
Bangladesh: Interim government bans Awami League under anti-terrorism law
ఉగ్రవాద నిరోధ చట్టంలో భాగంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యక్రమాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ చేసింది. పార్టీకి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా నడుస్తున్న కేసులు ముగిసే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ఇది చట్టవ్యతిరేకమైన చర్యగా అవామీ లీగ్ పార్టీ అభివర్ణించింది.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ బహిష్కృత మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలో నడిచే రాజకీయ పార్టీ అవామీ లీగ్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ విధించింది.
డాయ్చే వేలే నివేదిక ప్రకారం, అవామీ లీగ్ మీద దేశ ఉగ్రవాద నిరోధ చట్టం అనుసారం బ్యాన్‌ను విధించారు. ఇందులో భాగంగా దేశ న్యాయ సలహాదారు ఆసీఫ్ నజరూల్ మే 10న రాత్రి విలేకరులతో మాట్లాడారు. “అవామీ లీగ్, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నడిచే కేసులు పరిష్కరించబడే వరకు ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాలపై, అందులో ఆన్లైన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై నిరోధం కొనసాగుతుంది”అని ఆసీఫ్ అన్నారు.
గత ఏడాది ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శల సందర్భంగా చాలామంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అవామీ లీగ్, ఈ పార్టీ నేతల మీద కేసులు నమోదు అయ్యాయి. వీరి మీద నడుస్తున్న ప్రస్తుత కేసులు ముగిసేవరకు ఈ బ్యాన్ ఒక విశేష ట్రిబునల్ ద్వారా కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు.
ట్రిబ్యునల్ సాక్షుల రక్షణ కోసం ఈ బ్యాన్‌ను విధించడం జరిగిందని శనివారం నాడు జరిగిన ఒక విశేష క్యాబినెట్ సమావేశం తర్వాత నజరూల్ అన్నారు. దీని కంటే ముందు వేళమంది నిరసనకారులు డాకా రహదారుల మీద నిరసనకు దిగారు. ఎప్పటి వరకు అవామీ లీగ్ మీద బ్యాన్ విధించబడదో, అప్పటి వరకు తాము రహదారుల మీద నుంచి లేవమని నిరసనకారులు అన్నారు. ఈ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్తూ, అవామీ లీగ్ ఖండించింది.
హసీనా, అవామీ లీగ్ పార్టికీ చెందిన ముఖ్యనేత. అంతేకాకుండా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంతి. 2024 ఆగష్టు 5న బంగ్లాదేశీ సైన్యం కల్పించిన ప్రత్యేక విమానం నుంచి భారత్ చేరుకున్నారు.
ఆందోళనకారులు ప్రధాని కార్యాలయం వైపు వెళ్తున్న సమయంలో హసీనా తన దేశాన్ని వదిలారు. అక్కడ నుంచి వెళ్లే విషయం గురించి ఒక గంట కంటే కూడా తక్కువ సమయం ముందు ఆమెకు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల నేతృత్వంలోని ఈ ఆందోళన ఆ సమయంలో తీవ్రంగా ఉండి, చివరి దశలో ఉంది. ఇది అవామీ లీగ్ 15 సంవత్సరాల పాలనను అంతం చేసింది. అయితే, హసీనాను భారత్ తమకు అప్పగించాలని అధికారికంగా బంగ్లాదేశ్ కోరింది.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.