ఇదేంటి…నా అంతరాంత రాలలో..పాశవికుల గుంపు మెల్లిగా కదులుతున్నది ?
నేను కూడా హింసాత్మకుడిని అయిపోతూ ఉన్నానా!
నాలో మానవత్వం నశించింది.
ఈ క్రూరారణ్యపు కోలాహలంలో…
మెల…మెల్లగా నేను కూడా క్రూరుడ్ని కావటం లేదు కదా?
……….
ప్రతి చూపూ అచ్చం మృగపు చూపై వెంటాడుతున్నది !
నేను కూడా ఈ గుంపులో కలిసిపోయి సంస్కారాన్ని…నాగరికతని పోగొట్టుకుని…
మళ్ళీ జంతువులా మారడానికేనా ఇలా పరిగెడుతున్నది?
……..
చూడండి..ఇక్కడ ప్రతీ ధర్మమూ హింసాత్మకం గా మారిపోయింది!
యుగాల క్రితమే సమాజ మర్యాదల్ని ఈ ధర్మమే పక్కాగా తయారు చేసి పెట్టింది.
ఈ రోజు ద్వేషపు అడవి నలుదిక్కులా విస్తరిస్తున్నది.
ఇక్కడ ప్రతి ఒక్కరినీ ఊచకోతల కలలే వెంటాడుతూ ఉన్నాయి.!
ఏం చేయను…నా చేతిలో ఏ ఆయుధమూ లేదు.
కవిత్వం రాయడం తప్ప!
బహుశా..అందుకే నాలో కొంచెం మానవత్వం మిగిలే ఉంది.
ఎన్ని కవితలు రాస్తేనేం?
ఏమో పోయి..పోయి..ఈ క్రూరుల్ని ఢీ కొనవు కదా నా కవితలు?
మూలం- శరణ్ కుమార్ లింబాలే మరాఠీ.
హిందీ – రీనా త్యాగి.
తెలుగు – గీతాంజలి
…………