మహారాష్ట్ర పత్తి రైతులు ప్రస్తుతం అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. అందులో నకిలీ విత్తనాలు, పంట దిగుబడి సరిగా లేకపోవడం, వాతావరణ మార్పులు, బీమా కంపెనీలు ఇచ్చే పరిహారం సరిగా లేకపోవడం, పంటకు సరైన ధర రాకపోవడం అన్నింటికన్నా ఎక్కువగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒకటి.
మహారాష్ట్రలో పత్తిని పండించే రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఓ వైపు సరైన గిట్టుబాటు ధర దొరకగ పోగా మరోవైపు ఎరువులు, విత్తనాలు వంటి ముడిసరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రెండు సంవత్సరాలుగా మార్కెట్లో కనీస మద్దతు ధరకు కూడా పత్తి పంట చేరుకోలేదు. పెరుగుతున్న సాగు ఖర్చు వల్ల రైతులు ఖర్చులతో విలవిలలాడుతూ అనివార్యంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు.
ప్రభుత్వం తమ మీద దృష్టిసారించకపోవడంతో పత్తికి లాభదాయకమైన ధర లభించే కాస్తోకూస్తో ఆశలు నిరాశలుగా మారుతున్నాయి.
ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్, నాసిక్, ధూలె, నందుర్బార్ ప్రధాన పత్తిపండే కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే కుర్మీ పాటిల్ వర్గీయుల సామాజిక, రాజకీయ, ఆర్థిక పురోగతికి వారి స్థిరత్వానికి పత్తి పంట కారణమైనది.
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలోనే పత్తి తీసే పనులు మొదలైౖయ్యాయి. ఎన్నికల వేళ తమ సమస్యల గురించి రాజకీయ శ్రేణులు మాట్లాడతారెమోనని, సమస్యల పరిష్కారానికి ఏదైనా హామీ ఇస్తారెమోనని రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. కానీ, దీనికి విరుద్ధంగా ‘బటెంగే తో కటెంగే’ (విచ్ఛన్నమైతే విరగడమే) లాంటి నినాదాలు రైతుల ఆశల మీద నీళ్లు చల్లాయి.
ప్రస్తుతం రైతులు పండించిన పత్తి పంట కనీస ధర కన్నా తక్కువకు అమ్ముడు పోతుంది.
మహారాష్ట్రలోని రైతు సంస్థలు, సంఘాలు ఈ రైతులకు ఎటువంటి వెసులుబాటు కల్పించే కృషి చేయడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం నడిపే పత్తి కొనుగోలు కేంద్రాలలో తమ వంతు వచ్చే వరకు రైతులు చాలా రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో చాలా సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో పత్తిని అమ్మడం కూడా లేదు.
తగ్గుతున్న పంటదిగుబడి…
జలగావ్‌లోని అమలనేర్, పారొలా తాలుకా నాణ్యమైన పత్తి పంటను పండించడానికి ప్రసిద్ధి చెందింది. తమ ప్రాంతంలో జన్యుపరంగా అనువరిత్తత పత్తిపంట పండిస్తారని అమలనేర్లోని శాహాపూర్ గ్రామ సర్పంచ్ భావు సాహిబ్ పాటిల్ అన్నారు.
ప్రతి ఏడాది పత్తి విత్తనాల నాణ్యత తగ్గుతోంది. అంతేకాకుండా పత్తి మొక్కల్లో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతూ పోతుంది. దీంతో పురుగుమందులను ఎక్కువగా వాడాల్సి రావడంతో రైతులు ఎక్కువ పంటదిగుబడి చేయలేకపోతున్నారు.
భావు సాహిబ్ పాటిల్‌తో సహా నంద్‌గావ్ గ్రామ సర్పంచ్ దామోదర్ పాటిల్ కూడా పంట విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత రోజుల్లో దొరికే విత్తనాలు కేవలం నవంబర్ వరకే పంట ఉత్పత్తిని ఇస్తున్నాయి. ఎలా అయితే వాతావరణం మారిపోతుందో అలానే పంటల మీద పురుగులదాడి పెరుగిపోయి, పూర్తిగా పత్తి కాయలను తినేస్తాయి. మామూలుగా అయితే ఏ మొక్క ఫిబ్రవరి వరకు పత్తిని ఇస్తుందో అది నవంబర్ నెల చివరి వరకు పురుగుల తాకిడితో నష్టపోతుంది’. అని దామోదర్ పాటిల్ తెలిపారు.
‘వాతావరణ మార్పుతో జన్యుపరంగా అనువర్తిత మొక్క కీటకాల దాడిని ఒకేసారి ఎదుర్కోలేక పోతుంది. ఏడాదికి ఏడాది మొక్క తన శక్తిని కోల్పోవడంతో పంట దిగుబడి తగ్గుతోంది. ఓ వైపు ఇలా ఉంటే మరోవైపు నకిలీ విత్తనాలు రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. రైతుల సమస్యలను వినేవారే లేరు.’ అని దామోదర్ పాటిల్ వాపోయారు.
పత్తిపంట దిగుబడికి సంబంధించి లెక్కలను భావు సాహిబ్ పాటిల్ వివరించారు. ‘ఒక ఎకరం చేనులో పత్తి విత్తనాలను నాటినప్పటి నుంచి పత్తి తీసే వరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. వాటిలో విత్తనాలు నాటడానికి నీటి పారుదలకు, పురుగుల మందులకు, ఇంకా కలుపు నియంత్రణకి తక్కువలో తక్కువ 32 నుంచి 33 వేలు ఖర్చు అవుతాయి. ఇంత ఖర్చు చేసినా పొలంలో దాదాపుగా ఆరు క్వింటాళ్ల కు మించి పత్తి దిగుబడి రాదు’ అని అన్నారు.
దీని గురించి భావు పాటిల్ ఇంకా ‘ఈ పొలంలో పండించే పంట కనీస ఖర్చు క్వింటాళ్‌కు ఐదు నుంచి ఆరు వేల రూపాయలకు దగ్గరలో ఉంటుంది. అయితే పత్తి ఏరడానికి, రవాణాకు, మార్కెట్ వరకు చేర్చే ఖర్చులు మాత్రం ఇందులో భాగం కాదు. ఈ ఖర్చు ఒకవేళ కలిపితే ఇందులో వేయి రూపాయలు ప్రతి క్వింటాళ్‌కు పెరుగుతుంది. ఒకవేళ వాతావారణం అనుకూలంగా లేకపోతే మళ్లీ ఈ పంటలో ఏదీ చేతికి రాదు.’
ప్రతికూల వాతావరణం…
గమనించదగిన విషయం ఏంటంటే ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి దిగుబడి తగ్గింది. ఇది గతేడాదితో పోలిస్తే ఏడు శాతం తక్కువ. పంట దిగుబడిలో ఈ తగ్గుదల ప్రతికూల వాతావరణం వల్ల జరిగింది. దీంతో పత్తి రైతులకు పంట దిగుబడిలో తగ్గుదల చోటుచేసుకుంది. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలలో మొత్తం పంటలో దాదాపు 40 శాతం మాత్రమే కొనుగోలు చేయబడుతుంది. మిగితా పంటను బహిరంగ మార్కెట్లలోని వ్యాపారులకు అమ్ముతారు. దీంతో వీళ్లు నష్టపోతారు.
అంతేకాకుండా చిన్న రైతులు ఎక్కువ భాగం స్థానిక వ్యాపారస్తులు వద్ద అప్పు తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఆ అప్పును తీర్చడం కోసం తొందరగా నగదు వచ్చే మార్గాలను రైతులు ఎంచుకుంటారు. ఈ వ్యాపారులు రైతులకు పంటల బదులుగా తక్షణం నగదును ఇస్తారు. ఇంకా పంట ఇంటి నుంచి తీసుకువెళ్తారు. నిమ్, శహాపూర్, మార్వాడ్, సదావన్, కోలాపింపరీ, శెవగె, ఖడకే లాంటి గ్రామాలలో ఇటువంటి వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తారు.
లభించని సరైన పరిహారం…
అమలనేర్లోని బహ్రా గ్రామానికి చెందిన సుధీర్ పాటిల్ పత్తి రైతుల మరో పెద్ద సమస్యను తెలిపారు. ఆయన రైతులకు హెక్టెయర్కు సాధారణ ప్రిమియం ఒక రూపాయి మీద పంట బీమా సౌకర్యం లభిస్తుంది. బీమాలోని మిగితా ప్రిమియం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే, ప్రకృతి విపత్తుల బీమా కాకుండా తమకు న్యాయమైన, తగిన పరిహారం ఇవ్వరని పత్తి రైతులు అన్నారు. అంతేకాకుండా బీమా కంపెనీలు పరిహారం ఇవ్వడానికి తమ ఇష్టానుసారం వ్యవహరిస్తారని ఆరోపించారు.
ఏడాది క్రితం వాతావరణంలో మార్పు వల్ల పత్తి రైతులకు పంట నష్టం జరిగింది. కానీ బీమా కంపెనీలు నష్టానికి సంబంధించిన పరిహారాన్ని ప్రభావిత రైతులకు 25 నుంచి 50 శాతం మాత్రమే ఇచ్చారు. ఈ పరిహారం రైతుల కనీస ఖర్చుకు సరిపోవడం లేదు. దీంతో బ్యాంకు, వైశ్యుల వద్ద అప్పుతీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖడకే, అంచల్వాడీ, సడావణ్, జవ్ఖెడా మొదలైన గ్రామలకు చెందిన రైతులు పత్తి పండించడానికి వెనుకడుగు వేస్తున్నారు.
ఎందుకంటే ప్రభుత్వం, స్థానిక మార్కెట్ రైతులకు కనీస మూల్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు.
బీమా కంపెనీలకు రైతులు తమవంతు ప్రీమియాన్ని చెల్లించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ భాగానికి చెందిన ప్రీమియాన్ని మాత్రం బీమా కంపెనీలకు ఇవ్వలేకపోయింది. నష్టం తరువాత బీమా కంపెనీలు రైతుల క్లైమ్ను తిరస్కరించిన తరువాత ఈ విషయం రైతులకు తెలిసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల వేళ పత్తి రైతుల బాధ రాజకీయ చర్చలో ఎన్నికల హామీలో మాత్రం లేదు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రైతుల భవిష్యత్తును మార్కెట్‌కు అప్పగించారు.