
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలున్న ఉక్రేయిన్లోని కొన్ని ప్రాంతాలపై అగ్రరాజ్యం కన్ను పడింది. అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూ భాగాలలో ఈ అరుదైన నిక్షేపాలు నిగూఢంగా ఉన్నాయి. ఇటీవలి కాలం వరకు ఈ అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు తెలిసేది కాదు. వ్యవసాయ భూములుగానే ఉక్రేయిన్ భూభాగాలుండేవి. పెద్ద రాతి నిక్షేపాలు ఈ ప్రాంతంలోఉన్నట్లు గుర్తించిన తర్వాత అగ్రరాజ్యం ఆసక్తి పెరిగి పోయింది. ఇప్పటి వరకు చైనా అరుదైన ఖనిజాలను ప్రాసెస్ చేసే పనిలో ఉండటంతో ఈ రంగంలో చైనా ప్రాధాన్యతను అమెరికా అంగీకరించటంలేదు. నిజానికి ఈ నిక్షేపాలను వెలికి తీయటం, శుద్ధి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అసలు ఈ నిక్షేపాలు వెలికి తీతే అధిక వ్యవ ప్రయాసలతో కూడినదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఆశలను వదులకోవడంలేదు. రష్యా కూడా అమెరికా ఆసక్తిని గుర్తించి ఒప్పుకోలు సందేశాన్ని పంపింది. అంటే అసలు భూభాగాలు ఉక్రెయిన్‌వి. ఖనిజ నిక్షేపాలను కోరుకొంటున్నది. అమెరికా అంగీకారం తెలిపింది రష్యా
అత్తసొమ్మును అల్లుడు దానం చేసినట్టు!
అమెరికా 300 నుంచి 500 బిలియన్ డాలర్ల సాయం ఉక్రెయిన్‌కు ఇచ్చిందని దానికి బదులుగా ఉక్రెయిన్ ఖనిజ నిక్షేపాలను 50% మేర రాయితితో ఇవ్వాలని అమెరికా ప్రతిపాదన!
ఈ అరుదైన ఖనిజ నిక్షేపాలలో బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాలు మొదలైన వాటి తయారీలో కీలకం!
ఇప్పటి వరకు చైనా ఈ అరుదైన ఖనిజాలపై ఆధిపత్యం కలిగి ఉన్నందున ఎట్లాగైనా చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని భావిస్తున్న అమెరికా ఉక్రెన్ ఖనిజ నిక్షేపాలను కోరుకుంటుంది. చైనా అరుదైన ఖనిజాల వెలికితీతలో 70% దాకా వాటాను కలిగి ఉండటం అమెరికాను కలవర పెడుతుంది. నిజానికి ఖనిజాల వెలికితీత నుండి వాటిని ఉపయోగంలోకి తెచ్చే ప్రాసెసింగ్ అంత సులభం కాదు! చైనా ఈ పనిలో నైపుణ్యం కలిగి ఉందన్నది కాదనలేని విషయం! చైనాపై ఆధారపడటాన్ని జీర్ణించుకోలేని అమెరికా ఈ ఖనిజాలపై కన్నేసింది.
అరుదైన అత్యంత కీలక ఖనిజాల జాబితాల 30లో 21 రకాలు ఖనిజాలు ఉక్రెయిన్ భూభాగాలలో లేదా రష్యా ఆక్రమించిన భూభాగాలలో ఉన్నాయి. అమెరికాతో కొత్త స్నేహం చిగురిస్తున్న వేళ రష్యా ఖనిజాలను అమెరికా తీసుకోవడానికి అభ్యంతరం చెప్పటం లేదు!
క్రిస్టలైజ్ షీల్డ్ రూపంలో ఉన్నాయి. అట్లాగే అపార గ్రాఫైట్ నిల్వలుండటం వీటిని ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఉపయోగపడతాయి. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ లిథియం నిల్వలు ప్రపంచంలో అత్యధికంగా 3వంతు ఉక్రెయిన్ భూభాగాలలో ఉన్నాయి. టైటానియం నిల్వలు 7% వరకు ఉక్రెయిన్ వెలికి తీసేది. టైటానియం యుద్ధ విమానాలు, విద్యుత్ కేంద్రాల తయారికీ ప్రధాన ముడి సరుకుగా ఉంటుంది. 350 బిలియన్ డాలర్ల ఖనిజ నిల్వలు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్ళాయి.
అరుదైన ఖనిజాలు:
స్కాండియమ్, వాయిట్రియమ్, లేంథనమ్, సీరియమ్, ప్రెసిడోనియమ్, నియోడైమియం, ప్రోమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం లాంటి అరుదైన ఖనిజాలు ఉక్రెయిన్ భూభాగాలలో ఉన్నాయి.
డా. సుంకర రమేశ్
ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు
మొబైల్ : 94921 80764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.