
అస్సాంలో దిమా హసావో జిల్లాలోని భారతరాజ్యంగం 6వ షెడ్యూల్డ్ కిందికి వచ్చే భూమిని ప్రైవేటు కంపెనీకి కట్టబట్టడంపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి భూములపై నిర్ణయం తీసుకునేటప్పడు, స్థానిక గిరిజనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యాంగం మార్గదర్శనం చేస్తున్న ఈ భూమిని ప్రవేటు కంపెనీకి ప్రభుత్వం కేటాయించాయింది. ఈ చర్యను “అసాధారణమైనది”గా హైకోర్టు అభిర్ణించింది.
న్యూఢిల్లీ: అస్సాంలోని దీమా హస్సావ్ జిల్లాలో 3000 బీగాల గిరిజన భూమిని మహాబల్ ప్రైవేట్ సిమెంట్ కంపెనీకు ప్రభుత్వం మైనింగ్ కోసం కేటాయించింది. ప్రభుత్వ చర్యపై గౌహతి హైకోర్టు విభ్రాంతిని వ్యక్తం చేసింది. ఇది నిజమా లేక జోకాని ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
బార్ & బెంచ్ వెబ్సైట్ నివేదిక ప్రకారం, ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో ఆగస్టు 12న కోర్టులో గ్రామస్తులు పిటీషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
జస్టిస్ సంజయ్ కుమార్ మెహ్దీ, “దీనిని బట్టి చూస్తే, కంపెనీకి “చాలా పలుకుబడి” ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీకి అనుకూలంగా “దాదాపు జిల్లాలోని సగభాగాన్నేకేటాయించారు”, ఇది అసాధారణం” అని పేర్కొన్నారు.
“ఇది ఏ రకమైన నిర్ణయం? ప్రభుత్వం పరాచికాలాడుతుందా? అలా ఎలా 3,000 బీగాల భూమిని ఒక కంపెనీకి కేటాయిస్తారు? 3,000 బీగాల పరిమాణం ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఇది జిల్లాలో సగ భాగం” అంటూ ప్రభుత్వాన్ని జస్టీస్ మెహ్దీ ప్రశ్నించినట్టు బార్ & బెంచ్ కోట్ చేసింది.
సిమెంటు కంపెనీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, తమకు కేటాయించిన భూమి పూర్తిగా పడావు భూమి అని, కంపెనీ కార్యకలాపాలకు ఇది అవసరమని కోర్టుకు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ దీనిపై బెంచ్ స్పందిస్తూ, “మీ అవసరం సమస్య కాదు, ప్రజా ప్రయోజనం సమస్య” లైవ్లాలో కోట్ చేయబడింది.
గుర్తించాల్సిందేంటంటే, అస్సాంలోని దిమా హసావో జిల్లా భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్డ్ కిందికి వస్తుంది. ఇది స్థానిక తెగల- గిరిజన ప్రజల హక్కులకు, ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది.
త్రవ్వకాల ప్రాజెక్టు నెలకొల్పదలచిన ఉంరాంగ్సో ప్రాంతం దిమా హసావో జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం వసంత కాలంలో పర్యావరణ క్షేత్ర కేంద్రంగా పేరుగాంచింది. అంతేకాకుండా వలస పక్షులు, అడవిజంతువులు ఇక్కడ సేద తీరుతాయి.
ఇరు పక్షాల వాదోపవాదనలను విన్న తర్వాత, మహాబల్ సిమెంటు కంపెనీ భూకేటాయింపుపై తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించి రికార్డులను సేకరించి, సమర్పించాలని, ఉత్తర కచార్ హిల్స్ స్వయం ప్రతిపతి మండలిని కోర్టు ఆదేశించింది.
“వాస్తవాలను గమనిస్తే, ఈ కేసులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3000 బీగాల భూమిని కంపెనీకి కేటాయించాలనుకోవడమే అసాధారణమైన విషయం” అని కోర్టు పేర్కొంది.
ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
అనువాదం: జీ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.