
భారత రాజ్యాంగం ఎస్సీలందరికి కలిపించిన రిజర్వేషన్లను సామాజిక న్యాయ సూత్రాన్ని గౌరవిస్తూ వాటిని ఉపవర్గీకరణ చేయతలపెట్టిన తెలంగాణ ప్రభుత్వ సంకల్పాన్ని స్వాగతించాల్సిందే. అలాగే అభినందించాలి కూడా. అయితే ఈ ప్రయత్నం మరింత శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఈక్విటీ(బాధితుల అవసరానికి అనుగుణంగా సహకరించే విధానం) తాత్విక పునాదిగా ఉండాలి. తద్వారానే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కులాలకు పూర్తిగా సమన్యాయం జరుగుతుంది.
2025 ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ముసాయిదా బిల్లును రూపొందించటానికి 2011లో కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఎస్సీల కుల జనాభాను ప్రభుత్వం ఆధారంగా చేసుకుంది. ఈ విధానం 2024 ఆగష్టు 1న సుప్రీంకోర్ట్ ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై వెలువరించిన తీర్పుకు, అది సూచించిన మౌలికమైన మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఎందుకంటే ఆ తీర్పులో ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయడంలో ఈ క్రింది నియమ నిబంధనలను తప్పనిసరిగా తీసుకోవాలని అభిప్రాయపడింది.
పభుత్వాలు ఆయా రాష్ట్రాలలోని ఎస్సీ కులాల తాజా జనాభా సంఖ్యను, అలాగే ఎస్సీ కులాలకు కల్పించబడిన రిజర్వేషన్లను అనుభవించడంలో వారి వారి ప్రత్యేక జనాభా దామాషాకి సరిపడా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయో, లేవో అనే విషయాన్నీ తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల, స్థిర, చరాస్తుల వంటి వివరాలను తప్పని సరిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
అంటే, ప్రభుత్వం ఈ ఉపవర్గీకరణ రూపొందించే కంటే ముందే భారత రాజ్యాంగంలో అధికరణ 246 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేత కనీసం తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీల తాజా కులగణన చేయించాల్సింది. లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో సేకరించిన కులగణనలోని ఎస్సీ జనాభాకు చట్టబద్ధతను ఇవ్వమని కోరి ఉండాల్సింది. అలా చేయకుండా 2011 నాటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జనాభా లెక్కలను వర్గీకరణకు ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో 5 శాతం పెరిగిన మొత్తం ఎస్సీల జనాభాను రాష్ట్రంలోని ఎస్సీలందరు నష్టపోతున్నారు.
మరీ ముఖ్యంగా కారణాలేంటో కానీ, 1981 తర్వాత కాలం నుంచి క్రమంగా తగ్గించి చూపబడుతున్న మాల, దాని అనుబంధ కులాల జనాభాను వారు సరిచేసుకునే సదవకాశాన్ని నిరాకరించినట్లు అవుతుంది.
అమాయకత్వం, నిరక్ష్యరాస్యత వల్ల 2011లోని కులగణన ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉండి, గత కొంత కాలంగా కొంత చైతన్యం పొంది తమ న్యాయమైన రిజర్వేషన్ల వాటాను కోరుకుంటున్న మాల, మాదిగేతర సబ్బండ ఎస్సీ కులాల జనాభా శాతాన్ని 2025 నాటికి పెరిగిన విధంగా పొందలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద రాజ్యాంగ బద్ధంగానూ, సుప్రీంకోర్ట్ తీర్పు రీత్యానూ రాజకీయ ఒత్తిడితోనైనా సరే కొత్త లెక్కల ప్రకారం ఎస్సీలకు వివిధ సముదాయాలుగా రూపొందించి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
అలాకాకుండా కేవలం 2011 ఎస్సీల జనాభా లెక్కలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకంటే ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు, ఉషా మెహ్రా కమీషన్లు సేకరించిన లబ్ధిదారుల లెక్కల ఆధారంగానే వర్గీకరణ చేస్తే తెలంగాణలోని మాల, ఇతర అన్ని ఎస్సీ కులాలకు ప్రభుత్వం తీరని అన్యాయాన్ని చేసిందిగా మిగిలిపోతుంది. ఎందుకంటే 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం గతంలోనూ, ప్రస్తుతం సమకూర్చిన విద్యా, ఉద్యోగ, ఇతర ఎస్సీ సంక్షేమ పథకాలలో మాదిగలు వారి జనాభా శాతానికి మించి ప్రాతినిధ్యం పొందారు, పొందుతున్నారు కూడా. ఈ విషయాల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పరిపాలన శాఖల నుంచి సమాచారాన్ని పొంది పరిశీలించవచ్చు.
అందుబాటులో ఉన్న 2011 కులజనగణన నివేదిక ప్రకారం ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల మొత్తం ఎస్సీ జనాభా 54,32,680గా ఉంది. దానికి భిన్నంగా 2025 ఫిబ్రవరి 4న రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినా గ్రూపింగ్లలో అంటే గ్రూప్-1లో 1,7 గ్రూప్-2లో 32,74,377, గ్రూప్-3లో 17,71,582గా మొత్తం 52,17,580 సంఖ్యను వెల్లడించారు.
అంటే దాదాపు 2,15,100 వరకు ఎస్సీ జనాభాలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తారుమారు చేశాయని భావించవలసి వస్తుంది. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? కేంద్రమా? రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీనా? అందుకే తాజాగా మొత్తం ఎస్సీల జనాభాను కేంద్రం చేత సేకరించాలని మాలలు, మాదిగేతర ఎస్సీలు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమీషన్ పూర్తి నివేదికను ప్రజలకు, ప్రధానంగా ఎస్సీలకు అందుబాటులోకి తేకుండానే ఏ ఆధారాలతో మాల, ఇతర అనుబంధ కులాలను నేటి తెలంగాణాలో మెరుగైన, అభివృద్ధి పొందిన సమూహంగా నిర్ధారించారో ప్రజలకు చెప్పవలసి ఉంటుంది.
న్యాయంగా అయితే ఏదైనా ఒక కొత్త బిల్లును చట్ట సభలలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు సంబంధించిన వివరాలతోపాటు, అనుబంధ సమాచారాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రజా ప్రతినిధులకు అందుబాటులోకి ప్రభుత్వం తెస్తుంది. ఈ ఉపవర్గీకరణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా, గౌరవ ప్రజాప్రతినిధులకు ఎలాంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు? అందుకే ఇప్పటికైనా డాక్టర్ షమీమ్ అక్తర్ పూర్తి నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ వస్తుంది. తద్వారా ఈ చట్టం నిర్మాణంలో పారదర్శకతను, నైతిక నిబద్ధతను ప్రదర్శించిన పాలకులవుతారు. లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి కోసమే సున్నితమైన అంశాన్ని వాడుకున్నారనే అపవాదును చరిత్రలో ప్రభుత్వ పాలకులు మోయవలసి వస్తుంది.
1996లో నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన జస్టిస్ రామచంద్రరాజు కమీషన్(దానిలో అనేక లోపాలు ఉన్నప్పటికీ) Edger Thurston and Rangachariలు రాసిన Castes and Tribe of Southern India(Seven Volumes – 2001): K.S. Singh రాసినPeople of India: Schedule Castes Vol.2 – 1993: S.S. Hasan రాసిన The Castes and tribes of H.E.H the Nizam Dominions – 1941లను ఆధారం చేసుకొని నాడు వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ కులాలను నాలుగు సమూహాలుగా (గ్రూపులుగా) విభజించారు. అవి ఈ క్రింద పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించారు.
మానవ మల, మూత్రాలను శుభ్రం చేసే 12 కులాలను ఎ-గ్రూప్‌గా, తోలు పరిశ్రమలతో అనుబంధం కలిగిన వారిని, వారి ఆధ్యాత్మిక ప్రభోధకులైన 18 కులాలను బి-గ్రూప్‌గా, వ్యవసాయం- దాని అనుబంధ వృత్తుల వారిని, వారి ఆధ్యాత్మిక ప్రభోధకులైన 25 కులాలను సి-గ్రూప్‌గా, కుల అంటరానితనాన్ని వదిలిన ఎస్సీల సంస్కరణోద్యమ 5 కులాలను డి-గ్రూప్‌గా గుర్తించడం జరిగింది.
2025 ఫిబ్రవరి 4న తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కులాల వారి సమూహాలై (గ్రూపులు)ఇలా ఉన్నాయి.
గ్రూప్-1
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
భావురి |
127 |
0.002 |
2 |
బేడా (బుడగ) జంగం |
1,11,710 |
2.141 |
3 |
చచాటి |
125 |
0.002 |
4 |
డక్కల్, డొక్కాల్వాల్ |
2,558 |
0.049 |
5 |
జగ్గలి |
2,575 |
0.049 |
6 |
కొలువుల వాండ్లు, పంబల, పంబాడి, పంబండి |
931 |
0.018 |
7 |
మాంగ్ |
13,260 |
0.254 |
8 |
మాంగ్ గరోడి |
1,392 |
0.027 |
9 |
మన్నె |
29,656 |
0.568 |
10 |
మస్తీ |
1,246 |
0.024 |
11 |
మాతంగి |
704 |
0.013 |
12 |
మెహతర్ |
6,973 |
0.0134 |
13 |
మండాలా |
212 |
0.004 |
14 |
సంబన్ |
108 |
0.002 |
15 |
సప్రూ |
44 |
0.001 |
మొత్తం |
1,71,621 |
3.289 |
గ్రూప్-2
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
అరుంధతీయ |
107 |
0.002 |
2 |
బైండ్ల |
13,082 |
0.251 |
3 |
చామర్, మోచి, మూచి, చమర్– రవిదాస్, చమర్–రోహిదాస్ |
17,068 |
0.327 |
4 |
చాంబర్ |
632 |
0.012 |
5 |
చండాలా |
64 |
0.001 |
6 |
దండాసి |
86 |
0.002 |
7 |
డోమ్, డొంబర్, పైడి, పాను |
1,926 |
0.037 |
8 |
ఎల్లమ్మలవార్/ ఎల్లమ్మల వాండ్లు |
504 |
0.01 |
9 |
గోడారి |
208 |
0.004 |
10 |
జాంబవులు |
108 |
0.002 |
11 |
మాదిగ |
32,33,642 |
61.967 |
12 |
మాదిగదాసు/ మస్తీన్ |
1,663 |
0.032 |
13 |
పామిడి |
51 |
0.001 |
14 |
పంచమ/ పరియ |
63 |
0.001 |
15 |
సమగర |
1,046 |
0.02 |
16 |
సింధోలు (చిందోలు) |
3,872 |
0.074 |
17 |
యాటల |
163 |
0.003 |
18 |
వల్లువన్ |
92 |
0.002 |
మొత్తం |
32,74,377 |
62.757 |
గ్రూప్-3
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
ఆది ఆంధ్ర |
2,289 |
0.044 |
2 |
ఆది ద్రావిడ |
651 |
0.012 |
3 |
అనామక |
17 |
0.003 |
4 |
ఆరెమాల |
1,992 |
0.038 |
5 |
అర్వమాల |
8,398 |
0.161 |
6 |
బారికి |
83 |
0.002 |
7 |
బ్యాగర, బ్యాగరి |
9,672 |
0.185 |
8 |
చలవాడి |
160 |
0.003 |
9 |
డోర్ |
2,146 |
0.041 |
10 |
ఘాసి, హడ్డి, రెల్లి, ఛాచండి |
84 |
0.002 |
11 |
గోసంగి |
23,251 |
0.447 |
12 |
లియా |
358 |
0.007 |
13 |
లియా దాసరి |
8,482 |
0.163 |
14 |
మదాసి కురువ, మదారి కురువ |
3,707 |
0.071 |
15 |
మహార్ |
31,938 |
0.612 |
16 |
మాల, మలఅయ్యవార్ |
15,27,143 |
29.265 |
17 |
మాలదాసరి |
6,630 |
0.139 |
18 |
మాలదాసు |
925 |
0.018 |
19 |
మాల హన్నయ్ |
37 |
0.001 |
20 |
మాల జంగం |
3,187 |
0.061 |
21 |
మాల మస్తీ |
108 |
0.002 |
22 |
మాలసాలె, నేతకాని |
1,33,072 |
2.55 |
23 |
మాల సన్యాసి |
162 |
0.003 |
24 |
మిత అయ్యల్వార్ |
3,118 |
0.06 |
25 |
సాకి, మోటి, తోటి |
947 |
0.018 |
26 |
రెల్లి |
3,025 |
0.058 |
మొత్తం |
17,71,582 |
33.954 |
ఇందులో లోపాలు ఏంటంటే, ఎస్సీ కులాలలోని సామజిక, సాంస్కృతిక అనుబంధాల రీత్యా చూసినప్పుడు గ్రూప్-1లోని వరుస సంఖ్య 6, 9లలో పొందుపరిచిన కొలుపులవాండ్లు, పంబల, పంబండి ఇంకా మన్నెలను గ్రూప్-3లోకి చేర్చాలి. గ్రూప్-2లోని వరుస సంఖ్య 6, 7, 8, 13, 17, 18లలో పొందుపరిచినా దండాసి, డోమ్, డొంబర్, పైడి-పానో, ఎల్లమ్మలవార్/ఎల్లమ్మల వాండ్లు, పామిడి, యాటల, వల్లువన్లను(Scavenging కులాలు) గ్రూప్-1లోకి మార్చాలి. గ్రూప్-3లోని వరుస సంఖ్య 10, 25, 26 ఘాసి, హడ్డి, చాచండి, రెల్లి, పాకి, మోకి, తోటి, రెల్లీలను గ్రూప్-1లోకి చేర్చాలి.
సోషలాంత్రపోలోజి అధ్యయన పద్ధతి ప్రకారం చూసిన, మొత్తం ఎస్సీ కులాల సామాజిక, సాంస్కృతిక అనుబంధ అంశాల పునాదిగా చూసిన మరింత మెరుగైన, శాస్త్రీయమైన, హేతుబద్దమైన ఎస్సీల ఉప-వర్గీకరణను ఈ క్రింద ప్రతిపాదించిన గ్రూపులుగా చేయవచ్చేమో పరిశీలించాలి.
ప్రతిపాదిస్తున్న గ్రూపులు
గ్రూప్-1
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
ఆది ద్రావిడ |
651 |
0.012 |
2 |
భావురి |
127 |
0.002 |
3 |
చండాలా |
64 |
0.001 |
4 |
దండాసి |
86 |
0.002 |
5 |
డోర్ |
2,146 |
0.041 |
6 |
డోమ్, డొంబర్, పైడి, పాను |
1,926 |
0.037 |
7 |
ఎల్లమ్మలవార్/ ఎల్లమ్మల వాండ్లు |
504 |
0.01 |
8 |
మస్తీ |
1,246 |
0.024 |
9 |
మెహతర్ |
6,973 |
0.0134 |
10 |
మండాలా |
212 |
0.004 |
11 |
సాకి, మోటి, తోటి |
947 |
0.018 |
12 |
పామిడి |
51 |
0.001 |
13 |
రెల్లి |
3,025 |
0.058 |
14 |
సప్రూ |
44 |
0.001 |
15 |
చచాటి |
125 |
0.002 |
16 |
బేడా (బుడగ) జంగం |
1,11,710 |
2.141 |
17 |
ఘాసి, హడ్డి, రెల్లి |
84 |
0.002 |
18 |
యాటల |
163 |
0.003 |
19 |
వల్లువన్ |
92 |
0.002 |
మొత్తం |
1,30,176 |
2.3744 |
గ్రూప్-2
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
అరుంధతీయ |
107 |
0.002 |
2 |
బైండ్ల |
13,082 |
0.251 |
3 |
చామర్, మోచి, మూచి |
17,068 |
0.327 |
4 |
చాంబర్ |
632 |
0.012 |
5 |
డక్కలి |
2,558 |
0.049 |
6 |
గోడారి |
208 |
0.004 |
7 |
జగ్గలి |
2,579 |
0.049 |
8 |
జాంబవులు |
108 |
0.002 |
9 |
పంచమ/ పరియ |
63 |
0.001 |
10 |
మాదిగ |
32,33,642 |
61.975 |
11 |
మాతంగి |
704 |
0.013 |
12 |
మాదిగదాసు/ మస్తీన్ |
1,663 |
0.032 |
13 |
మాంగ్ |
13,260 |
0.254 |
14 |
మాంగ్ గరోడి |
1,392 |
0.027 |
15 |
సమగర |
1,046 |
0.02 |
16 |
సింధోలు (చిందోలు) |
3,872 |
0.074 |
మొత్తం |
32,91,984 |
63.092 |
గ్రూప్-3
వ.నం. |
కులం పేరు |
జనాభా |
మొత్తం ఎస్సీ జనాభాలో % |
1 |
ఆది ఆంధ్ర |
2,289 |
0.044 |
2 |
అనామక |
17 |
0.0003 |
3 |
ఆరెమాల |
1,992 |
0.038 |
4 |
అర్వమాల |
8,398 |
0.161 |
5 |
బారికి |
83 |
0.002 |
6 |
బ్యాగర, బ్యాగరి |
9,672 |
0.185 |
7 |
చలవాడి |
160 |
0.003 |
8 |
హోలియా |
358 |
0.007 |
9 |
హోలియా దాసరి |
8,482 |
0.163 |
10 |
గోసంగి |
23,351 |
0.448 |
11 |
మాల, మాలఅయ్యవార్ |
15,27,143 |
29.269 |
12 |
మాదాసి కురువ, మాదారి కురువ |
3,707 |
0.071 |
13 |
మహార్ |
31,938 |
0.612 |
14 |
మాలదాసరి |
6,630 |
0.127 |
15 |
మిత అయ్యల్వార్ |
3,118 |
0.06 |
16 |
మాలదాసు |
925 |
0.018 |
17 |
మాల హన్నయ్ |
37 |
0.001 |
18 |
మాల జంగం |
3,187 |
0.061 |
19 |
మాల మస్తీ |
108 |
0.002 |
20 |
మాలసాలె, నేతకాని |
1,33,072 |
2.55 |
21 |
మాల సన్యాసి |
162 |
0.003 |
22 |
కొలువుల వాండ్లు, పంబల, పంబాడి, పంబండి |
931 |
0.018 |
23 |
మన్నె |
29,656 |
0.568 |
24 |
సంబన్ |
108 |
0.002 |
మొత్తం |
17,95,524 |
34.4133 |
గ్రూపులవారీగా రిజర్వేషన్ల ప్రతిపాదన
విభాగం |
మొత్తం జనాభా |
శాతం |
జనాభా ప్రకారం 15% పంపకం |
ప్రతిపాదిత పంపకం (శాతంలో) |
గ్రూప్-1 |
1,30,176 |
2.3744 |
0.356 |
1 |
గ్రూప్-2 |
32,91,984 |
63.092 |
9.464 |
9 |
గ్రూప్-3 |
17,95,524 |
34.4133 |
5.162 |
5 |
మొత్తం |
52,17,684 |
100.00 |
15.00 |
15 |
మాల సమూహానికి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్‌ను మొత్తం ఎస్సీలకు కేటాయించిన రోస్టర్ స్కేలింగ్‌లో నాల్గవ స్థానమైన 22(మహిళ)ని ప్రారంభ రోస్టర్ పాయింట్‌గా ఏ ప్రాతిపదికన ప్రభుత్వం నిర్ణయించిందో స్పష్టత లేదు. అదే మాలలకు ప్రారంభ రోస్టర్ పాయింట్ అయితే ఉద్యోగ, విద్య, ఇతర లబ్ధి రంగాలలో మొత్తం అవకాశాల నిర్ణీత సంఖ్య 20 లోపు ఉన్నప్పుడు వారికి అవకాశాలు రావు. ఇది ఎలా న్యాయ సమ్మతమైనది? న్యాయంగానైతే రెండవ రోస్టర్ స్థానంలో మొదటి గ్రూప్‌కి కేటాయించాలి. ఒకవేళ ఆ గ్రూప్‌లో నుంచి అర్హత కలిగిన స్త్రీలు అందుబాటులో లేనప్పుడు అదే సమూహానికి చెందిన పురుషులకు అవకాశం కలిపించే వెసులుబాటును చట్ట నిర్మాణంలో తీసుకురావాలి. ఏడవ రోస్టర్ స్థానంలో గ్రూప్-2కు కేటాయించాలి.
పదహారవ రోస్టర్ స్థానమైన గ్రూప్-3కు కేటాయించాలి. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కలిపిస్తున్న ఉద్యోగాల సంఖ్య చాలామేరకు పదులలోనే ఉంటున్నాయి. వందల్లో ఉండడంలేదు. అలాచేయని పక్షంలో 2024 ఆగష్టు 1న సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులో భాగంగా పేజీ సంఖ్య 123, 124 పేరా 182లలో సూచించిన inclusivity మార్గదర్శకాలను విస్మరించినట్లవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం సుప్రీం కోర్ట్ తీర్పు ప్రతిపాదించిన ప్రజాస్వామ్య ప్రాతినిధ్య స్పూర్తితో వ్యవహరించాలి.
ప్రభుత్వం రూపొందించిన ప్రతి గ్రూప్‌లో దానికి కేటాయించబడిన రిజర్వేషన్లను పొందడంలో గ్రూపులో మరింత వెనుకబడిన శ్రేణులకు కెనడా రాజనీతి తత్వవేత్త విల్ కిమ్లికా ప్రతిపాదించిన మొదటి ప్రాధాన్యతను ఇచ్చే శాస్త్రీయ ప్రామాణికత శ్రేణి సూత్రానికి (Internal Restricted Rights)చట్టబద్దతను కలిపించాలి. అప్పుడు మాత్రమే అవకాశాలను పొందడంలో గ్రూపులలో అందరికి న్యాయం జరుగుతుంది.
వర్గీకరణ చట్ట నిర్మాణంలో మరింత పారదర్శకతను పెంపొందించటం కోసం ప్రభుత్వం ఉభయ సభల సభ్యులతో ఒక ఉమ్మడి అధ్యయన, సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. వారితో పంజాబ్ హరియాణాతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ల పునఃపంపిణి ఎలా చేశారో అధ్యయనం చేయించాలి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు రాజ్యాంగ బద్ధ పునాది అధికరణం 371(డి). అంటే ప్రభుత్వం కల్పించే విద్య ఉద్యోగ అవకాశాలలో జిల్లా, జోనల్ లేదా బహుళ/జోనల్ రాష్ట్ర స్థాయిలలో అనుసరించాల్సి ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్లలో వాటి ఉప-వర్గీకరణకు కూడా రాష్ట్ర పరిధిలో 371(డి) వర్తిస్తుంది. ఇలా చేయడంద్వారా మాత్రమే అన్నిస్థాయిలలో స్థానికతను, వెనుకబాటుతనాన్ని పూర్తిగా గౌరవించినట్లవుతుంది. ఇంత పెద్ద మౌలికమైన అంశం గురించిన ప్రస్తావన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లులో లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశం కూడా తుది చట్ట నిర్మాణంలో తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మళ్ళీ మరోరూపంలో ప్రతిపాదిత ఉప-వర్గీకరణ ప్రయత్నం న్యాయపరమైన చిక్కుల్లోకి జారిపోవచ్చు.
డా. నాగం కుమారస్వామి
ఫోన్ నెం: 8328467733
(వ్యాస కర్త నాగం కుమారస్వామి పాలమూరు విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర సహాయ ఆచార్యులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.