
కేటాయించిన మొత్తం 100 రోజుల పనులలో సగటున కేవలం 7% కుటుంబాలు మాత్రమే పూర్తి రోజులు పనిచేశాయి. మరోవైపు వేతనాలు తక్కువ, కేటాయింపులు సరిపోనివిగా ఉన్నాయి.
బెంగళూరు: విజయవంతంగా మూడో సారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన పదవికాలంలో రెండవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతొన్న వేళ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) గ్రామాలలోని ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధిని కల్పిస్తుంది. గ్రామీణ అభివృద్ధి శాఖ దీని కోసం 47% బడ్జెట్‌ను కేటాయిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధిని కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ఇండియా స్పెండ్ నివేదిక ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నిధుల కొరత ఎలా వేధిస్తుందో వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులు వివిధ సమ్యలపై దేశ రాజధాని ఢిల్లీలో వేతనాల ఆలస్యం, జాబ్ కార్డ్‌ల తొలగింపు ఇంకా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోకపోవడం లాంటి విషయాలపైన ఆందోళన చేశారు.
కోవిడ్-19 మహమ్మారి వేళ లాక్డౌన్ నిబంధనల వల్ల ఉద్యోగాలను కోల్పోయి, సొంత గ్రామాలకు చేరుకున్న వారందరిని కలుపుకొని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం మొత్తం 13.40 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పథకం అమలుకు సరిపోని బడ్జెట్, తక్కువ వేతనాలు, అవి కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడంలాంటి సంబంధిత సమస్యలను కార్మికులు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు.
బడ్జెట్ కంటే ముందు విడుదలైన ఈ నివేదిక చాలా విషయాలను తేటతెల్లం చేస్తుంది. ఈ పథకం ఏ విధంగా అమలు చేయబడిందో మనకు అర్ధం అవుతుంది. సాధారణ పని రోజులు, మహిళల భాగస్వామ్యం ఇంకా బడ్జెట్, వేతనాల వాయిదాలాంటి సమస్యలను పార్లమెంటరీ నివేదికల్లో కూడా తరచుగా లేవనెత్తారు.
ఏడాదికి పూర్తి రోజుల పని చేస్తున్న కొన్ని కుటుంబాలు.
100 రోజుల పనిని 150 రోజులు చేయాలనే డిమాండ్ సంవత్సరాల తరబడి కార్మికుల నుంచి వినిపిస్తుంది. అయితే ఇది కరోనా మహామ్మారి తర్వాత పరిణామాల వల్ల ఏర్పడింది. అసంఘటిత రంగం కార్మికులు వలస వెళ్లి పనిచేశారో, వారు సొంత ఊరికి చేరుకునేసరికి ఈ పథకమే జీవనాధారం అయ్యింది. ‘‘ ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే అందుబాటులో ఉండవో అప్పుడు గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ ఉపాధిగా ఉంటుంది’’ అని ప్రభుత్వం తెలిపింది.
అటవీ హక్కుల చట్టం కింద వచ్చిన భూమి తప్ప మరే ఇతర ఆస్తులు లేని అటవీ ప్రాంత గిరిజనులకు 150 రోజులు పని కల్పించాలని ఈ చట్టం ఆదేశిస్తుంది. అంతేకాకుండా, కరువు పీడితా- ప్రకృతి వైపరిత్యాల ప్రాంతాలలో కూడా అదనంగా 50 రోజుల పనిదినాలను కల్పించాలి. ‘‘తమ సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పని దినాలను పెంచాలి’’ అని పార్లమెంటరీ స్పందనలో ప్రభుత్వం తెలిపింది.
అసలు విషయమేంటంటే, కొందరు కార్మికులకే 100 రోజుల పని అందుబాటులో ఉంది. ప్రభుత్వ డాటా ప్రకారం, 2018-19 నుండి 7.4% కుటుంబాలకు సగటున వంద రోజుల పని దొరుకుతుంది. 2023-24లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధారిత కుటుంబం సగటున 52 రోజులు పనిచేసింది. 2012-13 నుంచి ఇప్పటి వరకు ఇది ఎక్కువని నివేదిక తెలుపుతుంది.
అయితే, ప్రస్తుతం ఉన్న 100 రోజుల పని దినాలను పెంచుతూ 150 రోజులు చేయాలని 37వ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక సూచించింది. నివేదిక సూచించిన సిఫార్సులపై డిసెంబర్ 2024 లోక్‌సభ కమిటీ చర్యలు తీసుకుంది.
‘‘ఏది ఏమైనా అదనపు రోజుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చట్టంలో సవరణ ద్వారా దేశవ్యాప్తంగా 150 రోజుల పనిని కల్పించాలని నివేదిక గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది.
‘‘పని రోజులు పెంచడం కన్నా ఉపాధిహామీ వేతనాలను పెంచితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. లబ్ధిదారులు, అర్హులు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు.’’ అని ఆర్ధికవేత్త జీన్ డ్రేజ్ ఇండియా స్పెండ్తో చెప్పారు.
జీన్ ఇంకా చెప్తూ.. ‘‘పని దినాలను 100 నుంచి 150కు పెంచితే ఎవరైతే ఇప్పటికే 100 రోజులు పని చేస్తున్నారో ఆ కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. అదే ఒక వేళ వేతనాలను పెంచితే కార్మికులు అందరికి మేలు జరగవచ్చు. ఇంకా కార్యక్రమంలో వాళ్లు చురుకుగా పాల్గొనేలా సహాయపడుతుంది.’’
2024-25 డాటా ప్రకారం కేవలం 600,000 కుటుంబాలు 101-150 రోజులు పనికి హాజరైయ్యాయి. ఇందులో సగానికి సగం మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లోని 50% కుటుంబాలు పని చేసినట్టుగా నివేదిక తెలుపుతోంది.
‘‘ ప్రస్తుత పరిస్థితులలలో సమస్యలను పరిష్కరించకుండా పని దినాలను 100 నుంచి 150 వరకు పెంచడం లాభదాయకం కాదు. ముందుగా అవసరమైన సమస్యలను పరిష్కరించాలి. అందులో ముఖ్యంగా పథకానికి కేటాయించిన బడ్జెట్‌ను పెంచాలి, ఎక్కువ మంది సిబ్బందిని పని ప్రదేశాల్లో నియమించాలి. అంతేకాకుండా పంచాయితీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి, దీని వల్ల ఉపాధిహామీ కింద పనిచేస్తున్నవారిని గుర్తించవచ్చు.’’ అని లిబ్టెక్ ఇండియా సీనియర్ రీసర్చర్ చక్రధర్ బుద్ధ తెలిపారు.
బడ్జెట్, వేతనాలు..
ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లను కేటాయించింది. పథకానికి కేటాయించిన బడ్జెట్లో ఇది చాలా ఎక్కువని ప్రభుత్వం చెప్తోంది. అయితే, 2023- 24లో సవరించిన అంచనాకు ఇది సమానం. 2022- 23 వాస్తవ వ్యయానికి 5% తక్కువని కూడా చెప్పవచ్చు.
2025 జనవరి 27 నాటికి 8.42 కోట్ల మంది ఉపాధి హామీ పథకం ద్వారా పని డిమాండ్ చేశారు. ఇదే ధోరణి కొనసాగితే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ డిమాండ్ మరింత పెరగనుంది.
2020 కోవిండ్- 19 మహమ్మారి తర్వాత ఎన్నడూ లేనంతగా 2023-24లో ఎక్కువమంది ఈ చట్టం కింద పని చేయడానికి సిద్ధపడ్డారు. మూడు ఆర్థిక సంవత్సరాల కంటే ముందు 2020-21 నుంచి 2022- 23 ఎక్కువగా 100 మిలియన్ ప్రజలు పనిని డిమాండ్ చేశారు. ఇది మహమ్మారి తర్వాత ఉపాధి కల్పనలో నెలకొన్న సమస్యలను సూచిస్తుంది.
2008 నుంచి పథకానికి చెల్లించిన వేతనాల గురించి డిసెంబర్ 2024 లోక్‌సభ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ‘‘వేతనాలు ప్రస్తుత జీవన ప్రమాణ స్థాయికి సరిపోవు, సమానంగా లేవు’’ అని కమిటీ తెలిపింది. అంతేకాకుండా ‘‘ఉపాధి హామీతో అనుసంధనమైన సూచికలకు అనుగుణంగా జాతీయ ద్రవ్యోల్బనాన్ని దృష్టిలో ఉంచుకొని పథకానికి చెల్లిస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గ్రామీణాభివృద్ధిశాఖను కోరాము. సూచికలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఉపాధి హామీ చట్టం కింద అమలు అవుతున్న వేతనాలలో ఎటువంటి మార్పు లేదు.’’ అని కమిటీ ప్రస్థావించింది.
2024- 25 సంవత్సరానికి గాను ఉపాధిహామీ చట్టం కింద ఒక్క రోజు వేతన రేటు రూ. 374, అదీను హర్యాణా, సిక్కింలోని మూడు పంచాయితీలలోనే ఇచ్చినట్టుగా గుర్తించారు. జాతీయ కనీస వేతన పద్ధతిలో మార్పులు చేర్పులు చేసి, స్థిరీకరణ చేయాల్సిందిగా 2019లో అనూప్ శత్పతి కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సు చేసిన జాతీయ కనీస వేతనం రూ.1కి ఇది చాలా తక్కువ అని ఇండియాస్పెండ్ నివేదించింది.
దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న వేతనాలను పోల్చి చూస్తే గనకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2023-24 పురుషుల వ్యవసాయ కూలీల వేతనాల రేటు, గుజరాత్, మధ్యప్రదేశ్ మినహాయించి 2024 ఉపాధిహామీ వేతనాలు అన్ని రాష్ట్రాల్లోను తక్కువగా ఉన్నాయి. కేరళలో వ్యవసాయ కూలీల రోజువారి వేతనాలు రూ.461తో ఎక్కువగా ఉన్నాయి.
‘‘ధరల సూచికను ఉపాధిహామీ చట్టంతో చాలా సంవత్సరాల క్రితమే అనుసంధానించింది. ఏటా పెరుగుతన్న ద్రవ్యోల్బణంతో పాటు ఉపాధిహామీ కార్మికులకు వేతనాలు పెరుగుతున్నాయి. అంతకన్న ఎక్కువగా మాత్రం కాదు.’’ అని డ్రేజ్ చెప్పారు. ‘‘మరో రకంగా చెప్పాలంటే, ఉపాధిహామీ నిజ వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. 2006లో పథకాన్ని ప్రారంభించినప్పడు వ్యవసాయ పనులకు ఇచ్చే వేతనాల కన్నా ఉపాధి పనులకు కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆవి చాలా తక్కువ అని చెప్పవచ్చు.’’
ఏటా వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణ సూచికి సంబంధించి కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం కొన్ని సిఫార్సులు చేసింది. ప్రస్తుత అధ్యయన కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణ తీవ్రతను లెక్కించేందుకు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతిపాదన కూడా సరిపోకపోవడం ఆందోళనకరమని నివేదిక అభిప్రాయపడింది.
ఒకవేళ ద్రవ్యోల్బణ సూచి లెక్కల ప్రకారం నిర్ధారణ అయ్యే వేతనం గత ఏడాది కంటే తక్కువైనప్పుడు గత ఏడాది వేతనాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని కూడా పార్లమెంటరీ సంఘం అభిప్రాయపడిరది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవచ్చని తెలిపింది.
వేతనాల చెల్లింపులో జాప్యం- సాంకేతిక సమస్యలు..
ఉపాధి హామీ పథకం డాటా ప్రకారం 2024-25 సంవత్సరానికి గాను జనవరి 27 నాటికి మొత్తం తాత్సారం చేసిన వేతనాలు(మొదటి దశ, రాష్ట్ర బాధ్యత) రూ.949 కోట్లుగా తెలుస్తుంది. తాత్సార పరిహారం రూ.8 లక్షలు చెల్లించారు. బాకీలతో పాటుగా మొత్తం రూ.23 లక్షలు. వేతనాల చెల్లింపు పదిహేను రోజుల కంటే ఎక్కువ జాప్యం జరిగితే ఆలస్యమైనన్ని రోజులకు రోజుకు 0.05 వేతనం చొప్పున పరిహారం చెల్లించాలి.
‘‘సాంకేతిక సమస్యల వల్ల ఉపాధిహామీ వేతనాలు సరైన సమయానికి రావు, ఒక్కోసారి కార్మికులకు అసలే చెల్లించరు. దీంతో పథకంలో పని చేయడానికి కార్మికులలో ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇది పథకం మొత్తం ఉద్దేశ్యానికి నష్టం చేస్తుంది. పథకంలో సవరణలు, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పథకానికి సంబంధించిన వేతనాలు పెంచాలని, ఇంకా సమయానికి వేతనాలను ఇవ్వాలని దీనిని దృష్టిలో పెట్టుకునే నేను చెప్పాను’’ అని డ్రేజ్ అన్నారు.
అయితే, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏబీపీఎస్), జాతీయ మొబైల్ మోనిటరింగ్ సిస్టమ్(ఎన్ఎమ్ఎమ్ఎస్)తో ఆన్లైన్ ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. ఒక్కొసారి ఈ చర్య ఉపాధి హామీ పథకం కార్మికులకు తీవ్ర సమస్యలకు గురి చేస్తుంది. జనవరి 2023 నుంచి ఈ పద్ధతిని తప్పని సరి చేశారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి ఏబీపీఎస్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం ప్రకారం అవకతవకలను అరికట్టడానికి ఏబీపీఎస్‌ను ఉపాధి హామీ చట్టం తప్పని సరిగా చేసింది. కానీ ఎన్ఎమ్ఎమ్ఎస్ను తీసివేయాలని నిపుణులు తెలిపారు. దాని వల్ల కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వారు చెప్పారు.
2021- 22 ఆర్థిక సంవత్సరంలో పది రాష్ట్రాలలో సుగుణా భీమరశెట్టి సర్వే చేశారు. ఆ రాష్ట్రాల వ్యాప్తంగా 31.36 మిలియన్ ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాల చిల్లంపుల నమూనాలను 2024 నవంబర్‌లో సుగుణా పరిశీలించారు. ‘‘సమయానికి చెల్లింపులు, ఎబీపీఎస్‌తో చెల్లింపులు తిరస్కరణ వంటి వాటిలో గమనించదగ్గ ఎటువంటి తేడా లేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చెల్లించిన వాయిదా పరిహారం దాదాపు రూ.40 కోట్లు’’ అని లెక్కించారు.
2021 మార్చిలో ప్రవేశపెట్టిన కుల ఆధారిత వేతనాల చెల్లింపుల పత్రం విషయాన్ని కూడా భీమరశెట్టి నివేదిక హైలెట్ చేసింది. నగదు ఉపసంహరణ సందర్భంలో వివిధ కులాలకు చెందిన కార్మికుల మధ్య గందరగోళం పెరిగింది. కలిసి ఒకే సమయంలో పనిచేసిన కార్మికులకు వేతనాల చెల్లింపులలో మాత్రం వ్యత్యాసం వచ్చింది. ప్రభుత్వం మాత్రం దీనికి ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. పథకం అర్హులకు కుల ఆధారిత చెల్లింపు పత్రాలను ఇవ్వడంపై 2022 మార్చి స్టాండింగ్ కమిటీ నివేదిక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కార్మికులు, మేధావుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఆధారంగా ఏబీపీఎస్ వ్యవస్థను తప్పనిసరి చేయరాదని 2024 డిసెంబర్లో ఇచ్చిన నివేదిక గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది. ఉపాధిహామీ చట్టం ప్రాథమిక లక్ష్యం సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం తీసుకునే చర్యలు ఈ ప్రాథమిక లక్ష్యానికి విఘాతం కల్గించకోడదని స్పష్టం చేసింది.
2025 జనవరి 27 నాటికి గత మూడేళ్లలో ఉపాధిహామీ చట్టం కింద పని చేసిన కార్మికులల్లో 99.5% మందికి సంబంధించిన ఆధార్ కార్డ్ వివరాలను ఈ కొత్త పద్ధతితో ముడి వేశారు. విద్యుత్ కొరత, ఇంటర్నెట్ లేకపోవడం, స్మార్ట్ ఫోన్లు లేకపోవడంలాంటి కారణాలతో పని చేసిన కార్మికులు కూడా ఏపీబీఎస్ ద్వారా హాజరు నమోదు చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతుంది.‘‘అవకతవకల నివారణకు ఈ ప్రతిపాదనలు, సాంకేతిక సామర్థ్యాల వినియోగం అనివార్యమే అయినప్పటికీ దాన్ని అమలు చేయడానికి ఇంకా సమయం పడుతుంది’’ అని నివేదిక తెలిపింది.
ఉపాధిహామీ పథకానికి హాజరైన కార్మికుల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ సమాచారానికి, మొబైల్ అనుసంధానిత సాఫ్టెవేర్లో ఉన్న సమాచారానికి మధ్య తేడా ఉంటే గ్రామ పంచాయితీ స్వాధీనంలో ఉండే రిజిస్టర్ ఆధారంగా ఆన్లైన్ రికార్లులు సరిచేయడానికి జిల్లా స్థాయిలో అవకాశం ఉంటుందని చక్రధర్ తెలిపారు. ‘‘కాకపోతే ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే మేట్లు గ్రామస్థాయికే పరిమితం అవుతారు. జిల్లా స్థాయిలో ఉండే సమాచారాన్ని చూడడం కానీ సవరించడం కానీ వీళ్ల పరిధిలో ఉండదు.’’
ఎక్కువగా మహిళా భాగాస్వామ్యం
మిగితా పని ప్రదేశాలలో స్త్రీపురుషుల వేతనాల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఉపాధిహామీ చట్టం వేతనాల విషయంలో ఎటువంటి లింగ వ్యత్యాసం లేదు. పురుషలకైనా స్త్రీలకైన సమాన పనికి సమాన వేతనాన్ని ఇచ్చారు. అయితే వ్యవసాయం, నిర్మాణం లాంటి పనులలో పురుషులకు ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. దీంతో వారు వందరోజుల పనికి దూరం అవుతుంటారు. అంతేకాకుండా మిగితా వ్యవస్థాగత సమస్యలు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపువేళ జరిగే సాంకేతిక సమస్యలలాంటి సున్నితమైన అంశాలు పురుషులను అటువంటి పని వైపు పురిగొల్పుతున్నాయి. అయితే మరోవైపు వందరోజుల పని కార్యక్రమం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాకుండా కనీసం మహిళలు పనిలో చేరాలని రిజిస్టర్ చేసుకుంటున్నారు.
దీనికి సంబంధించిన సమాచారంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం తక్కువ మధ్య ఆర్థిక వ్యవస్థలాంటి దేశాలలో మహిళా కార్మికులు బలవంతంగా పనికి వెళ్లడం తక్కువ అని తెలిపింది. కానీ భాగస్వామ్యం రేటు తక్కువగా ఉన్న భారతదేశంలో అది పెరుగుతూ పోతుంది. భవిష్యత్తులో ఇది కార్మిక ఉత్పాదక శక్తి మీద ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది.
‘‘మహిళలకు ఉపాధిహామీ ఎప్పుడూ ఆకర్షిణీయమైన వెసులుబాటు కల్పించింది. కాబట్టి వాళ్లు ఇంటి బాధ్యతలను పూర్తి చేసుకొని, డబ్బులు వచ్చే పనులను చేస్తున్నారు.’’అని ఆర్థికవేత్త రితికా ఖేరా అన్నారు. రితికా ఢల్లీలోని ఐఐటీలో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను ఇండియాస్పెండ్ 2024 మేలో నిర్వహించిన ఇంటర్యూలో రితికా తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి పథకాలలాంటి చెల్లింపు పనులు మహిళలకు ఇంటి బయట దొరకడం చాలా అరుదు అని రితికా అన్నారు.
2018 నుంచి 2024- 25 డాటా ప్రకారం జనవరి 27 నాటికి పథకంలో పనిచేసేవారు సగం కన్నా ఎక్కువ ఉద్యోగులు మాములుగా మహిళలు ఉన్నారు. కానీ రాష్ట్రాల పరంగా చూస్తే మహిళల భాగస్వామ్యం మాత్రం అనేకరకాలుగా ఉంది. ఉదాహరణకు అన్ని దక్షిణ ప్రాంత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇంకా తెలంగాణలో దాదాపు 50% లేదా ఎక్కువ మహిళా భాగస్వాములు ఉన్నారు. కేరళలో, తమిళనాడులో 85% కన్నా ఎక్కువగా ఉన్నారు. దీనికి విరుద్ధంగా ఏకకాలంలోనే ఉత్తర ప్రదేశ్‌లో 40% కన్న తక్కువగా మహిళలు భాగస్వామ్యం వహించినట్టుగా నివేదికలో వెల్లడి అయ్యింది.
మొత్తం మీద సగటుగా వంద రోజుల పని కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం 53% ఉంది. పనిని పంచుకోవడంలో 56% ఎక్కువ అని తెలుస్తుంది.
‘‘పేదరిక నిర్మూలన, మహిళల సాధికారత మిషన్ కుడుంబశ్రీ కేరళ రాష్ట్రంలో పథకం అమలుకు కీలకంగా వ్యవహరించింది. నైపుణ్యత లేని మహిళలను ఒక్క దగ్గరకు చేర్చడం, వాళ్లకు ఉపాధి హామీతో పనిని కల్పించడంలాంటివి చేసి ఎంతో మార్పును తీసుకు వచ్చింది. దీంతో పాత సంప్రదాయాన్ని మార్చేసి కొత్త ఒరవడిని సృష్టించింది’’ అని ఇండియాస్పెండ్ 2018 మే నివేదిక తెలిపింది.
‘‘ఒడిశాలోని వలస ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం 300 రోజుల పనిదినాలను కల్పిస్తుంది. తులనాత్మకంగా చూసినట్లైతే తక్కువ డబ్బులు వచ్చే వాటికి పథకంలోని సమస్యల వల్ల చాలా మంది పేద కుటుంబాలు లబ్ధిని పొందడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.’’ అని చక్రధర్ అన్నారు. ‘‘నెలకొన్న ఛాలెంజెస్ విషయంలో మహిళలకు కుటుంబాలు దిశానిర్దేశం చేస్తే వారి స్థోమతను పెంచుకుంటారు. దీంతో గ్రామాలు పథకాన్ని ఉపయోగించుకోవడంలో మార్గం సుగమమం అవుతుంది.
ఈ వ్యాసం మొదట ఇండియాస్పెండ్.ఆర్గ్ లో ప్రచురితం అయ్యింది..ఇది ప్రధానంగా గణాంకాల ఆధారంగా పరిశోధనాత్మక విశ్లేషణలు అందించే సంస్థ.
– శ్రీహరి పాలియత్, ఇండియాస్పెండ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.