
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం జర్నలిస్టుల మౌలిక కర్తవ్య నిర్వహణకు విఘాతం కలిగించేదిగా ఉందంటూ తక్షణమే ఆ చట్టాన్ని సమీక్షించాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు మరో 21 ప్రెస్ సంస్థల సంఘాలు, వెయ్యికి పైగా జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులతో కలిసి కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార ప్రసారమంత్రి అశ్వని వైష్ణవ్‌ను కోరారు.
ఈ సంస్థలు సంయుక్తంగా రాసిన లేఖలో అన్ని రకాల విభాగాల్లోనూ జర్నలిస్టులను ఆ చట్టం పరిధిలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా చట్టంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ నిర్వచనాలను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు న్యాయ నిపుణులు, వ్యక్తిగత గోప్యత చట్ట నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మిగిలిన జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాశారు. ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఆ), (జీ)లను సమాధి చేయటంతో పాటు దేశంలో జర్నలిస్టులకు తమ వృత్తిని ఎటువంటి భయాందోళనలు లేకుండా అనుసరించే వీలు లేకుండా ఈ నూతన చట్టం నియంత్రిస్తోందని ప్రెస్ కౌన్సిల్ తన విజ్ఞప్తిలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ బిల్లు రూపొందించే దశలో చట్టం పరిధిలోకి జర్నలిస్టు వృత్తిని చేర్చలేదని, కానీ ఇప్పుడు చట్టం ఆమోదం పొందిన తర్వాత జర్నలిస్టులను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవడం విస్మయం కలిగించే అంశమని ప్రెస్ కౌన్సిల్ వివిధ రాష్ట్రాలలో ఉన్న 21 ప్రెస్ సంఘాలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహరి, సెక్రటరీ జనరల్ నీరజ్ ఠాకూర్ ఈ విజ్ఞప్తిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ధీరేంద్ర ఓజాకు అందజేశారు. అశ్వని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఓజా ఈ విజ్ఞప్తిని అందుకున్నారు.
“పీఐబీ డైరెక్టర్ జనరల్ ద్వారా జూన్ 25న మెమొరాండం అందజేశాము. వివరాలు తెలుసుకునేందుకు మంత్రి సమయం కోరాము. మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మంత్రి కార్యాలయానికి పంపించామని డైరెక్టర్ జనరల్ ధ్రువీకరించారు. మంత్రితో సమావేశం అయ్యేందుకు సరైన సమయం చూసుకొని ఖరారు చేస్తామని డైరెక్ట్ జనరల్ హామీ ఇచ్చారు. ఆయన సమాధానం కోసం చూస్తున్నాము. వృత్తపరమైన జర్నలిస్టులో కార్యకలాపాలను చట్టం పరిధి నుంచి మినహాయించే విషయంలో పత్రికా రంగా నిపుణుల వాదనలను మంత్రి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. మీడియా మిత్రులలో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాము” అని లహరి తెలిపారు.
2025 మేలో సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. 2023 చట్టంలో కీలకమైన మార్పుల సవరణల కోసం మీడియా మిత్రులందరూ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే విజ్ఞాపన పత్రంపై సంతకం చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్పట్లో కోరింది. ఈ చట్టం అమలు పేరుతో వృత్తిపరమైన జర్నలిస్టుల రోజువారి పనికి భగ్నం ఏర్పడకోడదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.