మార్క్స్ పద్ధతి(మెథడ్)
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన గత ముప్పై సంవత్సరాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో, వలస ప్రజలచే రాజకీయ స్వాతంత్ర సాధన. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు బలోపేతం కావడం జరిగింది. ఈ క్రమంలోనే సామ్రాజ్యవాదం, భూస్వామ్య పాలన నుంచి చైనా విముక్తి అయ్యింది. అంతేకాకుండా, శక్తివంతమైన సోషలిస్టు దేశంగా ఆవిర్భవించింది.
అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ఇండో- చీనా ప్రజల గొప్ప విజయాలు; ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య సామ్రాజ్యవాదులకు ఎదురుదెబ్బలు; గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచ పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న తీవ్రమైన రాజకీయ ఆర్ధిక సంక్షోభం వంటి చాలా ప్రాముఖ్యత గల ఘటనలను చూశాయి.
సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధాన అత్యుత్తమ- చివరి దశ, దాని క్షీణత- పతన యుగం అన్న లెనినిస్టు దృక్పథానికి ఈ సంవత్సరాలు చాలా మద్దతు ఇచ్చాయి.
ఏది ఏమైనప్పటికీ సోషలిజం పురోగమనం ఏకరీతిలో లేదు. సోవియట్ యూనియన్, చైనాల మధ్య వివాదం, అనేక సోషలిస్టు ఉద్యమాలలో రివిజనిజం బలపడడం, అనేక సోషలిస్టు దేశాలలో ఆందోళన రేకెత్తిస్తున్న ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక ధోరణులు వంటి తీవ్రమైన ఎదురుదెబ్బలు ఉన్నాయి. కానీ సోషలిజం పురోగమనం- సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాల సాపేక్ష క్షీణత ప్రధాన ధోరణిగా ఉంది. ఈ విస్తృత చారిత్రక సందర్భంలో ఈ వ్యాసాల సమాహారంలో మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రాన్ని చర్చిస్తున్నాము.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంపై మార్క్స్ విశ్లేషణకు ఒక సాధారణ/సులభమైన వివరణను ఇచ్చే లక్ష్యం ఈ వ్యాసాల శ్రేణికి ఉంది. ప్రధానంగా మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రంపైకి దృష్టి మళ్ళించడంపై కేంద్రీకరించడం జరిగింది.
ప్రత్యేకించి సామ్రాజ్యవాద యుగంలో చాలా ముఖ్యమైన సైద్ధాంతిక, రాజకీయ పరిధి(will not be dealt with except in passing reference.) దాటవేత ధోరణిలో ప్రస్తావనలలో తప్ప వివరించడం ఉండదు. ఎందుకంటే సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా, చర్చ కొంతవరకు క్రోడీకరించే ధోరణిలో ఉంటుంది. సహజంగా, ఒక నిర్దిష్ట చారిత్రక పరిస్థితికి సైద్ధాంతిక భావనలను, వాదనలను వర్తింపజేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మార్క్సిజంపై కనీసం పైపై చర్చ కూడా లేకుండా విశ్లేషణను కొనసాగించవచ్చునని సూచించడం లేదు. చారిత్రక భౌతికవాదంపైనా, రాజకీయ అర్ధశాస్త్రంలో మార్క్స్ పద్ధతిపైనా కనీసం ఒక ప్రాథమిక ప్రకటన అవసరం.
మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం- చారిత్రక భౌతిక వాదం..
సామాజిక, చారిత్రక అభివృద్ధిని ప్రకృతితో మానవుల సంబంధాల పరంగానూ- మానవుల మధ్య గల సహజ సంబంధాల పరంగానూ చారిత్రక భౌతికవాదం చూస్తుంది. ప్రాథమిక సిద్ధాంతం ఏమిటంటే మానవుని ప్రాథమిక కార్యాచరణ ఉత్పత్తి.
మార్క్స్- ఎంగెల్స్‌లను ఉదహరిస్తే, ‘వారి జీవనోపాదిని వారు ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతోనే జంతువుల నుంచి తమను తాము వేరుచేసుకోవడం మానవులు ప్రారంభించారు.’ ఆవిధంగా మానవ సమాజంలోని సభ్యులు తమనితాము పునరుత్పత్తి చేసుకోవడానికి కావలసిన పదార్ధాల ఉత్పాదక కార్యకలాపాలలో తప్పనిసరిగా పాల్గొన్నారు.
ఉత్పత్తి చర్యలో ప్రకృతిని మనం స్వంతం చేసుకుంటాము. ఆవిధంగా రూపాంతరం చేస్తాము, మారుస్తాం. అంతే ముఖ్యమైనది, భౌతిక ఉత్పత్తి ప్రక్రియ ద్వారా మనల్ని మార్చుకుంటాము. చాలా ముఖ్యంగా మనం నేర్చుకుంటాము. ఉత్పాదక కార్యాచరణ ద్వారా పర్యావరణంపై కొంత నియంత్రణను పొందుతాము. భౌతిక అభ్యాసం ద్వారా మానవుల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మార్క్స్- ఎంగెల్స్‌లు దీనిని ఏ విధంగా చెప్పారంటే, “అన్నిటికన్నా ముందు తినడం, తాగడం, నివాసం, బట్టలు ఇంకా ఎన్నిటినో జీవితం చేర్చుతుంది. ఆవిధంగా ఈ అవసరాలను తీర్చడానికి సాధనాలను, భౌతిక జీవిత ఉత్పత్తినే, ఉత్పత్తి చేయడం మొదటి చారిత్రక చర్య” అన్నారు.
ఇంకా, ‘వ్యక్తులు తమ జీవితాన్ని వ్యక్తీకరించినట్లు వారుంటారు. అందుచేత వారి ఉత్పత్తితో, వారు ఏమి ఉత్పత్తి చేశారు, ఎలా ఉత్పత్తి చేశారన్న రెండింటితో వారేమిటో, సరిపోతుంది. ఆ విధంగా వ్యక్తుల స్వభావం వారి ఉత్పత్తిని నిర్ధారించే భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.’
అలాగే, ‘వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా వ్యక్తపరుస్తారో, అలాగే ఉంటారు. కాబట్టి వారు ఏమిటో, వారి ఉత్పత్తితో, వారు ఏమి ఉత్పత్తి చేస్తారో, ఎలా ఉత్పత్తి చేస్తారో లాత్(lathe) రెండింటితోనూ సమానంగా ఉంటుంది. అందువల్ల వ్యక్తుల స్వభావం వారి ఉత్పత్తిని నిర్ణయించే భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.’
అయితే ఉత్పత్తి ఒక వ్యక్తిచే ఒంటరిగా నిర్వహించబడదు. ఇది సమాజంలో, సమాజం ద్వారా జరుగుతుంది. అంటే, ఉత్పత్తి తప్పనిసరిగా సామాజిక ఉత్పత్తి. ఆ విధంగా సమాజంలో ఉత్పత్తిని ‘ద్వంద్వ సంబంధంగా చూడాలి: ఒక వైపున సహజ సంబంధంగా, మరొకవైపున సామాజిక సంబంధంగా.’
ఉత్పత్తి చాలా మంది వ్యక్తుల సహకారంతో సామాజికమైనందున, అటువంటి సామాజిక ఉత్పత్తి సమాజంలోని సభ్యుల మధ్య ఎల్లప్పుడూ సామాజిక సంబంధాలను కలిగి ఉంటుంది. సమాజ ఉత్పత్తి, పునరుత్పత్తి ప్రక్రియలో ప్రజలు ఒకరితో ఒకరు నిర్దిష్ట సామాజిక సంబంధాలలోకి ప్రవేశిస్తారు.
మానవ సమాజ అధ్యయనంలో, ఎవరైనా రెండు అంశాలను పరిశీలించాలి. మొదట, భౌతిక జేవిత ఉత్పత్తి పద్దతులు. ఇవి గత- ప్రస్తుత భౌతిక సాధన ఫలితాలు, సైద్ధాంతిక- ఆచరణాత్మక సంపూర్ణ జ్ఞానం. అంతేకాకుండా, నిర్దిష్ట సామాజిక రూపాల ద్వారా వ్యక్తీకరించబడిన మన సహజ వాతావరణంపై/ పర్యావరణంపై గత- ప్రస్తుత నియంత్రణ.
రెండవది, సామాజిక ఉత్పత్తిలో వారు పాల్గొనే సమయంలో, సమాజంలోని సభ్యులు ప్రవేశించే నిర్దిష్ట సామాజిక సంబంధాలు. పూర్వ ‘ఉత్పాదక శక్తుల’ సంపూర్ణతను, తరువాతి ‘ఉత్పత్తి సంబంధాలను’ గురించి మార్క్స్ చెప్పాడు. సాధ్యమైన అపార్ధాన్ని నివారించడానికి ‘ఉత్పాదక శక్తుల’ భావన అదే కాదు లేదా ‘సాంకేతికత’ అనే భావనకు కుదించగలది కాదని నొక్కి చెప్పడం అవసరం. మార్క్స్ చెప్పినట్లు, ‘ఒక పారిశ్రామిక దశ ఎల్లప్పుడూ సహకారం లేదా సామాజిక దశ నిర్దిష్ట పద్దతితో కలిసి ఉంది. అంతేకాకుండా, ఈ సహకార పద్దతి తానే ఒక ఉత్పాదక శక్తి’.
భౌతిక/ పదార్ధిక ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న మానవులు ఆచరణ నుంచి నేర్చుకుంటారు. పరివర్తన చెందుతారు. సమాజం కొత్త ఉత్పాదక శక్తులను పొందుతుంది. ఏ నిర్దిష్ట సమయంలోనైనా, సమాజంలోని ఉత్పాదక శక్తుల అభివృద్ధి ఒక నిర్దిష్ట స్థితి ఉంటుంది. ఇది క్రమంగా సామాజిక సహకారం, శ్రమ విభజన, సమాజంలోని సభ్యుల మధ్య సామాజిక సంబంధాలు వంటి నిర్దిష్ట రూపాలను సూచిస్తుంది.
ఒక నిర్దిష్ట ‘ఉత్పాదక శక్తుల’ అభివృద్ధి స్థితికి అనుగుణంగా అక్కడ సామాజిక సంబంధాలని కూడా పిలువబడుతున్న ఉత్పత్తి సంబంధాల సమూహం ఉంటుంది. ఆ విధంగా భూస్వామ్య యూరపులో భౌతిక/ పాదార్ధిక ఉత్పత్తిలో భూమి- వ్యవసాయం పాత్ర, ఉత్పత్తి సంబంధాల ప్రముఖ పాత్రకు అనుగుణంగా, భూస్వామ్య ప్రభువుకీ, దాసునికీ మధ్య భూసంబంధం ఆధారంగా కూడా ఉంటుంది.
పెట్టుబడిదారీ ఆధునిక పరిశ్రమలో, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల ప్రముఖ పాత్రకు అనుగుణంగా వేతన కార్మికునికీ, పెట్టుబదిదారుడికీ మధ్య సంబంధాలు ఉంటాయి. అయితే ఇవి ఉదాహరణలు మాత్రమే, ఉత్పత్తి శక్తులకూ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఏదైనా సాధారణ లేదా యాంత్రిక ప్రత్యక్ష(ఎదురు బొదురు) సమన్వయాన్ని సూచించడానికి కాదు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం, రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
