
ప్రస్తుతం యావత్ ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమం వెనుక పట్టుపట్టి ఒడిదుడుకులతో నడుస్తోంది. అదే సమయంలో పచ్చి మితవాద శక్తులు యావత్ ప్రపంచాన్ని పెను భూతంలా ఆవరిస్తున్నాయి. భారత దేశంలో కూడా పచ్చి మితవాద శక్తులు పాలన పగ్గాలు చేపట్టి ఫాసిజం దిశగా ప్రయాణం సాగిస్తున్నాయి.
భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు నాట, కమ్యూనిస్టు ఉద్యమం చిన్నాభిన్నమై చుక్కాని లేని నావలా సాగుతోంది. కమ్యూనిస్టు శ్రేణుల్లో సైద్ధాంతిక అధ్యయనం కొరవడింది. ఉద్యమం దాదాపు సామాజిక మాధ్యమానికే పరిమితమౌతుంది.
గత చరిత్రకు సంబంధించిన పత్రాలను సామాజిక మాధ్యమంలో చిన్నచిన్న భాగాలుగా అందిస్తే అయినా కమ్యూనిస్టు శ్రేణులు అధ్యయనం చేస్తారేమో, ఆ చారిత్రక అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకుని గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ఐక్యమై, మితవాద పాలకవర్గాలను ప్రతిఘటిస్తాయనే చిరు ఆశతో, నవ శకం ప్రచురణలు తరఫున చారిత్రక పాత్రలను అందించటంలో భాగంగా, వెంకటేష్ ఆత్రేయ రచించిన మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయ పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.
పుస్తకం ముందు మాట..
ఈ సంవత్సరంతో(2012) సోషల్ సైంటిస్ట్ ప్రచురణ సంస్థ నలభై సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్భంగా పత్రిక గత ప్రతుల నుంచి నిర్దిష్ట ఇతివృత్తాలను కలిగిన వ్యాసాలను అనేక సంపుటాలుగా తీసుకురావడానికి యోచిస్తున్నాము. ప్రస్తుత సంపుటి ఈ శ్రేణిలో ఒక భాగం. ఇందులో ఆచార్యులు వెంకటేష్ ఆత్రేయ ఏవీ బాలు(అతని అసలు పేరుకి సంక్షిప్త రూపం) అనే మారుపేరుతో, పాఠకులకు మార్క్సిస్టు రాజకీయ ఆర్ధిక వ్యవస్థ ప్రాథమిక పరిచయాన్ని కలుగజేయడానికి రాసిన వ్యాసాల సమూహం ఉన్నది. ఈ వ్యాసాలూ ప్రధానంగా పెట్టుబడిదారీ విధాన అంగ(శరీర ) నిర్మాణానికి కీలకమైన అదనపు విలువ మూలంపై దృష్టి పెట్టిన ‘పెట్టుబడి’ మొదటి సంపుటికి సంబంధించినవి.
ఈ వ్యాసాలు అవి ప్రచురించిన సమయంలో విస్తృత దృష్టిని ఆకర్షించాయి. దేశమంతటా మార్క్సిస్టు అధ్యయన వర్గాలలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. అనుభవజ్ఞుడైన, మార్క్సిస్టు అర్ధశాస్త్రంలోనే కాక పెట్టుబడిదారీ అర్ధశాస్త్రంలో కూడా ఎల్లలెరుగని పరిశోధనలు చేసిన, గణిత- గణాంక పద్దతులపై అరుదైన పాండిత్యం గల, అసాధారణ అర్ధశాస్త్రవేత్త వాటిని రాశాడనేది వాస్తవం.
సాధారణ మార్క్సిస్టు పాఠ్యపుస్తకాల నుంచి వీటిని శ్రేష్టమైన వాటిగా వేరు చేసింది. అందుచేత అవి ప్రామాణిక పాఠ్యపుస్తకాలలో తరచూ లోపిస్తున్న స్పర్శ నిశ్చయత, శైలితో రాయబడినాయి. వాటిని తిరిగి ప్రచురించాలనే మా నిర్ణయానికి, ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నేపథ్యంలో వచ్చిన మార్క్సిస్టు అర్ధశాస్త్రంపై ప్రపంచ వ్యాపిత ఆసక్తి పునరుద్ధరణతో, చాలా తక్కువ సంబంధం ఉంది. ఈ పునరుజ్జీవనంతో మేము సంతోషంగా ఉన్నాము.
అయిన్నప్పటికీ, అటువంటి పునరుజ్జీవనం లేక పోయినా మేము ఈ వ్యాసాలను తిరిగి ప్రచురించి ఉండేవాళ్ళం. ఇది దేనివలన అంటే, పెట్టుబడి మొదటి సంపుటిలోని మార్క్సిస్టు విశ్లేషణ సారాన్ని నిజమని మేము నమ్ముతున్నాము. దీనిని అనేక విధాల అభివృద్ధి చేయవలసి ఉంది. అనేక దిశలలో విస్తరించవలసి ఉంది. మన కాలంలో సరిపోయే విధంగా తాజాపరచవలసి ఉందనడంలో సందేహం లేదు. కానీ మార్క్సిస్టు విశ్లేషణ సారాన్ని అర్ధంచేసుకున్నప్పుడు మాత్రమే ఈ సవరణలన్నీ సాధ్యమౌతాయి. ఈ ప్రస్తుత సంపుటి ఆ సారానికి సులభ పరిచయం.(డిసెంబరు 2012, ప్రభాత్ పట్నాయక్)
ఉపోద్ఘాతము..
ఈ పుస్తకం సరళంగానే ఉన్నప్పటికీ, కఠినమైన వ్యాఖ్యానాన్ని కారల్ మార్క్స్ చిరస్మరణీయమైన రచన(దాస్ కేపిటల్)పెట్టుబడి మొదటి సంపుటిని అందిస్తుంది. అంతేకాకుండా, మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రానికి ప్రారంభ పరిచయాన్ని ఇస్తుంది.
ఈ పుస్తకంలోని విషయం 13 వ్యాసాల శ్రేణిలో ‘మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం’ అనే పేరుతొ రాయబడింది. సోషల్ సైంటిస్ట్ పత్రికలో 1976- 1978 సంవత్సరాలలో ప్రచురించడం జరిగింది.
మొదటి వ్యాసాన్ని పత్రికలో 46వ సంఖ్య గల ప్రతిలో ప్రచురించగా, చివరి వ్యాసం 65వ సంఖ్య గల ప్రతిలో ప్రచురించారు. ఈ వ్యాసాలూ ప్రచురించినప్పటి నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన దూరదృష్టితో కూడిన నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఏమైనప్పటికీ ఈ వ్యాసాలను వాటిని మొదట ప్రచురించినప్పుడు ఎలా ఉన్నాయో, అలాగే ఈ పుస్తకంలో ఇవ్వబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం, మొదట- చివరా ప్రస్తావించడం తప్ప, ఈ వ్యాసాలు అవి రాసి, ప్రచురించినప్పుడు ఉనికిలో ఉన్న వర్తమానకాల పెట్టుబడిదారీ వ్యవస్థ అధ్యయనంలో భాగంగా రాయక పోవడమే. అందుకు బదులుగా ఈ వ్యాసాల శ్రేణిలోని విషయం ఆసక్తి గల పాఠకుని ప్రత్యేకించి విశ్లేషనాత్మక ఆలోచనపై మొగ్గు చూపే, అలాగే ప్రగతిశీల ఆలోచనలు గల విద్యార్ధులను చేరుకోవాలనే ఉద్దేశంతో చేసిన పెట్టుబడి మొదటి సంపుటిలో నివేదించిన మార్క్స్ ఆలోచనలపై వ్యాఖ్యానం.
ఈ కారణాల వలన అసలు వ్యాసాల విస్తృతమైన పునర్విమర్శ చేసే ప్రయత్నం చేయనప్పటికీ, ఏవిధంగా ఈ వ్యాసాలూ ఎలా ఆరంభమయ్యాయో వివరిస్తూ, ఇవి రాసినప్పటి సందర్భంలో మార్పులపై ఒక మాటతో ఒక పరిచయం చేస్తే సరిగ్గా ఉంటుందనే భావించడం జరిగింది.
ఈ పుస్తకంలోని విషయాలకు రూపమిచ్చిన వ్యాసాలను సోషల్ సైంటిస్ట్ కొరకు, అప్పుడు ఆ పత్రికకు సంపాదకుడుగా ఉన్న జాకోబ్ ఎపన్ కోరికపై రాయడం జరిగింది. అర్ధశాస్త్రంలో(నా డాక్టోరల్ అధ్యయనాలు)పట్టా తీసుకున్న తరువాత పరిశోధనలు పూర్తి అయినాక తిరువనంతపురంలోని(సెంటర్ ఫర్ డెవలప్మెంటల్ స్టడీస్‌లో విజిటింగ్ ఫెలోగా) అభివృద్ధి అధ్యయనాల కేంద్రంలో సందర్శక ఆచార్యునిగా 1976 జనవరిలో చేరాను. దేశం అత్యవసర పాలనలో ఉంది, పౌర స్వేచ్ఛను తీవ్రంగా రద్దు చేయడంతో, మేధో కార్యకలాపాలు కూడా నిఘాలో ఉన్నాయి.
ఇటువంటి సమయంలో రాజకీయ అర్ధశాస్త్రంపై మార్క్స్ విధానాన్ని సరళమైన, సులభంగా అందుబాటులో ఉండే విధంగా వివరిస్తూ సోషల్ సైంటిస్ట్ పాఠకుల కొరకు వ్యాసాల శ్రేణిని రాయమని ఎపన్ నన్ను అభ్యర్ధించాడు. నా అధికారిక నామాన్ని వాడవద్దని ఇచ్చిన సలహా మేరకు అత్యవసర పాలనలో అధికారుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనూహ్యమైనది. అంతేకాకుండా ఎప్పుడూ నిరపాయకరమైనదిగా ఉండకపోయే స్థితి కావడంతో అతని సూచనపై ఏవీ బాలు అనే మారుపేరును ఉపయోగించి నేను వ్యాసాలూ రాశాను.
1970ల మధ్య కాలం అట్టుడుకుతున్న కాలం. దాదాపు మూడు దశాబ్దాల నిరంతరాయమైన, అపూర్వమైన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) దాదాపు 5 శాతం వార్షిక పెరుగుదలను రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మొత్తం ఆధునిక పెట్టుబడిదారీ ప్రపంచమంతటా మొదటి సమకాలీకరించబడిన మాంద్యం 1974-75లలో ఆవహించింది. దీర్ఘకాల అంతులేని అభివృద్ధి బద్దలౌతున్నదని సర్ జాన్ హిక్స్ చెప్పినది ఇప్పటికే స్పష్టమౌతున్నది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఓపీఈసీ) అమలులోకి తెచ్చిన క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రమైన పెరుగుదల, కొందరు వ్యాఖ్యాతలు పెట్టుబడిదారీ స్వర్ణ యుగమని పిలిచిన కాలం చివరలో పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ మాంద్యాన్ని వేగవంతం చేసింది. ఇంకా ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్భణ వత్తిళ్లను మరింత పెంచడానికి కూడా దోహదపడింది.
అప్పుడు ఉద్భవిస్తున్న పెట్టుబడిదారీ సంక్షోభంలోని మరొక ముఖ్యమైన అంశం ‘స్టాగ్ప్లేషన్’– స్తబ్ధత, ద్రవ్యోల్భణం ఏకకాలంలో సంభవించడం– కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నది. అది దారిలోకి తేలేనిదని అంతేకాకుండా, ‘కీన్సియన్ డిమాండు నిర్వహణ పద్దతులతో’ సులభంగా పరిష్కరించలేనిదని ఎక్కువగా రుజువు అవుతోంది.
ఆంగ్లో- సాక్సన్ విద్యారంగంలో కీన్సియన్ అర్ధశాస్త్ర పట్టును ఈ పరిస్థితి నిర్ణీత సమయంలో బలహీనపరుస్తుంది. మొదటగా ద్రవ్యవాదం(పూర్తిగా అనర్హమైనది), ఆ తరువాత పూర్తిగా చెప్పిందే మరలా చెప్పే(టాటోలాజికల్)‘హేతుబద్ధమైన అంచనాల’ సిద్ధాంతం, దాని సామాగ్రితో సహా, ‘నూతన శాస్త్రీయ అర్ధశాస్త్రం’ అని పిలవబడి ప్రజాదరణ పొందడానికి దారితీస్తుంది. కానీ ఈ పుస్తకంలోని వ్యాసాలు వ్రాసిన సమయంలో ఇది ఇంకా జరగలేదు.
1974-75ల నాటి మాంద్యం ప్రపంచ పెట్టుబదిదారీ ఆర్ధిక వ్యవస్థ సాపేక్షంగా నెమ్మదిగా పెరిగే కాల ప్రారంభాన్ని సూచించగా, ఆ తరువాత చాలా ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. 1945 తరువాత 30 సంవత్సరాల పైబడిన కాలంలో పెట్టుబడిదారీ అభివృద్ధి, అపారమైన ద్రవ్య నిల్వలకు, బహుళజాతి సంస్థల చేతిలోకి భారీ లాభాలు చేరడానికి దారితీసింది.
అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ ప్రపంచ కార్మికులు వారి పదవీ విరమణ అనంతర పొదుపు మొత్తాలను ఆర్ధికవ్యవస్థలోకి తెచ్చారు. పెట్రోలియం ఎగుమతి దేశాల పాలక వర్గాలు, చమురు ధరల పెరుగుదలతో లాభం పొందిన చమురు ప్రముఖులు కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించారు. పెట్టుబడిదారీ ప్రపంచం 1970ల చివరినాటికి ద్రవ్య నిల్వలతో కొట్టుకుపోయింది.
అంతేకాక, 1971లో ఏకపక్షంగా బంగారం- డాలరు మారకాన్ని వదిలివేయడానికి అమెరికా తీసుకున్న నిర్ణయం ఫలితంగా బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం విచ్ఛిన్నమైంది. దీంతో జాతీయ కరెన్సీల స్థిర మార్కెట్ రేట్ల వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీసింది. అంతేకాకుండా, కరెన్సీ మార్కెట్లలో ఊహాజనిత కార్యకలాపాలకు అదనపు అవకాశాన్ని అందించింది. ఇంతలో సమాచార, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యమైన పురోగతులు సంభవించాయి. ప్రపంచ ఆర్ధిక మార్కెట్ల ప్రపంచ అనుసంధానాన్ని ఇవి సాధ్యం చేశాయి. దీని ఫలితం, సారూప్యత కలది కానీ ఇంకా సామ్రాజ్యవాదం అన్న తన రచనలో లెనిన్ వివరించిన ద్రవ్య పెట్టుబడి అన్న లెనిన్ భావనకు భిన్నమైనది. అయినా, కొత్త రకం అంతర్జాతీయ ద్తవ్య పెట్టుబడి(మూలధనం) పెరుగుదల.
లెనిన్ కాలంలో, ద్రవ్య పెట్టుబడి ప్రాతినిధ్యం వహించిన బ్యాంకింగ్- మూలధన కలయిక జాతీయ సరిహద్దుల ద్వారా తీవ్రంగా విభజించబడింది. దీంతో ఎవరైనా జర్మను, లేదా ఫ్రెంచ్ లేదా బ్రిటిష్ వగైరాల ద్రవ్య పెట్టుబడిని గురించి మాట్లాడారు.
1970ల చివరలోనూ 1980ల ప్రారంభంలోనూ ద్రవ్య పెట్టుబడి పెరుగుదలకు తోడుగా ఎల్లలు(సరిహద్దులు) దాటే ద్రవ్యపెట్టుబడి కదలికలకు అడ్డుగా ఉన్న జాతీయ అడ్డంకులపై నిర్ణీత దాడి జరిగింది. కొనసాగుతున్న సరళీకరణ,(ఆర్ధిక) ద్రవ్య ఆస్తుల కోసం మార్కెట్ల ఏకీకరణతో వివిధ దేశాల సంపన్నులు భారీ(ఆర్ధిక) ద్రవ్య, పారిశ్రామిక సంస్థల సహా యజమానులు అన్నది కూడా మరొక విషయం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.