![Tyagaraya's works are an integral part of Indian music](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/Tyagarayas-works-are-an-integral-part-of-Indian-music.png)
పుష్య బహుళ పంచమి ముందు, తరువాత అంటే జనవరి, ఫిబ్రవరి నెలలలో కొన్ని వారాల పాటు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో త్యాగరాజు కీర్తనలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ త్యాగరాజ కీర్తనలతో ఆరాధనోత్సవాల సంప్రదాయం 1907 నుంచి మొదలైంది. విశేషమేమంటే ఈ ఆరాధనోత్సవాలు పుట్టిన రోజు కాదు.
తెలుగు వారంతా గర్వపడిన మహాయోగి, త్యాగ యోగి. త్యాగరాజు రచయిత అయిన స్వరార్ణవం త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత దినోత్సవం. నాదయోగి అయిన త్యాగరాజు 1767వ సంవత్సరం మే 4 వ తేదీన, (లేదా 5 అని కొందరు అంటున్నారు) జన్మించారు. అంతగా దొరికే ప్రామాణిక వివరాలు లేవు. జనవరి 6, 1847 నాడు ఈ గాన బ్రహ్మ పరమబ్రహ్మైక్య మైనారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు 5 జనవరి, ఫిబ్రవరి నెలలలో తిరువయ్యూరులో సమాధి చెందిన త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.
త్యాగరాజు మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఇప్పడి తమిళనాడు, జనవరి 6, 1847న పరమపదించారు, కళా ప్రక్రియ అనే కర్ణాటక భారతీయ స్వరకర్త ఆయన. కీర్తన , కృతి, రాగ స్రష్ట. అనే బహుళ ప్రక్రియలో భక్తి పాటలకు పెట్టిన పేరు త్యాగరాజు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీత చరిత్రలో మరచిపోవడం సాధ్యం కాదు, సమకాలీన కర్ణాటక సుప్రసిద్ధ గాయకులు సంగీతకారులచే సన్మానాలు సాధించిన వారు. త్యాగరాజు వేలాది కృతుల సంగీతాన్ని, పదాలను స్వరపరిచారు,
19వ శతాబ్దంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ముఖ్యుడు ఈ త్యాగరాజ స్వామి. మరో ఇద్దరు శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వారు. ఇద్దరూ సమకాలికుడీయన. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువాయరు కు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు. ముఖ్యంగా తెలుగులో కీర్తనలు రచించి స్వర రచన చేసి పాడిన మహానుభావుడు. ఎక్కువ కాలం తంజావూరులో ఉన్నారు.
వారిలో పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటక సంగీతానికి ఐదు రత్నాల వంటి కీర్తనలు ఉంటాయి. శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను “త్యాగరాజ పంచ రత్నాలు” అని తెలియని వారుండరు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి.
కీర్తిశేషుడు మంగళం పల్లి బాలమురళీ ఒక వీడియో ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు, సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేవారు. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో, ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేసారు. ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ, ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ, కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది’’ అంటూ మంగళం పల్లి బాలమురళి కృష్ణ తన చిన్నతనంలో ఆమె ఎదుట కచేరీ చేసారని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
1847 సిధ్దిపొందిన త్యాగరాజు ను తిరువయ్యూరుకు కావేరీ నదీ తీరాన సమాధిని తులసీ బృందావనం నిర్మించారు. ఆమె తన ఆస్తి మొత్తం అమ్మేసి ఆ డబ్బుతో త్యాగరాజ సమాధి చుట్టూ మందిరాన్ని నిర్మించారు. 13 సంవత్సరాలు ప్రతి ఏడాది సమాధి మందిరంలో నాగరత్నమ్మ గారు ఈ కీర్తనలతో ప్రముఖ సంగీతజ్ఞులు నిర్వహించేవారు. 1937న త్యాగరాజు విగ్రహం నెలకొల్పారు. 1957లో మంది గోడలమీద పాలరాతి ఫలకాలపౌ త్యాగరాజ కృతులను చెక్కించారు. త్యాగరాజు రామ కీర్తనలతో జీవనాన్ని సాగినవారు కనుక రామాయణ రచయిత వాల్మీకి విగ్రహం నెలకొల్పారు. ఇదొక గొప్ప మనదేశ సంస్కృతిలో భాగమయింది. అదే యజ్ఞంగా సాగింది. అనేకానేక టివి చానెళ్లు తిరువయ్యూరినుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
మాడభూషి శ్రీధర్