
Reading Time: < 1 minute
ఎప్పుడో జరిగింది సరే
ఇప్పుడూ అదేనా?
అప్పుడు అల్లూరి
ఇప్పుడు అంబాల!
అప్పుడు తెల్లోడు
ఇప్పుడు నల్లోడు
ఇద్దరిదీ ఒకటే ధ్యేయం
సంపదల దోపిడీ!
అల్లూరి, అంబాల దేశభక్తులు!
తెల్లోడిని తరిమేశాం
నల్లోడిని ఏం చేద్దాం?
భగత్ సింగ్కు ఉరి
కూడా రాజ్గురు సుఖ్దేవ్!
నాడు అల్లూరి ఎన్కౌంటర్
నేడు అంబాలతో పాటు ఎందరో!
నాడు భగత్ శవం సెట్లెజ్ నదిలో
నేడు అంబాల శవం సామూహిక దహనం
త్యాగులంతా కొండెక్కిపోయారు
భోగులంతా సింహాసనం మీదే
దుర్మార్గుల ‘కల’ నిజమౌతోంది
సన్మార్గుల ‘నిజం’ కలగానే ఉంది
కల నిజం కావొచ్చు
నిజం కల కాకూడదు
ఎన్నాళ్లీ చరిత్ర?
ఈ చరిత్ర మారాలి
తమ్మినేని అక్కిరాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.