
మేడమ్ .,నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా భార్యతో నా బాంధవ్యం ఎలా ఉండబోతే బాగుంటుంది ..,నాకు కొన్ని భయాలు ఉన్నాయి . నాకు ఈ విషయంలో పెళ్ళికి ముందే కౌన్సెలింగ్ కావాలి.-రవీందర్ -విజయవాడ .
మేడమ్ .., పెళ్లి తరువాత మా అక్కా బావ మధ్య వచ్చిన గొడవలు .,అశాంతి చూస్తుంటే పెళ్లి చేస్కోవాలంటే భయంగా ఉంది. నాకూ సంబంధాలు చూస్తున్నారు వాళ్ళలా నా పెళ్లి తర్వాతి జీవితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
డాక్ట ర్ గారూ .. నాకు పెళ్ళయి ఆరు నెలలు అవుతున్నాయి మా మధ్య ఇంకా కలయిక జరగలేదు కారణం నా భార్యకు సెక్స్ అంటే విపరీతమైన భయం . ఇంట్లో విడాకులు ఇమ్మనటున్నారు. నాకు ఇష్టం లేదు. ఆమెలో సెక్స్ పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి .. ఎవర్ని కలవాలి ?
మేడమ్ .. మా అబ్బాయి వయసు 15 సంవస్తరాలు . టెన్త్ లో ఉన్నాడు . బాగా కోపం ఉద్రేకం ఎక్కువ. ఎప్పుడూ గదిలోనే ఉంటాడు. సెల్ ఫోన్ తో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. ఈ మద్య కొధ్ధి గా ఎక్కువగా పడుకోవడం , మత్తుగా ఉన్నట్లు ఉండడం గమనిస్తున్నాను వాడి ఫ్రెండ్ మా అబ్బాయి ఏదో ప్రేమ వ్యవహారం లో ఉన్నాడని చెబుతున్నారు. అలాగే తరచూ కాలేజీ దగ్గరి బడ్డీ కొట్టులో ఏవో చాక్లెట్స్ కొంటున్నాడని చెప్పారు మా వాడు ఎంత అడిగినా చెప్పడు . అబ్బాయికి కౌన్సెలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాము ఏమై పోతాడో అని భయంగా ఉంది.
ఇవి తరచూ పెళ్లి కాబోయే.. అయిపోయిన దంపతుల్లో టీనేజీ పిల్లల తల్లి దండ్రుల్లో .. టీనేజి పిల్లల్లో కూడా వచ్చే సందేహాలు భయాలు. ఈ ప్రశ్నలకి సరి అయిన విధంగా శాస్రీ య పద్ధతిలో .. ఒక సైన్స్ లా విశ్లేషించి సమాధానాలు ఇవ్వక పోతే వీరు అర కొర జ్ఞానం ఉన్న నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళి మోసపోతూ ఉంటారు. లేదా విరివిగా సెల్ ఫోన్ లో దొరికే పోర్న్ సైట్స్ చూస్తూ అందులో చూపించే నాన్ మెడికల్ అంశాలనే నమ్ముతూ.. అందులోని వికృత అసహజ లైంగిక ధోరణులకు అలవాటు పడతారు. ఇది వారి భావి జీవితాలను సర్వ నాశనం చేస్తుంది. జీవితాంతం నరకం అనుభవించడమే కాదు వాళ్ళ జీవన సహచరులను కూడా కష్ట పెడతారు ఇదంతా సెక్స్ ని ఒక సైన్స్ గా .. ఒక మెడికల్ సిస్టమ్ & సెక్సువల్ హెల్త్ లో ఒక భాగంగా చూడకపోవడం వల్ల జరుగుతుంది. సెక్స్ ని ఇతర అవయవాల సహజమైన శరీర ధర్మాల వలె కాకుండా అంటే కన్ను, ముక్కు ,గుండె, ఊపిరితిత్తులు ,జీర్ణ వ్యవస్థ వలె కాకుండా మన జీవితంతో..శరీరంతో , వివాహం తో సంబంధం లేని ఒక మార్మిక మైన అంశంగా .. ఒక రహస్యంగా చూడాల్సిన.. ఉంచాల్సిన అంశంగా ., ఒక బూతుగా పాపం గా చూపించడం వలన దీని చుట్టూ ఇంత భయం, అయోమయం అలుముకుని చివరికి స్త్రీలలో జడత్వం, సెక్స్ జీవితం అంటే భయం, తద్వారా సెకండరీ వంద్యత్వం ,పురుషులలో అంగ స్తంభన లోపం, శీఘ్ర స్ఖలన సమస్యలు, సెక్స్ కోరికలు తక్కువగా ఉండడం, అసహజ సెక్స్ ధోరణులు లాంటి లైంగిక, మనోలైంగిక, మనో శారీరిక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. స్రీలలో పునరుత్పత్తి అవయవాలు గర్భాశయం, అండాశయం, యోని నాళం.. రుతుక్రమం అలాగే పురుషులలో అంగం, బీర్జాలు , ప్రొస్టేట్ గ్రంధి, వీర్యకణాలు ఇవన్నీ శరీరంలో ఇతర వ్యవస్థలలాగే సహాజమైనవిగా .. సాధారణమైనవిగా చూడాలన్న జ్ఞానం ఇవ్వబడలేదు. శాస్రీయ లైంగిక అవగాహనా లోపం దంపతుల మధ్య దూరాల్ని పెంచి విడాకుల వరకు,అక్రమ సంబంధాల వరకు దారితీస్తాయి. అపోహలు అనుమానాలు భయాలు తీరని టీనేజి యువతలో కూడా ఆందోళన.. డిప్రెషన్ ,భయం లాంటి మానసిక సమస్యలకు కొన్ని సార్లు ఆత్మ హత్యలకు దారి తీస్తుంది టీనేజి యువకులకి ఎక్కువగా వారి శరీరం లో వచ్చే మార్పులు .. హార్మోన్లు కలిగించే సంచయనాలు, ప్రత్యుత్పత్తి అవయవాల స్పందనలు, పరిమాణం, వీర్యస్కలన సంబంధిత అనుమానాలు ,అపోహలు వేధిస్తుంటాయి. విద్యాలయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ చెప్పరు .మానవ లైంగికత చుట్టూ ఉండాల్సిన విలువల గురుంచి, స్రీల లైంగిక ,పునరుత్పత్తి హక్కుల గురించి, స్రీలను దేహాలుగా కాదు విలువలున్న వ్యక్తులుగా గుర్తించాలని ,స్రీలు పురుషుల లైంగిక అవసరాలు తీర్చే వస్తువులు కాదని .. ఇంటి పనులు స్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసుకోవాలని .. స్రీల విద్య వృత్తి కి సంబంధించిన స్వేచ్ఛని అడ్డుకోరాదని , పురుషులు యువకులు ఈ విషయంలో సెన్సిటైజ్ అవడం గురించి కూడా చెప్పరు. సెక్సువల్ అనాటమి అంటే స్రీ పురుషుల ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణం , లైంగిక వ్యాధులు, అవి రాకుండా రక్షణ పద్ధతులు మాత్రమే చెప్తారు. ఈ మధ్య టీనేజిలో ఉండే విద్యార్థి, విద్యార్థినులు లైంగిక ఆకర్షణలో ఏర్పడిన సంబంధాలని ఎలా మానేజీ చేయాలో సిబిఎస్ఈ సిలబస్ లో చేర్చారు . ముందే అశాస్త్రీయ, తప్పుడు అవగాహన ,సమాచారాలతో తప్పుడు దారి పడుతున్న యువత ఇంకెన్ని ప్రమాదాల్లో పడబోతున్నారో కదా. ఇలా కాకుండా ఉండాలంటే ఒక మంచి ప్లాట్ ఫార్మ్ మీద సెక్సువల్ హెల్త్ కౌన్సెలింగ్, ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఈ విషయం లో ఈ పెళ్ళికి ముందు & తరువాతి సెక్సువల్ సమస్యల పరిష్కార వేదిక లో చర్చలు, ప్రశ్నలు, సమాధానాలు . సెక్సువల్ హెల్త్ ఆర్టికల్స్, మారేజీ కౌన్సెలింగ్ ,ఫామిలీ కౌన్సెలింగ్, కపుల్ థెరపీ ఉంటాయి . సమస్యలున్న ప్రతి ఒక్కరూ తమ. సందేహాలను ఈ క్రింద ఇచ్చే డాక్టర్ గారి ఈ-మెయిల్ కి మెయిల్ చేయవచ్చు
Dr. Bharathi MS
Sexual Health Counsellor, Marital and psychotherapist
Family counsellor
Gvs Research Centre for Sexual & Mental Health
Email id: bharathi27964@gmail.com,
Mobile -8688519225
Timings -11 am to 2 pm /5 pm -8 pm
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.