
ఛత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్‌లో మతమార్పిడి జరుగుతోందని బజరంగ్ దళ్ సభ్యులు నిరసన తెలిపారు. దీని తర్వాత దుర్గ్ రైల్వే స్టేషన్‌కు 18- 19 సంవత్సరాల వయసున్న ముగ్గురు అమ్మాయిలతో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను(నన్), ఒక వ్యక్తి కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మతమార్పిడి ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇద్దరు సన్యాసినులను, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను క్రైస్తవ సమాజం తీవ్రంగా ఖండించింది.
న్యూఢిల్లీ: మతమార్పిడీలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో బజరంగ్ దళ్ సభ్యులు నిరసన తెలిపారు. స్పందించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు శనివారం(జూలై 26) అస్సిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్(ఏఎస్ఎంఐ)కు చెందిన ఇద్దరు కాథలిక్ సన్యాసినులను అదుపులోకి తీసుకున్నారు .
ఈ ఇద్దరు సన్యాసినులు, వారితో పాటు వచ్చిన ఒక యువకుడు నారాయణపూర్ జిల్లా నుంచి 18, 19 సంవత్సరాల మధ్య వయసున్న ముగ్గురు మహిళలతో ప్రయాణిస్తున్నప్పుడు అరెస్టు చేయబడ్డారు.
ఆ వ్యక్తిని నారాయణపూర్ నివాసి సుఖ్మాన్ మాండవిగా గుర్తించారు, అతన్ని కేరళకు చెందిన ఇద్దరు సన్యాసినులు- ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్‌తో పాటు అరెస్టు చేశారు.
వారిపై భారత న్యాయ స్మృతి(బీఎన్ఎస్), ఛత్తీస్‌గఢ్ మత స్వేచ్ఛ చట్టం, 1968 కింద మానవ అక్రమ రవాణా, మతమార్పిడి వంటి నేరాలకు పాల్పడినట్లు ది న్యూస్ మినిట్ నివేదించింది.
రాయ్‌పూర్ ఆర్చ్‌డయోసెస్ వికార్ జనరల్ ఫాదర్ సెబాస్టియన్ పూమట్టం ప్రకారం, ఇంటి పని కోసం ఆగ్రాలోని ఒక కాన్వెంట్లో ఉంచడానికి ఈ అమ్మాయిలతో పాటు సన్యాసినులు వెళ్తున్నారని టీఎన్ఎం నివేదించింది.
“ఈ అమ్మాయిలకు నెలకు రూ 8,000 నుంచి రూ 10,000 జీతంతో వంటగది సహాయకులుగా ఉద్యోగాలు అందిస్తున్నారు. వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు ఉన్నాయి. అందరూ 18 ఏళ్లు పైబడిన వారు” అని ఫాదర్ పూమట్టం అన్నారు.
ఒక టీటీఈ ఆ బృందాన్ని ప్రశ్నించగా, రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత బజరంగ్ దళ్ సభ్యుల నిరసన జరిగింది.
ఫాదర్ పూమట్టం మాట్లాడుతూ, “ఒక వ్యక్తితో పాటు సన్యాసినులు ఉన్న ప్లాట్‌ఫారమ్ వద్దకు ఆ యువతులు చేరుకున్నారు. ఎగ్జామినర్ వారి టిక్కెట్ల గురించి అడిగారు. దాంతో వారి టిక్కెట్లు క్రైస్తవ సన్యాసినుల దగ్గర ఉన్నట్టుగా చెప్పారు. దీని తర్వాత వెంటనే ఎగ్జామినర్ స్థానిక బజరంగ్ దళ్ సభ్యులకు సమాచారం అందించాడు. కొన్ని నిమిషాల్లోనే దళ్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.”
బజరంగ్ దళ్ సభ్యుల ఒత్తిడి మేరకు ముగ్గురికి వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. దీని తరువాత, అమ్మాయిలను ప్రభుత్వ ఆశ్రయ గృహానికి తరలించారు. ఇద్దరు సన్యాసినులు, ఒక వ్యక్తిని ఆగస్టు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
నిర్బంధించబడిన సన్యాసినులను కలవడానికి చర్చి ప్రతినిధిని అనుమతించలేదని ఢిల్లీకి చెందిన కాంగ్రిగేషన్ ఆఫ్ ది హోలీ ఫ్యామిలీకి చెందిన సన్యాసిని సిస్టర్ ఆశా పాల్ అన్నారు. అంతేకాకుండా, యువతులు తమ ఇష్టానికి విరుద్ధంగా వెళ్లినట్టుగా చెప్పడానికి, వారిని బలవంతం చేశారని అనుమానించడానికి అనుమానం ఉందని ఆరోపించారు.
“మా దగ్గర తల్లిదండ్రుల సమ్మతికి సంబంధించిన అన్ని ఆధారాలు, గుర్తింపు కార్డులు, పత్రాలు ఉన్నాయి. ఇవన్నీ బలవంతపు ఉపయోగం లేదా మతమార్పిడి జరగలేదని రుజువు చేస్తాయి” అని సిస్టర్ పాల్ అన్నారు.
అరెస్టులను ఖండించిన క్రైస్తవ సమాజం..
ఈ సంఘటన తర్వాత, క్రైస్తవ సమాజ సభ్యులు అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
“అబద్ధపు ఆరోపణలతో సన్యాసినులను అరెస్టు చేశారు. మూక హింస, పోలీసులపై కేసులు, చర్చి నిర్వహించే సంస్థలపై దాడులు ఆందోళనకరంగా తరచుగా జరుగుతున్నాయనే దానికి ఇది మరో ఉదాహరణనని తెలియజేశారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల మౌనం లేదా సహకారం అటువంటి సమూహాలను మరింత ధైర్యాన్నిచ్చింది” అని ఈ సంఘటన తర్వాత ఒక ఫాదర్ చెప్పినట్లు టీఎన్ఎం నివేదిక పేర్కొంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయం మీద స్పందించారు. కేంద్ర హోంమంత్రికి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి లేఖ రాసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“స్వయంగా ప్రకటించుకున్న నిఘా వ్యక్తులు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టడం, ఎటువంటి చట్టపరమైన ఆధారం లేకుండా మతమార్పిడి, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. స్పష్టమైన పత్రాలు, తల్లిదండ్రుల అనుమతి ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపిస్తూ సన్యాసినులను, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇది న్యాయం స్పష్టమైన తప్పిదం, మైనారిటీ వర్గాల హక్కులపై దాడి” అని వేణుగోపాల్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఆదివారం నాడు ఇద్దరు సన్యాసినులకు న్యాయం జరిగేలా ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు.
మేరీ, ఫ్రాన్సిస్ తమ కాన్వెంట్లో పనికి వచ్చే మహిళలను తీసుకెళ్లడానికి వెళ్ళినప్పుడు అరెస్టు చేశారని ప్రధానమంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి విజయన్ తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.