
35 సంవత్సరాల పాటు పర్యావరణ పరిరక్షణలో ఉన్న నాకు అర్థమైందేంటంటే భూగోళపు సంక్షోభానికి కారణం విధ్వంసం, నిర్లక్ష్యం మాత్రమే కాదు ప్రకృతి విలువను గుర్తించడానికి నిరాకరిస్తున్న ఆర్థిక వ్యవస్థ గుడ్డితనం మరింత లోతైన కారణం అని. ప్రభుత్వాలు అభివృద్ధి వెనకాల పరిగెడతాయి. కంపెనీలు అత్యధికంగా లాభాలు పొందజూస్తారు.
మన ఆర్థిక వ్యవస్థ, సమాజాలను, వ్యక్తిగత సంక్షేమాన్ని స్థిరీకరించే విశాలమైన పర్యావరణ వ్యవస్థలను పరిగణించడంలో అవి విఫలం అయ్యాయి. మన కొలవగలిగిన దాన్ని మనం నిర్వహించుకుంటాం. పర్యావరణ వ్యవస్థల సేవలు జమా ఖర్చుల చిట్టాల్లో కనబడవు. అవి పూర్తిగా అదృశ్యంగా ఉంటాయి. కానీ వాటి ద్వారా వచ్చే చిక్కులు సహజ వనరుల అతి దోపిడీ, ఆవాసాల విధ్వంసం, వాయు కాలుష్యం, భూమి, నీరు, సముద్రాల కాలుష్యం కొట్టొచ్చినట్టు కనబడతాయి.
మన బాటలో మిగిలిన వాటి పరిణామాల గురించి బాగా నమోదు జరిగింది. సహజపర పరాగసంపర్కం, సముద్ర చేపలు, మొదలైన కీలకమైన పర్యావరణ వ్యవస్థలు కుప్పకూలిపోవడంతో ప్రపంచ స్థూల ఆదాయం 2.7 ట్రిలియన్ డాలర్లు తగ్గిపోయిందని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది.
మన నిర్ణయాల్లో ప్రకృతి కనిపించేలా సమగ్ర విధానాలు రూపొందించడం ఎట్లా? ప్రకృతికి సంబంధించిన ద్రవ్యలాభాలు వెల్లడించే ఒక బృందం ఏర్పరచడం ముఖ్యమైన మొదటి అడుగు. అన్య సంస్థలకూ, కార్పోరేషన్లకు ప్రకృతి పర్యావరణ వ్యవస్థలపై వారెంత ఆధారపడుతున్నారు. దాని ప్రభావం ఏమిటి అనేది కొలిచే సాధనాలు అందించడం ద్వారా వారు ప్రకృతికి అనుకూల పెట్టుబడుల వైపుకి తమ ధన ప్రవాహాలని మన్నించడానికి వారిని ప్రోత్సహించడం ఆ శక్తినివ్వడం జరుగుతుంది.
ఈ సంబంధాల పరిణామం లెక్కించడం భిన్న విషయం కాదు. ఈ గుర్తింపులను డిజిటల్‌గా చేయటం ఒక ఫలితం రాబట్టే పరిష్కారం. వారి హక్కులు పొందడం కోసం పౌరులకు వారి వ్యక్తిగత గుర్తింపు ఎట్లా ఉపయోగపడుతుందో ప్రభుత్వం నుండి పథకాలు పొందడానికి, బ్యాంకు సేవలు పొందడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడినట్టే ప్రకృతి గుర్తింపు డిజిటల్ అయితే మానవాభివృద్ధికి సహకరిస్తున్న పర్యావరణ వ్యవస్థల లెక్కింపుకు అవసరమైన పర్యావరణ కొలబద్దలను తయారు చేసేందుకు ఉపకరిస్తుంది.
ఆధునిక సమాజంలో వ్యక్తిగత గుర్తింపు లేని వ్యక్తి ‘కనబడని’ ప్రమాదం ఎదుర్కొంటాడు. ప్రకృతి విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్రకృతి పర్యావరణ వ్యవస్థలకు సురక్షితం అయిన గుర్తింపులు ఇవ్వడం ద్వారా వాటిని పర్యవేక్షకుడే లేని దోపిడీ నుండి కాపాడవచ్చు. ఉదాహరణకు ఒక అటవీ నీటి పరివాహక ప్రాంతపు గుర్తింపులో ఆ ప్రాంతపు భౌగోళిక లక్షణాలు, జీవవైవిద్యం, దాని పర్యావరణసేవలు మొదలైన సమాచారం నిక్షిప్తం చేయవచ్చు.
వాటితో పాటు అక్కడి స్థానిక సమాజాలకేకాకుండా పరివాహక దిగువ ప్రాంతాలకు కూడా అది అందించే లాభాలను లెక్కబెట్టి మరీ చెప్పెందుకు వీలుంటుంది. ఈ లాభాలను పరిణాత్మకంగా లెక్కించడం ద్వారా వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రకృతికి హాని కలిగించడం నిర్లక్ష్యం చేయటం కఠినతరం చేయవచ్చు. అదృశ్యంగా ఉండకుండా కనిపించే విధంగా ప్రకృతి విలువను నమోదు చేయటం చట్టపరంగా గుర్తించడం వల్ల దోపిడీ చేయటం కష్టతరం చేయవచ్చు.
గుర్తింపు వ్యవస్థల విప్లవం, డిజిటల్ చేయటం ద్వారా వాటిని గుర్తించేందుకు, జాడ తీసేందుకు, లెక్కించేందుకు మన సామర్థ్యం గతంలో కనీసం ఊహించని స్థాయికి పెరిగింది. భారత దేశపు ఆధార్ వ్యవస్థ- బయోమెట్రిక్ డిజిటల్ డేటా ఆధారిత వ్యవస్థ దీనికి ఒక ఉదాహరణ. ఒక వందకోట్ల పైగా ప్రజలకు ఆధార్ ప్రభుత్వ సేవలు సామాజిక కార్య ప్రమాణాల లబ్ధి పొందేందుకు ఈ తక్షణ గుర్తింపు అవకాశం కలిగించింది. అలాగే స్థిరాభివృద్ధిలో సౌర మౌలిక సదుపాయాలను డిజిటల్ చేయటం ద్వారా భౌతిక నిర్మణాలయిన రోడ్లు, బ్రిడ్జిలు, వాటి ఆర్థిక విలువలతో సహా ప్రత్యేక గుర్తింపు జారీ చేస్తుంది.
ఇటువంటి ప్రక్రియనే ప్రకృతికి కూడా అన్వయించవచ్చు. గతిశీలమైన సాంకేతికతో వేగంగా పెరగటం వలన ప్రకృతి డిజిటల్ డీటీని డిజిటల్ అనుబంధం రిమోటు సెన్సింగ్, సెన్సార్ డేటాలను ప్రస్తుత సమయ పర్యవేక్షణతో జోడించవచ్చు.
కృత్రిమ మేధ ఈ వ్యవస్థలని మరింత చేరువ చేస్తుంది. మరింతగా కార్యాచరణకు కారణం అవుతుంది. ఒక భౌగోళిక ప్రాంతానికి అనుసంధానించిన డేటా కట్టను ఊహించుకోండి. అన్ని కీలక పర్యావరణ లక్షణాలు, పరిసర, ఆరోగ్య సూచికలు, ఒక నిర్దిష్ట పర్యావరణ వ్యవస్థ సమగ్ర సజీవ చిత్రాలతో కూడిన డేటా కట్ట ఇది. ఈ అవగాహనను మొదట్లో పునరావృత్తం చేయటానికి కారణాన్ని కప్పులో కాఫీ వల్ల అడవులు నాశనం కాలేదనే విషయం జాడతీయడానికి ఆయా సరఫరా వ్యవస్థలని తెలుసుకునే శక్తిని గతిగించడం.
పరిపాలన, పర్యావరణం, భౌగోళిక డేటాకు డిజిటల్ స్వభావం గల గుర్తింపులతో సమ్మేళనం చేయటం ద్వారా ఫలితాన్ని చెల్లింపు పథకాలు, బొగ్గుపులుసు వాయువును ఇంకించుకునే వర్షాధారిత అడవులని మడ అడవులని ఇతర కీలక పర్యావరణాలని రక్షించే వారికే సరైన పరిహారం చెల్లించడం వంటి వాటిని కొలవవచ్చు. దీని వలన వ్యవసాయ సరఫరా గొలుసులో ముడి పదార్థల జాడ తీయవచ్చు. తద్వారా వైవిద్య పర్యావరణ రుణం, హరిత నిధి, పిర్ది వ్యవసాయ రుణాలు వంటివి ఇచ్చి భూయజమానులకు సాధికారత కల్పించవచ్చు. అన్నింటకంటే ముఖ్యంగా అటువంటి వ్యవస్థ వలన మూలవాసులకు, స్థానికులకు స్పష్టమైన ప్రాదేశీకమైన నిర్దుష్టమైన రికార్డులు ఇచ్చి వారికి చట్టపరమైన రక్షణ కల్పించవచ్చు.
అందరిని కలుపుకొనిపోయే, సమిష్టిగా కలసి పనిచేసే సూత్రాల ఆధారంగా సమాజం మొత్తం కలసి చేసే ప్రయత్నంగానే ఈ డిజిటల్ స్వభావ గుర్తింపులను అభివృద్ధి చేయాలి. దానిలో ఉన్న వారందరి ప్రయోజనాలు ప్రతిబింబించేలా దీని రూపకల్పన జరగాలి. అట్లా అయితేనే అది ప్రజాప్రయోజనానికి ఉపయోగపడే ప్రకృతి అనుకూల చర్యలను ఆ స్థాయిలో చేయగలుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మూలవాసులు, స్థానిక ప్రజల హక్కులు, సంక్షేమం, విలువల వ్యవస్థలను కాపాడాలి. వారి భూములు, వనరులు జీవన విధానానికి సంబంధిత డేటాపై వారికీ నియంత్రణ ఉండేలా చూడాలి.
ఆయా దేశాల విశిష్ట సామాజిక ఆర్థిక పర్యావరణ వాస్తవిక తలకు అమరేలా మలుచుకునే వీలుగలిగిస్తూ ఈ డిజిటల్ స్వభావంగల గుర్తింపు ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాలతో సమ్మేళనం చేయాలి. దురుపయోగం కాకుండా చూసేలా పరస్పర చర్యలని ప్రోత్సహించే విధంగా పటిష్టమైన చట్టాలు, డేటా పంచుకోవడం, ప్రామాణీకరణ యోగ్యతా పత్రాలు వంటి విధానాలు తయారు చేయాలి.
ఆ స్థాయిలో ఈ డిజిటల్ స్వభావం గల గుర్తింపు మన భూగోళికపు ప్రకృతి వనరుల విలువల లెక్కింపు సాధనంగా మానవులకు లబ్ధి కలిగించే ఒక మార్పు తెచ్చే పరికరం కాగలదు. మన సమాజాలు ఆర్థిక వ్యవస్థలు మనగలగడానికి ఎదగడానికి ప్రకృతి అనుసరించే మార్గాలను గుర్తించడం మదింపు చేయటం ద్వారా మన పర్యావరణ జవాబుదారీ తనానికి ఒక కొత్త యుగం సృష్టించగలం.
రాకషెల్లర్ ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారంతో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మూలవాసులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సెక్టారు సంప్రదింపులు ఈ డిజిటల్ గుర్తింపును ఒక డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయంగా రూపొందించేందుకు పరిశోధన చేస్తుంది.
మిజోరి పాక్సన్
(ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం నేచరల్హబ్ సంచాలకులు)
అనువాదం: దేవి
(ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయం రచయితది. భాగస్వాములు, దాతల అభిప్రాయాలు ప్రతిబింబించకపోవచ్చు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.