
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షులు వ్లాదిమీర్ పుతిన్ అలాస్కాలో సమావేశమైయ్యారు. భారతదేశం మీద ఈ సమావేశం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? భారతదేశం మీద అమెరికా విధించిన సుంకాలలో దీని వల్ల రాయితీ లభిస్తుందా?
న్యూఢిల్లీ: అలాస్కాలో ఆగస్టు 15నాడు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షులు వ్లాదిమీర్ పుతిన్ సమావేశం అయ్యారు.
ఈ సమావేశం భారత ఆర్ధిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
తెలియాల్సిందేంటే, రష్యా నుంచి భారతదేశం చమురును కొనుగోలు చేయడం వల్ల, శిక్షగా భారతీయ వస్తువుల మీద 50% సుంకాన్ని పెంచుతున్నట్టుగా అమెరికా ప్రకటించింది.
ఇందులో నుంచి 25% పరస్పర సుంకాలు గడిచిన ఆగస్టు 7 నుంచి అమలు చేయబడ్డాయి. అయితే 25% అదనపు సుంకం ఆగస్టు 27 నుంచి అమలుకానున్నది.
ఇటువంటి తరుణంలో ఈ సమావేశం మీద భారతదేశం తన చూపును సారించింది.
ఇంకేంటంటే ఈ సమావేశం, ట్రంప్ దౌత్యపరమైన ఒత్తిడిని తక్కువ చేస్తుందా లేక తీవ్రతరం చేస్తుందానే ప్రశ్నను లేవనెత్తింది.
ట్రంప్- పుతిన్ శిఖరాగ్ర సమావేశంలో చివరికి జరిగిందేంటి?
అధికారిక మాటామంతీ దాదాపు ఉదయం 11:30 గంటలకు మొదలైంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రాయబారి స్టీవ్ విట్కాఫ్తో ట్రంప్ కూర్చున్నారు.
పుతిన్‌తో విదేశాంగ మంత్రి సర్గోయి లావ్రోవ్, సలహాదారు యూరి ఉషకోవ్ ఉన్నారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.
మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వచ్చారు. కానీ, ఎటువంటి ప్రశ్నలకు వీరిద్దరు సమాధానం ఇవ్వలేదు.
అంతేకాకుండా ఈ సమావేశ విజయానికి సంబంధించిన ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.
దీని తర్వాత పుతిన్ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ట్రంప్ సాయంత్రం వాషింగ్టన్ వెళ్లే విమానం ఎక్కారు.
మొత్తం మీద చూసుకుంటే, పుతిన్ పది సంవత్సరాలలో తొలి అమెరికా ప్రయాణం ఆరు గంటల కంటే తక్కువ సమయం నడిచింది.
యుద్ధవిరామం చేయించడంలో ట్రంప్ విజయవంతమైయ్యారా? లేకా సమావేశం ఎటువంటి పురోగతి లేకుండానే ముగిసిందా?
అలాస్కా వెళ్తున్న క్రమంలో ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. ఒకవేళ సమావేశంలో ఒప్పందం కుదరకపోతే, తాను “సంతోషంగా ఉండను” అన్నారు.
ఈ నేపథ్యంలో సమావేశం మీద సర్వత్ర ఉత్కంఠతో పాటు అంచనాలు పెరిగిపోయాయి. సమావేశం తర్వాత ట్రంప్ ఉత్సహాపూరితమైన మాట చెప్పారు. “ఈరోజు మేము నిజంగానే మంచి పురోభివృద్ధిని సాధించామ”ని అన్నారు.
చర్చలు ఇంకా కొనసాగుతాయని ఆయన నొక్కివక్కాణించారు. అంతేకాకుండా మున్ముందు ఇంకా సమావేశాలు జరగుతాయని తెలిపారు. కానీ ఈ సమావేశానికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియజేయలేదు.
తర్వాత ఫాక్స్ న్యూస్‌తో ప్రత్యక్షమైన ట్రంప్ “ఇప్పుడు యుద్ధవిరామ ఒప్పందం చేయించాల్సిన బాధ్యత ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లోదిమీర్ జెలెన్స్కీ మీద ఉంద”న్నారు.
పుతిన్ కూడా ఆశావాద వైఖరితో “మేము నిర్మాణాత్మకమైన, పరస్పర గౌరవప్రదమైన వాతావారణంలో చర్చించాము. అంతేకాకుండా ఇది అర్థవంతమైన- ఉత్పాదకమైనదిగా నిరూపితమైంది” అన్నారు.
ఒకవేళ ట్రంప్ అధ్యక్షులయితే, ఉక్రెయిన్ యుద్ధం మొదలే అయ్యేది కాదని ట్రంప్‌ను అభినందిస్తూ రష్యా అధ్యక్షులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మీద ఒక “దీర్ఘకాలిక- శాశ్వత” పరిష్కారానికి సంబంధించిన మాస్కో డిమాండ్లను పుతిన్ పునరావృతం చేశారు.
అందులో యుద్ధానికి సంబంధించిన “మూల కారణాల” ప్రస్తావన, “సమర్థనీయమైన రష్యా ఆందోళనలు” పరిష్కరించబడాన్ని నిర్ధారించాలి.
అంతేకాకుండా, “యూరోప్- మిగిత ప్రపంచంలో ఒక నిష్పాక్షిక భద్రతా సంతులనం” పునరుద్ధరించడం కూడా భాగంగా ఉంది.
“ప్రస్తుత సంఘటనలను కీవ్- యూరోపియన్ రాజధానులు నిర్మాణాత్మక రూపంగా చూస్తాయని, అంతేకాకుండా అడ్డంకులను ఏర్పాటు చేయవని మేము ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.
సమావేశ అసలైన విజేతగా పుతిన్ నిలిచారా?
వ్లాదిమీర్ పుతిన్ వరకు అలాస్కాలో జరిగిన మాటామంతీ ఒక దౌత్యపరమైన విజయం. ఈ కారణంగా మాస్కోలో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రష్యన్ పార్లమెంట్ ఎగువ సభకు చెందిన విదేశీ వ్యవహరాల కమిటీ అధ్యక్షులు కాన్స్టాంటిన్ కోసాచ్యోవ్ “అలాస్కా సమావేశం, దాని స్వరూప- స్వభావం, ఫలితం, ఇద్దరు అధ్యక్షుల కోసం ఒక కీలకమైన, సంయుక్త విజయానికి ప్రతీక”అని టెలిగ్రాం మీద రాశారు.
“ట్రంప్‌కు పుతిన్ ఏం ఇవ్వలేదు, అయినా కానీ తను ఏదైతే కోరుకున్నారో అవన్నీ తనకు దొరికాయి” ఒక సీనియర్ రష్యా నేత ది గార్డియన్‌కు తెలియజేశారు.
“కొత్త పరిమితులు ఉండకపోవడం, మాస్కో రెడ్ లైన్స్‌ను ట్రంప్ మౌనంగా స్వీకరించడం, అమెరికా అధ్యక్షుడితో సరిసమానంగా భావించబడడంలాంటివన్నీ పుతిన్ గెలుపుకు బలాన్ని చేకూర్చాయ”ని ఆయన చెప్పుకొచ్చారు.
రష్యన్ భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ కూడా ఉక్రెయిన్ విషయంలో మాస్కో మీద ఒత్తిడి పెంచడం నుంచి ట్రంప్ వ్యతిరేకతను అన్నింటికంటే కీలకమైన పరిణామాలలో ఒకటిగా చూపించారు.
పుతిన్ ప్రజాసంబంధాల లక్ష్యాన్ని పొందారనే అభిప్రాయం అమెరికాలో కూడా ఉంది.
“అమెరికా పరాభవం” అని అమెరికన్ పోస్ట్ అభివర్ణించింది.
తన ప్రభావంతమైన రూపంతో ఒక పెద్ద యుద్ధ లక్ష్యాన్ని పుతిన్ పొందారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. “నిషేధిత నియంత పరిధి నుంచి ఆయన బయటపడ్డారు. అంతేకాకుండా, అమెరికా రాష్ట్రపతి ఆయనను ఒక శాంతిదూత రూపంలో స్వాగతించారు. పుతిన్ తన చమురు ప్రాంతం మీద పరిమితులన్ని మాటలను శాంతింపజేశారు. ఆయన ఏది కూడా వదలేదు.”
శిఖరాగ్ర సమావేశం మీద యూరోప్- ఉక్రెయిన్ ఎటువంటి ప్రతిస్పందనను వ్యక్తం చేశాయి?
జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటెన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్ నేతృత్వంలోని యూరోప్ నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్ సౌర్వభౌమాధికారానికి అనుగుణంగా తిరుగులేని మద్దతును ప్రకటించారు. నాటో లేదా యూరోపియన్ యూనియన్‌తో కివ్ భవిష్య సంబంధాలను రష్యా నిర్ణయించలేదని ఉద్ఘాటించారు.
ఎప్పటి వరకతే తమ ప్రకారం, న్యాయపూరితమైన- శాశ్వతమైన శాంతి స్థాపించబడదో అప్పటి వరకు తాము మాస్కో మీద పరిమితులను అలానే ఉంచుతామని, ఆర్థికపరమైన ఒత్తిడిని కొనసాగిస్తామని ప్రకటన ద్వారా తెలియజేశారు.
వ్లాదిమర్ పుతిన్‌తో సమావేశం జరిపే డొనాల్డ్ ట్రంప్ చొరవను బ్రిటన్ ప్రధామంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రోన్ అభినందించారు. కానీ ఎటువంటి మాటామంతితోనైనా ఉక్రెయిన్ కోసం బలమైన భద్రతా గ్యారంటీ కూడా కావాలని వీరిద్దరు ఉద్ఘాటించారు.
కీవ్ ప్రతిస్పందన ఎక్కువ అప్రమత్తతో కూడుకుని ఉంది. ఉక్రెయిన్ను భాగస్వామ్యం చేస్తూ త్రైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. దీనిని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమీర్ జెలెన్స్కీ స్వాగతించారు. కానీ యూరోపియన్ భాగస్వామ్యం అవసరని ఆయన అన్నారు.
అయినప్పటికీ, ఫాక్స్ న్యూస్ మీద ట్రంప్ మాటలు కీవ్‌తో పాటు అనేక యూరప్ రాజధానులలో అలజడిని సృష్టించాయి.
రష్యా- ఉక్రెన్ పరిస్థితిని పోల్చుతూ “రష్యా ఒక పెద్ద శక్తిగా ఉంది, ఇంకా అది(ఉక్రెన్) కాదు” అని ట్రంప్ అన్నారు
జెలెన్స్కీ “ఒప్పందాన్ని కుదుర్చుకోవాల”ని ఆయన చెప్పుకొచ్చారు.
మాస్కో నుంచి అమెరికా పరస్పర గ్యారంటీ పొందకుండానే, కీవ్ మీద రాయితీలను ఇచ్చే ఒత్తిడి వేస్తుందనే దాంతో యూరప్ భయం పెరిగిపోయింది.
యుద్ధవిరామం అనవసరమనే ఇదివరకటి రష్యా వైఖరిని ట్రంప్ పునర్ఘాటించారు.
“అన్నింటికంటే మంచి పద్ధతి సూటిగా శాంతి ఒప్పందానికి చేరుకోవడం. దీంతో యుద్ధం ముగిసిపోతుంది. కేవలం యుద్ధవిరామ ఒప్పందం, అది ప్రతిసారి సరైనదిగా భావించబడదు” అని ట్రూత్ సోషల్ మీద ట్రంప్ రాశారు.
“ట్రంప్ పుతిన్‌తో కలిసి పోయార”నిపిస్తుందని ఉక్రెయిన్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒలెక్సాండర్ మెరెజ్కో ఫైనాన్షియల్ టైమ్స్‌కు తెలియజేశారు. అంతేకాకుండా, వారిద్దరు తమను అనివార్యంగా, శాంతి ఒప్పందాన్ని అంగీకరించేలా మభ్యపెడుతున్నారని ఒలెక్సాండర్ అన్నారు. వాస్తవంలో దీని అర్థమేంటంటే, ఉక్రెయిన్ ఆత్మసమర్పణని చెప్పుకొచ్చారు.
వివిధ వార్తా సంస్థల ప్రకారం, ఈ సమావేశం తర్వాత ఒక ఫోన్ కాల్లో అధ్యక్షులు జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులతో ట్రంప్ మాట్లాడారు. ఒకవేళ ఉక్రెయిన్ తమ డొనెట్రస్క్, లుగామ్స్క్ ప్రాంతాలను పూర్తిగా అప్పజెప్తే, ఎక్కువ భాగం ఫ్రంట్‌లైన్‌ను మూసివేస్తామని పుతిన్ ప్రతిపాదించినట్టుగా ట్రంప్ వారికి తెలియజేశారు.
జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను అంగీకరిచలేదని రాయిటర్స్ తెలియజేసింది. అయితే, ట్రంప్ రాబోయే వాషింగ్టన్ ప్రయాణం సందర్భంగా, తనతో ప్రాంతీయ అంశం మీద చర్చించడానికి సన్నద్ధంగా ఉన్నారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నది.
ఈ సమావేశం మీద న్యూఢిల్లీ ఎలా ప్రతిస్పందించింది?
అమెరికా అధ్యక్షులు ట్రంప్, రష్యా అధ్యక్షులు వ్లాదిమీర్ పుతిన్ మధ్య అలాస్కా శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం స్వాగతించింది. అంతేకాకుండా దీనిని చర్చించే దిశలో ఒక సకారాత్మక అడుగుగా అభివర్ణించింది.
“ట్రంప్, పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం స్వాగతిస్తుంది” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
“ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారం కోసం చర్చలను, దౌత్యాన్ని కొనసాగించే మార్గంగా న్యూఢిల్లీ ఎప్పటికీ పేర్కొంటుంద”ని ఆయన చెప్పుకొచ్చారు.
గుర్తించదగినది ఏంటంటే, న్యూఢిల్లీ ప్రతిస్పందనను ఉపశమనం దృష్టి నుంచి చూడాల్సి ఉంటుంది. చర్చల మీద దృష్టిని సారించడం వల్ల భారత దేశం కోసం సంభావ్య అవకాశం ఏర్పాటవుతుంది. అది వాషింగ్టన్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యా శక్తి మీద ఎక్కువగా ఆధారపడడం మధ్య చిక్కుకుపోయింది.
రష్యా చమురు కొనుగోలు మీద అమెరికా 25% ద్వితీయ పరిమితుల తర్వాత, భారతీయ వస్తువులకు సుంకాన్ని పెంచి 50% ఎప్పుడైతే చేసిందో, అప్పుడు ఆగస్టు నెల ప్రారంభంలో ఈ ఒత్తిడి ఇంకా పెరిగిపోయింది.
అమెరికా సుంకాల నుంచి భారతదేశానికి ఉపశమనం లభిస్తుందా?
డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఉక్రెయిన్ ఒప్పందం కోసం మాస్కోను ప్రేరేపించే తాజా ప్రయత్నం కొత్త ప్రశ్నను లేవనెత్తింది. అదేంటంటే, భారత దేశానికి భారీ అమెరికా సుంకాల నుంచి ఉపశమనం లభిస్తుందా?
సమావేశానికి రెండు రోజుల ముందు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడారు. ఒకవేళ ఈ సమావేశం అనుకున్నట్టుగా జరగకపోతే, ట్రంప్ భారతదేశం మీద ద్వితీయ సుంకాలను పెంచే అవకాశాలు ఉంటాయని అన్నారు.
టారిఫ్ వల్ల రష్యా చమురును కొనుగోలు చేయడం భారత దేశం ఆపెయ్యాల్సి ఉంటుందని అలాస్కా వెళ్లే సమయంలో ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు తెలియజేశారు.
అలాస్కాలో సమావేశాన్ని భారతదేశానికి “భరోసా కలిగించేది”గా పాకిస్తాన్ మాజీ భారత రాయబారి అజయ్ బిసారియా పేర్కొన్నారు.
“అన్నింటికంటే మంచి వార్తా ఏంటంటే, సమావేశం జరిగింది”అని ఆయన ది వైర్‌కు తెలియజేశారు.
“ఏదైన కూడా సమస్యకు సంబంధించిన ఎటువంటి విభ్రాంతికి గురిచేసే పరిణామం రాలేదు”అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా “ఆ బంధం పూర్తిగా తెగిపోయే” ఎటువంటి సంకేతం దొరకలేదని అన్నారు.
“ఎటువంటి సంకేతలున్నాయంటే, భారత దేశానికి 25శాతం పరిమితుల కోసం ఇంకా సమయం ఇస్తారు. లేదా వాటిని వెనక్కి తీసుకుంటారు. ఇదికాకపోతే దానికి ఇంకా దీర్ఘ సమయాన్ని కేటాయిస్తారు” అని బిసారియా తెలియజేశారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
(ఈ వార్తను ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.