
ఆర్ధిక సాంకేతిక బలహీనతలు ఉండడం వలన మన విధానాలు, చైనాను నిలువరించడానికి అమెరికా బాకాలూదడమో, లేక ఈయూ, బ్రిక్స్, ఎస్సీఓ నిర్వాహకులతో కలిసి, బహుళశక్తుల మధ్య సంతులత సాధించడానికి సమయానుకూలంగా(అవసరమైనవారికి అనుకూలంగా మద్దెల వాయిస్తున్నట్టు- ఏ ఎండకాగొడుగు పట్టుతున్నట్టు) అటూయిటూ ఊగిసలాడుతున్నట్టు ఉంది.
భారతదేశ విదేశాంగ విధాన మనోదౌర్బల్యంలోనే ఒక విధానం ఉంటుంది. అది ఒక దేశంగా భారతదేశ బలహీనతల ఫలం; నిజమైన ఆర్ధిక, భౌగోళిక రాజకీయ బలాన్ని పెంచుకునే సమర్ధత ఉండి ఉంటే, నిజమైన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండేది. అది లేకపోవడం వలన 1950లలో అలీనవిధానాన్ని అనుసరించింది. దానికి కొనసాగింపుగానే 2020లలో బహుళ దేశాల సంకీర్ణం ఏర్పడింది. ఇందులో న్యూ ఢిల్లీకి, ఒక విదేశీ విధాన భాగస్వామిగా ఒక మేరకైనా ప్రభావితం చేయగల పరపతి ఉంది. అయితే అది అసలైన స్వయంప్రతిపత్తి కాదు. అందువలన అది నిరంతరంగా తన ప్రయోజనాలు కాపాడుకోడానికి, సమతుల్యత పాటిస్తూ, జాగ్రత్తగా అడుగులను ముందుకు వేస్తోంది.
ప్రస్తుతం, ప్రపంచ పరిస్థితులు నిరంతరంగా పెద్ద కుదుపులకు గురవుతున్న దృష్యా, ఇప్పుడీ సమతుల్యత ఒక సమస్యగా మారింది. ఈ మధ్యే నేను రాసిన ఒక వ్యాసంలో పీటర్ ఫ్రాన్కోపన్ “మనం ఒక విప్లవాల యుగంలో ఉన్నాము- డిజిటల్, సాంకేతికత విప్లవాలే కాక జనాభా, పర్యావరణ, సైనిక, వ్యాధికారక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ విప్లవాలు కూడా” అన్నారు.
కానీ ఆర్ధిక సాంకేతిక బలహీనతలకు లోబడిన మన విధానాలు, భారతదేశం ఈనాడు చైనాను నిలువరించడానికి అమెరికాకు బాకాలూదుతూ, లేదా ఈయూ, బ్రిక్స్ , ఎస్సీఓల వంటి బహుళశక్తుల కూర్పుల మధ్య సంతుల్యతను ప్రోత్సహించేందుకు శ్రమిస్తు న్న పాత్రను పోషించడం మధ్య ఊగిసలాడుతోంది. ఇది భారతీయులనూ, భారతదేశం తరఫున దౌత్యనీతిని రూపొందించే వారికి అసంతృప్తి మిగులుస్తున్నది.
ఈ మధ్యనే రియోడిజినెరోలో జరిగిన సమావేశంలో వెలువడిన బ్రిక్స్ డిక్లరేషన్ చూస్తే భారతదేశ పరిస్థితి ఏమిటా అని ఆశ్చర్యం కలుగుతోంది. బ్రిక్స్, పెహల్గాంలో జరిగిన ‘సైనిక దాడులను’ తీవ్రంగా ఖండించింది. కానీ ఆపరేషన్ సిందూర్‌పై మౌనంవహించింది. అదే సమయంలో ఆ సమావేశం, ఇరాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించడమే కాదు, అది అంతర్జాతీయ సంస్థ చార్టర్(దాడులను ప్రస్తావించక పోయినప్పటికీ)కి వ్యతిరేకమని పేర్కొనింది. ఇజ్రాయిల్- పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడం వలన ఏర్పడిన పరిస్థితులపై “గంభీరమైన ఆందోళనను ” వ్యక్తం చేసింది. గాజాలో ఇజ్రాయిల్ అంతర్జాతీయ మానవతాచట్టాలను ఉల్లంఘించడాన్ని ఖండించింది.
భారతదేశ తీర్మానంలో ఎటువంటి మార్పులూ కోరకుండా సమర్థించింది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై దాడి చేసినప్పుడు భారతదేశం స్పందించిన తీరు, లేదా గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల భారతదేశం అనుసరించిన విధానం ఎలా ఉన్నదో- మర్యాదగా చెప్పుకోవాలంటే, ఎంత బలహీనంగా ఉన్నదో మనం చూశాము. దాని పర్యవసానమే ఇప్పుడు ఆ దేశాలుస్పందిస్తున్న తీరు.
బహుళ జాతి అలీనవిధానానికి కట్టుబడి ఉండాలో లేక అమెరికాకి బాకాలూదడమే పనిగా పెట్టుకోవాలో, వెంటనే తేల్చుకోవలసిన పరిస్థితికి భారతదేశం నెట్టబడుతోంది. బ్రిక్స్‌కు అనుకూలంగా ఉండి, అమెరికాను వ్యతిరేకిస్తే మరో 10% పన్నులు అధికంగా వేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అంతకు ముందు బ్రిక్స్, డాలర్‌ను మారకంగా కొనసాగించకుంటే మరింత తీవ్రమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.
భారతదేశ విదేశాంగ విధానం ఎంత దుర్భలంగా ఉందంటే అమెరికా, బ్రిక్స్ దేశాలతో పాటు 60 దేశాలు తీవ్రవాదంపై పోరాడుతున్న భారతదేశానికి మద్దతు తెలియజేశాయి. అయినా, ఒక్క దేశం కూడా భారతదేశం ఆశించినట్టు, పెహల్గాంలో పాకిస్తాన్ జరిపిన దాడిని అధికారికంగా ఖండించలేదు.
రెండు వారాల తరువాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, మన “వ్యూహాత్మక భాగస్వాములు” అమెరికా, రష్యా , ఎస్సీఓ సభ్యులు, క్వాడ్, బ్రిక్స్, అంతా తటస్థ వైఖరిని అవలంభించారు. దేశ సరిహద్దులు దాటుతున్న తీవ్రవాదుల చర్యలను భారతదేశం, ఇజ్రాయిల్ రెండూ సమాంతరంగా సవాలు చేస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు.
తీవ్రవాదం..
ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే, జమ్మూ కాశ్మీర్లో స్వయంప్రతిపత్తి కోసం సాగే ఉద్యమాలను ఉగ్రవాద చర్యలను కలగాపులగం చేసి చూస్తోంది. గత పదేళ్లలో సీమాంతర ఉగ్రవాదాన్ని బూచిగా చూపించి అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను దౌత్యరంగంలో వెలి వెయ్యటానికి ప్రయత్నించింది. ఒక మేరకు ఈ ఉగ్రవాద వ్యతిరేక వైఖరి దేశీయంగా పాలక పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తెచ్చి పెట్టేందుకు సరిపోయింది. స్థూలంగా చూసినపుడు భారతదేశం జోక్యంతోనే దాదాపు అన్ని దేశాలూ ఉగ్రవాదాన్ని ఖండించాయి.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఉగ్రవాదాన్ని, స్వయంప్రతిపత్తి కోసం సాగే సమరశీల ఉద్యమాలు రెండింటినీ వేరువేరుగా చూస్తున్నాయి. కానీ భారతదేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని చూపిస్తూ తోడేలు తోడేలు అని గావు కేకలు పెట్టింది. కానీ పహల్గాంలో పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరిగిన ఉగ్రవాద దాడులను ఖండించే విషయంలో ప్రపంచం భారత్‌తో గొంతు కలిపేందుకు, పాకిస్తాన్ చర్యలను ఖండించేందుకు సిద్ధం కాలేదు.
ఈ మధ్యే, కొన్ని నెలల కిందట నుంచి భారతదేశం అమెరికాకి వంతపాడడం అత్యంత ఉచ్ఛస్థాయికి చేరింది. అమెరికా అనుసరించే విదేశాంగ విధానంలోని అరాచకత్వాని కి వత్తాసు పలకడం మాత్రమే కారణం కాదు. అనేక విషయాలలో అమెరికా అనుసరిస్తున్నతీరు- అరుపులు కేకలు, గందరగోళాల విధానాలు అనుసరించడమే కాక, భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో కూడా- ప్రధానంగా, పహల్గాం నరమేధాన్ని సృష్టించిన పాకిస్తాన్‌ని అమెరికా ప్రత్యక్షంగా ఖండించకపోవడం- మన దేశం మౌనం వహించడం, భారతదేశ విదేశాంగవిధానాన్ని అత్యంత అల్పస్థాయికి చేర్చింది.
ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ అదృష్టం..
మరింత ప్రాధాన్యతమైన అంశం ఏమిటంటే, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్తాన్ల మధ్య అమెరికా సమదూరం పాటించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ తర్వాత పదేపదే అమెరికా యుద్ధం ఆపడానికి సహాయం చేయడంలో, సంక్షోభాన్ని నివారించడంలో, అమెరికా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవడం మొదలు పెట్టారు.
భారత్- పాకిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకోవడం భారతదేశాన్ని కలవరపెట్టింది. భారతదేశాన్ని పాకిస్తాన్‌తో సరిసమానం చేసి చూడడం జీర్ణించుకోలేకపోయింది.
జూన్ 10న జరిగిన తీవ్రవాద చర్యలకు పాకిస్తాన్‌ను తప్పుపట్టకపోగా, అమెరికా కేంద్ర కమాండ్, చీఫ్ జనరల్, మైకేల్ కురిల్ల “ప్రపంచంలో తీవ్రవాదాన్ని ఎదిరించే ఒక అద్భుత భాగస్వామి పాకిస్తాన్” అంటూ కితాబు ఇవ్వడం పుండుమీద కారం జల్లినట్టు అయ్యింది.
ఆ తరువాత జరిగిన అనేక సంఘటనలు భారతదేశ అసౌకర్యాన్ని మరింతగా పెంచాయి. జూన్ 18న ట్రంప్ పాకిస్తాన్ కొత్త ఫీల్డ్ మార్షల్ ఆసిన్ మునీర్ శ్వేతసౌధంలో విందుకు ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు, ఒక పాకిస్తాన్ సైనిక అధికారిని, అందునా దేశాధినేత కానివ్యక్తిని, విందుకు ఆహ్వానించడం ఇదే మొదటి సారి. ఈ సమావేశం ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు చేరువగా జరుగుతున్నదని,”వాస్తవ” విధానం అమలు దిశగా కదులుతున్నదని స్పష్టం చేసింది. దేశాధినేతో కాక నేరుగా సైనిక అధికారులతోనే ట్రంప్ చర్చలు జరిపారు.
రోజులు గడుస్తున్నకొద్దీ ఆపరేషన్ సిందూర్ విషయంలో భారతదేశానికి, తన బహుళ దేశీ మిత్రత్వ విధానం వలన ఒరిగింది ఏమీలేదని తేలింది. నిజానికి రష్యా లాంటి దేశం కూడా అమెరికాకు భారతదేశం దగ్గరగా జరుగుతుండడం చూసి, తాము కూడా పాకిస్తాన్‌తో తమ వైఖరి గురించి పునరాలోచించుకుంటామని సంకేతాలు పంపింది. అందుకే ఈ సందర్భంలో రష్యా తటస్థ వైఖరి అవలంభించింది. అది పెహల్గాం దాడి సంఘటనని ఖండించింది. కానీ చర్చలు జరపాలని, నిగ్రహం చూపాలని సూచించింది. 2024లో ఎస్సీఓ సమావేశాల సందర్భంగా రష్యా ప్రధానమంత్రి, ఉపప్రధానమంత్రి పాకిస్తాన్ సందర్శించారు. 2025 ఏప్రిల్‌లో మాస్కో , రష్యా , పాకిస్తాన్‌లు ఉమ్మడిగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే కార్యాచరణ కమిటీకి ఆతిథ్యమిచ్చింది. దీని కొనసాగింపుగా రష్యా ఉపవిదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ సందర్శించారు. రష్యా, పాకిస్తాన్‌లు తమ మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాయి .
పాకిస్తాన్- రష్యాల మధ్య పెద్ద ఎత్తున రైల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని, తద్వారా దక్షిణ ఆసియాని మధ్య ఆసియాతో, రష్యాతో, అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారు. జూలై మొదటి వారంలో పాకిస్తాన్‌తో ఆ దేశ సమాచార మంత్రి అబ్దుల్ అలీం ఖాన్ రష్యా రవాణా ఉపమంత్రి అంద్రెయ నీకితిన్తో, చైనాలోని టీయాన్జిన్ఎస్సీఓ మంత్రుల సమావేశంలో, విరామ సమయంలో కలిసి చర్చించారు. ఈ పరిణామాలు ఉజ్బెకిస్థాన్- ఆఫ్గనిస్తాన్- పాకిస్థాన్‌ల గుండా మరో రైలుమార్గం ఏర్పాటు చేసుకునేందుకు దారి తీస్తున్నాయి.
పాకిస్తాన్, రష్యా రెండూ తమ మధ్య సంబంధాలను విస్తరించుకుని, పునఃక్రమాంకనం చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రస్తుత విషయానికి వస్తే పాకిస్తాన్‌కు చైనాతో ఉన్న దగ్గరి సంబంధం వలన, ఎస్సీఓలో తన సభ్యత్వం కారణంగా, రష్యాకి దగ్గరవగలిగింది.
చైనాకు సంబంధించినంత వరకు,పెహల్గాంపై దాడికి దాని ప్రతిస్పందనగా, అది అంతర్జాతీయ భద్రతా సంఘంలో బలమైన తీర్మానం చేయించింది. “అత్యంత దృఢమైన మాటల్లో” మేము దీనిని ఖండిస్తున్నామనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టడంలో చైనా ప్రధాన పాత్ర పోషించింది. అయితే పాకిస్థాన్-భారత్ రెండు దేశాలూ చర్చలద్వారా, సంప్రదింపుల ద్వారా తమ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని, సంయమనం పాటించాలనే విధానాన్ని చైనా సూచించింది. ఒక తటస్థ వైఖరి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ మొదలవగానే, జరిగిన పరిణామాల పట్ల బీజింగ్ విచారాన్ని వ్యక్తపరిచింది. “చైనా అన్నిరకాల తీవ్రవాదాన్ని ఖండిస్తుంది” అంటూనే పహల్గాం మాట ప్రస్తావించకుండా మరింత సంయమనం పాటించాలని సూచించింది. సంఘటన గురించి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరింది.
కానీ, వాస్తవానికి చైనా తన ”ఉక్కు సోదరుడికి” గట్టి మద్దతుగా నిలిచింది. తరువాత వెలువడిన నివేదికలను చూస్తే, బీజింగ్ పాకిస్తాన్‌కు సైనిక సహాయంచేయడమే కాక భారతదేశ మిస్సై ల్స్‌కు సంబంధించి, యుద్ధవిమానాలు పంపే క్రమాన్ని గురించిన విషయాలను గూఢచర్యం ద్వారా పాకిస్తాన్‌కు చేరవేసిందని తెలుస్తున్నది.
1999 నుంచి చైనాకు పాకిస్తాన్‌కు మధ్య పెరుగుతోన్న స్నేహానికి భారతదేశం గండి కొట్టలేకపోయింది. బీజింగ్ తటస్థ వైఖరిని తీసుకుంది. కానీ పాకిస్తాన్ పన్నాగాలను ఆపే ప్రయత్నం చేయలేదు. చైనా నిరాకరించిన తరువాత మాత్రమే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వాషింగ్టన్కు పరుగెత్తుకెళ్లి అమెరికా చేత తనకు కావాల్సిన పని చేయించుకున్నారు.
దక్షిణాసియా..
ఇప్పుడు సరికొత్త ప్రమాదం సార్క్ స్థానంలో వచ్చే కొత్త దక్షిణాసియా భాగస్వామ్యం. కన్మింగ్‌లో జూన్ 19వ తేదీన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సమావేశమై, కొత్త సమూహం ఏర్పాటు చేసుకోడం గురించి చర్చించాయి. ఈ సమూహం లక్ష్యం ప్రాంతీయ అనుసంధానం, సహకారం. చైనా, ఆఫ్ఘానిస్తాన్, మాల్దీవ్స్ , శ్రీలంకలని కూడా ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నది.
ఈ కూటమి ప్రతిపాదనలో వ్యాపారానికి అత్యంత ప్రధానపాత్ర ఉంది. వ్యాపారాన్ని ఆయుధంగా వాడుకోవడం మొదలవడం వలన దానికి ప్రాధాన్యత ఏర్పడింది . అత్యంత అరుదుగా దొరికే ఖనిజాలు, సెమి కండెక్టర్స్కు సంబంధించిన సాంకేతిక జ్ఞానం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఆఖరికి పారిశ్రామిక ఉత్పత్తులు కూడా నేడు జాతి ప్రయోజనాలకోసం వాడుతున్నారు. కొంత కాలం సాగిన ఏవగింపు కలిగించే వాణిజ్య ఒప్పందాలకు దూరంగా ఉన్న తరువాత, న్యూ ఢిల్లీ తిరిగి వాటినే కోరుకుంటున్నది. కానీ, కుదిరే పరిస్థితి లేదు. అమెరికాతో ఒప్పందాలు ట్రంప్ వినాశకర జోక్యం లేకుండా జరిగేటట్టు లేవు. ఏషియన్ విషయంలో, చైనా తన వస్తువులను సమూహాలలో గుమ్మరిస్తున్నదని భారతదేశం భావిస్తున్నది. న్యూఢిల్లీ, ఎఫ్‌టీఏ నుంచి వైదొలగాలని భావిస్తున్నది; అయితే దాని పర్యవసానం కూడా తప్పనిసరిగా ఉంటుంది.
భారతదేశ విదేశాంగ విధానం పూర్తిగా పరాజయం పొందిందని అనలేము. కానీ తన ఇరుగుపొరుగు దేశాల నుంచి, పక్కనున్న ఇతర దేశాల నుంచి నిర్మాణాత్మక, ఆచరణాత్మక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంది. మన ఆర్ధిక వ్యవస్థ సముచితంగానే సాగుతున్నది. వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని, ప్రపంచంలో స్థానాన్ని బాగానే నిర్వహించుకోగలుగుతున్నది. కానీ దాని ఆర్ధిక వ్యవస్థ బలహీనత -స్థూల జాతీయోత్పత్తి 3.5 ట్రిలియన్ డాలర్లు ఉండడం, 27 ట్రిలియన్ డాలర్లులు ఉన్న చైనాతో పోలిస్తే, ఆవగింజంత అని చెప్పుకోవాలి -స్పష్టమైన గా ఒక లోపంగా కనిపిస్తున్నది. భారతదేశం మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం వంటి సవాళ్ళను ఎదుర్కుంటూ ఉండడం వలన ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారి, ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేయలేకపోతున్నది. ఇక్కడ ప్రధానమైన అంశం ప్రభుత్వం సమర్ధత, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోడంలో చతురత. తన శక్తిలో చాలాభాగం విదేశాంగ విధానంలో ఆచరణాత్మక విషయాలపై పెట్టడం- ఉదాహరణకు 2023లో జీ20 సమావేశాల ఏర్పాటు, శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటుకు మోడీ ప్రపంచవ్యాప్తంగా చేసే పర్యటనలు.
భారత్ “ప్రపంచ శక్తివంతమైన నాయకుడిగా” ఎదుగుతోందన్న వాషింగ్టన్ అభిప్రాయాన్ని, అమెరికాకు కీలకమైన భాగస్వామి అన్న అంచనా వాస్తవమే అని భావించడమా లేక తాను బ్రిక్స్, ఎస్సీఓ, జీ20 వంటి వాటిపై ఆధార పడాలాని నిర్ణయించుకోలేక పోతున్నది. కానీ వ్యాపారాలలో గాని,సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడంలోగాని, తనకున్న ప్రత్యామ్నాయ మార్గాలు కుదించుకుపోతున్నాయి. వచ్చే ఏడాది అది మరో సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ బ్రిక్స్ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకోబోతున్నది. బ్రిక్స్ ప్రస్తుతం ట్రంప్‌ని అంచనా వేయడంలో తలమునకలుగా ఉంది.
అనువాదం: కె ఉషారాణి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.