
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో ఒక రాజకీయ మలుపు లాంటివి. ఉధృతమైన ప్రచారాలు, ఓటర్ల ధోరణిలో మార్పు, అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ, పార్టీల భిన్నమైన సిద్ధాంతాలు, వాగ్దానాలు, పార్టీల ప్రణాళికలు, వ్యూహాలతో ఎన్నికలు ఒక యుద్ధభూమిగా మారాయి. ఢిల్లీ అంసెబ్లీ ఎన్నికలను అంచనా వేయడానికి గత రెండు నెలలుగా కోడెమో, పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా టెలిఫోన్ సర్వేలు నిర్వహించి ఓటర్ల మనోభావాలను ట్రాక్ చేసి, వారి అభిప్రాయాలను విశ్లేషించాయి. ఓటర్ల సరళితో పాటు మహిళా పురుష ఓటర్ల అభిప్రాయాలకు సంబంధించి సర్వేలో సేకరించిన డేటా ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటమైంది.
ఆప్ – బీజేపీ మధ్య పోటాపోటీ
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. గత రెండు నెలలుగా ఓటర్ల సెంటిమెంట్ ఎటువైపు ఉందో రెండు పార్టీల మధ్య దోబుచులాడిరది. తొలుత బీజేపీ కంటే ఆప్ ముందంజలో ఉన్నట్టు కనిపించినా క్రమేణా మార్పు వచ్చి బీజేపీ పక్షంపై నిలిచింది. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి ఆకర్షణీయమైన పథకాల ప్రకటన తర్వాత ఆప్ ఓట్ల శాతం 58.1కి పెరిగింది. జనవరి 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ర్యాలీకి అనంతరం ఆప్ ఓట్ల శాతంలో తగ్గుదల మొదలైంది. తొలుత బీజేపీపై ఆధిపత్యం కనబర్చిన ఆప్ అనంతరం జనవరి 1వ తేదీ నుండి ఓట్ల శాతం మార్జిన్ G19.8% నుండి -11.8%కి పడిపోయింది.
వాస్తవ ఓటింగ్
ఎన్నికల ముందు సర్వే ప్రకారం జనవరి 1వ తేదీన ఆప్ ఓట్ల శాతం 49.2కు చేరుకున్న అనంతరం క్రమంగా తగ్గుతూ ఫిబ్రవరి 4వ తేదీ నాటికి 40.5%కి పడిపోయింది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరుసగా 4.7%, 2.3% ఓట్ల శాతాలను మెరుగుపరుచుకొని 48.5%, 7% కు ఓట్లను సాధించాయి.
అవినీతి రహిత పాలన అందించడం , ప్రజాకర్షక పథకాల అమలు హామీలతో 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని సాధించింది. అయితే ఢిల్లీ ఎక్సైజ్‌లో అవినీతి జరిగిందనే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవినీతి రహిత పార్టీ అని చెప్పుకునే ఆప్ ప్రతిష్టను దెబ్బతీశాయి. అంతేకాక, ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సహకాలను తాము అధికారంలోకి వచ్చినా ఆపమని బీజేపీ ఓటర్లను నమ్మించడంలో విజయవంతం అయ్యింది. ఇందుకు బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నెట్‌వర్క్‌ను తోడ్ప డింది. ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ అత్యంత ప్రజాదారణ నేతగా 40 శాతం ఓటర్లు ఆయనను ఆదరించినా బీజేపీ ఆధిక్యం సాధించగలిగింది.
మహిళా ఓటర్లలో మార్పు
ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ‘మహిళా సమ్మాన్ యోజన’ పథకాన్ని ప్రకటించి, దానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. దీంతో పార్టీలో పెద్ద ఎత్తున ఉత్సాహం పెరిగి జనవరి 10వ తేదీ నాటికి ఆప్‌కు 67 శాతం మహిళా ఓటర్ల మద్దతు లభిచంగా, బీజేపీ 28 శాతానికే పరిమితమైంది. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మార్పు వచ్చి ఆప్‌కు మహిళల ఆదరణ 50.2 శాతానికి తగ్గగా, బీజేపీ 41.8 శాతం, కాంగ్రెస్ 6.1 శాతం మహిళా ఓట్లు పెరిగాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల మాదిరిగా ఢిల్లీలో మహిళా ఓటర్లు అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇలాంటి పథకాలనే ప్రకటించి ఆప్ లబ్ది పోందకుండా చేయగలిగాయి. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మహిళా ఓట్ల శాతం 62.4 కాగా, 2025 సర్వేలో ఆప్‌కు మహిళల మద్దతు 50.2 శాతానికి పరిమితమైంది.
మహిళా ఓటర్లతో పోలిస్తే ఢిల్లీలో బీజేపీ మొదటి నుండి పురుష ఓటర్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎన్నికలు సమీపిస్తున సమాయానికి ఈ ఆధిక్యత మరింత పెరిగింది. జనవరి 1వ తేదీ నాటికి పురుష ఓటర్లలో ఆప్‌పై బీజేపీ G4.3 శాతం ఆధిక్యంలో ఉండగా, ఫిబ్రవరి 4వ తేదీకి G17.5 శాతానికి పెంచుకుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుష ఓటర్లలో ఆప్ 59% ఓట్ల వాటాను కలిగి ఉండగా, అది 2025 నాటికి 35.5%కి తగ్గింది.
సామాజిక వర్గాల వారీగా ఓటింగ్
ఢిల్లీలో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాలు, పలు ప్రాంతీయ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. జనరల్ కేటగిరీ ఓటర్లకు సంబంధించి 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 55% కంటే ఎక్కువ ఓట్లను పొందగా, ఈ సారి బీజేపీ ఈ వర్గంలో 57.3% ఓట్లను పొందింది. ఆప్ ఓటింగ్ శాతం 31.9 కు తగ్గింది.
ఓబీసీ ఓట్లు పార్టీల మధ్య చీలిపోయాయి. ఈ సామాజిక వర్గంలో బీజేపీ 48.6 శాతం ఓట్లతో పొందగా, ఆప్ 41.1% సాధించింది. జనవరి 1వ తేదీ నాటికి బీజేపీపై ఆప్ +5.4 శాతం ఆధిక్యంలో ఉండగా, ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకి ఎన్నికల నాటికి -7.5 శాతానికి తగ్గింది.
ఎస్సీ సామాజిక ఓటర్లలో మొదటి నుండి ఆప్‌కు మద్దతున్నా, ఎన్నికల చవరి దశ నాటికి తగ్గిపోయి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లబ్ది పొందాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు పార్టీలు పలు హామీలతో ఓటర్లకు చేరవవడమే. జనవరి 1 నుండి 4వ తేదీ వరకు పరిశీలిస్తే బీజేపీపై +25.9 శాతం కనబర్చగా ఎన్నికల నాటికి గణనీయంగా +8.5 శాతానికి తగ్గింది.
బీహార్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ మూలాలున్న పూర్వాంచలి ఓటర్లు అనేక నియోజవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు. ఎన్నికల ఒక నెల ముందు వరకు బీజేపీపై ఆప్ +3.5% ఓట్ల ఆధిక్యం కనబర్చగా, ఎన్నికల నాటికి అది -16.7శాతానికి తగ్గిపోయింది.
ఓట్లను చీల్చిన కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన పోటీలో లేనప్పటికీ, పలు నియోజకవర్గాల్లో కీలకపాత్ర పోషించి ఓట్లు చీల్చి, ఆప్ అవకాశాలను దెబ్బతీసింది. 2020 ఎన్నికల్లో 6,1 శాతం ఎస్సీ ఓట్లు పొందిన కాంగ్రెస్ 2025లో 7.8 శాతం ఓట్లు సాధించింది.
న్యూఢిల్లీలో వాల్మీకి సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న చోట కాంగ్రెస్ నాయకులు వాల్మీకి ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఎస్సీ ఆధిపత్య ప్రంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ 4,089 ఓట్ల తేడాతో ఓడిపోగా, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 4,568 ఓట్లను సాధించి కేజ్రీవాల్ ఓటమికి కారణమైంది. ముస్లిం ఓటర్లలో కాంగ్రెస్ 19% ఓట్లు సాధించింది. ఇది 2020 ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 2025 ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పొందింది. ముస్లింలు అధికంగా ఉన్న 7 స్థానాల్లో 6 స్థానాలను ఆప్ గెలుచుకున్నా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా స్థానాల్లో ఆప్ ఓట్ల ఆధిక్యం గణనీయంగా తగ్గింది.
Congress
Vote Share |
Delhi Assembly Elections 2025[As on 4th Feb 2025] |
Delhi Assembly Elections 2020 |
SC | 7.8% | 6.1% |
Muslim | 19.1% | 12% |
ఢిల్లీ రాజకీయాల్లో పెను మార్పులు
పరిపాలన రికార్డు, నాయకత్వం, ఎన్నికల వ్యూహాలు 2025 ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆప్ తన పరిపాలన ట్రాక్ రికార్డుతో ఎన్నికల్లో పోటీ పడగా, బీజేపీ కాలానుగుణంగా ఓటర్ల ప్రాధాన్యతలను గుర్తించి లాభపడింది. మహిళా ఓటర్లలో మార్పు రావడం, కాంగ్రెస్ ఆప్ ఓట్లను చీల్చడం, బీజేపీకి బలమైన కేడర్‌తో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడంతో ఓటర్ల సెంటిమెంట్‌లో మార్పు సంభవించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై సంయుక్తంగా నిర్వహించిన టెలిఫోన్ సర్వే కోసం కోడెమో, పీపుల్స్ పల్స్ సంస్థలు 2 నెలలుకు పైగా 30,000 సాంపిల్స్‌ను సేకరించింది. ఇందు కోసం పోస్ట్-స్ట్రాటిఫికేషన్ అనే శాస్త్రీయ సాంకేతికతను వినియోగించారు.
-సుభాష్ తనన్,
గ్రాడ్యుయేట్, ఐఐటి, కాన్పూర్
డైరక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ కొడెమో.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.