
విషపూరిత పౌర సంబంధాలనే శీర్షికతో ది వైర్, ఫ్రెంచ్ ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ, లైట్ హౌస్ రిపోర్టర్స్, ది గార్డియన్, లే మండే వంటి అనేక అంతర్జాతీయ ప్రతిష్టాత్మక మీడియా సంస్థలతో కలిసి నిర్వహించిన వార్తా కథనానికి వన్ వరల్డ్ మీడియా ఎన్విరాన్మెంట్ రిపోర్టింగ్ అవార్డును గతవారం లండన్‌లో ప్రకటించారు.
పరిశోధనాత్మక జర్నలిజంలో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ 24న జన్యు వంగడాలను వ్యతిరేకించే సామాజిక కార్యకర్తలు- శాస్త్రవేత్తల గురించి, అమెరికా కేంద్రంగా ఉన్న పౌర సంబంధాల కంపెనీ చేపట్టిన కార్యకలాపాల గురించి వార్తాకథనాన్ని ది వైర్ ప్రచురించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే వీఫ్లూయన్స్ ఇంటరాక్టివ్ సంస్థ ద్వారా జన్యు వంగడాలకు వ్యతిరేకంగా భారతదేశంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలపై నిఘా పెట్టడాన్ని వ్యతిరేకించే శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలపై నిఘా పెట్టడం కోసం అమెరికా ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థను నియమించుకున్నది. ఈ ప్రైవేట్ సంస్థ ప్రముఖ వాణిజ్య కంపెనీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బహుళజాతి కంపెనీలను ప్రజల దృష్టిలో మంచి కంపెనీలుగా చూపించే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జన్యు సంకరణ వంగడాల సేద్యాన్ని వ్యతిరేకిస్తున్న వర్ధమాన దేశాలలోని శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, పౌర సమాజ ప్రముఖుల గురించిన వివరాలు వారు ప్రాతినిధ్య వహించే సంస్థల, సంఘాల గురించి వివరాలు సేకరించి అమెరికా ప్రభుత్వానికి అందజేయడం ఈ కంపెనీ పని అని డీఎన్నె రెపుటేషన్ మేనేజ్మెంట్ అన్నారు.
13 రకాలైన ప్రత్యేక వార్తా కథనాలకు వన్ వరల్డ్ మీడియా అవార్డులను అందజేస్తారు. ప్రింట్ మీడియా, మీడియా స్వేచ్ఛ, శరణార్థులకు సంబంధించిన వార్తాకథనాలకు ఈ అవార్డులు వర్తిస్తాయి. తరచూ మీడియా కవరేజ్‌కు నోచుకోని విశేష కథనాలకు ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2025 సంవత్సరానికి గాను 20 దేశాల నుంచి 50 మంది న్యాయమూర్తులు 500కు పైగా వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను ఎంపిక చేశారు.
పర్యావరణం కేటగిరీలో విషపూరితమవుతోన్న పౌర సంబంధాలు అన్న ది వైర్ కథనానికి అవార్డు దక్కింది. జూన్ 25న ఈ అవార్డులను ప్రకటించారు. ది వైర్ రూపొందించిన ఈ కథనానికి లైట్ హౌస్ రిపోర్టర్స్, ఆఫ్రికా అన్ సెన్సార్ద్, ది న్యూ లీడ్, ది గార్డియన్, ది న్యూ హమానిటేరియన్, ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, ప్రీమియం టైమ్స్ నైజీరియా వార్త సంస్థలు సంయుక్తంగా కృషి చేశాయి.
ఈ కేటగిరీలో అవార్డు కోసం మెకాంగ్ ఐ సంస్థ రూపొందించిన పరిశోధనాత్మక కథనం క్యాటిల్ హాసిల్, ఎపిసెంట్రో టీవీ రూపొందించిన వీడియో కథనం మేరకు డొరికం బ్లాక్ బాక్స్‌లు కూడా పోటీ పడ్డాయి.
ది వైర్ నిర్వహించిన విషతుల్యమవుతోన్న పౌర సంబంధాలు పరిశోధనాత్మక కథనానికి తన వీడియో కథనాన్ని జోడించిన ఆఫ్రికా అన్ సెన్సర్డ్ మీడియా సంస్థ ప్రతినిధి సింథియా గికిరి 2025 సంవత్సరానికి గాను వరల్డ్ మీడియా జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. జన్యు వంగడాలు తయారు చేసే బహుళజాతి కంపెనీలు వీటిని వ్యతిరేకించే ఆఫ్రికా సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు ఎలా సేకరించాయో సింథియా తన కథనంలో వివరించారు.
వన్ వరల్డ్ మీడియా డైరెక్టర్ వివియెన్ని ఫ్రాన్సిస్ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో “పెచ్చరిల్లుతోన్న అంతర్జాతీయ వివాదాలు, కుదించుకుపోతున్న మీడియా స్వేచ్ఛ నేపథ్యంలో ఇటువంటి సున్నితమైన కథనాలను వెలుగులోకి తీసుకువచ్చే లఘు చలనచిత్రకారులు, జర్నలిస్టుల కృషిని కొనసాగించడం చాలా అవసరం” అని తెలిపారు.
ది వైర్ కథనం..
లైట్ హౌస్ రిపోర్ట్స్ మీడియా సంస్థ, ది వైర్ మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలతో కలిసి వీఫ్లూయెన్స్ అనే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఐదువందల మంది సామాజిక కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులు, శాస్త్రవేత్తలవంటివారి వివిధ వివరాలను సేకరించి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఆ వెబ్సైట్లో భారతదేశానికి చెందిన వందన శివ, దేబాల్ దేవ్ ఇంటా మరికొందరు శాస్త్రవేత్తల పేర్లు కూడా ఉన్నాయి.
ఈ నెట్‌వర్క్‌లో చేరాలంటే దాన్ని నిర్వహించేవారు మాత్రమే ఆహ్వానం పంపాలి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రసాయనిక పరిశ్రమలు, బయోటెక్నాలజీ పరిశ్రమల ప్రతినిధులు ఉన్నారు. ఈ రకంగా ప్రత్యేకంగా వివరాలు సేకరించి ఒక చోట భద్రపరచడం గురించి భారతదేశానికి చెందిన కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు వీఫ్లూయెన్స్ లాంటి సంస్థల చేతుల్లో పడితే ఎలా దుర్వినియోగమవుతుందో అన్నది ఆ ఆందోళన. భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తల గురించి లోతైన వ్యక్తిగత వివరాలు సేకరించడం అది కూడా ప్రభుత్వాలు పౌర సంస్థల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నపుడు ఇలాంటి వివరాలు గోప్యత సేకరించడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న ఎనిమిది మందిలో భారత విత్తన పరిశ్రమల సమాఖ్య ఎల్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవన్ సంపత్ కుమార్ కూడా ఒకరు. సంపత్ కుమార్ జన్యు సంకర వంగడాల రంగంలో ఉన్న వ్యాపారవేత్త. దాంతో పాటు వివిధ వ్యవసాయక రంగ సంబంధిత కంపెనీల కోసం కూడా పని చేస్తున్నారు. ఈ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పనలో కూడా సంపత్ కుమార్ భాగస్వామిగా ఉన్నారు. పత్తి ఉత్పత్తి చేసే ప్రాంతాలకు కావలసిన ప్రత్యేక విధానాలు రూపొందించంటానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఒక ప్రాజెక్టులో భారత విత్తన పరిశ్రమల సమాఖ్య కూడా భాగస్వామి.
ఈ బృందంలో మరో భారతీయుడు ఆనంద్ రంగనాథన్ భారతదేశంలో మితవాద రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే స్వరాజ్య పత్రికకు కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. క్రమం తప్పకుండా టీవీల్లో వార్తా వ్యాఖ్యానాలు చేస్తూ కనిపిస్తారు. ఆనంద్ రంగనాధన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయో టెక్నాలజీలో స్టాఫ్ రీసేర్చ్ శాస్త్రవేత్తగా కూడా పని చేశారు. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వంలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపాట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలతో భాగస్వామ్య ప్రాజెక్టులు చేస్తోంది. అయితే రంగనాథ్ మాత్రం తొలిసారి అలాంటి సంస్థ పేరు వింటున్నానని లైట్ హౌస్ రిపోర్ట్స్‌కు ది వైర్‌తో మాట్లాడుతూ అన్నారు.
అంతేకాక ఈ నెట్వర్క్(వీ ఫ్లుయెన్స్ నెట్ వర్క్) సేవలు కూడా ఎన్నడూ ఉపయోగించుకోలేదని రంగనాథ్ తెలిపారు. తాను కూడా స్వయంగా జన్యుసంకర వంగడాలు పట్ల సానుకూలంగా నే ఉన్నప్పటికీ వీఫ్లుయెన్స్ వంటి పొరపాటు వ్యవహారాలను ఎన్నడూ అంగీకరించనని చెప్పారు. జీఎమ్ ఫుడ్స్ విషయంలో అడ్డదారి రంగ ప్రవేశాలను అంగీకరించబోమని ఆయన అన్నారు.
ఈ అవార్డులలో భారతీయ మత్స్యకారుల గురించిన మౌఖిక చరిత్ర అనే పరిశోధనాత్మక “చెదిరిన వలలు” కథనానికి కూడా “విన్నూత్న పద్ధతిలో కథనాలు వినిపించడం” శ్రేణిలో అవార్డు లభించింది. షన్షీర్ యూసఫ్, మోనికాఝా, శ్రీరామ్ విట్టలమూర్తిలు ఈ కథనాన్ని ప్రచురించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.