
ఒక నిర్దిష్ట సమయంలో సమాజంలో ఉత్పాదక శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ మధ్య సమన్వయం ఉండగా అది నిరంతరం అణగదొక్కబడింది. అంతేకాకుండా, సమాజ అభివృద్ధి ప్రక్రియ ద్వారా అస్తవ్యస్తం చేయబడుతుంది.
ఉత్పాదక శక్తులు నిరంతరం అభివృద్ధి చెండుతున్నందున, సమాజం ఉత్పత్తి చేస్తుంది. తనని తాను పాదార్థికంగానూ సామాజికంగానూ పునరుత్పత్తి చేస్తుంది. ఆవిధంగా అక్కడ ఉత్పత్తి శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ మధ్య వైరుధ్యం తలెత్తుతుంది. మరింత సామాజిక అభివృద్దితో ఈ వైరుధ్యం మరింత తీవ్రంగా మారుతుంది.
ఉత్పత్తి ప్రస్తుత సంబంధాలు – సమాజంలోని ఆస్తి సంబంధాలలో వేటినైతే(సంగ్రహంగా మాత్రమే చెప్పగలం)సంగ్రహంగా చెప్పవచ్చో– అభివృద్ది చెందుతున్న ఉత్పాదకశక్తులతో చాలా తక్కువ అనుకూలంగా మారుతాయి. ఉత్పాదక శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ మధ్య వైరుధ్య పరిణామాత్మక సంచితం ఒక నిర్దిష్ట దశలో ఒక గుణాత్మక ముందడుగుకు, ఉత్పాదక శక్తుల అభివృద్ది కొత్త దశకు మరింత సముచితమైన ఉత్పత్తి సంబంధాల కొత్త సమూహానికి దారితీస్తుంది. ఫలితంగా సామాజిక విప్లవం వస్తుంది. కొత్త ఉత్పత్తి విధానానికి శక్తుల, ఉత్పత్తి సంబంధాల కొత్త కూటమికి దారితీస్తుంది.
భూస్వామ్య, భూస్వామ్య పూర్వ లక్షణాలతో సహా సహజీవనం..
సామాజిక మార్పు గతిశీలతకు ఇది చారిత్రక భౌతికవాద దృక్పథ అత్యంత ప్రణాళికాబధ్ధమైన, సాధారణ ఖాతా. కొన్ని అర్హతలు ఒక క్రమంలో: మొదటగా ఉత్పత్తి విధాన భావన సైద్ధాంతికమైనది. అందువలన ఆ సమయంలో చెల్లుబాటు అయ్యేది అయినప్పటికీ అది ఒక సంగ్రహణ అని గుర్తించవలసిన అవసరం ఉంది. ఇది ఏదైనా చారిత్రక సమాజాన్ని, దాని తక్షణ వాస్తవికతతో సూచించడం కాదు. ఆ రూపంలో వాస్తవ సమాజం, నిర్దిష్ట వాస్తవికతను సరిగ్గా ‘సామాజిక నిర్మాణం’ అని పిలుస్తారు. అటువంటి ఏ సామాజిక నిర్మాణంలోనైనా, కొన్ని ఒక నిర్దిష్ట ఉత్పత్తి విధాన లక్షణం, వేరేవి మరొక విధమైనవి, ఇంకా అనేక సామాజిక సంబంధాల బహుళత్వం సహజీవనం చేస్తుంది. ఆవిధంగా భారతీయ సామాజిక నిర్మాణంలో పెట్టుబడిదారీ విధాన సంబంధాల లక్షణాలు, పెట్టుబడిదారీ పూర్వ సంబంధాల లక్షణాలతో భూస్వామ్య, భూస్వామ్య పూర్వ లక్షణాలతో సహా సహజీవనం చేస్తాయి.
ఉదాహరణకు, పురాతన గిరిజన సమాజాలు విడిపోయినప్పటి నుంచి కుల వ్యవస్థ భారత దేశంలో ఉంది. బారతీయ సామాజిక నిర్మాణ పరిణామం జరిగిన సుదీర్ఘ కాలంలో కుల వ్యవస్థ ఒక రూపంగా ఉన్న సామాజిక సంబంధాల సారాంశం, గణనీయంగా మారిపోయిందనే విషయాన్ని తప్పక గుర్తించాలి. సాధారణంగా, రెండు లేక అంతకంటే ఎక్కువ విభిన్న ఉత్పత్తి పద్దతుల నిర్దిష్ట కలయిక ఒక ధృఢమైన సామాజిక నిర్మాణంగా ఉత్తమంగా కనిపిస్తున్నది.
ఉత్పత్తి విధాన భావనలకూ, ‘సామాజిక నిర్మాణానికీ’ మధ్య వ్యత్యాసం కీలకమైనది. సామాజిక నిర్మాణం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఉత్పత్తి వివిధ రీతులు కలిసిన నిర్దిష్ట పద్దతి తానే ఇచ్చిన సామాజిక నిర్మాణంలోనే మారుతుంది. సామాజిక నిర్మాణం పరిశీలించబడుతున్న ఒక నిర్దిష్ట చారిత్రక సమయాన్ని సూచికగా తీసుకొని మాత్రమే నిర్ణయించగలం. సామాజిక నిర్మాణంలో వర్గపోరాటం(తరువాత వివరించబడుతుంది) స్థితిని బట్టి ఈ సమయం కీలకంగా నిర్ణయించబడుతుంది.
రెండవది చారిత్రిక భౌతికవాద ధృక్పథం, సామాజిక- చారిత్రక అభివృద్ధి లక్ష్య ఆధారాన్ని నొక్కి చెబుతున్నదనే వాస్తవం, ‘వర్ణించలేని చారిత్రక నియమాల’ కారణంగా ఒకే విధమైన చారిత్రక పరిణామం ద్వారా ప్రతి మానవ సమాజం తప్పనిసరిగా వెళ్లాలనే భావనను ధృవ పరుస్తున్నదని అస్సలు సూచించదు.
మూడవది మార్క్సిస్టు దృక్కోణం నుంచి మానవ చరిత్ర ఇంజను(మోటారు) నైరూప్యంగా(ఏకపక్షంగా) భావించిన ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యం కాదు. అందుకు బదులుగా మానవ సంస్థ ద్వారా నిర్దిష్టంగా వ్యక్తీకరించబడిన ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యం, సామాజిక వర్గాల మధ్య పోరాటం.
భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు వంటి పదాలు పరిచయం చేయబడ్డాయి. అంతేకాకుండా, కలిసి ఉన్న భావనలకు వివరణ అవసరం. మానవ సమాజ అభివృద్ధి ప్రారంభ దశలలో ప్రకృతిపై మానవుల నియంత్రణ చాలా స్వల్పం, ఉత్పాదక శక్తులు చాలా పేలవంగా అభివృద్ధి చెందాయి. ఈ దశలో, సమాజంలోని శ్రమ ఉత్పాదకత స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం శ్రమ సమయం అంతా సమాజానికి అందుబాటులో ఉన్న సామర్ధ్యం ఉన్న దాని సభ్యులందరి శ్రమను జీవనాధార స్థాయిని సాధ్యం చేయడంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
ఉత్పాదక శక్తుల మరింత అభివృద్ధితో సమాజంలోని శ్రమ ఉత్పాదకత అందుబాటులో ఉన్న కొంత శ్రమ సమయాన్ని ‘అదనంగా’ అందించేంత ఎక్కువగా ఉన్న, లేదా సమానంగా అప్పుడు ప్రబలంగా ఉన్న జీవన స్థాయిలో, సామాజిక అవసరాలకు మించి అదనపు ఉత్పత్తి ఉన్న ఒక స్థితి ఉత్పన్నమయ్యింది. అటువంటి మిగులు ఆవిర్భావం దానితో, ఇప్పుడు సమాజంలోని కొందరు ప్రజలు పని చేయవలసిన అవసరం లేని కానీ ఇతరుల శ్రమతో జీవించగల తార్కిక అవకాశాన్ని తెస్తుంది. ఈ అవకాశం ద్వారా భౌతిక(పాదార్ధిక) ఉత్పత్తి సామాజిక సంస్థలో ఒక నిర్దిష్ట స్థానాన్ని ఆక్రమించడం ద్వారా అందులోని ఒక ప్రజా సమూహం ఇతరుల శ్రమతో జీవించగల వర్గ సమాజం ఆవిర్భవిస్తుంది.
శ్రమపై జీవించే వర్గ సమాజాల ఆవిర్భావం..
సాపేక్షంగా ‘అధునాతన’ స్థాయి తెగ(దాని ఉత్పాదక శక్తుల అర్ధంలో) మరొక తక్కువ స్థాయి తెగను జయించడం ద్వారా చారిత్రక వాస్తవంగా మారే అవకాశం మొదట వచ్చినట్లు కనిపిస్తున్నది. వర్గ సమాజ ఖచ్చితమైన మూలాలు ఏమిటన్నది ఒక క్లిష్టమైన సమస్య దాని లోనికి ఇప్పుడు మనం వెళ్ళలేము. భూమి, ఇతర ఉత్పత్తి సాధనాలలో కొన్నింటిలో మొదట, క్రమంగా మొత్తం ఉత్పత్తి సాధనాలు ఉమ్మడి యాజమాన్యం నుంచి వ్యక్తిగత యాజమాన్యంలోకి వెళ్ళిన ఆస్తి సంబంధాలలోనే మార్పు ఉన్నది. వివిధ రకాల వర్గ సమాజాలు ఉద్భవించాయన్న మార్క్స్ చాలా ప్రాధాన్యమైన పద్దతిని గమనించవచ్చు.
పైన చెప్పినది కేవలం రెండు విషయాలను సూచిస్తున్నది:(i) ప్రారంభంలో పేలవమైన ఉత్పత్తి శక్తులతో, వర్గ రహిత సమాజంగా వర్గీకరించబడిన మానవ చరిత్ర కాలం ఉంది. (ii) మిగులు ఆవిర్భావంతో సామాజిక ఉత్పత్తి ప్రక్రియలో వారి నిర్దిష్ట స్థానం కారణంగా వీరిలో ఒక వర్గం ప్రజలు ఇతరుల శ్రమపై జీవించే వర్గ సమాజాలు పుట్టుకొచ్చాయి.
ఆ విధంగా, ఉత్పత్తి ప్రక్రియ సామాజిక సంస్థలో ఒక నిర్దిష్ట స్థానాన్ని(ఒక నిర్దిష్ట స్థాయి సరళత, సంగ్రహణం వద్ద) సూచిస్తున్న దానిగా ‘వర్గం’ అనే భావనను చూడవచ్చు. వర్గ సమాజం తప్పనిసరిగా అభివృద్ధి చెందిన (ప్రాథమిక స్థాయిలో, పనిచేసేవారికీ చేయనివారికీ మధ్య) సామాజిక శ్రమ విభజనతో ఉన్న సమాజాన్ని సూచిస్తుంది. పనిచేయని వర్గానికీ, ఈ వర్గం కోసం అదనపు శ్రమ చేసే వర్గానికీ మధ్య గల సంబంధాన్ని మార్క్స్ దోపిడీగా పిలిచాడు. ఆవిధంగా దోపిడీ అన్న పదానికి మార్క్సియన్ చట్రంలో చాలా నిర్దిష్ట విశ్లేషనాత్మక సారం ఉంది. కొందరు వాదించినట్లు కనిపిస్తున్న నైతికత కాదు.
చారిత్రక భౌతికవాద విస్తృత చట్రాన్ని ఉపయోగించి, పశ్చిమ యూరపు ఫలవంతమైన కాలపరిమిత చరిత్ర అభివృద్ధి చేయబడింది. సామాజిక నిర్మాణంలో వరుసగా ఆధిపత్యం వహించే ఉత్పత్తి పద్దతులు, ఆదిమ కమ్యూనిజం(అతి తక్కువ లేదా మిగులు సున్నాగా ఉన్న గిరిజన జీవిత సంస్థ/ఆదిమ సమాజం), ‘బానిస పద్దతి’(విజయ ఫలితం, బానిసల శ్రమ ఆధారంగా మారకం కోసం పరిమిత ఉత్పత్తి), ‘భూస్వామ్య పద్దతి’(ప్రారంభంలో భూస్వాములు శ్రమను, అద్దెను సేకరించిన ఆ తదనంతరం అద్దె వస్తు రూపంలో, దాని క్షీణ దశలో అద్దెను నగదు రూపంలో స్వీకరించిన దాసత్వం లేదా బానిసత్వం ఆధారంగా) ‘పెట్టుబడిదారీ పద్దతి’(ఆధునిక పరిశ్రమ ఆవిర్భావం, పారిశ్రామిక సంబంధం ఆధిపత్య సంబంధం – ఆ తరువాత ద్రవ్య-పెట్టుబడి, ‘స్వేచ్చాయుత’ వేతన కార్మికుడు, భూస్వామ్య పద్దతిలో భూమికి బందీ అయిన బానిసత్వానికి విరుద్ధంగా స్వతంత్రుడు’, మార్క్స్ చెప్పినట్లు తన స్వంత జీవనాధారం నుండి స్వతంత్రుడు, ఆవిధంగా పెట్టుబడిదారుడి కోసం పనిచేయడానికి బలవంతపెట్టబడ్డాడు.
నిర్దిష్ట సామాజిక నిర్మాణంలో ఒక ఉత్పత్తి పద్దతి ఆధిపత్యం నుంచి మరొక ఉత్పత్తి పద్దతి ఆధిపత్యంలోకి పరివర్తనలోని సంక్లిష్ట సమస్యలలోకి మనం వెళ్ళాలనుకోవడం లేదు. కానీ ఈ పరివర్తనలో కీలకమైన శక్తులు సామాజిక వర్గాల మధ్య పోరాట శక్తులు అని గురించవలసి ఉంది.
యూరపులోని భూస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీయడానికి సుదూర వాణిజ్యం, డబ్బులకూ సరకులకూ మధ్య సంబంధాలు అభివృద్ధి చెండడం ముఖ్యమైనవే అయినప్పటికీ, అతి ముఖ్యమైన అంశం భూస్వామ్య ప్రభువులకూ దాసులకూ మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడమని మోరిస్ డాబ్ ఒప్పించే విధంగా వాదించాడు.
యూరోపియన్ సామాజిక నిర్మాణాలలో భూస్వామ్య ఉత్పత్తి విధాన క్షీణత నుంచి ఆ సామాజిక నిర్మాణాలలో పెట్టుబడిదారీ పద్దతి ఆధిపత్యంలోకి పరివర్తన పురోగమనం, తిరోగమనంలు రెండూ కలిగి ఉన్న సుదీర్ఘ ప్రక్రియ. ఈ పరివర్తనలో నిర్ణయాత్మక అంశం ఉదాహరణకు బ్రిటన్ చరిత్ర చెబుతున్నట్లు అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ తరగతికీ భూస్వామ్య యుగం భూస్వామ్య కులీన పాలక వర్గానికీ మధ్య పోరాటం, అద్భుతమైన విప్లవానికి దారితీసిన 1688 ఘటనల నుంచి 1840ల చివరలో మొక్కజొన్న చట్టాలను రద్దుచేయడం వరకూ ఈ పోరాటం ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక స్థాయిలలో సాగటాన్ని ఎవరైనా చూడగలరు.
పెట్టుబడిదారీ పూర్వ భూస్వామ్య పాలకవర్గ ఆర్ధిక, రాజకీయ అధికారానికి మొక్కజొన్న చట్టాలను రద్దుచేయడం. బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుని బలపడడం తుది దెబ్బ. అప్పట్లో ఉత్పాదక శక్తుల అభివృద్ధి– సుదూర రవాణా సాధనాల అభివృద్ధి(నౌకాయనంలో పురోగమనం), యంత్రాలు, భారీ స్థాయిలో ఆధునిక పరిశ్రమలు, వాటి అనుబంధ శ్రమ విభజన, సహకార రూపాలు – బ్రిటన్లో పెట్టుబడిదారీ పద్దతి మూలం, అభివృద్ధిలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. సాంకేతిక పరిణామాలుగా అవి అలా చేయలేదు. కానీ ఉత్పాదక శక్తుల, ఉత్పత్తి సంబంధాల మధ్య తార్కిక పరస్పర చర్యల ప్రక్రియలో భాగంగా అంటే, వర్గ పోరాటంలో భాగంగా చేశాయి.
పెట్టుబదిదారీ విధాన ముందస్తు షరతులు – అమ్ముకోవడానికి తమ ‘శ్రమ శక్తి’(పనిచేసే సామర్ధ్యం) తప్ప మరేమీ లేని వ్యక్తుల వర్గం ఒక వైపునా, ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యం కలిగి ఉండి, అమ్మడానికి వస్తువులను ఉత్పత్తి చేయడానికి, వాటి నుండి లాభాలను సంపాదించడానికి ఆస్తేమీలేని కార్మికులను నియమించుకునే వ్యక్తుల వర్గం మరొక వైపునా – అవే భూస్వామ్య పాలన క్షీణతా, విచ్ఛిన్నం సమయంలో జరిగిన వర్గ పోరాట ఉత్పత్తులైన కార్మికవర్గమూ, పెట్టుబదారీ వర్గమూను.
ఈ విధంగా ఉత్పత్తి శక్తులకూ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఉన్న వైరుధ్యం, సామాజిక మార్పు ప్రాథమిక క్రియాశీలకమే అది. దేని ద్వారానైతే ఉత్పత్తి సంబంధాల పరివర్తన జరుగుతుందో ఆ వర్గాల మధ్య పోరులో వ్యక్తమౌతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాలుగవ భాగం, మూడవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.