
కొన్ని కీలక సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ పరిగణలోకి తీసుకోకుండా తొక్కిపెట్టడానికి గల బలమైన కారణాలపై స్పష్టత లేదు.
కోర్టు తన అధికారాలను ఉపయోగించి ఈ సాక్షులను ఎందుకు విచారించలేదన్న దానిపై కూడ స్పష్టత లేదు.
ముంబాయి: మాలేగావ్ ఉగ్రవాద పేలుళ్ల ఘటన- 2008పై 2018లో విచారణ మొదలైంది. ఈ ఏడేళ్ల కాలంలో ప్రాసిక్యూషన్ 323 మంది సాక్షులను విచారించింది.
విచారణ సందర్బంగా అనేక మంది సాక్షుల నుంచి వారి వాదనలను వినకుండానే వారందరినీ కేసు నుంచి ఎందుకు తొలగించేశారు? ఈ ఘటన వెనక గల కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులను నిర్దారించడానికి ఈ సాక్షులు ఎంతో కీలకమైన వారని ప్రత్యేక జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఎ)భావించింది.
విచారణ నుంచి ఈ కీలక సాక్షులను తొలగించాలనే నిర్ణయం వల్ల, ప్రాసిక్యూషన్‌పై వ్యతిరేక ప్రభావం ఏర్పడగలదని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లాహోటీ అన్నారు.
ఈ కేసుపై 1036 పేజీల తీర్పును ఆగస్టు 1న అందుబాటులోకి తెచ్చారు.
అదే రోజు బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు ప్రగ్యా సింగ్ ఠాకూర్, విధుల్లో ఉన్న ఆర్మీ అధికారి ప్రసాద్ పురోహిత్‌తో సహా మొత్తం ఏడు మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
ప్రాసిక్యూషన్ తగినన్ని సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైందని, ఈ కారణంగానే ఇలాంటి తీర్పు ఇవ్వడానికి దోహద పడిందని కోర్టు అభిప్రాయపడింది.
అంతే కాకుండా తీవ్రమైన అనుమానం వల్ల కూడా కోర్టు నిందితులను శిక్షించలేకపోయిందని, కేవలం అనుమానం మాత్రమే సరిపోదని కోర్టు వ్యాఖ్యానించింది.
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కేసు ప్రకారం, 2006లో లభినవ్ భారత్ అనే సంస్థను పురోహిత్ స్ధాపించి సొంత జెండా, రాజ్యాంగంతో హిందూ రాష్ట్రం ఏర్పాటుకు ప్రయత్నించారని, అంతేకాకండా ఇజ్రాయిల్ లేదా థాయిలాండ్ నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి సన్నాహాలు చేశారని ఆరోపించబడింది.
ఈ ఎజెండాలో భాగంగానే ఆరోపించబడిన వ్యక్తులందరు ఒక్కదగ్గర చేరి మాలేగావ్ ఉగ్ర పేలుళ్లకు పాల్పడ్డారు.
దీనికంటే ముందు, ఈ కేసు దర్యాప్తు బాధ్యత నుంచి 2015లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాల్యాన్ నాటకీయ పరిణామాల మధ్య తప్పుకున్నారు.
కేసులో పేర్కొన్న నిందితుల పట్ల కొంత ఉదాసీనత చూపాలని తనకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సాల్యాన్ తెలియజేశారు.
సాల్యాన్ తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రాసల్ దర్యాప్తు బాధ్యతను చేపట్టారు. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన ఈ కేసు ముగింపు వరకు రాసల్ భాగస్వాములైయ్యారు.
పేళ్లులు సంభవించడానికి ముందు సహాయం చేసిన కొందమంది సాక్షులను తొలిగించారు.
రాంచంద్ర, సందీప్‌డాంగే..
ఎలాంటి వివరణ కోరకుండా ఈ కేసు నుంచి కొంత మంది సాక్షులను తప్పించాలని ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది.
దీంతో సాక్షుల్లోంచి ఒక వ్యక్తి టిక్కెట్ల బుక్కింగ్ కోసం తన ఫోన్ నెంబరు, యూజర్ ఐడీని ఉపయోగించేవారు.
ఏటిఎస్ కేసు ప్రకారం, తర్వాత ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు బాధ్యతను చేపట్టి 2016లో చార్జిషీట్ దాఖలు చేసింది.
విలోక్ శర్మ అనే ఒక సాక్షి, పరారిలో మరో ఇద్దరు నిందితులు రాంచంద్రా కాల్సాంగ్రా, సందీప్ డాంగేలు పూణె నుంచి ఇండోర్ వరకు రైలు ద్వార ప్రయాణించడానికి కావల్సిన టిక్కెట్లను శర్మ తన అకౌంట్ నుంచి బుక్ చేసేవాడు.
ఏటీఎస్, ఎన్ఐఏ ప్రకారం ఈ ఇద్దరు నిందితులు బాంబులను అమర్చేవారు.
మరో వ్యక్తి ప్రవీణ్ తక్కాల్కి అలియాస్ ప్రవీణ్ ముత్తలిక్ తొలుత పరారిలో ఉన్నఇద్దరు నిందితులతో కలిసి బాంబు పేళ్లులలో పాల్గొన్నారనే అరోపణలు ఎదుర్కొన్నారు.
కానీ అందుకు కావల్సిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎన్ఐఏ అతన్ని కేసు నుంచి 2017లో విముక్తి చేసింది.
అయితే ఈ తీర్పు విలోక్ శర్మ విషయంలో ఎన్ఐఏ ద్రష్టి కోణానికి భిన్నంగా ఉంది.
ఎన్ఐఏ కేసు ప్రకారం, రాంచంద్ర కాల్సాంగ్రా సందీప్ డాంగే అస్సలు పేర్లపై కాకుండా, వారి నకిలీ పేర్లు బల్వంత్ పాఠక్, మాన్సింగ్ అనే పేర్లపై శర్మ వారికి పూణె నుంచి ఇండోర్ టికెట్లను బుక్ చేశారు.
ఈ ఇద్దరు నిందితులు పూణెలో పురోహిత్ నుంచి ఆర్డీఎక్స్ పేలుడు సామగ్రిని సేకరించి, ఇండోర్ వెళ్లారు.
అక్కడ అప్పటికే పరారిలో ఉన్న నింధితుడు ఈ పేలుడు సామగ్రిని ఒక దగ్గరకు చేర్చి, దాన్ని ఎల్ఎంఎల్ ఫ్రీడం మోటారు సైకిల్లో ఉంచడం దర్యాప్తులో కీలకంగా మారింది.
ఈ కేసుకు సంభందించి నిందితుల విషయంలో వాస్తవాలు అనేక అనుమానాలకు అవకాశం కల్పిస్తుందని కోర్టు పేర్కొంది. “నిందితులను దోషులుగా తేల్చడానికి కేవలం అనుమానం మాత్రమే సరిపోదు, ఈ అనుమానం నిగ్గు తేల్చాల్సింది చివరికి కోర్టేనని, ఆ తర్వాత ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు వ్యక్తులను నిర్దోషులుగా చూడాలి.
పరారిలో ఉన్న నిందితులు పూణె నుంచి ఇందోర్ ప్రయాణాన్ని కూడా నిర్దారించాలి.
అలాగే ప్రస్తుతం నిర్దోషిగా ఉన్న ఆర్మీ అధికారి పురోహిత్‌తో వారికి ఉన్న సంబంధాలను తేలిగ్గా తీసుకోరాదు” అని తెలియజేసింది.
నిందితులకు టికెట్లు, బుకింగ్, ప్రయాణం చరిత్ర విషయంలో విలోక్ శర్మ సాక్షి అయినప్పటికీ కోర్టు విలోక్ శర్మను విచారించలేదు.
ఈ కేసు నుంచి తనను తప్పించిందని సాక్షి చెప్పారు.
కావున ఈ దశలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున తన అకౌంటు నుంచే ఇద్దరు నకిలీ వ్యక్తులు, అలాగే ఇద్దరు ప్రధాన నిందితులు(ఏఏ1) కాల్సాంగ్రా (ఏఏ2), డాంగే పేర్లపై టిక్కెట్లు బుక్ చేశాడని చెప్పలేము.
ఇది కేవలం శర్మ ప్రకటన కాదు. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ 65 బీ ప్రకారం, ఎసన్ష్యల్ సర్టిఫికెట్టు సేకరించి కోర్టుకు సమర్పించలేదు. ఈ సర్టిఫికెట్ లేదంటే ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాన్ని అనుమతించరు.
ఆర్‌డియక్స్‌ను సేకరించారని అరోపించబడిన పురోహిత్ ఆగస్టు 8 నుంచి 11 వరకు పూణెలోనే ఉన్న సమయంలో కాల్సాంగ్రా,డాంగే అక్కడే ఉన్నారు.
కుట్ర వివరాలు పేలుడు పదార్థాల సేకరణ వంటి వివరాలను ఒక్కొక్కటిగా సేకరించి సాక్ష్యాధారాలను రూపొందించాలి. ఎన్ఐఏ ప్రకారం ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని త్రోసిపుచ్చింది.
సాక్షుల విచారణ పేర్ల జాబితాలో శర్మ సాక్షిగా ఉన్నారు. అయినప్పటికీ అయన పేరును ఆ జబితా నుంచి తొలగించారు.
ఈ చర్యకు పాల్పడింది ప్రత్యేకంగా ఒక సీనియర్ రైల్వే అధికారి మరొక ఎటియస్ అధికారని తీర్పు చెపుతుంది.
నిందితులకు టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో విలోక్ శర్మ ఒక్కరే సాక్షి, అయినా అతని వద్ద ఉన్న మెటీరియల్ సాక్ష్యాన్ని ప్రాసిక్యూషన్ విచారించలేదు.
ఎలాంటి కారణాలు లేకుండా మెటీరియల్ సాక్ష్యాన్ని విచారించక పోవడంతో ప్రాసిక్యూషన్ జోక్యంపై అనేక అనుమానాలకు తావిస్తుంది.
దర్యాప్తు సంస్థ చెప్పిన దాని ప్రకారం, మరో సాక్షి ప్రమోద్ దేశ్‌ముఖ్ ఆగస్టు 8 నుంచి 11 మధ్య పూణేలోనే కాల్సాంగ్రా,డాంగేలను చూసినట్లు సాక్ష్యం చెప్పారు. కానీ దేశ్‌ముఖ్‌ను సాక్ష్యం నుంచి తొలగించారు.
జడ్జి లాహోటి రాసిన దాని ప్రకారం, డెటనేటర్ పేలకుండా చేసిన పోలీసు అధికారి కూడా కీలక సాక్షాదారుడేనని కోర్టు నొక్కి చెప్పిందని అయినప్పటికి సాక్షిగా అయనను విచారించలేదు.
కేసు ప్రాసిక్యూషన్ ప్రకారం, అసలు డెటనేటర్ పేలకుండా చేసిన అధికారి ఎపీఐ సచిన్ గవాడె అతన్ని కూడా విచారణకు పిలవలేదు.
డెటనేటర్ పరిస్థితి గురించి వాస్తవం చెప్పేవ్యక్తి అతనే, డెటనేటర్ పేలకుండా చేపట్టిన ప్రక్రియ ఆ తర్వాత పరికరాలను సేకరించడం వంటి మెటీరియల్ సాక్ష్యాన్ని పరీక్షించకపోవడం జోక్యానికా తావిస్తుంది.
మిస్సింగ్..
ఎన్ఐఏ 2016లో కోర్టుకు తెలియజేసిన ప్రకారం, సీఆర్పీసీలోని సెక్షన్164 ప్రకారం సుమారు 13 మంది సాక్షుల వాదనలను మెజిస్ట్రేట్ ముందు వ్రాతపూర్వకంగా చేసిన రికార్డులు మాయమైపోయాయి.
ఇంతటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అకస్మాత్తుగా అనుమానాస్పదంగా మాయమైపోవడానికి ట్రాయల్ కోర్టు, హైయ్యర్ కోర్టులు కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ నొక్కి చెప్పింది.
రికార్డు చేసిన ఒరిజినల్ పత్రాలన్ని మాయమైపోయాయి. ఈ డాక్యూమెంట్ల ఫొటో కాపీలను ఉపయోగించుకోవడానికి దర్యాప్తు సంస్థ కోర్టు అనుమతి కోరింది. అందుకు కోర్టు అనుమతించింది. ఈ అనుమతిని ఒక నిందితుడు ముంబాయి హై కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ సవాల్‌పై ముంబాయి హైకోర్టు అంతకు ముందు ట్రాయిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై స్టే విధించింది. ఆ తర్వాత ఒరిజినల్ పత్రాలతో సరిసమానంగా ఉండే ఫొటో కాపీల కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకోవాలని ఎన్ఐఏను ఆదేశించింది.
విశేషం ఏంటంటే, ఎన్ఐఏ ఎలాంటి ధరఖాస్తు ధాఖలు చేయలేదు. కేవలం సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం సాక్షులు తాము చెప్పిందే రికార్డు చేశారు.
సెక్షన్ 164 కింద పత్రాలు లేకపోవడంతో వాటిని రికార్డు చేసిన మెజిస్ట్రెట్ పరిశీలించవచ్చు. కానీ దీన్ని వ్యతిరేకించాలని ప్రాసిక్యూషన్ నిర్ణయించింది.
ఇలాంటి పరిస్థితిలో సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద నమోదు చేసిన రికార్డులను సాక్షులు లేదా సంబంధిత మెజిస్ఠ్రెట్ ముందు పెట్టాలి. కేసులో కుట్రదారుల సమావేశాలు బాంబర్ల కదలికలు ఇతర ముఖ్య సమాచారం కోసం ఈ 13 మంది వాంగ్మూలం చాలా కీలకం. కుట్రదారుల సమావేశాల్లో ముస్లీంలపై ప్రతీకారం తీర్చుకోనే అంశం ఏదైనా ఎప్పుడైనా చర్చకు వచ్చిందా అనేది నిర్ధారించడానికి కనీసం ఇద్దరు సాక్షులు అవసరం.
ముఖ్యమైన సాక్షులను కోర్టులో హజరు పర్చడం ప్రాసిక్యూషన్ బాధ్యత , ఈ విషయంలో ప్రాసిక్యూషన్ విఫలమైతే, కోర్టే ఆ పని చేయవచ్చు. సీఆర్పీసీలోని సెక్షన్ 311 ప్రకారం కేసులో కీలకమని భావిస్తే సాక్షులను నేరుగా తమ వద్దకు రప్పించుకునే అధికారం కోర్టుకు ఉంది. ఎలాగైతే కొన్ని కీలక సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ నొక్కి పెట్టడానికి గల కారణాలపై అస్పష్టత ఉంటుందో, అలాగే సాక్షులను తమ వద్దకు రప్పించుకునే అధికారాన్ని కోర్టు ఉపయోగించుకోకపోవడానికి గల కారణాలపై కూడా అస్పష్టత ఉంది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ మొత్తం 323 మంది సాక్షులను విచారించింది. అందులోంచి 39 మంది తిరగబడ్డారు. అయినప్పటికీ వారికి వ్యతిరేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాసల్ అలాగె సాక్షులు ఇచ్చిన తమ వాంగ్మూలాలకు కట్టుబడి ఉండటాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ కోర్టు కూడా వారి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అనువాదం: జీ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.