
మన భగత్ సింగ్
పేరులోనే ‘భగ భగ’లు
తలుచుకుంటే ఉద్వేగం
ఉద్రేకంతో ఊగిపోతాం
23 యేళ్ళకే సమసమాజం
కోసం ప్రాణ త్యాగం చేసిన
విప్లవ కిరణం,
అప్పటి నుంచి ఇప్పటికీ
రోజూఎందరో ‘భగత్’ల
కొనసాగుతున్న
ప్రాణత్యాగాల పరంపర
నీ త్యాగం ఏమైపోయింది?
ఇలా ఎన్నాళ్ళు భగత్?
ఆనాటి నుంచి ఇంకా ఇప్పటికి
దేశం రావణకాష్టంలా కాలుతోంది.
దేశమాత రక్షణ కోసం
నువ్వు ఎదిరించిన తీరు
నభూతో నభవిష్యతి
నీ దీక్షా శిక్షణలోనే
మేము ముందుకు సాగుతాం
త్యాగాలకు వెరచేది లేదు
నువ్వు తెల్లవాడినెదిరించావ్
కానీ ఇప్పుడు నల్ల దొంగల,
రంగురంగు దొంగ సర్ప
పరిష్వంగాలలో ప్రజలున్నారు
వాళ్లు ‘లాభాల’కై
కార్పొరెట్లతో జత కడితే
మేం న్యాయంకోసం ఐక్యం
కాలేకపోవటానికి సవాలక్ష
కారణాలు కనిపిస్తున్నాయ్
కార్పొరేట్ల దోపిడీ కంటే
మనుస్మృతి భావ దోపిడీ
మరీ ప్రమాదంగా ఉంది
అయినా వదలం
నువ్వే మా ఆశాకిరణం
నీ వెలుగే మాకు మార్గనిర్దేశం
తమ్మినేని అక్కిరాజు
(భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.