
యూపీఎస్సీ కి ఆశావాహుల ప్రశ్నలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా యువతరానికి జీవితంలో ఏదో ఒక రోజు యూపీఎస్సీ ర్యాంకర్ గా నిలవాలన్న కోరిక ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియామకాల సంస్థ. కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలకమైన హోదాలకు జరిగే నియామకాల కోసం అర్హులైన అభ్యర్థులను గుర్తించడం ఈ సంస్థ ప్రధానమైన కర్తవ్యం. ఈ సంవత్సరం నిర్వహించే పరీక్షలలో ర్యాంకులు సాధించడానికి యువత జీవితాంతం అహర్నిశలు పనిచేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో upsc పరీక్షలు నిర్వహించిన విధానం లో వెలుగు చూసిన అనేక దురదృష్టకర ఘటనలు దేశ యువత కంటున్న రంగుల కలలను కల్లలు చేస్తున్నాయి.
” ఒకప్పుడు యూపీఎస్సీ పరీక్షల్లో పాస్ అయ్యి బాధ్యతలు చేపట్టడం అంటే కీర్తి కిరీటంగా భావించే వాళ్ళం. ఇప్పుడు అదే యూపీఎస్సీ ని నిలదీస్తూ వీధుల్లోకి వచ్చాము” అంటున్నారు దేవ్. యుపిఎస్సి పరీక్షల్లో పోటీపటానికి పరీక్షల నిర్వహణలో యుపిఎస్సి అసమర్థతను ప్రశ్నిస్తున్నారు.
యూపీఎస్సీ వ్యవహార శైలితో విసుగు చెందినవారాలలో దేవ్ ఒక్కడే కాదు. అనేకమంది ఆశావహులైన యువత, వారి తల్లిదండ్రులు, రిప్లై ఇస్తున్న సంస్థలు జూన్ 218వ తేదీ జరిగిన పరీక్షల తతంగాన్ని ప్రశ్నిస్తున్నారు.
జూన్ 11వ తేదీన సివిల్ సర్వీస్ భర్తీకి జరిగిన ప్రాథమిక పరీక్షల ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణపై లేవనెత్తిన సందేహాలను పరీక్షలను సిద్ధం అయ్యే భారం కొద్దిగా పుస్తకాల మోత పూర్వపు ప్రసన్న పత్రాలు ఇటువంటి వాటి బరువుగ్యంగా పాతిపెట్టారు. ఆ సందేహాలు అన్ని ఇప్పుడు ప్రాణం పోసుకుంటున్నా యి. సమాధానం లేని సమస్యలు, మొత్తానికి సంబంధించిన ఆరోపణలు తో యూపీఎస్సీ తడిసి ముద్దయింది. యూపీఎస్సీ పై వస్తున్న ఆరోపణలు, అందుకు కారణమైన సమస్యలు వంటి అంశాలపై ద వైర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన అభ్యర్థులను వారికి శిక్షణను ఇచ్చిన ఉపాధ్యాయులను కలిసింది.
ప్రశ్నలకు సమాధానాలు – అందులో గందరగోళాలు
తాజాగా ఢిల్లీలోని రాజేంద్రనగర్ లో జరుగుతున్న ఆందోళనలు విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థి శివం సింగ్ దుబాయ్ తో మాట్లాడుతూ సివిల్స్ పరీక్షలకు యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాలు వింతగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది సోంసింగ్ ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో వింత వింత దూరంలో వ్యక్తమయ్యాయని ప్రస్తుతం పరీక్షలు రాసిన వారు గతంలో పరీక్షలు రాసిన వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉదాహరణకు శివం సింగ్ ట్రిప్లేట్ వివాదం గురించి ప్రస్తావిస్తున్నారు ఈ వివాదం 2025 యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రమే తెర మీదకు వచ్చింది. ఈ వివాదం యూపీఎస్సీ ఆశావహుల నమ్మకాన్ని వమ్ము చేసింది. యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేవారు ఒకే గదిలో ఒకే వరుసలు ఒకే రోల్ నెంబర్ తో మన విద్యార్థులు మెయిన్స్ కు ఎంపిక అవుతున్న విలక్షణ వైనాన్ని పరీక్షార్ధులు గమనిస్తున్నారు. ఇది కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న మోసంలో భాగమేనని విద్యార్థులు భావిస్తున్నారు.
దేశంలో ఉన్న 1105 ఖాళీలకు గాను 2024 జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 79 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ఇందులో 13 లక్షల 40 వేల మంది హాజరయ్యారు. 2023 సంవత్సరానికి గాను 13 లక్షల 30 వేల మంది హాజరయ్యారు. అంటే ప్రతి సంవత్సరం యుపిఎస్సి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులో కేవలం 0.2 శాతం మాత్రమే అన్ని రకాల పరీక్షలు పూర్తిచేసి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు పరీక్షల నిర్వహణపై వస్తున్న ఆరోపణలకు యూపీఎస్సీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించి వచ్చిన మరో ఆరోపణ పేపర్ లీకేజీ సంబంధించిన విషయం. సరిగ్గా దేశవ్యాప్తంగా 79 కేంద్రాలలో జరిగే పరీక్షలకు ఒక రోజు ముందు అంటే మే 24వ తేదీ గుజరాతీ పత్రికలో ప్రశ్నాపత్రాలు లీకేజీ గురించి వివరాలు వచ్చాయి. ఈ విధంగా లీక్ అయిన ప్రశ్న పత్రం రాజ్కోట్ లో 30000 రూపాయలు చొప్పున అమ్ముడుపోయింది. మర్నాడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు. అంతటితో సరిపోదు అన్నట్లు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎన్నికైన విద్యార్థులలో గుజరాత్రికి చెందినవారు 300 మంది ఉన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఎంతమంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఒత్తిడి కావటం వీడియో రికార్డు.
కొలకత్తా నుంచి తొలిసారి ఈ పరీక్షల్లో పాల్గొన్న కాజల్ చటర్జీ ఈ పరిణామాల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. “ప్రశ్నాపత్రాలు విషయంలో చెప్పనలవి కానన్ని గందరగోళాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చిన పథకంలో కనీసం 8 నుంచి పది ప్రశ్నలకు సమాధానాలు కందరగోళంగా ఉన్నాయి. ఇటువంటి గందరగోళపు ప్రత్యామ్నాయ సమాధానాలు ఇవ్వటంతో తమకు నచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కావలసిన సమాధానాలను ఖరారు చేసుకుని మిగిలిన సమాధానం త్రోసిపుచ్చుతున్నారు” అని వైర్ తో చెప్పారు.
2024 ప్రాథమిక పరీక్షల్లో ఇచ్చిన మూడు సమాధానాలు తుది పరీక్షలలో తప్పుడు సమాధానాలని నిర్ధారణమైన విషయాన్ని కాజల్ గుర్తు చేస్తున్నారు. ” అంటే యూపీఎస్సీ జారీ చేసిన సమాధానాల పత్రాన్ని అభ్యర్థులు కోర్టులో సవాలు చేసే సమయానికి తుది ఫలితాలు కూడా వెలువడతాయి. ఆ సమాధానాలు ఇచ్చిన కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ సివిల్ సర్వెంట్స్ గా అనేక బాధ్యతల్లో ఉన్నారు! వీరందరూ పొరపాటు సమాధానం సరైన సమాధానంగా రాశారు” అంటున్నారు కాజల్.
ప్రస్తుత పరీక్ష విధానంలో ఉన్న మరో లోపాన్ని కర్ణాటక నుంచి పరీక్షలకు హాజరైన అభిషేక్ సుందర్ అంటున్నారు. సమాధాన పత్రాలు ఆలస్యంగా విడుదల చేయడం ద్వారా అందులో ఏమైనా పొరపాట్లు దొరికితే వాటిని సవాల్ చేయటానికి అభ్యర్థులకు సమయం లేకుండా చేయడం ఈ లోపం. ” యుపిఎస్సి తుది ఫలితాలు వెలువడేంతవరకు ప్రాథమిక పరీక్షల కు సంబంధించిన సమాధాన పత్రాలను యుపిఎస్సి విడుదల చేయడం లేదు. అభ్యర్థులు ఎందుకు అయిపోయిన తర్వాత ఈ సమాధానాలు తప్పైనా ఒప్పైనా చేయగలిగేది ఏమీ లేదు”. అంటూ అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచార హక్కు కు సమాధానమే లేదు
పలు యూట్యూబ్ ఛానల్స్ యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల గురించి వార్తా కథనాలు ప్రచారం చేస్తున్న ప్రచారం వెనుక ఆన్న వాళ్లంతా ఆశావహులైన అభ్యర్థులు వారు అభ్యర్థులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్లో కీలకమైన ఆధారాలు. ఇందులో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ విధానంలో జరిగిన అవకతవకల గురించి సంబంధిత అధికారుల దృష్టిని ఆకర్షించటానికి సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదులు దాఖలు చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు.
సౌరభ అభిషేక్ చివరిసారిగా ఈ పరీక్షలు హాజరయ్యారు. వయోపరిమితి రీత్యా ఇకపై హాజరు కాలేరు. జీవితంలో ఓడిపోయాను అన్న భావనతో కుంగిపోతున్నారు. వచ్చిన ఫలితాలను చూసి కాదు. దేశంలోనే అత్యంత పురాతనమైన పోటీ పరీక్షల నిర్వహణ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు గురించి ఈ ఆందోళన. అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళం చేసే అవకతవకలు అక్రమాలను నివారించడానికి అభిషేక్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అభిషేక్ సమాచార హక్కు కింద యూపీఎస్సీని అడిగిన వివరాలకు సంబంధించిన సమాచారం ద వైర్ వద్ద ఉన్నది.
ఈ సమాచార హక్కు వినియో దాఖలు చేసుకున్న పత్రంలో మే 25వ తేదీ రాసిన పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు ఎన్ని, కటాఫ్ మార్కులు ఎన్ని, అధికారిక సమాధానాల పత్రం, తన పరీక్ష పత్రాన్ని సంబంధించిన ఓఎంఆర్ షీట్, తాను రాసిన సమాధానంలో ఎన్ని సరైనవి ఎన్ని సరికానివి అన్న వివరాలు అడిగారు. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి యూపీఎస్సీ సిద్ధం కాకపోతే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని బీహార్ నుంచి ఈ పరీక్షల్లో పాల్గొన్న అభిషేక్ కోరారు.
అన్ని ప్రశ్నలకు లేదు అను సమాధానం తప్ప యూపీఎస్సీ నుంచి మరో వివరణ లేదు. తుది ఫలితాలు ప్రకటించలేదు కాబట్టి మీరు అడిగిన వివరాలు ఇవ్వలేమని అన్నారు. నిజానికి తుది ఫలితాలు ప్రకటించిన వారం రోజుల తర్వాత జూన్ 19వ తేదీన అభిషేక్ ఆర్టిఐ అప్లికేషన్ దాఖలు చేశారు. ” వివరాలు ఇవ్వకుండా యూపీఎస్సీని అడ్డుకుంటుంది ఎవరు? చివరికి రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు అడిగిన వెంటనే ఓఎంఆర్ షీట్లు అందజేస్తాయి. ఈ పరీక్షల విషయంలో అందులోనూ క్వాలిఫైయింగ్ పరీక్షలు విషయంలో పారదర్శకంగా ఉండటానికి యూపీఎస్సీకి వచ్చిన ఇబ్బందేమిటి? ఫైనల్ మెరిట్ లిస్టు తయారు అయ్యేటప్పుడు ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులు ఏమి పర్యాయన్లో తీసుకోరు కదా” అన్నారు అభిషేక్.
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల విషయంలో చివరకు సి.బి.ఐ కూడా జపించేసుకున్నది. ఇక్కడ కేవలం మా మార్కుల షీట్ మాత్రమే అడుగుతున్నాం. మేము అడిగింది అంటే తప్పేమిటి అన్న అభిషేక్ అభిప్రాయాలను మిగతా విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ కి చెందిన మరో అభ్యర్థి డాక్టర్ హిమాన్షి గులేరియా యుపిఎస్సి వెబ్సైట్లో ఉన్న సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రివన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టం ద్వారా కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ కంప్లైంట్ లో ఆమె అనేక సమస్యాత్మక అంశాలను లేవనెత్తారు. అందులో గందరగోళపు ప్రశ్నలు, అస్పష్టమైన బహుళ సమాధానాలు, పారదర్శకతలో లోపాలు, అధికారిక సమాధాన పత్రాలను ఆలస్యంగా జారీ చేయడం, ఈ గందరగోళాలను సవరించడానికి ప్రశ్నలు లేవనెత్తితే తగిన విధంగా స్పందించే నాధుడు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.
ఈ మొత్తం పరీక్ష విధానంలో తామరాసిన సమాధానాలు సరే నువ్వు కాదా అన్నది కూడా తెలుసుకోలే. దుస్థితి, లోపాలను ప్రశ్నించలేని పరిస్థితులు, ప్రశ్నించిన సమాధానాలు చెప్పలేని యంత్రాంగం, పరీక్షల్లో తమ ప్రతిభ గురించిన వివరాలు సంవత్సరానికి పైగా తెలుసుకోలేకపోవటం వంటి అంశాల పట్ల గులేరియా డి వైర్ తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రతిపాయింటూ ప్రతి మార్కు మా జీవితాలు మార్చేస్తుంది. అన్నిటి విషయంలోను గందరగోళం. నాకు మరింత స్పష్టత కావాలి. మా మార్కులు తెలుసుకునే అధికారం మాకు కావాలి” అన్నారు.
గులేరియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ యుపీఎస్సీ ప్రశ్నాపత్రాలు సమాధానాలు సూచికలు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నాపత్రాలు అన్ని కొన్ని నిపుణుల బృందాలు తయారు చేస్తే మరికొన్ని నిపుణులు బృందాలు వాటిని సరి చూసిన తర్వాత ఓఎంఆర్ షీట్ల వాల్యూయేషన్ కూడా నిబంధనల ప్రకారమే జరిపామని సమాధానం ఇచ్చింది. అంతేకాక కమిషన్ ఇచ్చిన సమాధానంలో “గందరగోడానికి దారి తీసే లేదా సంధ్య హాస్పటమైన సమాధానాలు ఉంటే నిపుణుల అభిప్రాయం మేరకు వాటిని తొలగించి మార్కులు ఖరారు చేస్తున్నాం. సి సాడ్ సబ్జెక్టులో ఉన్న ఇబ్బందుల గురించి చూస్తే జనరల్ స్టడీస్ పేపర్ 2 ప్రశ్నలు సమాధానాలు సంబంధిత సబ్జెక్టు నిపుణుల ద్వారానే రూపొందించబడ్డాయి. ఈ ప్రశ్న పత్రం రూపొందించేటప్పుడు విద్యార్థులు చదువుకున్న సిలబస్ని గమనంలో ఉంచుకోవడం జరిగింది. సమాధాన పత్రాలు కటాఫ్ మార్కులు ఇతర వివరాలు అన్నీ తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే బహిర్గతం చేయటం జరుగుతుంది. ” అంటూ గులేరియా వేసిన ప్రశ్నలను కమిషన్ త్రోసి పుచ్చింది.
యుపిఎస్సి గులేరియా పిటిషన్ను తిరస్కరించిన తర్వాత కూడా గులేరియా ఆన్లైన్లో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
అస్పష్టమైనవి పరిష్కారం కాని సమస్యలు
రాజస్థాన్లోని జయపూర్ కు చెందిన ముఖేష్ పుక్రజ్ యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకునే వేలాది మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తారు. తన దగ్గరికి వచ్చిన వారికి కోచింగ్ ఇస్తూనే ప్రస్తుతం అనుసరిస్తున్న పరీక్ష విధానం పసలేనిదని ఆచరణాత్మకంగానూ నిర్వహణ సౌలభ్యం రీత్యా మారాల్సింది చాలా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ప్రశ్నాపత్రాలు రూపొందించే విధానంపై ముఖేష్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. “సీసాట్ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను గమనించండి. ఇది ప్రధానంగా విద్యార్థుల ఆప్టిట్యూడ్ ను మెరుగుపరచడానికి రూపొందించే ప్రసన్న పత్రం. కానీ ఈ పేపర్లో అడిగిన ప్రశ్నలు గందరగోళం గానూ సంక్లిష్టమైన గణాంక సూత్రాలతో కూడుకున్నది గాను ఉన్నాయి. కోచింగ్ సెంటర్లలో బోధించే ఉపాధ్యాయులు కూడా ఈ ప్రశ్న లకు సమాధానాలు చెప్పలేకపోయారు. అటువంటి అప్పుడు ఈ ప్రశ్న పత్రాలు ఏ సమర్ధులు నిరూపించడం కోసం రూపొందించబడుతున్నాయి?” అని అడిగారు.
గుర్గావ్ కేంద్రంగా గత దశాబ్దికాలంగా యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన అమిత్ కిల్హోర్ మాటల్లో యూపీఎస్సీ ఎంపిక విధానమే లోపభూయిష్టమైనది. ఎంపికైన అభ్యర్థులు వాళ్ళ అదృష్టం కొద్ది పోతున్నారే తప్ప అర్థవంతమైన ప్రయత్నం ద్వారా కాదు. ఆయన ” కొన్ని సంస్కరణలైనా చేపట్టడానికి ఇది సరైన సమయం. సంవత్సరం పాటు సమాధాన పత్రాలను దాచి ఉంచటం ద్వారా ఎవరికి ప్రయోజనం ? ఎవరికి ఏమి లాభం కలుగుతుంది? ప్రశ్నాపతంలోనే తప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఈ సంస్థలో దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు చాలా ఉన్నాయి. యుపిఎస్సి ఇచ్చే సర్టిఫికెట్ల లో కూడా మోసం జరుగుతుంది అని పూజా ఖేడెకర్ ఉదంతం వెల్లడిస్తోంది. ” అంటూ కిల్లర్ ఆరోపించారు.
యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను నానాటికి అసంతృప్తి ఆవేదన పెరుగుతుందని దాని ప్రధాన కారణం విద్యార్థులకు ఎదురవుతున్న సందేహాలు ప్రశ్నలకు కమిషన్ నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేక పోవడమేనని పుక్రజ్, కిల్హర్ లు అభిప్రాయపడ్డారు.
ఈ సంవత్సరం మార్చి 28వ తేదీన విడుదల చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రశ్నాపత్రాలకు సమాధానాలు బహిర్గతం చేయకపోవడం వలన పారదర్శకత సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడింది. ఇటువంటి పరిస్థితులు అభ్యర్థులను నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నది.
పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలో ” జరిగే పరిపాట్లను ప్రశ్నించే అవకాశాలను ఇటువంటి పరిస్థితులు పద్ధతులు మీరు కారుస్తున్నాయి. పారదర్శకతను నిష్పాక్షకతను సవాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు విద్యార్థులను మానసికంగా కుంగతీయటం తో పాటు మొత్తం పరీక్ష విధానం పైనే అపన మొహం కలగడానికి దారితీస్తుంది” అని అంచనా వేసింది.
ఇన్ని అభ్యంతరాలు ఆరోపణలో ఉన్న తేడాది తర్వాత గాని తుది ఫలితాలు వెలువడ లేదు. రాము పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదు అని తెలుసుకోవడానికి ఏడాది పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితిల్లో విద్యార్థులలో కొందరు ఆత్మహత్య కూడా పాల్పడుతున్నారు.
తా రుషి అశ్విని
అనువాదం కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.