
నా దేశం పట్ల
నా దేశ పతాకం పట్ల
నా దేశ ప్రజల పట్ల
నాకున్నది
ప్రేమ, అభిమానం, గౌరవం, బాధ్యత..
అయితే, కొందరికి మాత్రం
మరికొందరి పట్ల
ద్వేషంతో కూడిన దేశభక్తి
అసహనంతో కూడిన అపనమ్మకం
కలుపుకోలేని కుంచితత్వం
కలిసి జీవించలేని కరకుదనం..
28 మందిని కాల్చి పారేసిన
దుర్ఘటన నా మనసును ఇంకా
కలచి వేస్తూనే ఉన్నది
అయితే,
దీనిని విద్వేషపూరిత వేడుకగా
మార్చిన తీరు మాత్రం
మనందరి ఐక్యతపై
మరో భారీ ద్వేషదాడిగా
నా దేశ ప్రజలందరి
హృదయాలను మళ్లీ తీవ్రంగా
గాయ పరిచింది..
ఈ సమయంలో
నాయకత్వానికి కావలసింది
స్థైర్యం కోల్పోని నిర్ణాయకత్వం
ఇదే అదను చూసుకొని
మన చేతులలోని కొన్ని వేళ్ళను
మనతోనే తెగనరికించే
దురాలోచనలను
ప్రేమతో తిప్పి కొడదాం
మన భావ ఐక్యతతోనే
భారంగా నిలిచిన ఈ కాలాన్ని
ధైర్యంగా ఈదేద్దాం
ద్వేషాన్ని ప్రేమతోనే జయిద్దాం..
సమీర
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.