
న్యూఢిల్లీ: పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఉండే రాత్రి పగళ్ళలో వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా రుతువుల నిడివిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు సాక్ష్యంగా మహారాష్ట్రలోని పూనేలో డెంగ్యూ వల్ల పెరుగుతున్న మరణాలు, దోమల వల్ల వ్యాప్తి చెందుతున్న వ్యాధులను చెప్పవచ్చు. దీని మీద అధ్యయనం చేసి, పలు విషయాలను ఓ సైంటిఫిక్ నివేదిక వెల్లడించింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రాంతాలలో డెంగ్యూ మరణాలు, ఆరోగ్య సమస్యలకి సంబంధించిన డాటా నమూనాలను విశ్లేషిస్తే ముందస్తు హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అధికారులను ముందుగా అప్రమత్తం చేసి ఇన్ఫెక్షన్ వల్ల మరణించేవారి సంఖ్యను తగ్గిస్తుంది. ఆయా రాష్ట్రాలు ఆరోగ్య డాటాను పరస్పరం పంచుకోవడం దీనికి కీలకమని శాస్త్రవేత్తలు అన్నారు.
డెంగ్యూ, వాతావరణ మార్పు
డెంగ్యూ అనేది వైరల్ జ్వరం. అది దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 100-400 మిలియన్ల వరకు దీని ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది. ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు డెంగ్యూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, వికారం, దద్దుర్లు లాంటివి వ్యాధి సోకిన వారిలో సాధారణంగా కనబడే లక్షణాలు. ఒక్కొసారి డెంగ్యూ ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధికి ప్రస్తుతమైతే నివారణ లేదు.
డెంగ్యూ వ్యాధి కారణంగా మరణాలు, వాతావరణ పరిస్థితులు అనే అంశంపైన వాతావరణ ప్రజా ఆరోగ్య శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 2004-2015 వరకు పూనేలోని ఉష్ణోగ్రత, వర్షపాతం గురించి తెలుసుకుంది. పూనే నగరంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం ఇంకా తేమ సంబంధమైన అంశాలు డెంగ్యూ వ్యాధి మరణాలకు ఎక్కువ కారణమైనట్టుగా ఈ బృందం గ్రహించింది.
ఈ పరిశోధన బృందం డాటా ఏమంటోంది ?
కాలానుగుణంగా వాతావరణ మార్పులతో డెంగ్యూ మరణాలు సంభవించినట్టుగా స్పష్టంగా తెలిసింది. డిసెంబర్ నుంచి మే నెల వరకు మరణాల రేటు తక్కువగా ఉంది. కానీ ఆ తర్వాత పెరిగింది. వేసవికాల ప్రారంభం నుంచి వర్షాకాలం జూన్ నెలలో డెంగ్యూ తన ప్రభావాన్ని చూపించింది. నవంబర్ నెలలో అది తీవ్రస్థాయికి చేరుకుంది.
12 ఏళ్ల పాటు జరిగిన అధ్యయన కాలంలో 2014 సంవత్సరంలో ఎక్కువగా మరణాల సంఖ్య పెరిగింది. 2014 సంవత్సరంలో 81 డెంగ్యూ మరణాలు సంభవించాయి.
ఒక మోస్తరు వర్షాల వ్యాప్తి వల్ల వేసవి, వర్షకాలాలలో డెంగ్యూ మరణాలు పెరిగినట్టుగా బృందం గుర్తించింది. ఏదిఏమైనప్పటికీ భారీ వర్షాల వల్ల దోమల లార్వాలు కొట్టుకుపోవడం వల్ల వ్యాధి ప్రభావం తగ్గుతుంది. 27 డిగ్రీల సెంటిగ్రేటెడ్ పైబడిన ఉష్ణోగ్రతలు, 60% నుంచి 78% మధ్య ఉండే తేమ స్థాయి డెంగ్యూ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
వాతావరణ, డెంగ్యూ మరణాలకు సంబంధించిన ఆధారాలతో ఓ మోడల్‌ను ఈ బృందం అభివృద్ధి చేసింది. డెంగ్యూ మరణ అంచనాలు భవిష్యత్తులో ఎలా ఉండనున్నాయో ఆ నమూనాతో అంచనావేసింది.
వాతావరణంలో ఎక్కువగా విడుదలైన కర్బన ఉద్గారాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది, దాని ప్రభావంతో వాతావరణ మార్పులు సంభవించాయి. దీనిని ప్రస్తుత ప్రపంచమంతా చవిచూస్తోంది.
వాతావరణ మార్పు ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తే ఉష్ణోగ్రతతో పాటు తేమ శాతం కూడా దేశవ్యాప్తంగా పెరుగుతుందని అంచనా. ఇది వర్షపాత స్థాయి మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీని వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బృందం రూపొందించిన నమూనా అంచనాల మేరకు వాతావరణ మార్పుల వల్ల వెచ్చని రోజులు పెరిగితే పూనేలో డెంగ్యూ ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
వాతావరణ మార్పులలో భాగంగా సమీప భవిష్యత్తులో(2021-2040) డెంగ్యూ సంబంధిత మరణాల రేటు నగరంలో 13% పెరుగుతుందని ఈ బృందం అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. మధ్య శతాబ్దం (2041-2060) వరకు 23-40% చేరుకుంటుంది. శతాబ్దం చివరికి (2081-2100) చేరుకొనే సరికి అది కాస్తా 30-112% అవుతుంది. అయితే వివిధ కర్భన ఉద్గారాలు ఉష్ణోగ్రతను పెంచి, వర్షపాతం మీద ప్రభావాన్ని చూపుతాయి.
డాటా ప్రాముఖ్యత
ఏదిఏమైనప్పటికీ.. వాతావరణ కారకాలు, డెంగ్యూ పెరిగే ఫలితాల మధ్య సంబంధం ఉందని బృందం కనుగొన్నది. ఐదు, మూడు ఇంకా రెండు నెలల వరుస తేడాతో డెంగ్యూ మరణాల రేటు మీద ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ శాతం పూనేలో ప్రభావం చూపింది. ఈ అంతరం ఓ హెచ్చరికలా పనిచేయవచ్చు. వైద్యాధికారులు అప్రమత్తం అవ్వడానికి ఇది సరిపోతుంది.
వాతావరణ మార్పు ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపుతుందో అర్ధం చేసుకోవడానికి ఈ అధ్యయనం కీలకమైనదని సోఫియా యాకోబ్ చెప్పారు. ఐఐటీఎంలో సోఫియా రిసర్చర్, అంతేకాకుండా అధ్యయనంలో కీలక భాగస్వామి. అధ్యయన ఫలితాలను విశ్లేషించిన బృందంలో కూడా సభ్యులు. ‘‘మేము అభివృద్ధి చేసిన మోడల్ వేరే ప్రాంతాలలో కూడా అమలు చేయవచ్చు, వాతావరణ- డెంగ్యూలాంటి సున్నిత వ్యాధులు అదుపు చేయడానికి ఇది ఇంతో కీలకంగా పనిచేస్తుంది’’ అని సూచించారు.
కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, హర్యాన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ఇంకా ఉత్తరప్రదేశ్‌లలో డెంగ్యూ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదిఏమైనా ఇందులోని చాలా రాష్ట్రాలు తమ ప్రజారోగ్య డాటాను బృందానికి ఇవ్వలేదు.
‘‘పూణే వైద్యశాఖ పంచుకున్న డేటా ఆధారంగా మేము ఈ అధ్యయనాన్ని నిర్వహించి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థను రూపొందించాము’’ అని ఐఐటీఎం వాతావరణ సైంటిస్ట్ రాక్సీ మాథ్యూ కోల్ తెలిపారు. ‘‘ డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న మిగితా రాష్ట్రాలను కూడా మేము సంప్రదించాము కానీ అక్కడి వైద్యశాఖలు మాకు సహకరించలేదు.’’ అని విచారం వ్యక్తం చేశారు.
‘‘ఐఎండీ వాతావరణశాస్త్ర డాటా మా వద్ద అందుబాటులో ఉంది. ఒక వేళ రాష్ట్రాలు ఆరోగ్య డేటాను పంచుకుంటే, మేము ఆయా నగరాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అనుకూలమైన ముందస్తు హెచ్చరిక సిస్టమ్‌ను తయారు చేస్తాము. ఈ సిస్టమ్ డెంగ్యూ, మలేరియా, చిన్న అమ్మవారు లాంటి వ్యాధులకు పనిచేస్తుంది. ఆరోగ్యశాఖ సహకారం ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఎంతో కీలకమైనది’’ అని తెలిపారు.
సున్నిత వాతావరణ ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ బృంద అధ్యయనం దాని ప్రాముఖ్యతను తెలియజేసిందని సుజాత సౌనిక్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుజాత సౌనిక్ ఉన్నారు. అంతేకాకుండా ఈ అధ్యయనానికి సహ రచయిత కూడా.
‘‘శాస్త్రవేత్తలు, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మన ఆరోగ్య హెచ్చరిక వ్యవస్థను ఎలా మెరుగు పరచవచ్చోముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం మంచి ఉదాహరణగా నిలుస్తుంది’’ అని సుజాత అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.