
కలకత్తా: తమ వ్యాపార రంగంలో నిష్ణాతులైన ఇద్దరు దిగ్గజాలు కలిసి 2006లో బెంగాల్, రాష్ట్ర యువతకు కొత్త మార్గాన్ని రచించడానికి వచ్చారు. అయితే హుగ్లీలోని సింగూర్‌లో కారు తయారీ శాఖ నిర్మించాలనే వారి కల భూసేకరణ నిరసనల కారణంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఇదంతా చరిత్ర.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత, ఏప్రిల్ మధ్యలో రద్దీగా ఉన్న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో, ఒక యువ సీపీఎం మద్దతుదారుడు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టచార్జీ ఇంకా వ్యాపారవేత్త రతన్ టాటా ఇద్దరి కటౌట్‌ను పట్టుకొని ఉన్నాడు. తన తలపై తను పట్టుకున్న కటౌట్ కింద ఎరుపు రంగులో “యుబక్దర్ స్వాప్-నోబాంగో(మరణించిన యువత కల)” అనే నినాదం రాసి ఉంది.
బెంగాల్లో ఉద్యోగాల కొరతను 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీపీఎం కీలక అంశాలలో ఒకటిగా మారుస్తుందని ఇది సూచించింది, దీని కోసం ఆదివారం బ్రిగేడ్ వద్ద బిగుల్ మోగింది.
“గత 14 సంవత్సరాలుగా, మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి, గూండాగిరి, నిరంకుశత్వ పాలనను స్థాపించింది. 26, 000 మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోయిన సమయంలో, లక్షలాది మంది విద్యావంతులైన విద్యార్థులు, యువకులు బెంగాల్లో పరిశ్రమలు, ఉద్యోగాలు లేకపోవడంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్న సమయంలో మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము ” అని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) నాయకుడు అనాడి సాహు అన్నారు.
సీపీఎం మద్దతుగల నాలుగు ప్రజా సంఘాలైన సీఐటీయూ, ఆల్ ఇండియా కిషన్ సభ(ఏఐకేఎస్), ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్(ఏఐఏడబ్ల్యుయు), పశ్చిమ్బెంగా బుస్తీ ఉన్నయన్ సమితి నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన సాహు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నరేంద్ర మోడీలను ఒకే స్థాయిలో తూకం వేసి, మోడీ హయాంలో దేశంలో నిరుద్యోగం ఉందని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకమైన కేంద్ర కార్మిక కోడ్‌కు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా సాధారణ సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని ఆయన తెలియజేశారు.
సాహు తర్వాత ఏఐకేఎస్ నాయకుడు అమల్ హల్దార్ మాట్లాడుతూ “వామపక్ష పాలనా కాలంలో దేశంలో ఎక్కువ మొత్తంలో వరిని బెంగాల్ ఉత్పత్తి చేసింది. మమతా హయాంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానానికి పడిపోయింది. బెంగాల్ దాని బియ్యాన్ని ప్రేమిస్తుంది, అయితే ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేయాల్సిన రోజు రావొచ్చు”అని హల్దార్ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారతదేశ పర్యటన నేపథ్యంలో రైతులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఆయన హెచ్చరించారు.
ఏఐఏడబ్ల్యుయూ నాయకులు నిరపద సర్దార్, బన్యా తుదు ప్రసంగాలు ఎక్కువగా అభినందనలు పొందాయి. తుదు, తన మొదటి ప్రధాన ప్రజా ప్రసంగంలో, రాష్ట్రం- దేశం కష్టకాలంలో ఉన్నాయని, “దొంగలు(రాష్ట్రంలో) ఇంకా దోపిడీదారులు(కేంద్రంలో)”వాటిని పాలిస్తున్నారని చెప్పారు.
“గ్రామస్తులు అడవి ఏనుగులను తరిమివేసే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తరిమివేయాలని” ఆమె ప్రజలను కోరారు.
“వామపక్ష ప్రభుత్వం పేదలకు పంచిన భూమిని కబళిస్తున్నారు. మేము ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. వారు(తృణముల్) ‘కేళా హోబే (ఆట జరుగుతోంది)’ అని మాట్లాడుతున్నారు. 2026లో మేము వారి వికెట్ తీసుకుంటాము. ప్రతి బూత్‌కు రక్షణగా ఉండి నిజమైన ఆట ఎలా ఆడాలో వారికి చూపిస్తాము” సీపీఎం మద్దతుదారులు, ప్రధానంగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఉత్సాహభరిత నినాదాల మధ్య తుదు చెప్పారు. గత కొన్ని బ్రిగేడ్ ర్యాలీలలో యువత, విద్యార్థులతో నిండిన జనసమూహ స్వరూపంలో స్పష్టమైన మార్పు కనబడింది.
సీపీఎం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం మైక్ వద్దకు చేరుకొని ప్రసంగించారు. టీఎంసీ- బీజేపీపై మాటలతో ప్రత్యక్ష దాడి చేశారు, ఈ రెండు పార్టీలు ఆర్ఎస్ఎస్ సలహా మేరకు బెంగాల్‌ను సాముదాయికంగా విభజించడానికి కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
“ఆలయాలు, మస్జీద్‌ల గొడవ ఎప్పుడూ ఉండకూడదు. బంగ్లాదేశ్ వైపు చూడండి, ఎక్కడ అయితే అల్పసంఖ్యాకులు చంపబడుతున్నారో అలాంటి బంగ్లాదేశ్‌లా ముర్షిదాబాద్ కావడాన్ని మేము ఎప్పుడూ స్వాగతించము. కమ్యూనిస్టులమైన మేము, మా చివరి వరకు అల్లర్లను ప్రతిఘటిస్తాము. విద్యా, ఆరోగ్యం, ఉద్యోగాలు, మహిళల గౌరవం, ప్రజల మధ్య సామరస్యం కోసం మా యుద్ధం” అని సలీం అన్నారు.
ఇంకా “టీఎంసీ- బీజేపీ మతపరమైన అల్లర్ల రచన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రచించారు.” అని ఆయన అన్నారు.
తన ప్రసంగాన్ని ముగించే దశలో ముర్షిదాబాద్ అల్లర్లపై న్యాయ విచారణ జరపించాలని సలీం డిమాండ్ చేశారు. అంతేకాకుండా మత అల్లర్లను ప్రేరేపించే శక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రజల కరతాల ధ్వనుల మధ్య “అల్లర్లు చేసేవారు తమ తలలు పైకెత్తడానికి ధైర్యం చేస్తే, అవి నేలమీదికి కొట్టడం జరుగుతుంది” అని దివంగత బుద్ధదేవ్ భట్టాచార్జీ తరచుగా వాడే వివాదాస్పదంగా భావించే ప్రసిద్ధ ప్రకటనను ఆయన ప్రస్తావించారు.
నాయకులు, మద్దతుదారులు బ్రిగేడ్ ఓటింగ్‌తో సంతృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణలు సిపిఎం ఈ ట్రెండ్‌ను అధిగమించి 2026 ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదా అనే స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తాయి.
ఒక సీపీఎం నేత మాట్లాడుతూ “2011 తర్వాత మొదటిసారి రైతు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమీకరించబడ్డాయి. పునరుజ్జీవ స్వల్పమైన అవకాశం కోసం, మార్పు అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభించాలి. ఈసారి టీఎంసీ-బీజేపీ పోలరైజేషన్ వ్యూహాన్ని ఓడించడం ద్వారా ఇది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము “అని అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.