Reading Time: < 1 minute
ప్రగతిశీల భావాల ప్రవాహం, ప్రపంచవ్యాప్తంగావెల్లువెత్తుతుంది.!
మరో ప్రపంచపు వెలుగులు చూసి,
సామాజిక రంగం పైకొచ్చాను.
నా చుట్టూ ఉన్న ప్రపంచంలో,
తాత గారి బామ్మ గారి భావాలను ఎదిరించా.!
ముందు యుగం దూతగా నిలబడ్డా.!
ప్రగతి శీల భావాల జెండా సగర్వంగా ఎగురవేశా.!
నాలుగు దశాబ్దాల జీవన సమరం,
నచ్చేది ఎవరు.? మెచ్చేది ఎవరు.?.
నమ్మిన ఆదర్శాలెన్నో తలకిందులైనా,
నా ఆశయం చెదరలేదు, బెదరలేదు.!
కాలం చెల్లిన భావాలు మళ్లీ కోరలు చాస్తున్నాయి.,
అడుగడుగునా రాజీ,..రాజీ…,
అయినా నేను ప్రగతిశీలభావాలకే కట్టుబడే ఉన్నా.!
మూఢ విశ్వాసాల వెల్లువ ముంచ్చెత్తుతున్నా.,
ఉనికిని కోసం, నన్ను నేను విడగొట్టుకున్నా.!
అభ్యుదయ ప్రగతిశీల భావాల జండాను ఎగరవేస్తూనే ఉన్నా.!
ఒంటరినైనా, తుంటరినైనా,
నేను నిరాశ చెందలేదు.! జండా మార్చలేదు.!!
కానీ నేను చిన్న బోయాను.!!!