
భారతసైన్యం దాడులలో తమ నాయకులు చనిపోయారని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఇండిపెండెంట్) ఆరోపించింది. దీనికి సంబంధించిన అంశం ది హిందూలో ప్రచురితమైంది. దాని ప్రకారం, మయన్మార్ సరిహద్దుల్లోని ఉల్ఫా స్థావరాలపై భారత సైన్యం జూలై 13వ తేదీన డ్రోనులు, క్షిపణులతో దాడి చేసింది.
అయితే, ఎటువంటి సైనిక చర్యను తాము చేపట్టలేదని భారత సైన్యం వెల్లడించినట్లుగా కూడా ది హిందూ ప్రస్తావించింది.అస్సామీస్ భాషలో ఉల్ఫా ప్రకటనను విడుదల చేసింది. అందులో, తమ అగ్రనేత నయాన్ మెదితో సహా ముగ్గురు నాయకులు భారత సైన్యం చేసిన డ్రోనులు, క్షిపణుల దాడుల్లో చనిపోయారని తెలిపింది.
భారత్ సరిహద్దు సమీపంలోని ఎన్‌ఎస్‌పీఎన్ కప్లాంగ్ క్యాంప్‌పై భారత సైన్యం డ్రోనులతో దాడులు చేసినట్టుగా కొన్ని వార్త సంస్థలు కథనాలు వెలువరించాయి. మరికొన్ని వార్తా సంస్థలు మణిపూర్‌లో నిషేధిత సంస్థ పీఎల్ఏ ఈ దాడులు జరిగిన ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకొని ఉన్నదని తెలియజేశాయి.
ఉల్ఫాఐ జారీ చేసిన మరో ప్రకటనలో, తమ దళాలకు చెందిన మరో ఇరువురు నేతలు బ్రిగేడియర్ గణేశ్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోంలు కూడా ఈ దాడుల్లో చనిపోయారని ఆరోపించింది.
“నయన్ మేధికి అంత్యక్రియలు జరుగుతున్నపుడు బ్రిగేడియర్ గణేశ్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోంలు, మరికొందరు నాయకులు కూడా అమరులయ్యారు. అనేకమంది పౌరులకు గాయాలయ్యాయి”అని ఆ ప్రకటనను ఉటంకిస్తూ హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.