్లోలం చాలా ఆందోళనకరం. ఆందోళన కలిగించేవి. వాళ్లు నిజానికి పరస్పర సంభాషణను, అభివ్యక్తీకరణను లొంగదీశారు. ఊహాత్మకంగా జోడించారు. సంభాషణ, సంవాదం, చర్చ అనేవి అంతరాయం, భంగం కలిగించడం, కల్లోలితం చేయటం అనే వాటి దాడితో ప్రజాస్వామిక రంగస్థలం నుండి కూడా నిష్క్రమించాయి.
వేదాంత తాత్విక మహాసభల ప్రారంభోత్సవంలో రాజకీయాన్ని చొప్పించడం మర్యాద కాదనే విషయం కూడా ఆయనకు తట్టలేదు. వాస్తవానికి ఆయన ప్రస్తావించిన రాజకీయ అంశం గురించి ఎవరైతే వారి కర్తవ్య నిర్వహణలో విఫలం అయ్యారో వారిపై ఒత్తిడి తేవాలని జనాన్ని కోరడం ద్వారా రాజకీయాల గురించి నొక్కి చెపుతున్నారు. వేదాంతం, సనాతన వచనాల్ని నమ్మేవారు వికృతమైన వలసవాద మానసికతకు బాధితులు అని ధన్కడ్ ఆరోపిస్తున్నారు. భారతీయతత్వశాస్త్రంలోని అన్ని ధోరణులు వేదాలపై ఆధారపడి లేవనేది ఒక వాస్తవం. అయితే దానికంటే ముఖ్యమైనది ఒకటుంది. వేదాంతాన్ని, ఆలోచనగలిగిన భారతీయ తాత్వీక ప్రవచనాలని నమ్మేవాళ్లు కూడా ‘మనుస్మృతి’ సామాజికంగా తిరోగమన శీలమైందని మాత్రమేకాక అది భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేక సిద్ధాంతంగా భావిస్తారు. అధికారంలోకి వచ్చిన ప్రతీవారు రాజ్యాంగాన్ని కాపాడతామని, రాజ్యాంగబద్ధులమై ఉంటామని తప్పని సరిగా చేసే ప్రమాణం అంటేనే, అంతర్గతంగా మనుస్మృతిలో పేర్కొన్న సామాజిక నిచ్చెనమెట్ల వ్యవస్థ తప్పని, దాన్ని వారు తిరస్కరిస్తామని కూడా ప్రమాణం చేసినట్లేనని భావించాలి. దీనిని వికృత వలసవాద మానసికస్థితిగా భావించకూడదు. అలా ఒకవేళ భావిస్తే రాజ్యాంగం మొత్తం వికృత వలసవాద మానసికస్థితి నుండి తయారైందని చెప్పాల్సి ఉంటుంది.
ప్రశాంతమైన హేతుబద్ధమైన చర్య, పిడివాదాన్ని తిరస్కరించడం, నిరంతరం ప్రశ్నించడం, వైవిధ్యభరితమైన ఆలోచనలు అనేవి భారతీయతత్వశాస్థ్రానికి పునాదులు. ధన్కడ్ ప్రారంభోపన్యాసానికి ముందు క్లుప్తంగా మాట్లాడిన ప్రొఫెసర్ అరిందమ్ చక్రబర్తి ఈ విషయాన్ని ప్రతినిధులకు వివరించారు. బహుశా ఇదే విషయం ధన్కడ్ ఉపన్యాసంలో కూడా ఇలా వ్యక్తీకరించి ఉండొచ్చు.
విధ్వంసకర సాంకేతిక శక్తిని మించిపోయి ఉండే అణుశక్తికంటే ఎంతో మించి పోయి రూపాంతరం చెందే శక్తికలది వేదాంతం. ఒకటి అది దిగజారుడు అవుతుంది. రెండు పరిస్థితిని చక్క దిద్దుతుంది. దాన్ని బాగు చేయటం ద్వారా మనల్ని సరైన గాడిలో పెడుతుంది. వేదాంతం తాత్వికతకు మించింది. చైతన్యానికి, మానవ చైతన్యానికి అది ఆల్గోరిథమ్లాంటిది.
ఈ ఆలోచనను పార్లమెంటు పభ్యులు గ్రహించాలని ఆయన అభిప్రాయం. ‘మరి కోవిడ్‌ను ఎదుర్కొంటున్నడు అధర్వేద ఆధిక్యం వహించింది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఏది సర్వజ్ఞానం కలది’ అన్న ఆయన అభిప్రాయన్ని డాక్టర్లు కూడా ఆమోదించాలని ఆయన కోరుకుంటున్నారా?
రచన: వివేక్ కట్జు (పూర్వ భారత రాయబారి)
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.