
అస్సాం పోలీసుల ద్వారా ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్, కన్సల్టింగ్ ఎడిటర్ కరణ్ థాపర్ మీద నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్, చాలా రోజుల ప్రయత్నాల తర్వాత చివరికి ఆగస్టు 20 లభించించడం జరిగింది. వైర్‌కు సంబంధించిన చాలా మంది పాత్రికేయుల, వ్యాసకర్తల పేర్లు అందులో నమోదు చేయబడ్డాయి.
న్యూఢిల్లీ: అస్సాం పోలీసుల ద్వారా ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్, కన్సల్టింగ్ ఎడిటర్ కరణ్ థాపర్‌కు వ్యతిరేకంగా నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్ చాలా ప్రయత్నాల తర్వాత చివరాఖరికి ఆగస్టు 20న అస్సాం పోలీసుల వైబ్‌సైట్ నుంచి లభించింది.
2025 మే 9న ది వైర్ మీద అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. గువాహటీ పీఎస్ క్రైం బ్రాంచ్ నుంచి ఎఫ్ఐఆర్ 3/2025 సంఖ్యతో కూడిన ఒక ప్రతి లభించింది. సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్‌తో పాటు ఇతర పలువురు ముఖ్యమైన వ్యక్తుల పేర్లు ఇందులో నమోదు చేయబడ్డాయి.
ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడిన వారిలో జమ్మూ కశ్మీర్, మేఘాలయ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఉన్నారు. ఆయన ఈ నెల ప్రారంభంలో చనిపోయారు. దీంతో పాటు పాత్రికేయులు నజామ్ సేథి, ది వైర్ హిందీ సంపాదకులు అశుతోష్ భారద్వాజ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడింది.
దీంతోపాటు, పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత ది వైర్ ద్వారా ప్రచురితమైన 12 వ్యాసాల పూర్తి లేదా పాక్షిక శీర్షికలను ఎఫ్ఐఆర్లో జాబిత చేశారు. కింద సూచించిన రచయిత లేదా ఇంటర్యూ చేయబడిన అంశం(ఎఫ్ఐఆర్లో పేరు లేదు)అని ఇందులో పేర్కొనబడింది. ది ట్రిబ్యున్ మాజీ సంపాదకులు హరిశ్ ఖరే, అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండోషన్ సీనియర్ ఫెలో మనోజ్ జోశీ, మాజీ ఇంటిలీజెన్స్ బ్యూరో అధికారి అవినాశ్ మోహ్నానే, రా పూర్వ ప్రముఖులు ఎఎస్ దులత్, కల్నల్ (రిటైర్డ్) అజయ్ శుక్ల, సరిహద్దు భద్రతా దళం మాజీ ఏడీజీ ఎస్కే సూద్, సీనియ్ పాత్రికేయులు ఆనంద్ సహాయ్, విద్యావేత్త రోహిత్ కుమార్, సీనియర్ డిఫెన్స్ జర్నలిస్ట్ రాహుల్ బేదీ, పరిశోధకులు నిర్మణ్య చౌహాన్, మాజీ భారతీయ సైన్యాధికారి అలీ అహ్మద్ పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి.
ఈ విషయంలో సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్‌కు సమన్లు జారి చేయబడ్డాయి. అయితే, వారికి ఎఫ్ఐఆర్ ప్రతి, దాని తేదీ లేదా అసలు విషయానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. గువాహటీలోని విచారణ అధికారి(ఐఓ)కి ఎఫ్ఐఆర్ కావాలని ది వైర్ ప్రతినిధి విన్నవించారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) కోర్టు నుంచి ప్రతి పొందాలని ఆయన సూచించారు. లేదా డిప్యూటీ కమీషనర్‌ను అడగాలని తెలియజేశారు.
ఈ కేసులో ది వైర్, కరణ్ థాపర్ ద్వారా డిప్యూటీ కమీషనర్‌కు ఒక ఈమెయిల్‌ను పంపించడం జరిగింది. ఎందుకంటే, స్పీడ్ పోస్ట్ సేవలలో దేశవ్యాప్తంగా అంతరాయం ఉంది. వారి సర్వర్లు డౌన్ అవ్వడం వల్ల, సేవలు ఆలస్యమవుతున్నాయి.
ఈ సమన్లకు సమాధానం వాట్సాప్ ద్వారా ఐఓకు పంపించాలని, ఈమెయిల్ ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు పంపించాలని, ఇంకా సమాధాన ఒక ప్రతి స్థానిక న్యాయవాది ద్వారా అందజేయాలని సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్ నిర్ణయించుకున్నారు.
ఆగస్టు 16(శనివారం), ఆగస్టు 18(సోమవారం), ఆగస్టు 19(మంగళవారం)నాడు సీజేఎం కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ను పొందాలనే ప్రయత్న జరిగింది. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైయ్యాయి. చివారాఖరికి, ఆగస్టు 20నాడు సుమారు మధ్యాహ్నం అస్సాం పోలీసు వైబ్‌సైట్ మీద వైర్‌కు ఎఫ్ఐఆర్కు సంబంధించిన ఒక ప్రతి లభించింది.
ఈ కేసుకు సంబంధించి పలుపురు ప్రముఖులు స్పందించారు. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, వార్తా పత్రికల సంపాదకులతో పాటు, ఇతర సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని, ఇంకా పాత్రికేయులను ఇబ్బంది పెట్టడానికి సమన్ జారీ చేసే విధానం, ఇంకా ఎఫ్ఐఆర్ను బహిరంగపరచకపోవడం వంటి వాటిని విమర్శించారు.
2025 ఆగస్టు 14న సాయంత్రం గువాహాటీ పాన్‌బజార్ క్రైం బ్రాంచ్ నుంచి వరదరాజన్‌కు మొదటి సారి ఒక సమన్ ప్రతి లభించింది. దీని తర్వాత ది వైర్ ఒక ఎఫ్ఐఆర్ ప్రతిని పొందడానికి కింది ప్రయత్నాలను అనుసరించింది.
♦ ఆగస్టు 14వ తేదీన సాయంత్రం మొత్తం, దాని తర్వాత కూడా ప్రతిరోజూ అస్సాం పోలీసు వైబ్‌సైట్‌ను చెక్ చేయడం జరిగింది.
♦ విచారణ అధికారి, పాన్‌బజార్ నేరశాఖ తెలియజేసిన ముబాయిల్ నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపి ఆగస్టు 15 ఎఫ్ఐఆర్ ప్రతిని అడగడం జరిగింది.
♦ ఆగస్టు 16న స్పీడ్ పోస్ట్ పంపించడం జరిగింది(ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వల్ల సెలవు వచ్చింది). అయితే, భారతీయ పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా సమస్యల వల్ల ఈ సేవకు అంతరాయం ఏర్పడింది.
♦ అస్సాంకు చెందిన స్థానిక న్యాయవాదితో ఆగస్టు 16, ఆగస్టు 18నాడు స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ ప్రతిని పొందే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది.
♦ విచారణ అధికారి నుంచి ఎఫ్ఐఆర్ ప్రతిని పొందాలనే సూచనలు పలువురు విలేకరుల ద్వారా అందాయి. డీసీపీ మాత్రమే ఈ ప్రతిని ఇస్తారని వారు చెప్పారు. అయితే, ది వైర్ ఈ ప్రయత్నం చేయలేదు.
♦ ఆగస్టు 17( ఆదివారం)రాత్రి అస్సాం ప్రెస్ సీనియర్ సభ్యుల ద్వారా ప్రయత్నాలు జరిగాయి. ఎన్ఈ నౌ సంపాదకులు మానస్ డేకా ఫోన్లో మాట్లాడుతూ, కేవలం డీసీపీ మాత్రమే ఎఫ్ఐఆర్ అందజేస్తారని తెలియజేశారు.
♦ క్రాస్‌కరంట్, ఢిల్లీ టైమ్ పాత్రికేయులు పదేపదే ప్రయత్నించిన కారణంగా విచారణ అధికారిని సంప్రదించలేకపోవడం జరిగింది. డీసీపీ క్రైంను సంప్రదించే ప్రయత్నాన్ని ఒక జాతీయ వార్తా సంస్థ చేయడం జరిగింది. కానీ సంప్రదించడం కుదరలేదు.
♦ ఆగస్టు 18, నాడు అర్థరాత్రి ది వైర్ ద్వారా డీసీపీకి ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది.
♦ ఆగస్టు 19, విచారణ అధికారి, సౌమరాజ్యోతి రేను ది వైర్ స్థానిక తరఫు గువాహటీ స్థానిక న్యాయవాది కలిశారు. అంతేకాకుండా ఈమెయిల్, వాట్సాప్, స్పీడ్ పోస్ట్ మీద ముందే పంపిన సమాధాన ఓ ప్రతి రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఒక ఎఫ్ఐఆర్ ప్రతిని అడిగారు.
♦ వారు సీజేఎం కోర్ట్ కామరూప(మెట్రో) గువాహటీలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
♦ విచారణ అధికారిని కలిసిన తర్వాత, సీజేఎం కోర్ట్ కామరూప(మెట్రో) గువాహటీ నుంచి ఎఫ్ఐఆర్ ప్రతి పొందడానికి మరోసారి మళ్లీ ప్రయత్నించడం జరిగింది.
♦ ది వైర్ స్థానిక న్యాయవాది ఆగస్టు 19న సీజేఎం కోర్టులో ఎఫ్ఐఆర్ ప్రతి కోసం దరఖాస్తు చేశారు.
♦ వివిధ మీడియా సంస్థలు ఈ చర్యను, ఎఫ్ఐఆర్ను అందరికీ కనబడేలా పెట్టని విధానాన్ని విమర్శించాయి.
♦ ఆగస్టు 19న మధ్యాహ్నం- ది వైర్ ద్వారా సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేయడం జరిగింది. అందులో నేర శాఖ ద్వారా సమన్ జారీ చేయడాన్ని ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడాన్ని కోర్టు దృష్టిలోకి తేవడం జరిగింది. అస్సాం పోలీసు న్యాయవాదికి ఈ దరఖాస్తును పంపించడం జరిగింది.
♦ ది వైర్ తరఫు నుంచి అస్సాం పోలీసు వైబ్‌సైట్ మీద లోతైన శోధన చేసిన తర్వాత, కొన్ని ఫలితాలు లభించాయి. ఎఫ్ఐఆర్ నంబర్ 3/2025 ఎంట్రీ ద్వారా, 2025 మే 9న నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్ అని తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అంశాన్ని డౌన్లోడ్ చేయడం సాధ్యం కాలేదు.
♦ ఆగస్టు 20, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు: మే 9న నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్ ఎంట్రీ ప్రతిని డౌన్లోడ్ చేయడానికి మరో సారి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ అయ్యింది. అస్సాం పోలీసు వైబ్సైట్లో ప్రస్తుతం లింక్ ద్వారా ఎఫ్ఐఆర్ అందుబాటులో ఉంది.
పూర్తి ఎఫ్ఐఆర్ను చదవగలరు..
ఈ నేపథ్యంలో, “పాత్రికేయవృత్తిని నేరంగా చూపే ప్రయత్నాలలో ఈ ఎఫ్ఐఆర్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది” అని మీడియా పర్యవేక్షణ సంస్థలు, పాత్రికేయులు- ప్రతిపక్ష నేతులు అభివర్ణించారు.
“ప్రశ్నించడం, విభిన్న ఆలోచనలను ప్రోత్సహించడం, జాతీయ భద్రతతో కూడిన కీలక అంశాలను ప్రజలకు తెలియజేయడం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన చర్చ, చర్చా పూరిత వాతావరణానని సృష్టించడం ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నార”ని వాపోయారు.
గుర్తించాల్సిందేంటే, క్లిష్టమైన సమయాల్లో దేశం- సమాజం కోసం ముఖ్యమైన సమస్యలను లేవనెత్తి, చర్చిండంలో భారతీయ మీడియాకు గౌరవప్రదమైన చరిత్ర(రికార్డ్) ఉంది. 1975లో అత్యవసర పరిస్థితి కానీ, దేశ ఆర్థిక లేదా ఇతర సంక్షోభాల సమయంలో కానీ ఇది రుజువు అయ్యింది.
ఈ పరంపరను కొనసాగించడం మా హక్కు మాత్రమే కాదు. భారతదేశంలో స్వతంత్ర ప్రెస్ సభ్యులందరి కర్తవ్యం కూడా. ఏ ప్రజాస్వామ్యమైతే సజీవమైన ప్రెస్‌కు అనుమతి ఇవ్వదో, అది నామమాత్రపు ప్రజాస్వామ్యంగా పరిగణించబడుతుంది.
పూర్తి ఎఫ్ఐఆర్ చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.