
హైదరాబాద్ : ఇళ్ళు, అపార్ట్మెంట్లు, విల్లాలు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టదల్చుకున్న వారు కొన్ని నియమాలను తూచా తప్పకుండా అనుసరించాలని (హైడ్రా) కమిషనర్ అన్నారు. ముందుగా సదరు వెంచర్లు ఏమైనా సాగునీటి వనరులను ఆక్రమించి నిర్మించారానే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు.
సోమవారం నాడు ప్రజావాణిలో దరఖాస్తుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకృతి వైపరీత్యాల నివారణ ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ సాధికార సంస్థ(హైడ్రా) కమిషనర్ హాజరైయ్యారు. కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వటానికి వచ్చిన ప్రజలతో ఆయన ముచ్చటించారు.
“ఆస్తులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాలువలు నీటి ప్రవాహాల మీద జరిగే శాశ్వత నిర్మాణాలు భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలకు, పర్యావరణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులు చట్టవిరుద్ధమైనవని నిర్ధారించబడితే, ప్రభుత్వమే కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వవచ్చు. అలాంటి పరిస్థితులు ప్రజలకు ఆర్థిక నష్టాన్ని కలగచేస్తాయి” అని రంగనాథ్ హెచ్చరించారు.
సోమవారం నాడు హైడ్రా అధికారులకు మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం నాలా సమస్యలు, అక్రమ లే అవుట్ సమస్యలు ఉన్నాయని హైడ్రా విడుదల చేసిన ప్రెస్ నోట్లో తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.