Reading Time: < 1 minute
మనిషే నాగలిగా మారినప్పుడు..!
కాడెద్దుల బదులు మనిషే నాగలిగా మారి
పొలం దున్నుతున్నప్పుడు…
అతనికి అచ్చం ఎద్దుకిలా కొమ్ములు మొలుస్తాయి.
బురదలో కూరుకుపోయిన తన పాదాలను
బలంగా పైకి పెకిలించుకుంటున్నప్పుడు
మెడ బలహీనంగా పక్కకి వాలిపోతుంది.
పాదాలకుండే ఐదువేళ్లు… ఛీలిపోతాయి
మడమలకు పగుళ్లు వచ్చేస్తాయి
తప్పదు ఇక అతని పాదాల వేళ్లను ఇనుప పెచ్చులతో
కప్పాలి…
లేకపోతే… ఈ మనుషులు
యజమాని కొరడా ఝులిపిస్తే కదిలే
జంతువుల కంటే తక్కువేం కాదు.
గుల్జార్ ఉర్దూ దళిత కవిత్వం
అనువాదం – గీతాంజలి