
A madman's accusation against man and God
”రక్తపాతం, నరసంహారం వంటివి జరిగినపుడు, అది పాలస్తీనా భూమిపై కాకుండా స్టాక్ మార్కెట్లో జరిగినపుడు మనుషుల మనోభావాలు కాకుండా సుంకాలకు పెట్టుబడుల మనోభావాలు దెబ్బ తింటాయి.”
ప్రశాంతంగా నిస్పక్షపాత దృష్టితో రాజకీయ వ్యాఖ్య చేయడానికి ప్రయత్నించడం కంటే గొప్ప అవమానం గాజా వాసులకు మరొకటి ఉండదు. మాంసపు ముద్దగా చితకగొట్టబడే ముందు గాజాలో ఒక బిడ్డకు ఒక పాటపాడే అవకాశం ఇస్తే ఆ బిడ్డ షేక్స్పియర్ని తాజా పరిచి
ఆకతాయి కుర్రాళ్లకు ఈగల మాదిరి
ఇజ్రాయిలు మిలటరీకి మేము
ఆటగా వాళ్లు మమ్మల్ని చంపుతారు.
ఈ హత్యా కాండ చీకట్లో దాచిపెట్టుకునే వికృత జ్ఞాపకం గా చూసే బదులు పట్టపగలే బరితెగింపు కు చిహ్నంగా చూస్తున్నారు.
అక్కడ తిరుగాడే అధికారి బహుశా సాహిర్ లూథియానివి తో గొంతుకలిపి
ఈ లోకంలో ఇక్కడ
ఒక ఆటబొమ్మ మానవజీవితం
ఇక్కడ బతుకు కంటే మరణమే తృప్తి నిస్తుంది
శవాల గుట్టలు తవ్వి తీస్తే
వాటి మాటున ఒక పాపో బాబో బిక్కు బిక్కు మంటూ కనిపిస్తారు
కాబట్టి చూశారా మిత్రులారా నాగరిక ప్రజలు శోకించింది చాలు పవిత్రమైన వారి ఎదురు పడితే ఈ రోజూ ఇక ముగించాలని తెల్సినవారు తెలివిపరులు.
తాజాగా వధించబడిన వారి సంఖ్యను నివేదించడానికి శశ్మానంలో ఇంకా తిరుగుతుండే వాళ్లు వెర్రివాళ్లు, వారు కూడా తొందరగా చనిపోయిన వాళ్లను చేరుకుంటారు.
ఇంతట్లో రక్తపాతం నరసంహారం వంటివి జరిగినపుడు అవి పాలస్తీనా గడ్డపై కాకుండా స్టాక్ మార్కెట్లొ జరిగితే సుంకాలకు పెట్టుబడుల మనోభావాలు దెబ్బ తింటాయి. మనుషుల ఊచకోత కు కాదు
త్వరపడండి డబ్బు సంపాదించే తరుణం ఇది. ఆపై మరింత సంపాదనే లక్ష్యం
అదంతా సరే నీకు గాజాలో ముస్లిం స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉండటం కావాలా మధ్యధరా ప్రాంతంలో యూరపు విహార యాత్రా ప్రదేశం ఉండటం కావాలా?
మనం కొంచం హేతుబద్ధంగా ఆలోచించాలి. అత్యంత బలవంతులయిన సహాయపడే మంచి వాళ్లల్లో ఎంతమంది ఆ భగవంతుడి రహస్య ప్రయోజనాలను వెనక్కి తిప్పగలుగుతారు?
భగవంతుడు
నిజంగా రహస్యం. స్వయం పాకం తీసుకుపోవడానికి మనం ప్రవచక గాయకులు చెంతకు తిరిగి పోదాం పదండి.
స్కాట్లాండు మాక్సెట్ నుండి ఇంగ్లాండులో దాక్కొన్న మాక్షఫ్.. అతను లేనపుడు ఫాసిస్టు కసాయి అతని భార్యా పిల్లల్ని తన కత్తికి ఎరచేశాడనే వార్త అతనికి చేరినపుడు అతని నోటి నుండి ఏ మాటలు వెలువడ్డాయి.
స్వర్గం చూస్తూ ఉండిపోయిందా
వారి వైపున నిలబడ లేదా?
చూశావుగా అట్లా చూస్తూ ఉండిపోవడం దేవుడి పాత అలవాటు వాళ్లకు మాత్రమే తెల్సిన ఏ పాపాల వల్లనో అమాయకులను ఊచకోతకు వదిలేస్తారు. తరచుగా బహుశా అది శాంతి సమయం మనుషుల్లో దేవుళ్లలో కలగచేసే ఒకేరకం అయిన విసుగు నుండి బయట పడటానికి మూలమే అది జరగవచ్చు.
కాబట్టి రాబోతున్న బాంబుల వర్షపు కాలంలో చావుకి నిర్దేశించబడిన తరువాతి వందల మందిని ఈ మానవ ఉద్దేశ్య పథకం ఎక్కడకి తీసుకువెళుతుందని నీవు అడగవచ్చు.
పొట్టి జవాబు: వారి స్వంత సాధనాలకు వారి కర్మకు.
బదరి రైనా
అనువాదం: దేవి