
జ్ఞాపకాలు వెలివేతకు గురైనప్పుడు ఒక సామూహిక ఆత్మాభిమానానికి బదులు ద్వేషాన్ని పెంపొదిస్తాయి.
‘మార్చి 3వ తేదీ ఆదివారం నాడు చక్రవర్తి ఔరంగజేబు కొరెగాం రాగానే సోమవారం 1689
మార్చి 11న అతన్ని అతనితో పాటు కవికలశ్ ను కత్తితో నరికి చంపేశారు.’
ఇది
‘మాసిర్ ఏ ఆలంగీర్’లో శివాజీ పుత్రుడు శంభాజీ మరణానికి సంబంధించిన వర్ణన’ మరాఠాల గతం గురించి, చారిత్రకమైన, జానపదుల ఉమ్మడి జ్ఞాపకాలలో కేంద్రంగా ఉన్న పతాక సన్నివేశంగా భావించే దాని వర్ణన పేలవంగానూ చప్పగాను కన్పిస్తుందిక్కడ.
మరాఠాలను, కున్బీలను, మహారాష్ట్ర దళితులను అత్యంత ప్రభావితం చేసే ప్రాచుర్యమైన, సంస్మరణీయమైన l బలిదానం ఏదైనా ఉంటే అది శంభాజీ మరణం, అతని శరీర విచ్ఛేదనం.
మరాఠాల రెండో పరిపాలకుని మరణానికి సాక్షీభూతంగా నిలబడే చారిత్రక వీరగాథల పరమార్ధంలోతుగా కదిలించి వేస్తుంది. దాన్ని అన్వయించే తీరు వినేవాళ్ల రోమాలు నిక్కబడెలా చేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. కీర్తనలు పాడేటపుడు వీరగాథల కీర్తనకారుడు చారుదత్ అఫాలే గొప్ప తన సొగసయిన పదబంధాలు ఆ గాథకు ఒక దృశ్యాన్ని ఉపయోగించే ఉపమానాన్ని అందిస్తాయి. ఈ గాథలు వింటే పాట ఒకరి రక్తంలో కంపనలు రేకిత్తంచడం అంటే ఏంటో అనుభవంలోకి వస్తుంది.
కథ ఇలా నడుస్తుంది. షిర్కే తెగ వాళ్లు శంభాజీకి ద్రోహం చేశారు. దాంతో సంగమేశ్వర దగ్గర ముకర్రబ్ ఖాన్ నాయకత్వంలో మొగలు సైన్యాలు అతన్ని ముసురుకుని చుట్టుముట్టాయి. అతన్ని అతని సలహాదారు కవికలశ్ ను నిర్బంధించి, అడవి మృగంలాగ సంకెళ్లతో బంధించి బహదుర్గ్లో ఆలంగీర్ ఔరంగజేబు దర్బారులో ప్రవేశపెట్టారు.
శిబిరానికి నాలుగుమైళ్ల దూరంలో వారిని విదూషకుల మాదిరిగా గంటలు కుట్టిన పొడుగాటి టోపీపెట్టి ఒంటెలపైకి ఎక్కించారు. వీధుల్లో గుంపులు కూడిన జనం ముందు ఊరేగించారు. దారంతా వారిపై ఊశారు. మూత్రంపోశారు. బల్లాలతో పొడిచారు. అవమానకరం అయిన ఈ ప్రదర్శన తరువాత చివరికి వారిని చక్రవర్తి దగ్గరికి తెచ్చారు. శంభాజీ తన కోటలన్నింటినీ ఇచ్చేసి అతను దాచిన సంపదల ఆచూకీ చెబితే అతనికి సమాచారం అందించే మొగలు అధికార్ల పేర్లు చెబితే అతన్ని క్షమించి వదిలేస్తామని శంభాజీకి అవకాశం ఇచ్చారు. ఈ క్షమాభిక్షకున్న ఒకే ఇక్క షరతు అతను ఇస్లాం మతంలోకి మారి పూర్తిగా లొంగిపోవాలని నోటిమాటగా చెప్పినట్టు ఒక కల్పన ప్రచారంలో ఉంది. ‘కానీ, ఆనాటి రికార్డుల ప్రకారం అస్సలాంటి షరతులులేవి పేర్కొననబడలేదు.’ శంభాజీ వీటన్నింటినీ తీవ్రాతి తీవ్రంగా తిరస్కరించాడు. ఔరంగజేబుని అతని ప్రవక్తనూ పరుషంగా దూషించాడు. ఈ లావాదేవీల్లో అతన్ని కూతుర్లలో ఒకరిని మూల్యంగా చెల్లించమన్నాడు. ఆ రాత్రి అతని కళ్లను కాల్చిన ఇనుపచువ్వలతో గుచ్చిపీకారు. అతని నాలుక అంగిలి నుండి మొత్తం కోసేశారు. ఒక పక్షంరోజులు శంభాజీనీ, కవికలశ్ను అవమానించి చిత్రహింసలు పెట్టేశారు. ప్రతిరోజూ చర్మాన్ని కొంతకొంతమెర వలిచి కత్తిరించారు. ఎముకలు విరగ్గొట్టారు. వారికి తృప్తి కలిగాక ఈ ముక్కలైన, వేలాడబడిన జీవుల్ని భీమనది ఒడ్డున కొరెగాంకు తీసుకువెళ్లారు. ఫాల్గుణమాసపు నెలవంక పొడిచిన రోజున 1689 మార్చి 11న గుడిపడవా ముందు రాత్రి వారి శరీరంలో ఒక్కో అవయవాన్ని ముక్కలుగా కోసి కుక్కలకు వేశారు. వారి తలలు నరికి వాటిని చుట్టుపక్కల నగరాలన్నింటిలో తిప్పారు. హైందవ స్వరాజ్యపు శవాలకు నమూనాగా. ఆ తర్వాత ఎపుడో ‘వధు’ అనే గ్రామపు పొదలలో ఈ తలలు దొరికాయి. ఓ ఇద్దరు గ్రామస్తులు వీటికే దహన సంస్కారం చేశారు.
భామ, భీమ, ఇంద్రయాని నదుల సంగమంలో ‘వధు’ గ్రామం ఉంది. గ్రామస్తులకు సంబంధించినంత వరకు శంభాజీ మరణం గురించి వారి అవిచ్ఛన్నమైన జ్ఞాపకాల దారపు పోగుల నుండి రెండు కథనాలు తరువాత ఉత్పన్నం అయ్యాయి.
గ్రామంలోని కున్బీ- మరాఠాల (షివాలేలు, షివాలే పాటిల్‌ల కొనసాగింపు) నమ్మకం ప్రకారం ఛత్రపతి శరీరపు భిన్న అవయవాలను పోగేసి కలిపికుట్టి వాటిని ఒక శవాకారంలా చేసి తర్వాత అంత్యక్రియలు జరిపించారు.
వధు గ్రామపు దళితుల కథనం దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ కథనం జానాబాయి అనే ఒక చాకలికులానికి చెందిన మహిళతో ప్రారంభం అవుతుంది. ఆమె ఇంద్రయాని నదిలో బట్టలు ఉతకడానికి వెళ్తే ఆమెకు ఆ ఒడ్డున మాంసపు ముద్దలు కనబడతాయి. ఆమె భయపడి ఒక గుంపును పోగేసుకొని వెళ్తుంది. కానీ గ్రామ పాటిల్ ఆమె నోరు నొక్కేస్తాడు. శంభాజీ శరీరం ముక్కలు జంతువలకు ఆహారం కావాలనీ, ఎవరైనా వాటిని ముట్టుకుంటే అదే గతి పడుతుందనీ ఔరంగజేబు ఆజ్ఞ. అయితే, ఆమె తమ ప్రియమైన రాజు రుణాన్ని ఆయన మరణం తర్వాతైనా తీర్చుకోమని ప్రతి ఇంటినీ అడుగుతూ పిచ్చిదానిలా ఊరంతా తిరుగుతుంది. అపుడు మహర్కులపు గోవింద్ గైక్వాడ్ ముందుకు వస్తాడు. దాంతో వధు గ్రామపు దళిత స్త్రీలు, పిల్లలు కలిసి నది నుండి పొదల నుండి వారి రాజు శరీరపు తునకల్ని దొరికిన గుడ్డల్లో కట్టుకుని తెస్తారు. వీటికి వధు గ్రామపు కళేబరాలు తొలగించే గోవిందా మహర్ అగ్ని సంస్కారం చేశాడు.
కుల తప్పుడు రేఖలకు అద్దం పడుతూ ఈ కథనానికి ఒక అనుబంధ కథనం కూడా ఉంది. గుడిపడవ సాంస్కృతిక వారసత్వంలో అదనంగా చేరిన వాటిని ఇది ప్రశ్నిస్తుంది. గుడిపడవా(తెలుగు ఉగాదిలా) రోజున ఇంటి ముందు ఉంచే గుడి బొమ్మ మామూలుగా ఒక కర్రకు ఒక మెరిసే రంగు బట్ట కట్టి, దాని చుట్టూ వేపాకులు వాటిపైన ఒక రాగి చెంబు బోర్లించి పెడతారు. ఈ రూపం గుడికి ఎలా వచ్చింది? చైత్రమాసపు మొదటి రోజున శంభాజీ మరణానికి మరుసటి రోజునే ఎందుకు దాన్ని ఇలా పెడతారు? శంభాజీని నాశనం చేయడానికి అతని బ్రాహ్మణ సలహాదారులు రహస్యంగా కుట్ర పన్నారని ఈ కథనం ఆరోపిస్తుంది. అంతఃపురంలో లోపలి రామదాసి బ్రాహ్మణుల బృందం ఈ కుట్రకు గూడు ఎలా కట్టిందో, రామదాస్స్వామి ప్రధాన శిష్యుడైన రంగనాథ స్వామి రైరికర్ శంభాజీ చివరి కదలికల ఆచూకీని మొగలులకు ఎలా అందజేశాడో ఈ కథనం ఆరోపిస్తుంది. శంభాజీకి పడిన శిక్షలన్నీ మనుస్మృతి ప్రకారం జరిగాయని ఈ కథనం వెల్లడిస్తుంది. పవిత్రమైన నిపుణులు మాత్రమే నేర్చుకునే దైవదత్తమైన హక్కులుగల పవిత్ర భాషను అభ్యసించినందుకు, స్వచ్ఛమైన సంస్కృతంలో వచనం రాసే సాహసానికి పాల్పడినందుకు, మత గ్రంథాలను అధ్యయనం చేసినందుకు, పురోహితులకు వారి కర్తవ్యాన్ని బోధించేంత గర్వం ఏర్పడినందుకు అతను శిక్షించబడ్డాడని అంటుందీ కథనం.
2017 డిసెంబరు 28వ తేదీన ‘వధు’లో రాజేసిన నిప్పు జనవరి 1న కొరెగాం అల్లర్లకు దారి దీసింది. గోవిందా మహర్ సమాధి దగ్గర చరిత్రకు సంబంధించి ఒక తప్పుడు సమాచారపు ఫ్లెక్సీబోర్డు పెట్టడంతో ఇది ప్రారంభమైంది. ఔరంగజేబు ఆజ్ఞలను ధిక్కరించి శంభాజీకి అంత్యక్రియలు చేసిన వ్యక్తి అంటూ గోవిందా గురించి గుర్తుచేసుకుంటూ మహర్ సమాజం బోర్డు పెట్టింది. దానికి కొద్ది దూరంలోనే శంభాజీ దహనం జరిగిన చోటు ఉందని అంటారు. అంత్యక్రియల్లో షివాలేల పాత్రను గుర్తిస్తూ వేసిన అధికారిక శిలాఫలకం అక్కడ ఉంది. డిసెంబరు 29 వేకువకు ముందే ఈ ఫ్లెక్సీ బోర్డు ధ్వంసం చేయబడిరది. గోవిందా మహర్ సమాధిని అపవిత్రం చేశారు. అదే రోజున సర్పంచ్ రేఖా షివాలేతో సహా 49 మందిపైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద ఫిర్యాదు చేయబడింది. దానికి ప్రతిగా గ్రామ పంచాయితీ సభ్యుడు రమాకాంత్ షివాలే జనవరి 1వ తేదీ కొరేగాం భీమ విజయ సభ ఉత్సవాలకు వచ్చే లక్షలాది దళితులు ప్రతీకారం తీర్చుకుంటారని తమని బెదిరించారని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనల ఫలితంగా కొరెగాం భీమ గ్రామ పంచాయితీ బందు ప్రకటించింది.
ఓదార్పును, సంఫీుభావాన్ని ఇవ్వాల్సిన నిజంగా కీర్తించాల్సిన ఈ స్వరాజ్య అవశేషాలు ఇవే కావడం ఒక వైచిత్రి. సామూహిక గుర్తింపులో జ్ఞాపకాల సామాజిక స్వభావంలో ఇవి మిళితం అయ్యాయి. చారిత్రక కథనాలన్నీ లేదా వాటిలో భాగాలు ఉజ్జాయింపులే అయితే, పుకార్ల పోగులైతే, మరి జ్ఞాపకం అనేదాన్ని కృతుకంగా తయారు చేసిన గతం అని ఎలా ప్రకటిస్తారు?
ఈ స్థానిక ఇతిహాసాలు, జ్ఞాపకాలు భయంకరమైన వెలివేతకు గురయ్యి దానివల్ల చివరికి విద్వేషం సృష్టించేవిగా మిగులుతాయా? మూడువేల మంది ఉండే చిన్న గ్రామంలో జ్ఞాపకం అల్లర్లకు కారణమై మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసేదిగా మారుతుందా? బహుశా అందుకే కావచ్చు చరిత్రకారుడు త్రయంబక్ షెజ్ వాల్కర్ ఒక సందర్భంలో మహారాష్ట్రకు చరిత్రదెయ్యం పట్టుకుందంటూ హతాసుడయ్యాడు.
– అంబరీష్ సాత్విక్
అనువాదం: దేవి
(బిజినెస్ లైన్ సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.