
ప్రస్తుతం ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే యుసిసి, డీలిమిటేషన్ వంటి కార్యక్రమాలతో ఒకే ఎన్నికల బాండ్స్ పథకం ఏమవుతుంది. దానికి ఒకే దేశం ఒకే భాష అని కూడా చేర్చితే దేశంలో అనూహ్య పరిణామాలు తప్పవు. ఈ దేశంలో ప్రజలందరూ సమైక్యంగా ఉండడానికి, విభిన్న రాష్ట్రాల ఆయా భాషల వైవిధ్యాన్ని స్వాగతించడం తప్పనిసరని గుర్తుంచుకోవాలి. అందుకే జాతీయ భాష కాకుండా కొన్ని భాషలను అధికారిక భాషాలుగా రాజ్యాంగంలో ప్రకటించాము. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశించింది కూడా ఇదే.
ఓటు చాలా బలీయమైన ఆయుధం. దాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. తద్వారానే పాలకుల నియంతృత్వాన్ని నియంత్రించవచ్చు. శాశ్వతంగా ఒక ప్రభుత్వం లేదా కొన్ని తరాల దాకా ప్రభుత్వాలు ఉండడాన్ని ఎవరూ ఆశించరు.
భారతీయులు కొన్ని విషయాలలో అమెరికా రాజ్యాంగాన్ని అనుసరించారు. అందులో ఒకటి కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికల దేశాధినేతగా ఒక వ్యక్తి ఉండాలనే నిర్ణయాన్ని. ఇప్పుడు అమెరికాలో తీసుకుంటున్న తీవ్రమైన నిర్ణయాల వల్ల రెండో పర్యాయం ప్రెసిడెంట్‌ను అమెరికా దేశం ఒక్కసారికే పరిమితం చేయాలి. కనీసం రెండు పర్యాయాలు దేశాధినేతను పరిమితం చేయడం ప్రస్తుత పద్ధతి. మరి భారతదేశంలో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది. బిజెపిలో కమ్యూనిస్టు పార్టీలలో ఒక సారి ఉన్నత అధికారాల్లో ఉన్నవారు పదేళ్లు, పదిహేనేళ్లు ఇంకా పైన అధికారాన్ని కొనసాగిస్తూ ఉంటే దీనిని ప్రజాస్వామ్యం అందామా? ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కనీసం రెండు పర్యాయాలు దాటిన తర్వాత పరిపాలించకూడదు. గవర్నర్, వైస్ ఛాన్సలర్లు, మంత్రులు, అన్నిరకాల పదవులు రెండో సారికే పరిమితం కావాలి.
ఏప్రియల్ 14న పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ అంబేడ్కర్ ఇటువంటి మంచి సంస్కరణలను, విధానాలను సూచించారు. అందులో ముఖ్యమైంది, సభలలోని మొత్తం సభ్యులు ప్రధాన మంత్రిని మార్చగలిగే ఒకే ఓటుతో(single transferable vote) ఎన్నుకోవలసిన అవసరం ఉంది. అది ముందు ‘‘ప్రధానమంత్రిని లోక్‌సభలో లేదా రాజ్యసభలోని సభ్యులలో గెలిచిన వారిలో అతి పెద్ద సంకీర్ణ పార్టీ ఎన్నికోవాలి’’ అని భారతరాజ్యాంగంలో మనం అనుకోలేదు..! అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభ, రచనా సంఘానికి అధ్యక్షుడు కావడానికి ముందు చాలా ఉపయోగమైన ఈ విధానం కోసం డిమాండ్ చేశారు. మరికొన్ని నిర్మాణాత్మక డిమాండ్లు కూడా చేశారు.
ఇష్టం వచ్చినవారినే నియమిస్తే అధికారం ప్రధానికి ఇవ్వరాదు: అంబేడ్కర్
క్యాబినెట్లో విభిన్న మైనారిటీల ప్రతినిధులను లెజిస్లేచర్‌లో ప్రతి మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధిని మార్చగలిగిన ఒకే ఓటుతో(single transferable vote) ఎన్నికచేయాలని అంబేడ్కర్ రాజ్యాంగ సభకు వినతి చేశారు. క్యాబినెట్లో ప్రధాని తనకు నచ్చిన వారినే క్యాబినెట్లో మంత్రులుగా చేర్చుకునే, ఆయా వర్గాల ప్రతినిధులకు ఎన్నిక చేసే స్వతంత్రం ఇప్పుడు మన దేశంలోలా(ప్రధానికి) ఇవ్వకూడదని అంబేడ్కర్ అన్నారు. ముస్లిం, క్రైస్తవ తదితర హిందూయేతర మతాలవారికి, షెడ్యూల్డ్ కులాలను కూడా ఆయా కులాలు, మతాల ప్రతినిధులను మాత్రమే మంత్రులుగా నియమించాలని అన్నారు.
మెజారిటీ హిందూ మతం వారి ప్రతినిధులను పూర్తి సభా సభ్యుల ఎన్నిక single transferable voteతో జరగాలి. కానీ ఇతర మైనారిటీ వర్గాల అందరినీ, ఎస్సీ వారిని మంత్రులుగా ఎన్నిక చేయాలి. హిందూ, హిందూయేతర సభ్యుల ఎన్నిక సమిష్టిగా కావాలి. వారిలో మళ్లీ ఇంకో మార్పు కూడా ఉండాలన్నారు. అదేంటంటే హిందూ, హైందూయేతర సభ్యులను మంత్రుల ఎంపికలో ప్రధానమంత్రికి ఎటువంటి నిర్ణయాధికారం ఇవ్వకూడదని అంబేడ్కర్ సూచించారు.
మంత్రివర్గంలో ఏ సభ్యుడైనా అభిశంసన (censure motion) తీర్మానంతో సభద్వారా కేవలం అవినీతి, దేశద్రోహ కారణాలతో ఆ మంత్రిని మంత్రిత్వాన్ని మహా అభిశంసన(impeachment)ద్వారా తొలగించడానికి అధికారం ఉండాలి. అంతేకాకుండా రాజకీయ కారణాల మీద, ఇతరుడనే అనర్హత లేదా చేతగాని వాడని మంత్రిని ప్రధాని తొలగించడానికి వీల్లేదు. క్యాబినెట్లో ఏ విధంగానైనా మంత్రులను, మంత్రి వర్గాన్ని సవరించుకునే అధికారం ప్రధానికి ఉండకూడదని తెలిపారు.
స్టేట్ సోషలిజాన్ని అంబేడ్కర్ పనికి రాదన్నారా..!
సోషలిజం గురించి అంబేడ్కర్ పదేపదే కలలు కన్నారు. అయితే రాజ్యాంగ నిర్ణాయక సభలో మాత్రం ఆ మాట ఊసే లేదు. సోషలిజం, ఆర్థిక విధానాలు, దానిగురించే చెప్పరు. కీలకమైన కోట్లాది వేల డబ్బులు పెంచి ప్రతి జీవీ బాగుండేందుకు కీలకమైన పరిశ్రమలు అమ్మకుండా నిలుపుకుని రాష్ట్ర పరం చేయాలని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ దేశానికి జాతీయం చేయాలన్నారు. రాష్ట్రాలకు ఇవ్వరు కానీ కేంద్రంగా అమ్మడానికి విధానాలు ఈ విధంగా ఉంటే ఇంక సంవిధానం ఏంచేస్తుంది. రాబోయే రోజుల్లో ఒకరో ఇద్దరో ప్రపంచ పరమ సంపన్నుడైపోతారని తెలుస్తోంది, కాకుండే ఏమవుతారు?
రాజ్య ఇండస్ట్రీ అన్నారు, సమిష్టి పొలాలు రావాలనుకున్నారు. చెరువులు రక్షించుకోండి అంటూ ఉంటే మొత్తం గోదావరిని, రొయ్య చెరువులను సమిష్టి వ్యాపారంగా మార్చివేయడం ఎవరైనా ఊహించగలరా? అందమైన కొబ్బరి చెట్లూ గోదావరి చుట్టూ తీయని నీళ్లు ఇస్తూ ఉంటే కొబ్బరికాయలు ఎక్కడ, బోండాలు ఇక్కడ దేవుడికి కొబ్బరికాయలు కొట్టేవారెవరు? మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు, తెలంగాణలో మరొకరు నదులన్నీ అమ్మేసుకోవడం తప్ప నదుల జాతీయం మాట ఎవరు వింటారు?
భూమిని జాతీయం చేయాలని కోరుకున్న అంబేడ్కర్..
భూమిని జాతీయం చేయాలనే అవసరమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోయామని అంబేడ్కర్ అన్నారు. ఈ మాట రాజ్యాంగంలో లేదు, పునాదుల్లో కూడా కనబడలేదు. పంచవర్ష ప్రణాళికల్లో కూడా ఎక్కడా ఆ కలలు కానరావు. సోవియేట్ యూనియన్ స్టాలెన్ అనుకున్నాడే. మావో చైనాలో కూడా అనుకున్నాడా? అవన్నీ ఉన్నాయా పోయాయా? మరి భూమి జాతీయం గురించి ఏమన్నాం? జాతీయ చేయడం కాదు, మనం ఏం చేస్తున్నాం. అమ్మేస్తున్నాం, కనీసం ప్రైవేటీకరణ అయినా చేస్తున్నారా? ఊహూ చేయడం లేదు. పోతే పోని, కనీసం అమ్మేస్తున్నాం. కనపడిన ప్రతీదాన్ని, ప్రభుతానికి దొరికినవి దొరికినట్టు అమ్మేస్తున్నాం.
హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ ఎవరికి అమ్మేస్తారు. మూసీ నదిని మృత్యునదిగా చేసేసి, కాలనీలను నిర్మించారు. మూసీ భూములను అమ్ముకున్నాం. విజయవాడ దగ్గర కృష్ణానదిని తాగేస్తాం, అమ్మేస్తాం. ఇవన్నీ ఎలాకొనుక్కుంటారో నాకు తెలియదు. చుట్టూ ఉన్న వ్యవసాయాలను జాతీయం చేయడం లేదు. అంబేడ్కర్ పేద ప్రజల గురించి ఎంతో తపించారు.
వ్యవసాయం జాతీయం చేయాలని అన్నారు. అంతేకాకుండా భూమి జాతీయం చేసుకోండంటే వినకపోయేసరికి ప్రస్తుతం ఆర్థిక నాశనం జరుగుతుంది. దీంతో జాతీయ సంఘర్షణలు వస్తాయని చెబుతున్నా వినేవారే లేరు. దొరికిన కాడికి ఏదైనా అమ్మేసుకోవడమే. మళ్లీ దానికో బడ్జెట్. అమ్ముకోవడానికి ఓ ప్రణాళిక. ఈ బడ్జెట్లో బజ్జీల్లా ఏం అమ్ముతారో ఎవరు కొంటారో చూద్దామని జోకులు వేసుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరమైన విషయం.
అసలు రాజ్యాంగ నిర్ణాయక సభ ఎందుకు పట్టించుకోలేదు?
1944లో జరిగిన బెవరాలీ నికోలాస్ ఇంటర్వ్యూలో అంబేడ్కర్ ఈ విధంగా వివరించారు. “ప్రతి గ్రామంలో కొన్ని మైనారిటీలు వర్గాలు అంటరాని కుటుంబాలుగా ఉండేవి. ఒక్కొక్క మైనారిటీ వర్గాన్ని కలిపి, ఉద్యమం ద్వారా సంఘటితం చేసి మెజారిటీలుగా మార్చాలని కోరిక. వారినందరినీ వ్యవస్థితం చేసేందుకు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలని అర్థం. అప్పుడు వారి గ్రామాలను తీర్చిదిద్ది ప్రజలలో ఒక మార్పును తీసుకురాగలుగుతాం” అని తెలిపారు. ఈ విషయం డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్: రచనలు ప్రసంగాలు అనే పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలోని 17వ సంపుటిలో ఆయన ప్రస్తావించారు.
నిరంతరం సమానతను ప్రబోధించాల్సిందే..
నిరంతరం సమానత గురించి చెప్పాల్సిందే, మనం అన్నతమ్ములవలె ఉండాల్సిందేనని అంబేడ్కర్ చెప్పేవారు. వేలాది మందిలో చైతన్యాన్ని రగిలించడమే ఆయన పని. అసమానతను, వివక్షను, పెత్తనాన్ని తగ్గించాలి. ప్రజలకు విచక్షణతో మెలిగేలా నేర్పించాలి, దాని ఆవశ్యకతను వారికి వివరించడం మన బాధ్యతని అంబేడ్కర్ చెప్పారు. దీనికోసం షాక్ట్రీట్మెంట్ ఇవ్వాలని అనేవారు.
అంటరాని తనం, వివక్షలాంటి రుగ్మతలను సమాజంలో నుంచి తొలగించడానికి హిందూ సమాజానికి షాక్ట్రీట్మెంట్ ఇవ్వాలని అంబేడ్కర్ అన్నారు. అన్యాయాన్ని, వివక్షను శరవేగంగా తొలగించాల్సిందేనని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు, వెనుక బడిన వారిని వివక్ష నుంచి బయటపడేయ్యడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఆయన విగ్రహం నుంచి ఎప్పుడూ ఇటువంటి సందేశం వస్తూనే ఉంటుంది.
రాజ్యాంగ రచన సమయంలో ఏం చేశారు? అప్పుడు ఏం చెప్పారు? బిఎన్ రావ్ చెప్పక ముందే ఈ చిత్తు ప్రతి చెప్పిందని తెలుసాని వాదించడం వేరే విషయం. ఆ తరువాత నిలబడ్డ చిత్తు ప్రతి ఏ విధంగా ఒక చైతన్యోద్యమానికి పీఠిక అయింది. ఎజెండా అయింది. కాబట్టి బిఎన్ రావ్ తరువాత కూడా చైతన్యాన్ని పుట్టిస్తున్న అంబేడ్కర్ విషయం అర్థం కావాలి. నేను భక్తుడిలా అనుసరించేవాడిని, భజన చేస్తాను అంటే అది ఎవరి ఇష్టం వాళ్లది. తమంతట తాము మూర్ఖులుగానే ఉంటామంటే ఎవరు కాదంటారు? చూస్తూ ఉండిపోతారు. కానీ సమానత కోసం అందరు సోదరులవలె ఉండాలని అంబేడ్కర్ చెప్పినదాంట్లో తప్పులేదు. స్వాతంత్య్రోద్యమ విలువలతో, కలల లక్ష్యాల సాధనతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ఆయన అందించిన స్ఫూర్తితో విలువలను కొనసాగిస్తూ దేశ క్షేమం కోసం మానవత్వపు ధ్యేయంతో కృషి చేయాల్సిన బాధ్యత భారత దేశ పౌరుడిపై ఉందని గమనించాలి.
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.