
అజిత్ అంజుం పై ఎఫ్ఐఆర్ పట్ల ఎడిటర్స్ గిల్డ్ విస్మయం
సీనియర్ జర్నలిస్టు అజిత్ అంజుం బీహర్ పరిణామాల గురించి ప్రసారం చేసిన కథనాలపై పోలీసులు బలియా స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంపై ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి అజిత్ అంజుం తన యూ ట్యూబ్ ఛానెల్లో జూలై 12వ తేదీన ఓ కథనాన్ని ప్రసారం చేశారు.
సాహెబ్‌పూర్ కమల్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని వివరించారు.
‘‘క్షేత్రస్థాయికి వెళ్లి వార్త కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగతున్న భారీ స్థాయి అవకతవకల గురించి వెలుగులోకి వచ్చింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అజిత్ అంజుం ఎన్నికల సన్నాహాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, మత కలహాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తుంది. తదనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టంలోని పలు సెక్షన్ల కింద అంజుం పై జూలై 16వ తేదీన కేసు నమోదైంది.’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ వీడియలో అజిత్ అంజుం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బలియా నియోజకవర్గంలో జరుగుతున్న కసరత్తును చూపిస్తూ అందులో చాలా మందికి సంబంధించిన ఓటరు దరఖాస్తు ఫారాలు ఎటువంటి అనుబంధ ప్రతాలు, ఎన్నికల సంఘం సూచించిన ఆధార పత్రాలు, ఫోటోలు లేకుండానే వెబ్సయిట్లో అప్లోడ్ చేస్తున్నారని అంజుం వివరించారు.
‘‘ ఎడిటర్స్ గిల్డ్ అంజుం ప్రసారం చేసిన వార్తను ఖండిరచటం కానీ, సమర్థించటం కానీ చేయటం లేదు. జర్నలిస్టుగా అంజుం తన విధి నిర్వహణలో భాగంగా వార్తలు ప్రసారం చేయటంపై కేసులు నమోదు చేయటం ద్వారా ప్రభుత్వం చట్టం పరిధికి అతిక్రమించినట్లు ఎడిటర్స్ గిల్డ్ భావిస్తోంది. జర్నలిజాన్ని నేరపూరితమైన చర్యగా పరిగణించటం, అవసరం లేని భారీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం కూడని పని.’’ అంటూ ఎడిటర్స్ గిల్డ్ జారీ చేసిన ఓ ప్రకటనలో అభిప్రాయపడిరది.
ఎడిటర్స్ గిల్డ్ ఈ ప్రకటనలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, అంజుం తో సహా విధి నిర్వహణలో భాగంగా వ్యవహరించే జర్నలిస్టులపై ఆంక్షలు, అవాంతరాలు విధించకుండా చూస్తుందని, సమాజంలో అందరూ అర్థవంతమైన, సత్యసంధతతో కూడిన జర్నలిజాన్ని సంరక్షించేందుకు తీసుకునే చర్యల్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.