![Broken Tea Cup](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-16-at-14.23.41.jpeg)
Reading Time: < 1 minute
తిర్ఖా కప్!
బీటలు వారిన చాయ్ కప్పులా ఉన్నాడతడు
అచ్చం పట్టుకోవడానికి హ్యాండిల్ లేని కప్పులా.
పెదాలను కాలుస్తుందేమో అన్న భయంతో
ఎవరూ కూడా ఆ కప్పుని నోటి దాకా
తీస్కెళ్లరు.
పోనీ చేతుల్లోకి తీస్కుందామంటే
దానిలోని సలసలమనే వేడి చేతివేళ్లను కాల్చేస్తుంది.
అతనలాంటి ఛాయ్ కప్పులాంటి వాడు..
ఎప్పుడూ సెగలు కక్కుతూ ఉండేవాడు
సహనం చచ్చిన అతని బాస్ ఒక రోజు ఆ చాయ్ కప్పుని
ఆఫీసు నుంచి ఉక్రోషంగా బయటకు విసిరి
“నడువు బయటకి దళితుడా”… అంటాడు.
అంతే .. వెంటనే
ఆఫీసులో అందరి మొఖాలు
చాయ్ కప్పులా పగుళ్లు వారి పోయాయి.
గుల్జార్ ఉర్దూ దళిత కవిత్వం
అనువాదం – గీతాంజలి