న్యాయవాది గాందీ-ఆయన యాత్రలు అమ్రిత షా రచించిన ‘ద అదర్ మోహన్’ అనే పుస్తకం నుంచి యాత్రా సాహిత్యం, జ్ఞాపకం, కుటుంబ చరిత్రలో ఒక భాగం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అమ్రిత షా ముత్తాత మోహన్ లాల్ దక్షిణాఫ్రికా యాత్ర సాగిస్తున్నప్పటి విషయాలను వివరిస్తూ, పాఠకులను అపూర్వమైన ప్రపంచ యాత్రలోకి తీసుకెళ్ళిపోతారు.
న్యాయవాది గాంధీ
గాంధీజీ 1893 మే 23వ తేదీన ఓడలో డర్బన్ కు వచ్చాడు. ఆసక్తిగల కాంతి వంతమైన కళ్ళతో, ఎలాంటి గొప్పతనాన్ని ప్రదర్శించకుండా వచ్చేసరికి, భారత న్యాయవాది అబ్దుల్లా అందరికీ కలిపిన చోటు కాకుండా విడిగా ఒక బస ఏర్పాటు చేశారు.
దాదా అబ్దుల్లా స్వస్థలమైన పోర్ బందర్ లోనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మించాడు. అక్కడ చాలామంది ఇళ్ళలాగానే తన ఇల్లు కూడా సున్నపు రాయితో నిర్మించిందన్న విషయం చెమ్మారని మనసులో మర్చిపోలేదు. నగర గోడల నుంచి ఆ సముద్రం వరకు విసిరేసిన రాళ్ళతో నిండి ఉందన్న విషయం తన భవిష్యత్ జీవిత చరిత్రలో చెప్పాడు. పోర్ బందర్ నగరం ఒక ద్వీపంలాగా చుట్టూ దానికి ఆనుకుని ఉంది. ఆ పిల్లవాడు మూడంతస్తుల తన ఇంటి పై కెక్కి వీక్షిస్తుంటే, వీస్తున్న శీతవాయువు దాన్ని పైకి లేపుతున్నట్టనిపించేది. దాదా అబ్దుల్లా లాగా గాంధీలు ముస్లింలు కాదు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలో ఉన్నటువంటి బనియా అనే వర్తక కులానికి చెందిన వారు. గాంధీజీ పూర్వీకుల్లో ఒకరైన ఉత్తమ్ చంద్ గాంధీ రెవెన్యూ వసూలు చేసే ఉన్నతమైన కలెక్టర్ కాగా, ఆయన తండ్రి స్థానిక ప్రధాన పాలనాధికారి.
తూర్పు ఇండియా కంపెనీ బాగా అభివృద్ధి చెందడంతో, కథియావార్ అనే స్వతంత్ర సంస్థానం భారత దేశంలో చెప్పుకోదగ్గదిగా బ్రిటిష్ వారి పాలనకిందకు వెళ్ళిపోయింది. అది పూర్వ భూస్వాముల చేతుల్లోనే ఉండినప్పటికీ, పోర్ బందర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ కోట రాజధానిగా బ్రిటిష్ రాజకీయ దళారుల పర్యవేక్షణలోకి ఉండిపోయింది. గాంధీ కుటుంబం రాజ్ కోట్ కు వెళ్ళిపోవడంతో, రాజ్ కోట్ హైస్కూల్ అనే కథియావార్ తొలి ఇంగ్లీష్ స్కూల్లో ఆయన చేరాడు.
బొంబాయి, సూరత్ లను తాకినట్టుగానే, రాజ్ కోట్ ను కూడా సంస్కరణల గాలి తాకింది. భారతీయులు పశ్చిమ దేశాల ఆధిపత్యం కింద బతికే ధోరణిని మార్చుకోవాలనేది ఆ సంస్కరణల సారాంశం. భారతదేశాన్ని ఇంగ్లీషు వాళ్ళు పాలించడానికి తగిన బలం చేకూరాలంటే వాళ్ళే అసూయపడేలా మాంసాహారం తీసుకోవాలని కొందరు యువకులు భావించారు. ‘‘ఇంగ్లీషు వాడిలాగా బలంగా ఉండంది – భారతీయులు పొట్టిగా ఉండబట్టి వాడు పాలిస్తున్నాడు-ఎందుకంటే వాడు మాంసం తినేవాడు కనుక-అతను అయిదు మూరల పొడవున్నాడు’’ అన్నది గాంధీ చదివే స్కూల్ పిల్లల్లోబాగా వ్యాపించింది.
మానసికంగా, శారీరకంగా బలంగా ఉండడానికి తన కుటుంబంలో నిషిద్ధ మైన ఆహారం తీసుకోవాలనుకున్నాడు గాంధీ. మాంసాహారం తీసుకోవడానికి తాను పుట్టి పెరిగిన వైష్ణవ సంప్రదాయం అనుమతించనందున, మాంసం తినాలని ప్రయత్నించి వాంతికి చేసుకున్నాడు. బ్రిటిష్ వారి ఆకర్షణ మాత్రం గాంధీని వదలలేదు. కొంత కాలానికి ఆయన తండ్రి మరణించిడంతో, ఉన్నత చదువులకు ఇంగ్లాండ్ వెళ్ళమని కుటుంబ స్నేహితుడు సూచించడం వల్ల, గాంధీ ఆ ఆలోచనకు ఎగిరి గంతేశాడు.
కతియా వార్ లో ఎవరూ నిలువలేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్రతి సంవత్సరం ఇద్దరికి మించి ఎప్పుడూ మెట్రిక్యులేషన్ దాటలేకపోతున్నారు. గాంధీకి చెల్లించలేని అప్పులు ఏమీ లేవు కనుక, కాలాపానీని (అండమాన్ జైలు చుట్టూ ఉన్ననీళ్ళు) దాటకూడదనే కుల నిషేధాన్ని అధిగమించడానికి గాంధీ కాస్త వెనకాడాడు. గాంధీ గుణగణాల్లో అది కూడా ఆయనకున్న ఒక ఆకాంక్ష. ‘‘నా ఆసక్తిని సంతృప్తి పచురుకోవడానికి లండన్ గురించి నా మనసులో రహస్యంగా ఆలోచించుకున్నా. నేను ఇంగ్లాండ్ వెళితే బారిస్టర్ అవడానికి మాత్రమే కాదు , కవులు, తత్వవేత్తలున్ననాగరికత విలసిల్లిన ఆ నేలను చూడగలుగుతాను.’’
లండన్ లో కథియావార్ కు చెందిన ఈ బలహీనమైన పిల్లవాడు జంటలు జంటలుగా కలిసి నాట్యం చేసే బాల్ రూంలోకి అడుగుపెట్టగానే వయొలిన్ నాదానికి అనుగుణంగా చేస్తున్న నాట్యం కనిపించింది. ఆ థియేటర్ కు తరచూ వెళ్ళేవాడు. అతి పెద్ద సిల్క్ టోపీ పెట్టుకుని, అందమైన సిల్క్ చొక్కా వేసుకుని, రెండు వెస్టెడ్ కోట్లు వేసుకుని, కాళ్ళకు లెదర్ బూట్లు, చేతులకు గ్లౌలు తొడుక్కుని, చేతిలో వెండి కర్రను గుండ్రంగా తిప్పుతూ ఉన్న వాళ్ళతో దిక్కులు పిక్కటిల్లేలా సర్కస్ శబ్దాలు. విక్టోరియా హోటల్ లో కాంతివంతమైన లైట్లను చూసి పొంగిపోయాడు. జీవితాంతం ఆ గదిలోనే ఉంటే ఎంత బాగుంటుందోనని భావించాడు.
భారత దేశానికి తిరిగి రావాల్సి రావడం పెద్ద ఇబ్బంది. బొంబాయిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పటికీ, అక్కడ సరైన సంబంధాలు లేకపోవడంతో సాధ్యం కాలేదు. ‘‘నేను నిలుచున్నాను కానీ, నా కాళ్ళు నా బూట్లలో దిగబడ్డాయి. నా తల తిరుగుతోంది. కోర్టు అంతా తిరుగుతున్నట్టనిపిస్తోంది. అక్కడ కూడా నా ఆకాంక్షలను తగ్గించడానికి ఒక సంఘటన చోటుచేసుకుంది. తన పెద్దన్న తనను ఒప్పించాక, ఎవరితోనైతే ఒప్పందం కుదుర్చుకున్నాడో, మంచి తీర్పుకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా తనకు ప్రయోజనం చేకూరడానికి బ్రిటిష్ రాజకీయ ఏజెంట్ ను కలిశాడు. ఆ ఏజెంట్ తనను తొలగించడంతో, తాను అవమానానికి గురయ్యి వృత్తి పరంగా తన విజయాన్ని దెబ్బతిసినట్టయిందని గాంధీ భావించాడు. ఆ పట్టణంలోని ఫ్యూడల్ రాజకీయ ఏజెంట్ , తెల్ల ఏజెంట్ ఒకరికి మేలు చేయడం కోసం తలబిరుసుగా వ్యవహరించడంతో సున్నితమైన ఆ యువకుడికి ఊపిరాడని విధంగా తయారైంది. ఈ స్థితిలో ఎలాగైనా సరే , అన్నిటికంటే గాంధీ నిరాశతో భారతదేశం విడిచి వెళ్ళాలనుకున్నాడు.
ఒక సాహసం చేయడానికి ఈ పరిస్థితుల అతన్ని లండన్ కు తీసుకెళ్ళాయి. వెనకటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. బృంద నాట్యం జరిగే బాల్ రూంలో అందరినీ ఆకర్షించే దుస్తులు వేసుకుని వయోలిన్ నాదానికి అనుగుణంగా న్యాట్యం చేస్తున్న యువత గుర్తుకు వచ్చింది. తొడుక్కున్న తొలి ఆసక్తులను వదిలేసి, గాంధీజీ తన ఇష్టాలను ఒకటొకటిగా వదిలేస్తూ వస్తున్నాడు. పనికి మాలిన ప్రదర్శనల పైన ఆయన దృష్టిలో విలువలేదు. నగరంలోని ‘బొధనా సంస్థలు, ప్రజా సమావేశ స్థలాలు, మ్యూజియంలు, థియేటర్లు, పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలు, ప్రజల పార్కులు’ ఇలా అసంఖ్యాకమైన అవకాశాల స్థలాలు ఉన్నప్పటికీ, మత తాత్వికత, హుందాగల శాకాహారం వంటివి నిజమైనవిగా గాంధీజీ భావించాడు.
భారత దేశానికి తిరిగా వచ్చి చాలా కొద్దికాలం గడిపిన తరువాత గాంధీ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. తన తాజా వైఫల్యాలతో పాటు, కొన్ని అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వాస్తవాలతో పాటు తనకు లభించిన కొత్త ఉద్యోగం తన అర్హతకు తగింది కాదు. ఇంటి జీవితావసరాల నుంచి తప్పించుకోవడంతో పాటు, తన వృత్తిపరమైన పోటీలో తనను తాను రుజువు చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఏజెంట్ తో జరిగిన సంఘటన అతన్ని కలవరపరిచింది.ఆయన చెప్పినట్టుగా ఆ సంఘటన అతని జీవిత గమనాన్నే మార్చింది. ఇంగ్లీషు లీగల్ శిక్షణలో భారతీయుల్లో కూడా అతనికి గౌరవం పెరిగింది. యూరోపియన్ గౌనుకోటు వేసుకుని, అంటించినట్టున్న ప్యాంటు తొడుక్కుని, మెరుస్తున్న బూట్లతో పాటు తలపాగా కట్టుకున్నాడు. (డర్బన్ లో లా చదివిన ఒక బారిస్టర్ లాగా తన ప్రాముఖ్యతను తెలియచేయడానికి). తాను ప్రవేశించే సమాజం గురించి తనకు కాస్త ఎలా తెలుసో చెప్పాడు.
నటల్ కు వచ్చేనాటికి గాంధీకి అక్కడి వలసవచ్చిన భారతీయుల గురించిన అవగాహన లేదు. దక్షిణాఫ్రికాలో వ్యవసాయ పనులు చేయడానికి నటల్ కు భారతీయ కూలీలు పెద్ద ఎత్తున వచ్చారు. నటల్ ప్రభుత్వ రైల్వే అధికారులతో ఒప్పందం జరిపినట్టుగానే మున్సిపాలిటీలో కూడా పనిచేయడానికి 1860లో వచ్చిన భారతీయ కూలీలు మంచి నమ్మకస్తులుగా వారి విశ్వాసాన్ని పొందారు. తొలి విడత ఒప్పందం చేసుకుని వచ్చిన కూలీలు, తమ ఒప్పంద కాలం పూర్తి అయ్యేసరికి, ప్లాంటేషన్ యజమానులు చేసిన ఫిర్యాదుతో 1871లో వారు భారతదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. కొన్నేళ్ళ వరకు కూలీల ఎగుమతి రద్దు చేసుకున్నారు. వలస కూలీలకు వైద్య జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, శారీరక దండన వంటి తీవ్రమైనశిక్షలను పక్కన పెట్టడంతో 1874 నుంచి వలస కూలీల రాకను పునరుద్ధరించారు.
ప్లాన్టేషన్ యజమానుల ఒత్తిడితో రక్షణ కల్పించే అధికారం ఆచరణలో తగ్గిపోయి, కోర్టు కూడా యజమానులకు అనుకూలించడంతో వారు అధికారాన్ని చెలాయించారు. పశువులను కొట్టినట్టు కూలీలను చావ బాదడం, అపరిమితమైన చాకిరీ చేయించడం వల్ల తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నరు. కూలీల జీవన పరిస్థితులు ఇలా దారుణంగా తయారయ్యాయి. ఈ దారుణ సంఘటనల కథనాలు వరుసగా వెలువడుతున్నప్పటికీ, రేనాల్డ్ బ్రోస్ కంపెనీ యజమానులు, భారత దేశంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు పనిచేసే ఉమ్ జింటో ప్లాంటేషన్, ట్రేడింగ్ కంపెనీ యజమానులు పెద్ద ఎత్తున కూలీలను భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి వారికి ఉచితంగా అనుమతులు ఇస్తున్నారు. భారతదేశంలో పరిస్థితులు దుర్భలంగా ఉండడం వల్ల, తెల్లవారైన చిన్న చిన్న యజమానులు కూడా ఒప్పందాలను సైతం ఉల్లంఘించి, క్రూరంగా వ్యవహరించడం మొదలు పెట్టారు.
హే అనే వ్యాపారి తన సేవకుడు ఇస్సాక్ చేతిలో చీట్ల పేక ఉండడాన్ని గమనించాడు. అతనిపై చిరాకు పడ్డ యజమాని మద్యం పెట్టెలను తెరవమన్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువ శబ్దంతో వాటిని తెరిచాడని ఇస్సాక్ పైన అధికారులకు ఫిర్యాదు చేశాడు. వలస చట్టంలో సెక్షన్ 36 ప్రకారం తన యజమానిని అవమానించాడని ఇస్సాక్ కు సెకండ్ క్రిమినల్ మేజిస్ట్రేట్ శిక్షవిధించాడు. మేజిస్ట్రేట్ తీర్పును సవాలు చేస్తూ చేసిన అప్పీల్ ను 1906లో తమ అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు) గుర్తించిందని నటల్ విట్ నెస్ నివేదించింది.
ఈ సంఘటనలన్నీ భారతీయుల పట్ల తెల్లవారి దుర్మార్గాలను, పొగరుబోతుతనానికి, జాతి దురహంకారానికి చిహ్నాలుగా గ్రహించారు. వినోదం లేకపోవడం, సాంస్కృతికమైన ఆహార పోషణ లేకపోవడం, కార్మికుల్లో జెండర్ నిష్పత్తిని నాశనం చేయడం వల్ల వారు తాగుడుకు బానిసలవడం, ఘర్షణలకు దారితీస్తున్నాయి. స్వదేశస్తులు కూడా వారిని అంగీకరించని విధంగా ఒప్పంద కార్మికులకు కళంకం వచ్చేలా నీచంగా చేశారు. కార్మికుల నుంచి వేరు పరచడం కోసం భారత ముస్లిం ప్రయాణికులు ఇబ్బందిపడేలా వారికి పేర్లు పెట్టారు. పార్సీలు తమని తాము పర్షియన్లని భావిస్తారు. మద్యానికి వ్యతిరేకంగా మతపరమైన గుర్తులు పెట్టడానికి మాజీలు ఇబ్బందిపడ్డారు. ఒప్పంద కార్మికులకు సరైన పెళ్ళిళ్ళు, స్మశానాల్లో అనుసరించే తమ పద్ధతులకు సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు.
హర్పర్ కొలిన్స్ అనుమతితో తీసుకున్నది.
అమ్రిత్ షా డెబనాయర్ కు, ఎలికి మాజీ ఎడిటర్. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు మాజీ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్. అమెరికాకు చెందిన టైమ్ లైఫ్ న్యూస్ సర్వీస్ కు కూడా పనిచేశారు.‘అహ్మదాబాద్ : ఏ సిటీ ఆఫ్ ది వరల్డ్ (2015), విక్రమ్ సారాబాయ్ : ఏ లైఫ్ (2007) ‘టెల్లి గిలోటైన్డ్ : హౌ టిలివిజన్ చేంజ్డ్ ఇండియా( 2019) వంటి రచనలకు అవార్డులు పొందారు.
అనువాదం : రాఘవ