
గుర్మీత్ రాం రహీంకు జైలు నుంచి ఉపశమనం లభించడం ఈ సంవత్సరం ఇది రెండోసారని చెప్పొచ్చు. జనవరిలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల వారం రోజుల ముందు కూడా తనను 30 రోజుల పైరోల్ మీద విడుదల చేయడం జరిగింది. రాం రహీం తన ఇద్దరు శిష్యులను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ 2017లో పంచకులా కోర్టు తీర్పును వెలువరించింది.
న్యూఢిల్లీ: సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్‌కు మరోసారి కొన్ని రోజుల కోసం జైలు నుంచి బయట ఉండే అనుమతి లభించింది. ఈ సారి ఆయనకు 21 రోజుల సెలవు దొరికింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, రాం రహీంకు బుధవారం(ఏప్రిల్ 9) ఉదయం రోహ్తక్లోని సునారియా జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. ఆయన సిర్సాలోని తన డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారు.
ఆయనకు జైలు శిక్ష నుంచి ఉపశమనం లభించడం ఈ సంవత్సరం ఇది రెండోసారని గమనించాలి. గుర్మీత్ రాం రహీంకు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక వారం ముందు కూడా 30 రోజుల పైరోల్ మీద విడుదల చేశారు. ఆయన సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో బస చేశారు. దీని కంటే ముందు ఓ సారి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పత్‌లోని డేరా ఆశ్రమంలో ఆగారు.
గుర్మీత్ రాం రహీంకు ఎక్కువగా రాష్ట్ర లేదా వేరే ఎన్నికల సందర్భంలో పైరోల్, సెలవులు లభిస్తు వచ్చాయనేది గమనించాల్సిన విషయంగా చెప్పుకోవాలి. హర్యాయాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఇంకా రాజస్థాన్‌లోని వివిధ నియోజకవర్గాలలో డేరాకు అభిమానులు, అనుచరగణం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
గుర్మీత్ రాం రహీంకు తన ఇద్దరు శిష్యులను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తు 2017లో పంచకులా కోర్టు తీర్పును వెలువరించింది. ఆయన 2017 నుంచి హరియాణా రాష్ట్ర రోహతక్‌లోని సునారియా జైలులో ఉన్నారు. తీర్పు వెలువరించిన సందర్భంలోనే ప్రతి బాధితురాలికి 15 లక్షల రూపాయల జరిమానా ఇవ్వాల్సిందిగా గుర్మీత్‌కు న్యాయమూర్తి ఆదేశం కూడా ఇచ్చారు.
డేరా అధినేతతో పాటు మరో ముగ్గురిని ఒక పాత్రికేయుడి హత్య కేసులో కూడా 2019లో దోషిగా నిర్ధారించారు. అప్పుడు ఉన్నత న్యాయస్థానం సింగ్ ఇంకా ఇతర నలుగురిని 2002లో డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ‘కళంకితం- అనుమానస్పద’ విచారణ గురించి పేర్కొంటూ నిర్దోషులుగా ప్రకటించింది.
2021లో పంచకులాకు చెందిన ప్రముఖ సీబీఐ జడ్జ్ డా సుశీల్ కుమార్ గర్గ్‌కి చెందిన కోర్టు గుర్మీత్ రాం రహీం సింగ్, కృష్ణ లాల్, జస్బీర్ సింగ్, ఇందర్ సేన ఇంకా సబ్దీల్ సింగ్‌ను ఐపీసీ అధికరణ 302(హత్య) ఇంకా 120బీ (నేరపూరిత కుట్ర) నేపథ్యంలో దోషిగా తేల్చింది. వీరందరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.
2019 జనవరిలో పాత్రికేయుడు రామచంద్ర ఛత్రపతి హత్యకు సంబంధించిన కేసులో సీబీఐకు చెందిన ప్రత్యేక కోర్టు గుర్మీత్ రాం రహీంకు జీవితఖైదును విధించింది. అయినప్పటికీ దీని తర్వాత కూడా ఆయన ఎన్నో సార్లు పైరోల్ మీద బయటకు వస్తూ ఉన్నారు, దీని మీద పాత్రికేయుడు ఛత్రపతి కొడుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.