
మీరుండే ప్రాంతంలోని అన్ని చోట్ల చొరబాట్లు జరుగుతున్నాయి. దోపిడీ దొంగలు నేరగాళ్లతో కుమ్మకై మారణాయుధాలు పట్టుకుని వీధుల్లో స్వైర విహారం చేస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి, చేతికందినవన్నీ దోచేసుకుంటున్నారు. దాడులన్నీ జరిగిన తరువాత పోలీసులు నింపాదిగా రంగ ప్రవేశం చేస్తున్నారు. దాడులలో కొంత మంది తీవ్రంగా గాయపడుతున్నారు. మరికొంతమంది చనిపోతున్నారు. కావలసినన్ని ఆయుధాలు అందుబాటులో లేకపోవడం అలానే ఉండాల్సినంత విశ్రాంతి లేకపోవడంతో పోలీసులు దొంగలను అడ్డుకోలేకపోతున్నారు.
ఇటువంటి సమయంలో మీ పొరిగింటి యజమాని తన ఇంటి బయట “ఈ ఇంటి యజమాని వద్ద అధునాతనమైన తుపాకులు ఉన్నాయి, జాగ్రత్త”ని ఒక హెచ్చరిక రాసిన సైన్‌బోర్డును పెట్టాడు. మర్నాడు రాత్రి దోపిడీ దొంగలు రానే వచ్చారు. హెచ్చరిక ఉన్న ఇంటికి మాత్రం వాళ్లు వెళ్ళలేదు. ఆ ఇంటి చుట్టుపక్కల ఇళ్లను దోచుకొనిపోయారు. కనీసం ఆ హెచ్చరిక నిజమా కాదాని కూడా ఆ దుండగులు చూడలేదు. యజమాని దగ్గర తుపాకులు ఉన్నాయా లేదాని, అతనికి తుపాకులను ఉపయోగించడం వచ్చా రాదాని కూడా తెలియదు. ఆ ఇంటిని దోచుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మీకో ప్రశ్న, ఇటువంటి సందర్భంలో ఆత్మరక్షణ కోసం మీరు ఒక తుపాకీని కొనుక్కుంటారా లేదా?
ఆత్మరక్షణ వర్సెస్ ఆత్మసమర్పణ..!
మీకు తుపాకుల మీద నమ్మకం లేకపోవచ్చు. మీ ఇంట్లో అత్యంత ఖరీదైన వస్తువు ఒక గుండుసూదే అయి ఉండవచ్చు. అయినప్పటికీ, మీరలాంటి హెచ్చరికను మీ ఇంటి ముందు పెడతారా లేదా? మీ చుట్టుపక్కలా పరిస్థితులు స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏమాత్రం ప్రతిదాడి ఉంటుందని అనుమానం ఉన్నా దాడి చేసేవారు వెనకడుగు వేస్తారు. లేకపోతే మీ జీవితం, మీ కుటుంబ సభ్యుల జీవితాలు బలి కావడం తథ్యం.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఈ ప్రశ్న సందిగ్ధావస్థలో పడేసింది. తేడా ఇక్కడ అసలు విషయం తుపాకీ కాదు, న్యూక్లియర్ ఆయుధాలు. న్యూక్లియర్ ఆయుధాలు లేని దేశాలైనా లిబియా, యుగోస్లావియా దాడుల బారిన పడడమే కాదు, వారి ప్రభుత్వాలు కూడా మార్చివేయబడ్డాయి. కేవలం కొన్ని న్యూక్లియర్ ఆయుధాలు మాత్రమే కలిగిన దేశాలు- ఉత్తర కొరియా , చైనా తమపై దుష్ట ఆలోచనలు రానీయకుండా కాపాడుకోగలుగుతున్నాయి. తను అనుకున్న లక్ష్యం చేరుతాననే హెచ్చరికను ఇరాన్ గుమ్మంలో అంటించి పెట్టింది. ఈ మధ్యే అమెరికా- ఇజ్రాయిల్ దీనిపై బాంబు దాడులు చేశాయి.
ప్రస్తుతం సూక్ష్మకాల యుద్ధ విరమణ కొనసాగుతున్నది. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను ధ్వంసం చేశామని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధ తయారీ కార్యక్రమాన్ని చర్చా వేదికలలో అడ్డుకోవడం ఇప్పుడు మరింత తేలికని అనుకుంటున్నారు. దొంగతనంగా న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసుకోవడం అపాయకరమని దాడి జరిగిన తర్వాత ఇరాన్ గ్రహించింది. అయితే అసలు నూక్లియర్ ఆయుధాలు లేకపోవడం కూడా మరింత అపాయకరమని తన గత అనుభవం దృష్ట్యా అర్థం చేసుకున్నది.
న్యూక్లియర్ ఆయుధాలు గల దేశాలు, నూక్లియర్ ఆయుధాలతో చేసే దాడుల నుంచి రక్షింపబడుతుండగా, ఇతర దేశాలు బలవుతున్నాయి. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, అనేక ఇతర దేశాలు కూడా తమ మనుగడ కోసం నూక్లియర్ ఆయుధాలు కలిగి ఉండటం మేలనే నిర్ణయానికి వస్తున్నాయి. మారిన అంతర్జాతీయ వాతావరణంలో అంతర్జాతీయ పోలీసు రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ తరుణంలో ఉమ్మడి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సవాలును ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి.
సంక్లిష్ట తుపాకులను అనేక రకాలుగా ఇరాన్ ఉపయోగించుకోవచ్చు. జంతువులను వేటాడడానికి, బంకమట్టి లక్ష్యాలను చేదించడానికి, బడి పిల్లలను మట్టు పెట్టడానికి. అలానే న్యూక్లియర్ శుద్ధి కర్మాగారాలను కూడా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. తన న్యూక్లియర్ శుద్ధి కర్మాగారాలు ఇంధన తయారీకి, విద్యుత్ ఐసోటోప్ల ఉత్పత్తికి, ఇతర అనేక విధాలుగా కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెబుతున్నది. అయితే ఇటువంటి శాంతియుత కార్యక్రమాలకు అణుశక్తిని 60% శుద్ధి చేయవలసిన అవసరం లేదు. 3-5% శుద్ధి చేయడానికి పరిమితం చేస్తే చాలు. కానీ, అదే సందర్భంలో ఆయుధాలు తయారు చేసేందుకు 90% శుద్ధి చేయాల్సి ఉంటుంది .
గతంలో ఒబామా ప్రభుత్వం ఇతర అనేక అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఇరాన్ 20% మాత్రమే అణు శుద్ధికి పరిమితమవ్వాలని ఒప్పందం చేసుకుంది. తన వద్దనున్న సామాగ్రిని 3.5% శుద్ధి చేయడానికి ఇరాన్ పరిమితం చేయడం ప్రారంభించింది. ట్రంప్ ప్రభుత్వం, అమెరికాని న్యూక్లియర్ ఒప్పంద పరిధి నుంచి తప్పించింది. పర్యవసానంగా, ఇరాన్ న్యూక్లియర్ శుద్ధి చేయడాన్నిపెంచుకుంటూ పోవడం ఆశ్చర్యం కలిగించ లేదు. నతాంజ్, ఫోర్డో ప్రాంతాలలోని భూగర్భంలో న్యూక్లియర్ శుద్ధి కర్మాగారాలను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు లక్ష్యాలనే అమెరికా పేల్చేసింది. అమెరికాకు చెందిన 14 బాంబులు ఈ లక్ష్యాలపై పడ్డాయి. బాంబు దాడి తరువాత ఇరాన్ రాతి యుగానికి చేరుకుంటుందని అమెరికా ఆశపడింది. ట్రంప్ ప్రభుత్వం దావా చేసింది కూడా అదే. దాడుల తర్వాత వెంటనే ట్రంప్ ప్రభుత్వం తన విజయాన్ని ప్రకటించుకుంది.
కొన్ని అభిజ్ఞాన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు, ట్రంప్ దాడి ఇరాన్‌ని “కొన్ని నెలల వెనక్కి” నెట్టగలిగింది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ధారణ అనామక, అతి తక్కువ స్థాయిలో ఉన్న విఫలమైన నిఘా సంస్థ అధికారి పనిగా, కేవలం ఒక లీక్‌గా కొట్టి పారేసింది.
అయితే, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉన్నతాధికారి రఫెల్ గ్రోస్సి, డీఐజీ ఈ నివేదికను ప్రస్తుతించారు. “వారికున్న సమర్ధతలు వారికున్నాయి. వారు తలుచుకుంటే కొన్ని నెలల్లో, లేదా ఇంకా ముందు కొన్ని సెంటిగ్రేడ్ నిర్ఘరి పరిభ్రమణం తరువాత, శుద్ధి చేయబడిన యురేనియం తయారు చేసుకోగలుగుతారు ” అన్నారు. జరిగిన విధ్వంసం తామూహించిన దానికన్నా తక్కువగా ఉండడం చూసి ఇరాన్ అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్టు ప్రైవేటుగా చెప్పుకున్నారు. యురేనియం శుద్ధి చేసే కర్మాగారాన్ని అమెరికా- ఇజ్రాయిల్ ధ్వంసం చేసినా, యురేనియం నుంచి అణుశక్తి తయారు చేయగల శక్తిని సమర్ధతని ధ్వంసం చేయలేదు. ఆ జ్ఞానం వారి శాస్త్రజ్ఞుల వద్ద పదిలంగా ఉంది. నిజానికి ఇరానీ ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే. కిందటేడు జూన్‌లో జరిగిన సర్వే ప్రకారం, తమ దేశం న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్లో 70% మంది అనుకూలంగా ఉన్నారు. ఈ అభిప్రాయం కూడా రెండు దశాబ్దాల ప్రచారం తరువాత ఏర్పడింది. అంటే, అణ్వాయుధాలు కోరుకుంటున్నది కేవలం ఇరాన్ నాయకులే కాదు, అక్కడి ప్రజలు కూడా. అంటే ఒకవేళ అమెరికా కేవలం ప్రభుత్వాన్ని మార్చినంత మాత్రాన ఒరిగేదేమి లేదు.
అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని 2017లో ట్రంప్ రద్దు చేశారు. అమెరికా పాలకులకు ఒప్పందాలంటే ఏమాత్రం లెక్క లేనట్టు ఉంది. అయితే ట్రంప్ ఒప్పందాలకు విరుద్ధం కాదు, కేవలం ఒబామాతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధం. దాడులకు ముందు ఆ తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడులు జరిపిన శుక్రవారం పూట కూడా ట్రంప్ రహస్యంగా ఇరాన్‌తో చర్చలు నడుపుతున్నారని సీఐఎన్ఎన్ వార్త సంస్థ భోగట్టా: చర్చించిన అంశాలలో 20 నుంచి 30 బిలియన్ల ఆయుధేతర అణుశుద్ధి పెట్టుబడులు, ప్రజల ఇంధన ప్రయోజనాలకు ఉపయోగపడేవి వచ్చాయని ఒక అధికారి అనధికారికంగా తెలియజేశారు.
అమెరికా సొమ్ము ప్రత్యక్షంగా అమెరికా నుంచి రాదు. తన అరబ్ భాగస్వాముల నుంచి పెట్టుబడులు పెట్టడానికి అమెరికా అంగీకరిస్తుంది. కొన్ని నెలల ముందు జరిగిన అణు చర్చల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇదంతా క్లింటన్ ప్రభుత్వ కాలంలో పోంగ్యాంగ్తో, దాదాపు దక్షిణ కొరియాతో జరిపిన చర్చల చట్రంలాగానే కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో విద్యుత్ ఉత్పత్తికి అణు రియాక్టర్ల నిర్మాణానికి వెంటపడినట్టు. అయితే ఆ అణురియాక్టర్లు నిర్మించబడనే లేదు. తానే చిన్న శ్రేణిలో అణ్వాయుధ రియాక్టర్లను ఉత్తర కొరియా నిర్మించుకుంది.
అయితే, భవిష్యత్తులో ఇటువంటి దాడులకు పాల్పడమని హామీ ఇస్తే తిరిగి చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఒకరిపై ఒకరికి నమ్మకాలు సడలిన తరువాత ఇరాన్ చర్చలకు వెళ్లినా, అణ్వాయుధాలు తయారుచేయనన్నా, ఇక ముందు దాడులు చేయబోమని ఇజ్రాయిల్ హామీచ్చినా, అవేం నిలబడవు. కేవలం అలంకారప్రాయంగా ఉంటాయి.
ట్రంప్ ఓ పచ్చిఅవకాశవాది..
డొనాల్డ్ ట్రంప్ ఒక ఒంటరితత్వవాదని, ఏ దేశంతోనూ సరైన సంబంధాలు పెట్టుకోడని, సైనికీకరణకు వ్యతిరేకని, తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి మాత్రమే ఎక్కువ మొగ్గుచూపుతాడనే అభిప్రాయం ఉంది. ఇరాన్‌పై అమెరికా చేసిన దాడితో ఈ అభిప్రాయాలు పటాపంచలయింది. డోనాల్డ్ ట్రంప్ పచ్చిఅవకాశవాది. గర్భస్రావాలపై, క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాలను మార్చుకుంటూనే ఉన్నారు. తన రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకు ఏ అభిప్రాయం ఉపయోగపడుతుందో దానిని సమర్థిస్తారు. ఏ సిద్ధాంతం ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. ట్రంప్ అవకాశవాదాన్ని భౌగోళిక రాజకీయ సిద్ధాంత స్థాయికి చేర్చారు.
గతంలో చాలా సార్లు మధ్యప్రాచ్య దేశాలలో యుద్ధాలు లేకుండా చేస్తానని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధం చేశారు. ఉక్రెయిన్‌లో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని “నియంత, స్టుపీడ్” అన్నారు. మరోవైపు అవకాశవాదంతో కైవ్ లోహపు గనుల ఒప్పందం చేసుకున్నారు.
ట్రంప్‌కు మతతత్వ వాదులతో చర్చలు జరపడానికి కూడా ఎటువంటి ఆక్షేపణ లేదు. మధ్య తూర్పులోని సున్ని మతతత్వ వాదులతో హాయిగా మాట్లాడగలరు. సౌదీ అరేబియా సున్నీలకు ఇరాన్లో షియాలకు ఎంతో కష్టపడి వారి మధ్య తేడాలను వివరించగలరు. అవకాశం వస్తే, ఇరాన్‌తో చర్చలు నడవడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనకు ఆయనే ఇరాన్ అణుయుద్ధ ప్రమాదాన్ని నివారించిన వ్యక్తినని చెప్పుకున్నారు.
ప్రపంచదేశాలన్నీ అనివార్యంగా అణ్వాయుధాలలో పెట్టుబడులు పెట్టేల ట్రంప్ పరిస్థితులను సృష్టించారు. తన దేశంలో అణ్వాయుధాల అవసరం లేదంటూనే 13 బిలియన్ డాలర్లను బడ్జెట్లో కేటాయించారు. ఆయన “బంగారు శిఖరం” పథకం అనేక దేశాలను అణ్వాయుధాల తయారీకి ప్రోత్సహిస్తుంది. తమతమ దేశాల బడ్జెట్లలో అణ్వాయుధాల కోసం కేటాయింపులు పెంచే విధంగా కారణమౌతుంది. ఇది ఎంతో విచక్షణతో కూడిన బాలిస్టిక్ మిస్సైల్స్ వ్యతిరేక ఒప్పందానికి భిన్నమైనది. తన మిత్రదేశాలైన యూరప్, ఆసియా దేశాలు, అణు
యుద్ధాలలో అమెరికా తమకు అండగా ఉంటుందన్న నమ్మకానికి అమెరికా రక్షణ వ్యవస్థ ప్రస్తుత అడుగులు తూట్లు పొడిచాయి. ఇప్పుడు యూరప్ దేశాలు కూడా తమ అణు వ్యవస్థని- ఫ్రెంచ్ కేంద్రంగా పటిష్ట పరుచుకోవడం గురించి మాట్లాడుతున్నాయి. దక్షిణ కొరియాలోని మితవాదులు కూడా అణ్వాయుధ నిరోధాల గురించి చర్చిస్తున్నారు.
ఇక మిగతా ప్రపంచం సంగతేంటి?
అణ్వాయుధ నిరోధక ఒప్పందం నుంచి వైదొలగడానికి ఇరాన్ పార్లమెంట్ డ్రాఫ్ట్ తయారు చేస్తోంది. ఇప్పటి వరకు ఒకే దేశం, ఉత్తర కొరియా మాత్రమే ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. చాలా కొద్ది దేశాలైనా ఇజ్రాయిల్, పాకిస్తాన్, ఇండియా, సౌత్ సుడాన్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా లేవు. ఇరాన్ బయటికి వస్తే మరిన్ని దేశాలు దాని వెనుక వచ్చేస్తాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా, టర్కీ; ఇవి ఇప్పటికే అణుశక్తి నిర్ణయం తమ ఆధీనంలో ఉండాలని రచ్చచేస్తున్నాయి.
ట్రంప్ చర్యల కన్నా శక్తివంతంగా బాకాలు ఊద గలిగిన వారెవరూ లేరు.
ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్‌తో అణ్వాయుధాలకు సంబంధించి “ప్రేమలేఖల”ను ట్రంప్ ఇచ్చిపుచ్చుకున్నారు. వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా పెద్ద అభిమానినని చెప్పుకున్నారు. తైవాన్ కన్నా చైనా పట్ల తనకున్న గౌరవాన్ని గురించి అనేక వేదికలపైన ప్రస్థావించారు. అణ్వస్త్రాల కంచెకి మరో వైపు ఇరాన్‌పై బాంబులు వేశారు. వెనిజులా, క్యూబాను బెదిరిస్తున్నారు. కెనడా నుంచి గ్రీన్ ల్యాండ్‌ను చేజిక్కించుకునే అవకాశముందన్నారు. “నేను అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని సమర్థించను. కానీ ఒకవేళ నేను గనక కెనడా దేశస్థుడినయితే, ప్రపంచంలో శ్వేతసౌధం మంచితనానికి పడ్డ కోత గురించి పెద్దగా పట్టించుకోను. న్యూక్లియర్ మొనలున్న కొన్ని ఐసీబీఎంలు మాత్రం, శ్వేతసౌధాన్ని తాము అర్ధం చేసుకున్నామని సందేశాలు పంపాయ”ని పేర్కొన్నారు.
అనువాదం: కే ఉషారాణి
(వ్యాస రచయిత జాన్ ఫెఫర్ విదేశాంగ విధాన కేంద్ర డైరెక్టర్‌గా ఉన్నారు. రైట్ అక్రోస్ ది వరల్డ్: ది గ్లోబల్ నెట్వర్కింగ్ అఫ్ ది ఫార్ రైట్ అండ్ లెఫ్ట్ రెస్పాన్స్ అనే పుస్తకాన్ని ఆయన రాశారు).
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.