సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, కేంద్రియ మంత్రి సురేశ్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉన్నతకులానికి చెందిన వ్యక్తిని ఆదివాసీ సంబంధిత మంత్రిని చేయాలి, వెనుకబడ్డ కులానికి చెందిన వ్యక్తిని ఉన్నతకుల సాధికారత మంత్రిగా చేయాలి’’అని సురేశ్ గోపీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆయన తన మాటలను ఉపసంహరించుకున్నారు.
న్యూఢల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ మాట్లాడిన ఒక్క మాటతో రాజకీయపరంగా వివాదం రాజుకుంది. ‘‘ఉన్నత కులా’’నికి చెందిన వ్యక్తిని ఆదివాసీ సంబంధిత మంత్రిని చేయాలని, ‘‘వెనుకబడ్డ కులా’’నికి చెందిన వ్యక్తిని ఉన్నతకుల సాధికార మంత్రిగా చేయాలని అన్నారు.
ద హిందూ రిపోర్ట్ ప్రకారం సురేశ్ గోపీ వాఖ్యల తర్వాత పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సురేశ్ గోపీ స్పందిస్తూ ‘‘ఇలా అనడం వెనుక నాకు సదుద్దేశం మాత్రమే ఉంది, ఎవరైనా నా మాటలతో సంతోషంగా లేకపోతే నేను వాటిని ఉపసంహరించుకుంటున్నాను.’’ అని అన్నారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఈ క్రమంలో తూర్పు ఢల్లీలోని మయూర్ విహార్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. మయూర్ ప్రాంతంలో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు. బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్రమంత్రి సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఆదివాసి కాని వ్యక్తి ఆదివాసి సంబంధిత మంత్రి కాకపోవడం మన దేశానికి మరో శాపం. ఆదివాసి సముదాయ ఉద్ధరణ(సాధికారత)కోసం ఎవరైనా ఉన్నత కులానికి చెందిన వ్యక్తి ఆదివాసి సంబంధిత మంత్రి కావాలి, ఇది నా కోరిక ఇంకా కల కూడాను. ఒకవేళ ఎవరైనా ఆదివాసి వ్యక్తికి ఆదివాసి సంబంధిత మంత్రి కావాలని ఉంటే, అతనికి ఉన్నతకుల సాధికారత మంత్రి పదవిని ఇవ్వాలి. ఈ మార్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రావాలి’’ అని తెలిపారు.
‘‘ఆదివాసి విషయాలను బ్రాహ్మణ లేదా నాయుడు కులానికి చెందిన వారిని చూడనివ్వండి, చాలా పెద్ద మార్పు వస్తుంది. దీని గురించి నేను మోదీని అభ్యర్ధించాను, కానీ ఈ విషయాలలో కొన్ని నియమ- నిబంధనలు ఉన్నాయి.’’
అంతేకాకుండా గోపీ ఇంకా మాట్లాడుతూ ‘‘నాకు పౌర విమానయాన శాఖ వద్దు, దీని బదులుగా గిరిజన వ్యవహారాల శాఖ ఇవ్వాల్సిందిగా 2016లో నేను రాజ్యసభ ఎంపీ అయినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాను.’’ అని చెప్పారు.
ఆయన వ్యాఖ్యల మీద వివాదం నెలకొన్న తర్వాత ‘‘ఆదివాసీల సంబంధిత విషయాలను చూడడానికి ఒక ఉన్నత కులానికి చెందిన వ్యక్తి రావాలని, వెనుకబాటు కులానికి చెందిన వ్యక్తి ఉన్నత కులం సమస్యలను చూడాలని నేను అన్నాను. సదుద్దేశంతో కూడుకున్నవి నా మాటలు, మనం ప్రస్తుత వ్యవస్థ నుంచి వేరు అవ్వాలని మాత్రమే నేను అన్నాను. కానీ ఈ మాటలు సరిగా లేవని మీకు అనిపిస్తుంది. అయితే నేను వీటిని వెనక్కి తీసుకుంటున్నాను.’’ అని స్పష్టం చేశారు.
గోపీ వ్యాఖ్యలపై కేరళలో దుమారం..
హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం గోపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వ విమర్శలను ఎక్కుపెట్టారు. ఆయనను చాతుర్వర్ణ వ్యవస్థకు ప్రచారకర్తగా చూపారు. వెంటనే ఆయనను కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు.
‘‘ఆయన తన వాఖ్యలను వెనక్కి తీసుకోగలరు ఇంకా క్షమాపణలు అడగగలరు. కానీ దేశ ప్రజలు ఆయన మాటలను విన్నారు. ఆయన, ఆయన పార్టీ చాతుర్వర్ణ వ్యవస్థ సమర్ధకులు. వారు మనుస్మృతి, దాని జాత్యాహంకార ఆలోచనలను బలపరుస్తారు.’’ అని బినయ్ విశ్వ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
‘‘గోపీ మాటలు ఆయన చేసిన రాజ్యాంగ ప్రమాణ ఉల్లంఘానికి నిదర్శనం’’ అని ప్రముఖ సీపీఐ(ఎం) నేత, అలాథూర్ ఎంపీ కే రాధాకృష్ణన్ మండిపడ్డారు.
‘‘ఆయన రాజ్యాంగ ప్రమాణం చేశారు. అందరు పౌరులు సమానమని రాజ్యాంగంలో చెప్పబడింది. ఆయన మాటలు రాజ్యాంగ సిద్ధాంతాల ఉల్లంఘన అవుతుంది. దానికి తోడు ఉన్నత కులానికి చెందిన వ్యక్తి అని ఎవరు నిర్ణయిస్తారు?’’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నిథన్ స్పందించారు. ‘‘గోపీ వ్యాఖ్యలు ఆయన ‘‘రాజకీయ అపరిపక్వత’’ను సూచిస్తుంది. ఎవరైతే వ్యక్తి తన ప్రస్థావనాన్ని భూమి నుంచి మొదలుపెట్టి రాజకీయ నిచ్చెన అగ్రశ్రేణి వరకు చేరుకుంటాడో అతను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడడు. అతనికి ఇంకా ఎక్కువ రాజకీయ అనుభవ అవసరం ఎంతైనా ఉంది.’’ అని అన్నారు.