
మిజోరాంలోని చక్మా ప్రాంతీయ స్వయం పాలిత మండళ్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన రెండ్రోజులకే ఆ రాష్ట్ర గవర్నర్ వీకే సింగ్ ఆ ప్రాంతంలో గవర్నర్ పరిపాలనను విధించారు. మోడీ తొలి మంత్రివర్గంలో వీకే సింగ్ కేంద్ర సహాయక మంత్రిగా పనిచేశారు. పాలక మీజోరాం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులను ఓడించి చక్మా స్వయంపాలిత జిల్లా మండలిని కైవసం చేసుకున్నారు. అప్పటికి రాష్ట్ర గవర్నర్గా భాన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు.
2016లో అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ స్వయంపాలిత జిల్లా మండలి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ను ఓడించి రాష్టంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాత కాంగ్రెస్ టికెట్ల అటానమస్ కౌన్సిల్ సభ్యులను పార్టీ ఆహ్వానించింది. ఇంకా అప్పటి రాష్ట్ర గవర్నర్ భాన్వరిలాల్ పురోహిత్ ఎన్నికైన స్వయంపాలిత మండలి నుంచి అధికారాలను పూర్తిగా లాగేసుకుంది. అంతేకాకుండా కౌన్సిల్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించారు. తర్వాత జరిగిన స్వయం పాలిత మండలి ఎన్నికల్లో పాలక బీజేపీ గెలుపొందింది.
మిజోరంలో గత నెల 16వ తేదీన చక్మా స్వయంపాలిత మండలి అధ్యక్షులు లక్కన్ చక్మా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని పాలక జెడ్పీఎం ప్రతిపాదించింది. జెడ్పీఎం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో భాగస్వామి. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో బీజేపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. గతంలో బీజేపీ సభ్యులుగా ఉన్నవాళ్లే ఇపుడు జెడ్పీఏం సభ్యులుగా మారారు. జూన్ 16వ తేదీ జరిగిన సమావేశంలో మొత్తం 17 మందికి గాను 15 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అధికారిక బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే దక్కింది. మిజో నేషనల్ ఫ్రంట్ తరఫున ఉన్న ఏకైక సభ్యుడు ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో అప్పటి వరకు బీజేపీ చేతిలో ఉన్న చక్మ జిల్లా స్వయం పాలిత మండలి ఇపుడు జెడ్పీఎం చేతికి మారింది.
జెడ్పీఎంకు మారిన లక్కన్ చక్మ కొత్త మండలిని ప్రతిపాదించారు. నూతన కౌన్సిల్ నియామకానికి అనుమతించడానికి బదులు గవర్నర్ స్వయం పాలిత మండలిని రద్దు చేసి ఆ ప్రాంతాన్ని కూడా తన ప్రత్యక్ష పరిపాలన కిందకు తెచ్చుకున్నారు. ఆర్నెల్ల పాటు స్వయం పాలిత మండలి స్థానంలో గవర్నర్ అధికారాలు చలాయిస్తారు. ఆర్నెల్ల తర్వాత కూడా ఈ ప్రాంతం గవర్నర్ కబ్జాలో ఉండాలంటే అసెంబ్లీ అనుమతి కావాలి.
ఫిబ్రవరి నాలుగున జరిగిన సీఏడీసీ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలుపొందింది. కేంద్రంలో పన్నెండేళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి ఈ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చక్మలు ఆధిపత్యం కలిగిన ప్రాంతం నుంచి గెల్చుకున్న అసెంబ్లీ స్థానాన్ని కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకోలేక పోయింది.
2016లో అస్సాం గవర్నర్ బీజేపీకి పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నించారు. ప్రసుత్తం మిజోరాం గవర్నర్ మాత్రం బీజేపీ పరాజయం తర్వాత కూడా అధికారాన్ని బీజేపీ అప్పగించటానికి తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. స్థానిక పత్రికల కథనాల ప్రకారం, చక్మ స్వయం పాలిత మండలి పరిధిలో నిరంతరం పెరుగుతోన్న రాజకీయ అనిశ్చితి ఈ ప్రాంత అభివృద్ధికి నష్టదాయకం. అందువల్లనే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం గవర్నర్ పరిపాలన విధించాలన్న నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి పచౌ వెల్లడించారు.
కొత్తగా ఎన్నికైన మండలి ఆధ్వర్యంలో పరిపాలన సజావుగా సాగుతుందా లేదా అన్న విషయంపై రాష్ట్ర మంత్రి మండలి అభిప్రాయాన్ని కూడా గవర్నర్ తెలుసుకున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం దాఖలు పడిన అధికారాలను సద్వినియోగం చేసే అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాంలలో ఇటువంటి ఆదివాసీ స్వయంపాలిత మండళ్లు పది ఉన్నాయి. అస్సాంలో కర్ని అంగ్లాంగ్ మండలి పగ్గాలు సొంతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారిని బీజేపీలోకి లాగేసుకోవడంతో పాటు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల విషయంలో అప్రజాస్వామిక పద్ధతులకు బీజేపీ పాల్పడింది.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.