
ఏదైనా సోషల్ మీడియా పోస్ట్‌ను కేవలం లైక్ చేయడం దానిని ప్రచారం చేయడానికి సమానం కాదని అలహాబాద్ హైకోర్టు తెలియజేసింది. ఇంకా, ఇది ఐటీ చట్టం ఆర్టికల్ 67 ప్రకారం నేరం కాదని తెలియజేసింది. ఆర్టికల్ 67 ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీమైనటువంటివి ప్రచురించడం లేదా ప్రచారం చేయడం వల్ల లభించే శిక్షతో ఇది ముడిపడి ఉందని పేర్కొన్నది.
న్యూఢీల్లీ: ఏదైనా సోషల్ మీడియా పోస్ట్‌ను కేవలం లైక్ చేయడం దానిని ప్రచారం చేసే దానికి సరిసమానం కాదని అలహాబాద్ హైకోర్టు తెలియజేసింది. ఇంక ఐటీ చట్టం ఆర్టికల్ 67 ప్రకారం నేరం కాదని, ఆర్టికల్ 67 ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీమైనటువంటివి ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వల్ల విధించే శిక్షతో ఇది ముడిపడి ఉందని పేర్కొన్నది.
లైవ్ లా నివేదిక ప్రకారం, ఏదైనా పోస్ట్‌ను లేదా మెసేజ్‌ను పోస్ట్ చేసినప్పుడు మాత్రమే “ప్రచురణ”గా పరిగణించబడుతుందని జస్టిస్ సౌరభ్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్‌ను “ప్రచారం”గా ఎప్పుడు పరిగణిస్తారంటే, దానిని షేర్ లేదా ట్వీట్ చేసినప్పుడని చెప్పుకొచ్చింది.
పిటిషన్‌దారు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా నమోదైన ఒక కేసును కొట్టివేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శ్రీవాస్తవ ఈ మాటలను ప్రస్థావించారు. వేరే వ్యక్తి పోస్ట్ చేసిన ఒక పోస్టును కేవలం ఖాన్ లైక్ చేశాడని తెలిసిన తర్వాత ఇలా వ్యాఖ్యానించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్, వాట్సప్ ఖాతాలో ఎటువంటి అభ్యంతరమైన పోస్ట్ లేదు.
కోర్టు తెలిపింది కదా, “ప్రస్తుత కేసులో ఈ ఆరోపణతో పాటు కేసు డైరీలో ఉన్నటువంటి దాని వల్ల అర్థమవుతుంది కదా, పిటిషనర్ దారు ఫర్హాన్ ఉస్మాన్‌కు చెందిన ఓ పోస్టును చట్టవిరుద్ధమైన సభకు సంబంధించిన దానిని లైక్ చేశాడు. కానీ ఏదైన పోస్ట్‌ను లైక్ చేయడం, దానిని ప్రచురించడం లేదా ప్రచారం చేసే దానికి సమానంగా పరిగణించబడదు. దీంతో కేవలం ఏదైనా పోస్ట్‌ను లైక్ చేయడం ఐటీ చట్టం ఆర్టికల్ 67 పరిధిలోకి రాదు.”
దీని కంటే ముందు పోలీసులు ఖాన్ మీద “సోషల్ మీడియాలో రెచ్చగొట్టె సందేశం” పోస్ట్ చేశాడని కేసును నమోదు చేశారు. దాని ఫలితంగా ముస్లిం వర్గానికి చెందిన దాదాపు 600- 700 మంది ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ తీయడానికి సన్నద్ధం అయ్యారు.
కానీ, ఖాన్ కేవలం వేరే వ్యక్తి ద్వారా పోస్ట్ చేయబడిన ఒక సందేశాన్ని లైక్ చేశాడని కోర్టు నిర్ధారణకు వచ్చింది.
ఐటీ చట్టం ఆర్టికల్ 67 రెచ్చగొట్టె సందేశాల కోసం కాకుండా, కేవలం అశ్లీలమైనటువంటి(లైంగిక ప్రేరేపిత)వాటి కోసం రూపొందించడం జరిగింది. దీంట్లో “లైస్వియస్” లేదా “ప్రురియంట్ ఇంట్రెస్ట్” లాంటి పదాల ఉన్నాయి. వీటి అర్థం లైంగిక కోరికలను ప్రేరేపించే విషయాలు. దీని వల్ల ఒకవేళ ఏదైనా పోస్ట్ కేవలం రెచ్చగొట్టేదై ఉండి అశ్లీలం కాకపోతే ఆ కేసుకు సంబంధించి ఆర్టికల్ 67 ప్రకారం శిక్ష వేయడం జరగదు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.