
- తొందరగా శాంతినెలకొల్పాలని ప్రతిపక్షాల డిమాండ్
- రాజీనామా మీద పలువురి విమర్శలు
మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ రెండు సంవత్సరాల తర్వాత సీఎం పదవికి ఎన్ బిరేన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కుకీ- మెయితీ సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘బిరెన్ రాజీనామా చేసినంత మాత్రాన ప్రస్తుత స్థితిలో ఎటువంటి మార్పు రాదు. మణిపూర్లో హింసను తగ్గించడం కోసం తక్షణమే నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తి చేసింది.
న్యూఢిల్లీ: మణిపూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బిరేన్ సింహ్ తన సీఎం పదివికి రాజీనామా చేశారు. అయితే, బిరేన్ ఈ నిర్ణయాన్ని చాలా ఆలస్యంగా తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. మణిపూర్లో హింసను పూర్తిగా ఆపడానికి కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెండు వర్గాల మధ్య మణిపూర్లో జరిగిన సంఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది నిరాశ్రయులు అయ్యారు. ఇంకా ఈ ప్రాంతంలో దాదాపు రెండు సంవత్సరాలుగా సాధారణ పరిస్థితి ఏర్పడకపోవడంతో జనజీవన స్రవంతి అస్తవ్యస్తం అయ్యింది.
హిందుస్తాన్ టైమ్స్ ప్రకారం కుకీ, మెయితీ వర్గాల మధ్య గొడవకు ఆ రెండు వర్గాల నేతలు కూడా కారణం. కాబట్టి, బిరేన్ వెళ్లి పోయినంత మాత్రాన పరిస్థితులలో ఎటువంటి మార్పు రాదని పేర్కొంది.
కుకీ వర్గం గొంతుకను వినిపించే ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్(ఐటిఎల్ఎఫ్) రాజీనామా మీద స్పందించింది. బిరెన్ వెళ్లిపోయినంత మాత్రాన తమ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదు అని అసహనం వ్యక్తం చేశారు. ఐటిఎల్ఎఫ్ ప్రతినిధి గింజా వుఅల్జోగ్ మాట్లాడుతూ ‘బిరేన్ సీఎం పదవిలో ఉండని ఉండకపోని, మా డిమాండ్లో ఎటువంటి మార్పు రాదు. మెయితీ వర్గీయులు మమ్మల్ని వేరు చేశారు, ఇప్పుడు వెనక్కి వెళ్లడానికి ఎటువంటి దారి లేదు.’ అని చెప్పారు.
రాజకీయ లెక్కల కారణంతో బిరెన్ రాజీనామా చేశారని వుఅల్జోగ్ అన్నారు. ‘మణిపూర్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఈ క్రమంలో తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం రాజీనామా చేసి ఉండవచ్చు. దీంతో పాటు ఆయన ఆడియో టేప్ లీక్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయాన్ని లేవనెత్తింది. ఈ సారి బిజెపి ప్రభుత్వం తనను కాపాడడం కోసం ఏ సహాయం చేయదని నాకు అనిపిస్తుంది’ అని వుఅల్జోగ్ చెప్పుకొచ్చారు.
ప్రముఖ మెయితీ సంస్థ మణిపూర్ ఇంటీగ్రిటి కో సమితి మాజీ సమన్వయకర్త జితేంద్ర నింగోబా ఇదే విషయంపై స్పందించారు. ‘బిరెన్ రాజీనామా ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని నాకు అనిపిస్తుంది. ఈ అడుగు మణిపూర్లో కుకీ వేర్పాటువాదుల శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. మణిపూర్లో సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం విఫలమైంది. బిరెన్ రాజీనామా దీనికి మరో ఉదాహరణ’అని జితేంద్ర అన్నారు.
విభజనకు పెద్దపీట
బిరేన్ సింహ్ ఆయన పదవి కాలంలో మణిపూర్లో విభజనకు పెద్దపేట వేశారు. అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా ‘మణిపూర్లో సంఘర్షణ వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. తక్షణం మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్లో శాంతి నెలకొల్పాలి’ అని కాంగ్రెస్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా అన్నారుగా,‘అన్నింటకన్న కావాల్సిన మొదటి ప్రాధాన్యత దేశంలో శాంతి నెలక్పొడం, మణిపూర్ ప్రజల గాయాల మీద లేపనం పూయాలి. ప్రధానమ మంత్రి మోదీ తక్షణమే మణిపూర్లో పర్యటించాలి. బాధిత ప్రజల గొంతును వినాలి, చివరికి సాధారణస్థితిలోకి ప్రస్తుత పరిస్థులు తెచ్చేందుకు కృషి చేయాలి’ అన్నారు.
‘బిరెన్ రాజీనామా గుర్రం పారిపోయిన తర్వాత అశ్వశాల తలుపు మూసేసినట్టుగా ఉంది’ అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.
‘ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. 21 నెలల వరకు బిజెపి మణిపూర్లో అగ్గి రాజేసింది. ప్రజలను, అన్ని వర్గాలను ఆ మంటల్లో అలానే వదిలివేసింది. దీని పర్యవసనంగా సరాసరి 258 మంది చనిపోయారు. పోలీసు స్టేషన్ల నుంచి 5,600 కన్న ఎక్కువగా ఆయుధాలు, 6.5 లక్షల మందుగుండు సామాగ్రిని దోచుకున్నారు. 60,000 కన్న ఎక్కువ మంది నిరాశ్రయులు అయ్యారు. ఇంకా వేల మంది దిక్కుతోచని స్థితిలో రక్షణ శిబిరాలలో ఉంటున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా చెప్తూ, ‘ప్రస్తుత పరిస్థితికి ప్రధానమంత్రి మోదీనే అసలైన దోషి. మణిపూర్ భారతదేశంలో భాగమని ఆయన మర్చిపోయారు.’ అని అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాణం, ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఇంకా సుప్రింకోర్టు తీర్పు ఈ పరిణామాల మధ్య అపఖ్యాతి సీఎం రాజినామా ఇవ్వడం జరిగింది. ఇది గత 2023 లాంటి రాజీనామా డ్రామా కాదు. సమాజంలోని ప్రజల గెలుపు.’ అని చెప్పుకొచ్చారు.
ఇదే విషయం మీద భారతీయ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ డి.రాజా స్పందించారు. ఈ రాజీనామా బిజెపి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ పూర్తి వైఫల్య స్వీకృతని రాజా అన్నారు. రాజకీయ నేతలు అందరూ కలిసి రాష్ట్రంలో శాంతి స్థాపన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బిరేన్ సింహ్ రాజీనామా చేసినట్టుగా మణిపూర్ కాంగ్రెస్ అధ్యుక్షుడు మేఘచంద్ర సింహ తెలిపారు.
స్వపక్షంలో విపక్షం మొదలై బిరేన్పై అధికార పార్టీలోనే చాలాకాలంగా తిరుగుబాటు కొనసాగుతుంది. దీనికి తోడు ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టులో దాఖలైన కేసు మరింత ఆజ్యం పోసింది. ఈ కేసులో సింహ్ ఆడిమో నమూనాలు మణిపూర్ రాష్ట్రంలో జాతి హింసను ప్రేరేపించేలా ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రైవేటు ప్రయోగశాల ట్రూత్ ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో బిరేన్ సింహ్ తన పదవికి రాజీనామా చేశారు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.