
భారతదేశంలో రాయిటర్స్, తుర్కీ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ వెబ్సైట్ టీఆర్టీ, చైనా వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్‌లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల ఎక్స్ ఖాతాలను ఆదివారం అర్థరాత్రి నుంచి మళ్లీ పునరుద్ధరించారు. ఎక్స్‌లో ఈ ఖాతాలను బ్లాక్ చేసిన దాదాపు 24 గంటల తర్వాత మళ్లీ వీటి సేవలను పునరుద్ధరించడం జరిగింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో రాయిటర్స్, తుర్కీ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ వెబ్సైట్ టీఆర్టీ, చైనా సంబంధిత గ్లోబల్ టైమ్స్ న్యూస్లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల ఎక్స్ ఖాతాలను ఆదివారం అర్థరాత్రి నుంచి మళ్లీ పునరుద్ధరించారు. ఎక్స్‌లో ఈ ఖాతాలను బ్లాక్ చేసిన దాదాపు 24 గంటల తర్వాత మళ్లీ వీటి సేవలను పునరుద్ధరించడం జరిగింది.
దీనికంటే ముందు, సామాజిక మాధ్యమం ఎక్స్‌లోని ఈ ఖాతాలను “చట్టపరమైన డిమాండ్” నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే, ఈ చట్టపరమైన డిమాండ్ ఏంటనే దానికి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. ఏ అధికారి కూడా దీనికి సంబంధించి ఎటువంటి విషయం చెప్పలేదు.
హిందుస్తాన్ టైమ్స్ ప్రకారం, “భారత ప్రభుత్వం తరఫు నుంచి రాయిటర్స్, గ్లోబల్ టైమ్స్, టీఆర్టీ వరల్డ్ హ్యాండిల్‌లను బ్లాక్ చేసే ఎటువంటి అవసరం లేదు. ఇటువంటి చట్టపరమైన డిమాండ్‌ను ప్రస్తుతం ఎవరూ అడగలేదు. ప్రస్తుతం ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి మేము ఎక్స్‌తో కలిసి పనిచేస్తున్నాము” అని ఈ ఖాతాల పునరుద్ధరణ గురించి ఐటీ శాఖకు చెందిన ఒక ప్రతినిధి అన్నారు.
“ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్లాక్ చేయాలని చెప్పిన ఖాతాలలో రాయిటర్స్ ఎక్స్ హ్యాండల్ కూడా ఉంది”అని మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
“ఆ సమయంలో ఎక్స్ భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదు. మరోవైపు ప్రభుత్వం ఈ విషయాన్ని సాగదీయలేద”ని వార్తా పత్రికకు అధికారి తెలియజేశారు.
“ముందటి నిర్దేశంతో ఆలస్యంగా ప్రతిక్రియ” జరుగుతూ ప్రస్తుత చర్య వెలుగులోకి వచ్చిందని ఆయన ఆశ్చర్యంవ్యక్తం చేశారు.
తెలియాల్సిందేంటంటే, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం విదేశీ వార్తా సంస్థలను, ప్రముఖ ఖాతాదారులకు సంబంధించిన మొత్తం 8,000 కంటే ఎక్కువ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ఎక్స్‌కు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రస్తుత విషయంపై ఎక్స్‌ను స్పందించాల్సిందిగా వార్తా పత్రిక కోరింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన ఎక్స్వైపు నుంచి రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఎక్స్ నుంచి వివరణ కోరారు.
టీఆర్టీ వరల్డ్, గ్లోబల్ టైమ్స్ రెండింటి ఎక్స్ హ్యాండల్లను భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నిషేధించింది. “భారత వ్యతిరేక” ప్రసారాలు చేస్తున్నారనే నెపాన్ని చెప్పింది.
ఆ తర్వాత వీటి మీద నిషేధాన్ని తీసేసి వాటి సేవలను పునరుద్ధరించారు. కానీ శనివారం(జూలై 5) రాత్రి వీటి సేవలను మళ్లీ ఆపివేశారు.
“ఇది సాంకేతిక సమస్యగా అనిపిస్తోంద”ని మంత్రిత్వశాఖకు చెందిన మరో అధికారి అన్నారు.
గమనించాల్సిందేంటే, ఈ హ్యాండిల్స్ బ్లాక్ చేసే కొన్ని రోజుల కంటే ముందు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల, వార్తా సంస్థల యూట్యూబ్- ఇన్‌స్ట్రాగ్రాం ఖాతాలను ఒక రోజు ఇండియాలో అన్‌బ్లాక్ చేశారు. ఈ విషయంలో అధికారులు “సాంకేతిక లోపం” అని పేర్కొన్నారు. ఆ తర్వాత వాటిని మళ్లీ బ్లాక్ చేశారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.