
ఏకకాలంలో బహిరంగా విశ్లేషణ చర్యలు అభద్రంగాను దూకుడుగాను ఉన్నాయి. దాడి చేయడం, దాడికి గురవ్వడం చాలా తొందరగా జరుగుతుంది.
దృశ్యచిత్రాల ట్రోలింగ్‌తోనూ తిట్లతోనూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అతని ఎక్స్ అకౌంట్‌ను ప్రైవేటుగా మార్చుకోవాల్సిన స్థితికి రావడంతో, దూషణల దుందుడుకు మతోన్మాద అకౌంట్లు, భారతదేశపు విశ్లేషణా చర్యలను మలచడంలో మీడియా ఏ రకమైన పాత్రను పోషిస్తుందనే ప్రశ్నలు తిరిగి మరోసారి తలెత్తేలా చేశాయి. ఈ విశ్లేషణాజ్వాల ప్రభావం అంతర్జాతీయంగా ఎలా ఉందనేది కూడా పరిశీలించాలి.
ఈ దూషణలపై ప్రభుత్వం మౌనం పాటిస్తుంటే ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకుల్లో ఒక వర్గం, మీడియా వ్యక్తులు విదేశాంగ శాఖ కార్యదర్శికి తమ సంఘీభావం తెలియజేశారు. విదేశాంగ శాఖ కార్యదర్శి ఆదర్శప్రాయమైనన పదవీకాలం గురించి అతను ఇటువంటి దూషణలకు అర్హుడు కాదని ఈ ఖంఢనలన్నీ పేర్కొన్నాయి. అది నిజమే కావచ్చు కానీ దీని వల్ల పెద్ద సమస్య రూపం చిన్నదవుతుంది. ఒక అన్లైన్ మీడియా సంస్కృతి ఎన్నడైతే గత దశాబ్దకాలంగా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ల నోరు మూయించడానికి దూషణలు, దృశ్యచిత్రాల లైంగిక బెదిరింపులు, అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారం బహిరంగ పర్చడం సైబర్ స్థలాల్లో వెన్నాడటం వంటివన్నీ చాలా మామూలుగా జరుగుతున్నాయో ఇవన్నీ పెద్ద సమస్య.
ఈ వారంలో విక్రం మిస్రీ ఒకరే లక్ష్యం కాదు. అంతర్జాతీయ మీడియాను తమ వైపుకు తిప్పుకోవడానికి విదేశాంగశాఖ ప్రయత్నించాల్సిన సమయంలో ది ఎకనామిస్ట్ పత్రికా రక్షణా వ్యవహారాల సంపాదకులు తన వార్తా కథనాల పట్ల కోపం వచ్చిన భారత ఆన్లైనర్ల నుంచి తనకు డజన్ల కొద్ది బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇలాగే దక్షిణాసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకులనేక మందికి ఇటువంటి బెదిరింపులు కోకొల్లలుగా వచ్చాయని వారు పేర్కొన్నారు. పనిగట్టుకొని తప్పుడు సమాచారం పక్షపాతంతో అందిస్తున్నారని ఆరోపిస్తూ, వారిని భారతేదేశం నుంచి వార్తలివ్వకుండా చేస్తామని ఈ ఆన్లైన్ భారతీయులు బెదిరిస్తున్నారు.
పాకీస్తానీయులకు సంఘీభావం ప్రకటించిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంలోనే కాకుండా అంతేస్థాయిలో గత జూన్‌లో రాఫాపై ఇజ్రాయిల్ దురాక్రమణకు ముందే పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన భారతదేశ ప్రముఖులపై ట్రోలింగ్ చేయటంలో కూడా ఇవే ఖాతా వ్యక్తులు చురుకుగా వ్యవహరించడం ఆసక్తికరం. అక్టోబరు 7, ఆ కాలంలో మరింత దృశ్య చిత్రాల తప్పుడు సమాచారం ఏదైతే చక్కర్లు కొట్టిందో అది తయారు చేసింది, పంచుతున్నదీ, మతోన్మాద భారత పాత్రికేయులు, ప్రభావితం చేసే వ్యక్తులే. పాలస్తీనా మరణాల పట్ల తరుచుగా ఈ ఖాతాకు చెందిన వాళ్ళు సంతోషపడటం. అంతేకాకుండా గాజాను ధ్వంసం చేయండని పిలుపులివ్వడం అనేవి గాజాలో ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు భారతదేశానికి మధ్య సంబంధం అనే అంతర్జాతీయంగా ప్రజల భావనల్లో పటిష్టం చేశాయి. దీన్ని వదిలించడం చాలా కష్టం.
నేను ముందే ప్రస్తావించినట్టుగా భారతదేశం, భారతీయుల పట్లా అంతర్జాతీయంగా ప్రజల భావనల్లోని అవగాహనను ఈ ఖాతాలు రూపకల్పన చేస్తాయి. ఈ అవగాహనలు మన విదేశాంగ విధానానికి సవాళ్లు విసిరాయి. భారత పూర్వ సైనికాధికారి గౌరవ్ ఆర్య(ఈయనను ఎక్స్‌లో ప్రధాని మోడీ కూడా చూస్తారని ఉంది) తరచుగా భారత మ్యాడ్ ఛానళ్లలో రక్షణ వ్యవహార విశ్లేషకుడిగా దర్శనమిస్తారు. గత వారం ఈయన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ని “పంది కొడకా” అని పిలిచిన దృశ్యం ఆయన యూట్యూబ్ ఛానల్ క్లిప్ ఇరాన్లో వైరల్ కావడంతో ఒక రాయబార వైషమ్యానికి అగ్గిరాజేసింది. గతవారంలో అబ్బాస్ ఇరుదేశాల వివిధ వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేస్తూ ఢిల్లిలో ఉన్నారు. ఈ ఆర్య వాజ్యాల వల్ల లేచిన దుమారం గురించి తక్కువ చేసి చెప్పాలంటే మనకు సహాయకారికాదు. మళ్లీ ఒకసారి ఈ పగలకొట్టిన ముక్కలు ఏరుకునే పని మన రాయబారులకే వదిలివేశారు.
గతవారపు పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో ఒక భాగమైన ఈ ఆన్లైన్ ట్రోల్స్ వల్ల భారతదేశ దౌత్యసంబంధాలకు ముప్పుగా తయారవుతున్నదనే ఏకాభిప్రాయం ఏర్పడుతున్నట్టు కన్పిస్తుంది. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిపై ట్రోలింగ్ వారి పగ్గాలు వదలడం కంటే వారికి కళ్లాలు వేయటం మరింత కష్టమని సూచిస్తున్నది.
ట్రోల్ ఖాతాలు, హిందూమత తత్వం, హింస వికేంద్రీకరణ..
కులంపై నిర్మితమైన సమాజాల్లో సార్వభౌముడు చట్టబద్ధమైన హింసపై గుత్తాధిపత్యం కలిగి ఉండలేడు. కుల ఆధిపత్య నిచ్చెనను అమలు పరిచేపని భౌతిక హింసతోనూ బహిష్కారాలతోనూ స్థానికంగా జరుగుతుంది. దానిలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం ద్వారా సార్వభౌముడు దీనికి చట్టబద్ధత కల్పిస్తాడు. దీనిని ఆధునిక హిందూత్వ రాజ్యానికి అన్వయిస్తే పరిపాలనలో భాగం కాని పాత్రధారులు మైనారిటీలపై జరిగే హింస, దానిని పరిపాలనలోని పాత్రధారుల పక్కన నిలబడి చూడటం ద్వారా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం ద్వారా లేదా ఈ హింసకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని అమలు చేయనిరాకరించడం ద్వారా చట్టబద్దం చేస్తారు.
ఉదాహరణకు గోరక్షక బృందాలు పరిపాలనలో భాగంకాదు. కానీ వారితో పాటు తరచుగా పోలీసులు కనిపిస్తారు. ఈ పోలీసులు వీరు చేసే హింసలో జోక్యం చేసుకోరు. ఈ రక్షకులు తరచుగా చట్టానికి అతీతంగా ఉంటారు. ఈ నమూనాలో రాజ్యం ఈ హింసకు చట్టబద్ధతనిస్తుంది. ప్రోత్సహిస్తుంది. కాని ఒక కేంద్రీకృత వ్యవస్థ నుంచి ఆశించినట్టు రోజువారి నియంత్రణను అది ఎప్పుడూ ప్రయోగించక పోవచ్చు.
ఆన్లైన్లో జరిగే ట్రోలింగ్‌లో కూడా ఇదే నమూనా అనుసరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా బహిర్గతం చేసే వాటికి నాయకత్వం వహించేవి కొన్ని ప్రముఖ మతోన్మాదుల ఖాతాలే అయినా ఇవి అన్ని పోలీసు ఫిర్యాదుల నుంచి బయటపడి మామూలు అయ్యేందుకు గమనించదగ్గ స్థాయిలో శక్తి కలిగి ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ అసభ్య దూషణ సందేశాలు, ఫోన్లూ చేసే అసంఖ్యక ఫోను నంబర్లు ఖాతాల వల్ల చాలా పై స్థాయిలో వీటి సమన్వయం జరుగుతుందని అర్థమవుతుంది. అయితే వాళ్లు లక్ష్యంగా చేసుకున్నవారిపై ఏ రకమైన నియంత్రణ వాళ్లు సాధిస్తున్నారో స్పష్టత లేదు.
ఇప్పటి వరకైతే ప్రభుత్వాన్ని, హిందూత్వ మతరాజకీయాలని, పితృస్వామ్యాన్ని విమర్శించే ఖాతాలే వారికి లక్ష్యంగా ఉంటున్నాయి. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆయన కూతురిని, కాల్పుల విరమణ తర్వాత దేశంలో వినవస్తున్న యుద్ధ వ్యతిరేక గొంతుకలని లక్ష్యంగా చేసుకోవడం చూస్తే వారి లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో ఈ ఖాతాలకు కొంత స్వతంత్ర్యం ఉందని భావించవచ్చును.
ఈ ఖాతాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం కాల పరిమితిలో పోలీసులకు వచ్చే ఫిర్యాదులపై చర్యలు చేపట్టడమే లేదు. ఈ ఆన్లైన్ హింసపై విశాల స్తాయిలో వీటిని చట్టవ్యతిరేకంగా చూపించాలి.
విశ్లేషణా చర్యలలో విస్తృతమైన మార్పు..
నిబంధనలు విధించడం ద్వారా బహుశా నియంత్రించగలిగిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయటంలో ప్రత్యేక నైపుణ్యం గల లక్ష్యం చేసుకుని దూషణలకు పాల్పడం చేసే నిర్దిష్ట ఖాతాలే కాకుండా మతోన్మాద మీడియా, ఆన్లైన్లో ప్రముఖ ఖాతాల నాయకత్వంలో ఈ బహిరంగ చర్చల స్వభావంలో సాధారణ క్షీణత ఏర్పడింది. కొన్ని కొత్త వాదవివాదా నియమాలు అభివృద్ధి చెందడం వల్ల భారతదేశపు ఆన్లైన్ ప్రదేశాలు మౌలికంగా అసురక్షితంగా తయారయ్యాయి.
మొదటిది మీడియాలో ఎడతెగకుండా జరుగుతున్న అమానవీయకరణ- ప్రత్యేకించి ముస్లిం అమానవీయకరణ వల్ల ఆన్లైన్లో అభ్యుదయవాదులుగా కనబడే మైనారిటీలు, దళితులు, మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ బహిరంగ చర్చల్లో ఏ రకమైన భాషాపరమైన నైతికమైన పరిమితులు లేకుండా పోయాయి. లైంగికపమైన దూషణ- బలాత్కార, లైంగికదాడి బెదిరింపులు, హత్యలు హెచ్చరికలు, మతపరమైన దుర్భాషలు, కులపరమైన బూతులు అన్ని ఇక్కడ మామూలై పోయాయి. ఈ భాషను మించి ఒక సాధారణ అమానవీయత హింసాత్మక భావనలు చీదర కలిగించేలా వ్యక్తం అవుతుంటాయి. ఈ రకమైన వాదనలు వాఖ్యలు దేశ సరిహద్దులు రాజకీయ అనుబంధాల పరిధుల్లో కూడా లేవు. ఉదాహరణకు గాజాలో గాయపడిన లేదా చనిపోయిన ముస్లిం పిల్లలపై వచ్చిన విషపూరితమైన జవాబులు కొన్ని భారతీయఖాతాల నుంచే వచ్చాయి. వీటిలో కొన్ని మతోన్మాదుల నుండి కావు.
రెండవది అమర్యాద, బెదిరింపులు సంభాషణల్లో/ చర్చల్లో ఒక అధికారిని చిహ్నంగా చూడటం. బ్రిటీషు సామ్రాజ్య ధ్వంసం జరిగిన తర్వాత సంవత్సరాల్లో వలస వాదానంతర కులీనుల్లో నాగరికంగా మాట్లాడ్డం, మార్యాదలు పాటించడం పట్ల అతిగా కేంద్రీకరించే ధోరణి ఉండేది. “సరిహద్దులకావల” అనే తన పుస్తకంలో సీఎల్ఆర్ జేమ్స్ ఈ ధోరణిని వర్ణించారు. వెస్ట్ఇండీస్ క్రికెట్ ఆటగాళ్లు క్రికెట్ మైదానంలో ఆడేటప్పుడు నిజమైన ఆట స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా బ్రిటిష్ పెద్ద మనిషి తరహా వ్యవహారశైలి ప్రదర్శించేవారని రాశారు. ఆ తరాల సాంస్కృతిక కులీనులు ఈ రకమైన మర్యాదపూర్వక ప్రవర్తనకు అంతప్రాధాన్యత ఇవ్వడం అనేది వలసవాద దృష్టిలో తాము ఆటవీకులుగా కాకూడదనే భయం నుండి వచ్చింది.
కాలంతో పాటు ఈ భయం సహజంగానే తొలిగిపోయింది. దేశంలో పాశ్చాత్య మర్యాదలు చర్చానియమాల తిరస్కరణ వల్ల ఏర్పడిన ఖాళీని ఏకకాలంలో అభద్రంగానూ దూకుడుగాను ఉండే విశ్లేషణ చర్చా ఏదయితే వేగంగా దాడి చేయటం/పొందడం చేస్తుందో అది నింపింది.
భారతదేశపు టీవీ ఛానళ్లు, ఆన్లైన్లలో ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి విదేశాంగ విధానంపై అతి తక్కువగా గంభీరమైన విశ్లేషణ వెలువడింది. పత్రికారంగంలో ఏదయితే పై వాటికంటే గంభీరంగా చర్చిస్తుందో అక్కడ కూడా భారత ప్రభుత్వం తన ఓటర్లు ఏది వినాలని కోరుకుంటుందో అది. అంటే, వాస్తవ ఆధారలతో సంబంధం లేకుండానే భారత ఆర్థికవ్యవస్థ ఎదుగుదల, ప్రపంచలో పెరుగుతున్న భారత ప్రతిష్ట గురించి కథనాలు ప్రతిధ్వనించే ధోరణి ఉంది. భారతదేశంలో నివాసం ఉండని భారతీయ పాత్రికేయులు, విశ్లేషకులు ఈ ఆకాంక్షలను ధృవీకరించినప్పుడు మిత్రులను పొందడానికి ఉద్దేశించబడని ఈ కొత్త చర్చా పద్దతి చట్రంలో భాగంగా వీరిపై ఒక మూక ఆగ్రహం కట్టలు తెగుతుంది.
కథనాల నియంత్రణకు అనుకూలంగా ఒకవైపు నుండే ప్రసారాలు జరిగే టీవీ మాధ్యమం లాగా కాకుండా సామాజిక మాధ్యమం రెండు వైపుల ప్రసారం ఉంటుంది. ఒక రకంగా ఇది వీధి మూలన ఉండే పత్రిక స్టాండుకు లేదా ప్రాచుర్యంలో గల అభిప్రాయాలు వెల్లడించే టీకొట్టుకు ఆధునిక రూపంలాంటిది. ఇక్కడ ఆ వీధి మూలన మొత్తం ప్రపంచం అంతా మాట్లాడే ప్రతిదానికి ప్రతిస్పందన ప్రతిచర్య ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే భారత దేశం అత్యంత జనాభా గల దేశం. అనువాద సాంకేతిక సాధనాలు, ఇంటర్నెట్ సదుపాయం మెరుగుపడేకొద్ది ఆన్లైన్లో మరిన్ని భారతీయ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారతీయ టీవీ ప్రసారపు భాగాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం ప్రారంభించగానే ఒకే వైపు నుంచి అభిప్రాయాలు సమాచార ప్రసారణం చేసే సాధనంగా ఉండటం ఆగిపోతుంది. ఇది కూడా సామాజిక మాధ్యపు మచ్చట్లలో చేరిపోతుంది. ఆపరేషన్ సింధూర్ నివేదికల చుట్టూత ఏర్పడిన గందరగోళం చూస్తే ఈ సమాచార ప్రవాహాన్నిగాని అభిప్రాయాన్ని గాని వ్యూహాత్మకంగా నిర్వహించడం దాదాపుగా అసాధ్యం.
ఇంటర్నెట్ను గాని, ఇంటర్నెట్లో భావప్రకటన స్వేచ్ఛను గాని క్రమబద్దీకరించడం/నియంత్రించడం సూత్రప్రాయంగా ఆకాంక్షించ దగ్గది కాదు. ఆచరణ సాధ్యమూ కాదు. ఏ ఘటనల కాలంలోనైనా విదేశాల్లోని భారతీయులు అంతర్జాతీయ ప్రజాభిప్రాయాన్ని ఎలా మలుస్తారో అనే ఆందోళనకంటే భారతప్రభుత్వానికి భారతీయుల నుంచి సమాచారం దాచడం పట్ల కేంద్రీకరించినట్టు కనబడుతున్నది. కాబట్టి విదేశాల్లో మన గురించిన అవగాహన మార్చాలంటే అది మన ఇంటి నుండే ఈ కొత్త విశ్లేషణ చర్చా నియమాలను తిరస్కరించడంతో ప్రారంభం కావాలి. అధికభాగం జనాభా ఎవరైతే అవాస్తవికమైన ఆకాంక్షల వలయంలో చిక్కుకుపోయారో ఈ ఆకాంక్షలు నెరవేరనపుడు బాధితులుగా భావించుకొని ఆన్లైన్లో దూకుడు ప్రదర్శిస్తారో(దేశంలోనూ విదేశంలోనూ) ఈ దూకుడును కాదంటే మరింతగా బాధితులం అనుకుంటున్నారో వాళ్లు ఈ బాట నుంచి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.