Reading Time: < 1 minute
అజ్ఞాన తిమిరం నిండిన
మది తరగతి గదిలో
జ్ఞాన నిధి వెలుగుల
పాలపుంత గురువు
అపజయాల బ్లాక్ బోర్డుపై
నిరాశ నిస్పృహల
రాతలను చెరిపేసే
ప్రేరణ దారి దీప గెలుపు
తారా లోకం గురువు
బతుకు శాంతి పాఠాలతో
జీవన మానవత్వపు
గుణపాఠాలను రంగరించి
కలల ఫిజిక్స్ శోధనలో
విజ్ఞానతత్వ తరంగిణి
మైక్రోచిప్ గురువు
తన ఆలోచనల రాకెట్
అడుగుజాడలను స్ఫూర్తి
శిఖరాలుగా మార్చే
భవిష్యత్ కాలపు గుండెలో
లేజర్ కాంతి పుంజం గురువు
జీవిత గణిత గమనానికి
సాంకేతికత రంగులనద్దే
నిత్య గీతా సారాంశ బోధకుడు
సమాజాభ్యుదయాన
అభినవ ఆచార్య సూర్యుడు
గురువంటే మహా చైతన్యపు
విలువల కవిత్వం
గురువంటే అనంత శూన్యంలో
అంతరిక్ష అక్షర విశ్వం
