
హైదరాబాద్: గుజరాత్లోని సబర్కంఠ జిల్లా ప్రాంతిజ్ తాలూకా వడవస పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 25 ఏళ్ల యువతి సత్యేష లేవువ విజేతగా నిలిచింది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగాయి. అయినప్పటికీ సత్యేష తాను గుజరాత్ కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) శాఖ పరిధిలో జిల్లా నాయకత్వ బాధ్యతల్లో ఉన్నానని ఆమె బహిరంగంగానే చెప్పారు.
3,984 ఓట్లున్న గ్రామంలో సత్యేషాకు 596 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్ధులు సవితకు 492 ఓట్లు పుష్పకు 236 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్ పోస్ట్ దళిత మహిళకు రిజర్వ్ అయ్యింది.
వృత్తి రీత్యా న్యాయవాది అయిన సత్యేష అహ్మదాబాద్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికతో సత్యేష మాట్లాడుతూ, తను జిల్లా పార్టీ శాఖలో సెక్రటేరియట్ సభ్యురాలిగా పని చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీ సమావేశాలకు తను శాశ్వత ఆహ్వానితురాలిగా చెప్పారు.
సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా సత్యేష కొనసాగుతున్నారు.
వదస పంచాయతీ ఎన్నికలు 2020 నుంచి వాయిదా పడుతున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయ నిపుణుల సంఘం నివేదిక కోసం ఎదురు చూస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని సత్యేషా తెలియజేశారు.
గ్రామంలో రోడ్లు కరెంట్ సరఫరా ముఖ్యమైన సమస్యలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడం తన ప్రథమ ప్రాధాన్యతని సత్యేషా చెప్పారు. వర్ధ్యాల సమస్య, కట్టిన ప్రభుత్వ ఇళ్లు లబ్ధిదారులకు అందజేయకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ముందుముందు ఒక గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, వ్యాయామశాల ఏర్పాటు గురించి కృషి చేస్తామన్నారు.
“మా గ్రామానికి జాతీయ రహదారి కిలోనీటరున్నర దూరంలో ఉంది. దానికి దరిదాపుల్లో బస్స్టాప్లు లేవు. ఈ కారణల రీత్యా ఎలక్ట్రానిక్ రిక్షాలు అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు రవాణా వెసులుబాటు కల్పించాలన్నది ఆలోచనగా ఉన్నద”ని తమ భవిష్యత్తు కార్యాచరణను సత్యేష చెప్పారు.
తాను కొంతకాలంగా రాజకీయ కార్యకర్తగా పని చేస్తున్నానని, విద్యార్థులకు రుసుము చెల్లించలేని తల్లితండ్రులకు ఆర్థిక సహకారం అందించడం, పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి బలహీన తరగతులకు ఫీజు రాయితీలు ఇప్పించడం వంటివి చేస్తున్నానని తెలిపారు.
3,000కు పైగా ప్రజలున్న గ్రామంలో 1875 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1415 మంది ఓటు చేయగా మూడో వంతు ఓట్లను సత్యేష గెలుచుకున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.