కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యాజమాన్యాన్ని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సిబిఐ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చే నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) సిబ్బంది కూడా కొందరికి ఈ కేసుతో సంబంధం ఉండటంతో వారినికూడా విచారణ నిమిత్తం సిబిఐ అదుపులోకి తీసుకుంది. తమ కాలేజీని ఎGG ర్యాంకు తెప్పించుకోవడానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ సిబ్బందికి పెద్ద ఎత్తున ముడుపులు అందచేసినట్లు కెఎల్యూ యాజమాన్యం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల నిమిత్తంగా సిబిఐ విజయవాడ, హైదరాబాద్, ఢల్లీిలతో సహా దాదాపు 20 నగరాల్లో దాడులు నిర్వహించింది. అరెస్టయిన వారిలో ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జిపి సారధి వర్మ, సంస్థ ఉపాధ్యక్షుడు కోనేరు రాజా హరీన్, ఎ రామకృష్ణ, నాక్ తనిఖీల బృందం అధ్యక్షులు, రామచంద్రవంశీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సమరేంద్రనాథ్ సాహా, భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా డీన్, తనిఖీ కమిటీ సభ్యుడు డి గోపాల్, ఇతర సభ్యులు రాజేష్ పవార్, మనస్ కుమార్ మిశ్రా, గాయత్రి దేవ్‌రాజ్, బాలు మహారాణలు కూడా అరెస్టయ్యారు. ఈ సందర్బంగా సిబిఐ వీరి నుండి 32 లక్షల రూపాయల నగదు, ఆరు ల్యాప్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోను. కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నిమిత్తంగా మొత్తం 14మంది పై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలుస్తోంది.
Reading Time: < 1 minute